డైలీ సీరియల్

సర్వం శివరూపమే ( శివ పురాణం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తులసి లక్ష్మీ అంశురాలిగానూ, శంఖజూడుడు, కృష్ణాంశుడుగానూ జన్మించినా, శాపవశాత్తూ శంఖ చూడుడు లోక కంటకుడై ప్రజలనూ, దేవతలనూ బాధిస్తూండటంతో శివకేశవులు అతడిని వధించాలనే నిర్ణయానికి వచ్చారు. అమిత భక్తురాలూ, మహా పతివ్రతా అయిన అతని భార్య తులసి శీలాన్ని హరించాల్సి వచ్చింది విష్ణుమూర్తికి. బృంద వలెనే తులసి కూడా మోసపోయి తరువాత ఆయన మోసాన్ని గ్రహించి ఆయనకు పత్నీ వియోగం సంభవిస్తుందని శపించింది. తులసి గండకీ నదీ తీరాన మొక్కగా మొలచింది. విష్ణుమూర్తి ఆ నదీ తీరాన, సాలగ్రాముడయ్యాడు. శంఖఛూడుడిని పరమ శివుడు వధించి లోక కళ్యాణం గావించాడు.’’ అని తెలిపారు సూత మహర్షి.
సురులైనా, అసురులైనా, యక్ష కినె్నర గంధర్వులైనా, మానవులైనా శివుడిని ఆరాధించినవారు సారూప్య, సాలోక్య, సాన్నిధ్య, సాయుజ్య మోక్షాలుగా తెలుపబడే కైవల్యాన్ని అనగా శివ లోకాన్ని పొందుతారని తెలిపిన సూత మహర్షి ఆ తరవవాత దేవీ లీలలైన మహిషాసుర, శుంభ నిశుంభ, దుర్గముల వధలని వరుసగా మహాలక్ష్మీ, సరస్వతీ, పార్వతీ అనే తన మూడు ముఖ్యమైన అంశలతో అంతమొందించిన శ్రీమాత వీరత్వాన్ని వివరించారు. వీరినే కాక అరుణుడనే రాక్షసుడిని వధించిన భ్రామరీ దేవిగా, చండ ముండులని వధించిన తన అంశ అయిన చాముండిగా, కాళికగా, చండికగా, తన శత (అనగా అనేక) నేత్రాల నుండీ కరుణతో కన్నీటిని వర్షించి కరువు కాటకాలను బాపిన మాతృమూర్తి శతాక్షిగా, ఆ విశ్వమాత చూపిన లీలలను శౌనకాదులకు తన గురువైన వ్యాస మహర్షి తనకు తెలిపిన రీతిలో వివరించారు సూత మహర్షి. ఈ అసుర సంహారాలలో ముఖ్యమైనవి, సనత్కుమారుడు వ్యాసునికి రుద్ర సంహిత యుద్ధ ఖండంలో వివరించినట్లు వ్యాసుల వారు రచించారు. ఆ తరువాతిదైన ‘శతరుద్ర’ సంహితలో ఆయన శివుని పది అవతారాల గురించీ వాటిని వెన్నంటి ఉండే శక్తుల నామాల గురించీ, ఏకాదశ రుద్రుల గురించీ వివరించారు. వ్యాసుల వారు తనకి తెలిపిన ఆ వివరాలు శౌనకాదులకు తెలిపారు సూతులవారు.
‘‘శౌనకాదులారా! ఆ పరమేశ్వరుడీ జగత్తుని తన ఎనిమిది ప్రకృతి తత్వాల చేత పాలింపజేస్తున్నాడు. ఆయనే ప్రకృతి. ప్రకృతే ఆయన. పంచ భూతాలైన ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వీ తత్వాలతోపాటూ సూర్య, చంద్ర, క్షేత్రజ్ఞులుగానూ ఆయన విశ్వాన్ని ఆవరించి ఉన్నాడు. ఆయన మహాకాలుడిగా మహాకాళి సమేతంగానూ, తారుడిగా తన శక్తియైన తారతోనూ, భువనేశ్వర - భువనేశ్వరీ దేవులగానూ; శ్రీ విద్యేశుడూ-షోడసీ దేవులగానూ; భైరవుడూ-్భరవిగానూ; ఛిన్న మస్తకుడూ- ఛిన్నమస్తగానూ; ధూమ-్ధమవతులగానూ; బగళాము ఖుడూ-బగళాముఖిగానూ; మతంగుడూ - మాతంగిగానూ; కమలుడూ-కమలలగానూ తన పది అవతారాలలో పూజింపబడుతున్నాడు. ఆయన కశ్యపుడి పుత్రులైన ఏకాదశ రుద్రులను తన అంశలతో జన్మింపజేశాడు. ఆయన అవతారాలుగా భావింప బడుతున్న ఏకాదశ రుద్రులైన కపాలి, పింగళ, భీమ, విరూపాక్ష, విలోహిత, శాస్త్ర, అజపాద, అహిర్భుదన్య, శంభు, చంద, భవ నామధేయులు. వీరే కాక హనుమంతుడు అనసూయా దేవీ-అత్రినందనుడైన దుర్వా సుడూ కూడా శివావతా రాలుగా భావింప బడుతున్నారు. ఒకప్పుడు కౌరవ వధ కోసం పాశుపతాస్త్రం కోరిన అర్జునుడికి ముందుగా ‘కిరాత’ రూపంలో దర్శనమిచ్చి, అనుగ్రహించాడు శివుడు.
నందీశ్వర కాలభైరవులూ ఇంకా ‘నరసింహమూర్తిని శాంతింపజేయటానికి ఆయన దాల్చిన శరభ సాళువ రూపమూ కూడా ఆ శివ అవతారాలుగా పరిగణింపబడుతున్నాయి.
ఆ పరమ శివుడిని పూజిం చటానికీ, అభిషేకం చేయటానికీ ఫాల్గుణ మాసాన వచ్చే ఉత్తర ఫాల్గుణీ నక్షత్ర యుక్తమైన దినమూ, అదే విధంగా చిత్తా నక్షత్ర యుక్త చైత్ర మాస దినమూ, విశాఖా నక్షత్ర యుక్త వైశాఖ మాస దినమూ మూలా నక్షత్రయుక్త జేష్ఠ మాస దినమూ, ఉత్తరాషాఢ నక్షత్ర యుక్త ఆషాఢ మాసదినమూ, శ్రవణా నక్షత్ర యుక్త శ్రావణ మాస దినమూ, ఉత్తరాభాద్రా నక్షత్ర యుక్త భాద్రపద మాస దినమూ, కృత్తికా నక్షత్ర యుక్త కార్తీక మాస దినమూ బహు ఉత్తమ దినాలు. అంతేకాక మాఘ బహుళ చతుర్దశి అయిన శివరాత్రి దినమూ, ఆరుద్రా నక్షత్ర యుక్త సోమవార దినమూ, కార్తీక పౌర్ణమీ, త్రయోదశి, చతుర్దశి తిథులూ ఆ పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమయినవి అని వివరించారు సూత మహర్షి.
శివరాత్రి దిన వైశిష్ట్యాన్ని గురించి స్వయంగా శివుడే దేవతలకు తెలిపాడని సూతులవారు తెలుపగా మహర్షులు అందరూ భక్తి పూర్ణ హృదయులయారు.
॥ శంభు మూమాపతిం సురగురుం
వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం
వందే పశూనాం పతిం॥
॥ సూర్య శశాంక వహ్నినయనం
వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రయంచ వరదం
వందే శివం శంకరం॥
- ఇంకావుంది...

శ్రీమతి గౌరీ గార్లదిన్నె