డైలీ సీరియల్

దూతికా విజయం-74

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలాంటి క్లిష్టమైన పని చేయటానికి తానిప్పుడు సిద్ధమై శే్లష్మంలోని ఈగవలె ఇరుక్కుపోయింది!
పీఠంలో కుదురుగా వుండే పర్వతంలాటి పథకాన్ని తయారుచేసుకున్నానని నమ్మితే, ఇప్పుడంతా భూకంపానికి గురైన విధంగా పునాదులతో సహా కదిలి ముక్కచెక్కలైంది. ఆ ముక్కలన్నిటినీ జేర్చి, అతికి ఉంటే, పటిష్టంగా, బెసగకుండా ఉండేదేదైనా చేజిక్కందే తాను గాలిలో వేళ్ళాడలేదు కదా! ఆధారపడదగిన ఇలాటి అవకాశం వీరభద్రుడేనని ఎక్కువ ఆలోచన లేకుండా తేల్చుకోవచ్చు.
స్వార్థరహితమైన సహాయాన్ని ఎదుటి వ్యక్తి నుండి ఆశించటం మానవ నైజం. ఐతే ఎటుతిరిగినా ఇది కుదరదు కనుక, ఎంత స్వల్ప ప్రతిఫలంతో సాధిద్దామా అనే ప్రయత్నాలు తప్పవు. సహాయాన్ని అర్థించేవారూ, చేసేవారూ బేరసారాలాడి ఒక ఒప్పందానికి రానిదే పనులు జరగవు. యాచకునిది కింది చెయ్యి కనుక, లొంగి పడి ఉండవలసిందే!
ఆమనోవాక్కాయ కర్మలా తాను పురుష ద్వేషి. తన ప్రతి రక్తకణంలోను ఈ ద్వేషం ప్రవహిస్తూనే వున్నది. సమయం చిక్కినపుడల్లా పురుష జాతిని ఆడిపోయడంలో ఎంతో ఆనందాన్ని అనుభవించడానికి జీవితారంభం నుంచీ తాను అలవడి వున్నది.
అలాంటిది చిత్రంగా తనలో ఇంత త్వరగా మార్పు ఎలా వస్తోందో తెలియలేదు. త్రికరణశుద్ధిగా నమ్మిన మూడింటా, రెండు వంతులు కూలిపోతున్నవి. మనసులోంచి ఆ ద్వేషం తొలగిపోయింది. వాక్కులో నుంచి కూడా మాయమయేందుకు సిద్ధంగా ఉన్నది. పోతే ‘కర్మ’గా దాన్ని ప్రయోగంలో ఎలా సమర్థించాలా అనే ఆలోచన మాత్రమే వేధిస్తున్నది.
ఐతే మనోవాక్కులను ఆకట్టుకోగలిగిన మనసిజుడు, ఆ కర్మకాండకు మాత్రం ప్రతికూలుడవుతాడా? ఉప్పుకారాలతో పెరిగిన శరీరమిది. రాజ భోజనాలతో కొవ్వు పట్టి నునుపుదేరిన దేహమిది. దీన్ని నిరోధిస్తూ ఆశయాన్ని పట్టుకొని వేళ్ళాడుతూండబట్టి సరిపోయింది కాని అది అనుక్షణమూ తనకు తెలియకుండానే తిరుగుబాటు చేస్తూన్నది. తాను పోరాడి పోరాడి అలసిపోయిన ఈ సమయాన, తన మనసు ఎదురుతిరిగినా లెక్కచేయక, నాయకునిమీదనే తిరుగబడిన సైనిక పటాలంవలె అణువణువూ ఎదురాడుతే తాను ఓటమిని ఒప్పుకోక తప్పేదేమున్నది?
మనసులోని అనుభూతిని శరీరంలోని వివిధాంగాల ద్వారా ప్రకటించవచ్చనే సిద్ధాంతమే తనకు తెలిసింది. కానీ శరీరం పొందే అనుభూతుల ద్వారా కూడా మనసు మారుతుందేమోననే సందేహం ఇప్పుడిప్పుడే బలపడుతోంది.
వీరభద్రుని ఊరుపు పీఠాన్ని అలంకరించినప్పుడు ఆ స్పర్శ తనకెంతో ఆనందదాయకంగా ఉన్నప్పటికీ, తాను తలచని దుస్సంఘటనగానూ, తాను వచ్చిన పని ఒకటైతే, జరుగబోయే కార్యం వేరొకటిగానూ తోచి చీదరించుకున్నది.
వీరభద్రుడు తన హృదయ స్పందనను పరిశోధించిన ప్రయత్నంలో కూడా తనను తెలియని ఆనందం ఆవరించింది. తన పవిత్రతకూ, ఈ రకం ఆనందాలకూ చుక్కెదురు కనుక, తాను మనసులో అసహ్యించుకున్నా శరీరం ఆ మాధుర్యానికి కొద్ది క్షణాల పాటు పరవశమైంది.
ఇంతకుముందు వీరభద్రుడు తన మెడ దగ్గిర చూపుడువేలు ఆనించినప్పుడు కితకితలు పెట్టినట్లయి శరీరం పులకించింది. ఆ వేలు వెనె్నముక మీదుగా వేగంగా ప్రయాణం చేస్తూ రవిక చింపినప్పుడు, బలమైన విద్యుత్ ప్రవాహమే శరీరమంతా ప్రవహించినట్లయింది!
తనను కాపాడమని అర్థించే నిమిత్తం మృదువైన తన అరికాళ్ళతో వీరభద్రుని పాదాలను రాచినప్పుడు రాలిన నిప్పు కణాల సెగలు ఆపాదమస్తకం ఆవరించి, తలకెక్కినట్లనిపించింది!
పైపైన అంటీ అంటనట్లున్న ఈ నమూనాలే ఇలా ఉంటే లోతుల్లోని అసలైన సిసలైన ఆనందం ఇంకెలా ఉండగలదో ఊహకే అతీతంగా ఉన్నది!
‘అగ్గిలాటి ఆడది సరస్వతి!’ అని తనను ఎరిగినవారి అభిప్రాయం. దాని వేడి సోకకుండా, ఆదర్శనమనే కవచాన్ని తాను ధరించి, ఇన్నాళ్ళూ రక్షణను పొందుతూన్నది. ఈ వీరభద్రుని స్పర్శతో ఆ కవచం కరిగిపోయింది. లోని అగ్గి బుగ్గి కాకుండా ఇప్పుడు తనను తాను రక్షించుకోవాలి. ఆ మాటకొస్తే ఆ రక్షణ బాధ్యతను కూడా ఈ వీరభద్రుడే వహించాలి!
తన శరీరం అగ్ని నిరోధకం కాదు! బైటినుంచి వచ్చి పడే వేడిని కూడా తానిప్పుడు ఎదుర్కోవాలి. ఎంత బలంగా తాను ఎదురాడుతుందో అంత తీక్షణంగానూ ఆ వేడి తనను తాకేందుకు ప్రయత్నిస్తుంది. అది దావానలం కాకముందే దాన్ని స్వీకరించి, హరించుకొని, చల్లార్చి నామరూపాలులేకుండా చేసుకోవాలి!
ఈ నిప్పు నలుమూలలనుంచీ తనను చుట్టుముట్టుతున్నది. దీన్నుంచి తప్పించుకునేందుకు ఒకే ఒక్క మార్గం ఉన్నది. దాన్ని మూసిపెట్టి భస్మమవటంకన్న ఈ విపత్కర పరిస్థితుల్లో తెరిచి ఎలాగో సందుచేసుకొని ఆ ద్వారం నుంచే బైటపడటం ఉత్తమోత్తమం!
ఆకాశపుటంచుల్లో విహరించే తన ఆదర్శాన్ని నమ్ముకొని ఇప్పుడు ఆ ఎత్తు నుంచి దిగడమెలా అనే ప్రశ్న రాగా, అసలిది ఎంత ఎత్తో తెలుసుకునేందుకు కిందికి చూస్తే కళ్ళుతిరుగుతున్నట్లున్నది. ఐతే ఆ మకరధ్వజుడే తన బంటుగా పంపిన వీరభద్రుని ద్వారా తనకు ఎలాటి ప్రమాదమూ, భయమూ లేకుండా జాగ్రత్తగా అంచలంచలుగా సుఖంగా దింపేందుకు పూనుకున్నాడు. అతన్ని నిరోధించటం తన పతనాన్ని కావాలని తాను కోరటమే అవుతుంది!
ఈ జరుగబోయేదంతా తన తత్వానికి సరిగ్గా విరుద్ధ విధానంలోనే ఉంది. తాను ఇష్టపడి కాకున్నా అవసరార్థం తత్వాన్ని మార్చుకోవాలి. అయితే ఒక పక్కనుంచి నరుక్కురావటం మొదలైతే ఇదంతా చాలా సులభంగా, సౌకర్యంగా, మెత్తగా, హాయిగా, తేలిగ్గా కొనసాగగలదనే ఆమె లోకజ్ఞానం వివరిస్తూన్నది. తాను పట్టుబట్టి అస్వభావికంగా నిరోధించకుంటే చాలు. ఇనుమును అయస్కాంతం బలంగా ఆకర్షించినట్లు, నీరు గోతిలోకే ప్రవహించినట్లు జరిగిపోతుంది, అప్పుడు తాను ఊహామాత్రంగా భావించే ఆ సుఖ కలశం నిండి పొంగి పొర్లక తప్పదు.
ఈ ఉద్రేకాలు క్షణభంగురాలు. మొదటిచూపులోనే వీరభద్రుడు తనను చూసి మహోద్రేకి అయాడు. ఆ తరువాత సంఘటన- రక్షక భటులు ఎదురవటం, ఎదురుచూడని కొత్త ప్రమాదం వాటిల్లటంతో అతని మనస్సంతా వికలమై, ఆ ప్రమాదం నుంచి బైటపడటం మీదనే లగ్నమై ఉండాలి. దాని మరుగున అంతకుమునుపున్న కామోద్రేకం కనుమరుగై ఉండాలి. సూదులమీద కూర్చున్నవాడికి పంటినొప్పి మాయమైన విధంగా అతని మనస్తత్వం మారిందేమో?
తనకు వొంగని, లొంగని వనిత తానని నిరాశ చేసుకొని, ఆ రక్షక భటులకు అప్పగించి తనను బాధించడం ఇష్టం లేక, మన్నన లేకపోయినా, మర్యాదగానే తనను బైటికి పంపే ఉద్దేశ్యమే అతనికి ఉన్నట్లయితే!
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు