డైలీ సీరియల్

దూతికా విజయం-66

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగ్నంగా వున్న తన వీపులో విజయుడైన అహంకారంతో పొంగి పొరలే తన పాపను చూసుకొని గర్వపడుతున్నట్లుందీ వీరభద్రుడు.
‘‘వీపుమీద వాతలు వేశానన్న ఈ కోమలి కూతలు, వట్టి కూతలేనని గ్రహించినా, నోళ్ళకు మూతలు వేసుకొని, మూతులు ముడుచుకున్నారేమయ్యా!’’ అని వీరభద్రుడు రక్షక భటుల్ని దబాయించాడు.
సింహమూ, సివంగీ పోట్లాడుకుంటుంటే దారిన పోయే వృషభాలు రెండింటిని న్యాయం చెప్పమన్నపుడు ఆ వృషభాలు మెదలకుండా ఊరుకోవటమే మేలనుకోకపోతే జరుగవలసింది ప్రాణాంతకరంగానే పరిణమిస్తుందని గ్రహించలేకపోతవా?
కృత్రిమమైన బిగువు రొమ్ములమీదినుంచి తొలగించబడగా, సహజమైన బిగువు సరస్వతికి వికారంగా తోచింది. అందునా ఆరు పురుష నయనాల దృష్టి కేంద్రీకరణ తనవీపుమీదనే ఉండటం చాలా ఇబ్బందిగా ఉన్నది. స్తనభారానికి ముందుకు పడిపోతానేమో ననిపించిందామెకు. రెమ్మకున్న నారింజలు తుంపి, తిరిగి అదే రెమ్మకు కట్టినట్లుగా ఉన్నది తన రుూ పరిస్థితి.
అందుకని ఎంత త్వరలో రుూ దృశ్యానికి మంగళహారతి పాడి, గృహాంతర్భంలోకి మాయమైతే అంత మంచిదిగా తోచింది. తానాడిన అబద్ధాన్ని నిజం చేయాలనే ఉద్దేశ్యమే ఇప్పుడామెకులేదు. అది సాధ్యంకాదు కూడాను. ఐతే ఏదో ఒకటి వాగి, కొంచెం గౌరవంగానే తిరోగమనాన్ని సాధించటం మీదనే వున్నదామె దృష్టి.
తాను వలచి వరించిన రుూ వనిత వీపు భాగమే ఇంత అందంగా పాలరాతి పేర్పువలె మెరిసిపోతూంటే, ముందు భాగాలు ఇంకెంత అందాలను విరజమ్ముతూండటవోననే తలపులలో తలమున్కలై లోలోన లొట్టలు వేస్తున్నాడు వీరభద్రుడు.
ఈ రక్షక భటుల్ని త్వరగా, వాళ్ళకు ఏ మాత్రమూ అనుమానం లేకుండా రుూ పరిసరాల నుంచి పారద్రోలి, ఎంత త్వరగా వీధి తలుపులు మూసి, తాను ఊహించే సరస్వతి శారీరక పరిశోధనలను సాగిద్దామా అనే తొందర వీరభద్రునిలో కూడా పనిచేయసాగింది.
ఆమె అరికాలి మంట నెత్తికెక్కింది. ఇపుడు వీరభద్రుని మీద విరుచుకుపడింది.
‘‘ఏమన్నా బుద్ధి ఉన్న పనులేనా ఇవి?’’’ అన్నదామె రోషకషారుూత నేత్రాలతో, పమిట చెంగును బిగుతుగా వీపుమీదికి లాక్కుంటూ. ‘‘మదనగోపాలుని భక్తులని రుూ చిలిపి చేష్టల ద్వారా, ఇలా బహిరంగంగా ప్రకటించుకోండి!’’
‘‘నువ్వేం తక్కువదానివా? సంతాన గోపాలుని భక్తురాలివిగా! అలనాడు ద్రౌపదీ మానభంగం నాడు ఆ గోపాలుడు ఆమెకు ఎన్ని చీరెలివ్వలేదు? రుూనాడు నీకూ దయదలచి పలవలు ఇస్తే- గుడ్డలు కొనటమన్నా నాకు తప్పుతుంది!’’ అని వీరభద్రుడు దెప్పి పొడిచాడు. దాంతో తను చిత్తుగా ఓడిపోయినట్లే భావించిందామె.
‘‘్ఛ.. ఛీ! వెధవ కాపరం!’’ అని ఆమె తనమీద తనకే కలిగిన అసహ్యాన్ని వెళ్ళగక్కింది. ‘‘మావాళ్ళు చెప్పిన మాట విని మా మేనత్త కొడుకునే చేసుకున్నట్లయితే ఎంత సుఖపడేదాన్నో!’’
‘‘ఈ దురదృష్టవంతుడిక్కడ ఉండగా, మీ మేనత్తకొడుకైన ఆ అదృష్టవంతుడు బతికిపొయ్యాడులేవే!’’ అన్నాడు వీరభద్రుడు. ‘‘చూశారటయ్య రక్షక భటులూ! ఈ ఆడవాళ్ళు అబద్ధాలూ, ఆగడాలూ కనటమూ, వినటమూ ఐంది కదా! ఈ చట్టాలు అబలులమైన ఈ మగజాతిని ఎలా రక్షిస్తయ్యయ్యా?’’
‘‘పాపం! మొగజాతి భయపడి ఛస్తోంది. తెల్లారేదాకా ఆడవాళ్ళను ఇంకా దిగతొక్కటం ఎలాగో చర్చించండి!’’ అని ఆమె రెండడుగులు అవతలికి, సింహద్వారం దాటి లోనికి వెళ్లిపోయేందుకు సిద్ధపడింది; కాని అంతలోనే ఈ ఇంటిలోని ముందుభాగం మినహా తనకు మిగతాదంతా కొత్తే కనుక, తలుపు పక్కగా చీకట్లో నక్కింది; వీళ్ళ సంభాషణ విని, తదనుగుణంగా ప్రవర్తించటం మంచిదదని కూడా ఆమె తలచింది.
‘‘ఈరోజుల్లో ఆడవాళ్ళతో మాట్లాడగలమటండీ! పెళ్ళానికీ బెల్లానికీ వున్న సంబంధమేదో మనం వాళ్ళ ముందు ఎందుకూ పనికిరానివాళ్ళను చేస్తూన్నది.. ప్రతి కొంపపలోనూ ఇదే తంతు.. పేరుకేమో మగాడు యజమాని. అసలు పరిపాలనంతా ఇల్లాలిదే కదండీ! ఎంత గొప్ప మొనగాడైనా పిల్లుల్లాటి ఇతర పురుషుల మధ్య పులి ఐనప్పటికీ ఆడవాళ్ళనే పులుల మధ్య పిల్లే స్వామీ!..’’ అన్నాడొక రక్షక భటుడు, సరస్వతి ఆ ప్రాంతాల్లో లేదనే నమ్మకంతో.
సరస్వతి తన జాతిని గూర్చిన పొగడ్తలను విని లోలోన సగర్వంగా నవ్వుకున్నది.
‘‘ఎందుకొచ్చిన రభసండీ! ఈ చలిగాలిలో వానలో ఎందుకు నిలబడతారు? వెళ్లి, వెచ్చగా హాయిగా పడుకోండి.. ఒక్క మనవి’’అన్నాడు రెండో రక్షక భటుడు.
‘‘ఏమి- చెప్పు’’
‘‘ఏమీ లేదు. ఇప్పుడీ అర్థరాత్రి గస్తీ తిరిగే స్థితిలో లేము. అసలీ వానకు భయపడి ఎక్కడన్నా తల దాచుకుందామని చూస్తూంటే, ఈ అరుగులు వాటంగా ఉండటం గమనించి పైకి రాబోతుంటే మీ దంపతుల సాక్షాత్కారమైంది. ఏంలేదు. ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాం తమకు అంగీకారమైతే!’’
ఆ మాటలు వీరభద్రునికి ఎంత మధురంగా ధ్వనించినవో సరస్వతికి అంత కఠినంగా వినిపించినవి. ఈ రక్షక భటులైన రక్షక భటులు ఇంతటితో వదలిపోక, ఈ రాత్రంతా అక్కడే కాపలాగా ఉంటే తాను వీరభద్రుణ్ణి నిరోధించి, నిభాయించటం కుదరదు. వీళ్ళు ఆ మన్మథుని ఆజ్ఞల్ని అమలు జరిపి తీరేందుకు నియోగించబడిన సైన్యంలోని మనుషులే అనిపిస్తున్నారామెకు. తను నోరెత్తేందుకు లేదు కదా!
‘‘ఓ! దివ్యంగా పడుకోండి.. చాపలేమన్నా ఇవ్వనా?’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘పోనీండి పాపం లోపలే పడుకోమందాం!’ అని అందామని సరస్వతి నోటిదాకా వచ్చింది. అందువల్ల ఈ రాత్రికి వీరభద్రుని ఆట కడుతుందని తెలుసు.
కానీ వీరభద్రుడు ఇంటి యజమాని కనుక, వీళ్ళూ లోపల పడుకునేందుకు అతను నిరాకరించవచ్చు. పురుషుడుగా అతనిదే పైచెయ్యి అవుతుంది. అదీగాక వీళ్ళు ఈ గడపదాటి లోపలికి వచ్చి గమనించినట్లయితే అసలీ ఇంట్లో దంపతులు ఉంటున్నారనే సూచన ఒక్కటీ కనిపించక, తన బండారం బైటపడుతుంది. లోపలికి వచ్చీ రావడంతోనే వీళ్ళ మాయ కళ్ళు తన మేలి ముసుగుమీదా, నగిషీ పనితో మెరిసిపొయ్యే పాదరక్షల మీదా పడగానే వీళ్ళ అనుమానం బలపడిందంటే.. ఆవలిస్తే పేగులు లెక్కపెట్టడంలో అందెవేసిన వీళ్ళ చేతులు దేవటం మొదలెడుతే తన అంతు తేలుస్తారు.
అదీగాక ఈరాత్రి అసలు జరుగవలసిన కార్యక్రమం- తను వచ్చిన పని సాధించవలసిన బాధ్యత వున్నది. ఆ ఉద్వేగాన్ని ఎలాగో స్వాధీనంలో ఉంచుకొని గొంతులో మాటను గొంతులోనే పూడ్చిపెట్టగలిగినందుకు సరస్వతి తనను తాను అభినందించుకున్నది.
‘‘చాపలొద్దుస్వామి! కాసేపు నడుములు వాల్చి వెళ్తాం. వెళ్ళేటప్పుడు మళ్లీ మిమ్ము లేపవలసి వస్తుంది’’ అని ఆవలిస్తూ వాళ్ళిద్దరూ కత్తులు, కఠార్లు పక్కన పెట్టుకొని, కరదీపిక ఆర్పి, నాలుగు బారలున్న తలగుడ్డలు విప్పి, ఒక చేయి ముడిచి తలగడగా పెట్టుకొని, తలగుడ్డనే వంటినిండా కప్పుకొని సుఖంగా ఉండేట్లు సర్దుకుని పడుకున్నారు.
వీరభద్రుడు విజయగర్వంతో తలుపుమూశాడు.
తాను తీసిన గోతిలో తనే పడక తప్పని విషమ పరిస్థితి ఏర్పడింది. ఐతే తాను పడుతూ, తన గోతిలో వీరభద్రుడు కూడా పడటం తథ్యం కనుక ఉభయులూ, పతనమయాక అతను తన మాటలు వింటాడనే నమ్మకం సరస్వతికి ఏర్పడింది.
ఈ పథకాన్ని దిగ్విజయంగా కొనసాగించేందుకు అవసరమైతే ద్వారపాలకునికి లొంగిపోయేందుకు కూడా నిశ్చయించుకున్న తను ఈ వీరభద్రుణ్ని నిరాకరించి ఆదిలోనే హంసపాదులు ఆరంభించటంలో అర్థంలేదు.
అందునా ఇతనేం సామాన్యుడా? ఆ అందచందాలూ, బలాతిశయమూ, తెలివితేటలూ, బ్రహ్మతేజస్సూ ఏ ఆడదాన్ని ఆకర్షించవు కనుక! అందాల రాణి, ప్రాణ సమానంగా ప్రేమించిన నవ యువకుడు! నిజంగా ఇలాటివాడు తనను వరించాడంటే తానెంతో గర్వపడాలి. ఏ జన్మలోని సుకృతమో నిలవ ఉంటేనే తప్ప ఈ పురుష పుంగవుడు తనను కోరుతాడా?
ఇటు వీరభద్రుడు, అటు ద్వారపాలకుడూ కూడా తనను కోరే పక్షంలో వంతులవారీగా ఉభయులను తృప్తిపరచందే, ఈ వ్యవహారం ముందుకు సాగదు. ఇద్దరు పురుషులకు అందునా ఒక ఉత్తమునికి మరొక నీచునికి కూడా లొంగిపోవటం గణితశాస్త్ర ప్రకారం రెండు విధాలా చెడటమనుకుంటే ఇప్పుడీ వీరభద్రునికి లొంగటం ఒక విధంగా చెడటంగానే భావించి సరిపెట్టుకోవడం సమంజసమనిపించింది సరస్వతికి. ఇద్దరు పురుషులను తాను తృప్తిపరచవలసి వస్తే, తన కారణంగా వారిలో వారు తగాదాలు పడకుండానూ, ఈర్ష్యకు తావు లేకుండానూ ఒకళ్ళకు తెలియకుండా మరొకర్ని కలవాలి! ఎంత ఘోరమైన పరిస్థితి అది. మగజాతి అంటే ఉండే ద్వేషం దానంతటదే కరిగిపోతోంది. దాని స్థానే ఎంతో ఇష్టం పెంపొందుతోంది. అందులోనూ విధివశాన ఏర్పడిన దుస్సంఘటనలో తన మాన ప్రాణాలను ఇంతకుముందే కదా- వీరభద్రుడు కాపాడింది!
అతని పట్ల కృతజ్ఞత చూపవలసిన బాధ్యత తనకు ఉన్నది. ప్రణయారాధన అంటేనే ఒక రకం కృతజ్ఞతను చాటడమేనేమో? అదీగాక ఆ కృతజ్ఞతను ఏ రూపాన చెల్లించాలని సహాయపడిన వ్యక్తి కోరుతాడో, అదే రూపాన తాను చెల్లించి ఋణవిముక్తురాలు కావలసిందే కదా!
రాణి వీరభద్రుణ్ణి కోరి ఉండటమే ఒక గొప్ప ప్రతిబంధకం! రాజరికం అనుభవించవలసినదాన్ని విశ్వాసపాత్రురాలైన సేవిక ఎంగిలి చేసి కానుకగా ఇవ్వటం దారుణమే కాదు గొప్ప నేరం కూడానూ! అదీగాక తన ఈ జీవితంలో దాంపత్య సౌఖ్యం రాసిపెట్టిలేదు. అందుకు ఇంతకముందెన్నడూ తాను విచారించానూ లేదు. ఇప్పుడు కేవలం స్వసౌఖ్యాన్ని ఆశించి కాకపోయినా, కర్తవ్య నిర్వహణలోని విజయసాధనకుగాను తాను వీరభద్రునికి లొంగి తీరందే ముందుకు సాగలేని విషమ పరిస్థితి ఏర్పడింది.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు