డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తిపురుషుల మనస్తత్వాల్లో ఉన్న వౌలికమైన తేడాయే దీనికి కారణం. మగాడు ఎదుటివాళ్లు చెప్పిందాంట్లో విషయానికి ప్రాధాన్యత ఇస్తే, ఆడది దానితోపాటు విషయం చెప్పిన విధానానికీ, ఆ విషయపు పుట్టుకకూ, దాని మూలాలకూ సంబంధించిన కారణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.
అందుకే నువ్వూ, సాహిత్యా కల్సుకున్న విషయాన్ని ఎవరో మూడో మనిషి ద్వారా తనకు తెల్సినప్పుడు తాను అందరి భార్యల్లా సహజంగానే స్పందించింది.
మీ పరిచయం స్నేహం మాత్రమేననీ, అంతకుమించి మీ ఇద్దరిమధ్యా ఏమీ లేదని నువ్వెంత ఒప్పించ చూసినా ఆమె నమ్మలేదు.
ఏ స్ర్తి అయినా భర్త చెప్పే విషయాన్ని.. అంటే ఇటువంటి విషయాన్ని మనసులో నమ్మినా ఎట్టి పరిస్థితుల్లోనూ పైకి మాత్రం తాను నమ్మినట్టు ఒప్పుకోదు నీ భార్యలానే.
మేనేజ్‌మెంట్ కోర్సు చదవకపోయినా ఇటువంటి కార్యనిర్వాహక చిట్కాలు స్ర్తిలకు వయసు పెరిగేకొలదీ వాటంటతవే తెలిసిపోతుంటాయి. లేకపోతే స్వతహాగా అణచిపెట్టే గుణం ఉన్న మగాడితో ఏళ్లతరబడి సంసారాలు సాగించగలరా ఆడవాళ్లూ!?
ఇహ నీ విషయానికొస్తే నీ ముందున్న ప్రత్యామ్నాయాలు రెండే రెండు. సాహిత్యతో పరిచయానికి స్వస్తి చెప్పి, నీ భార్య కనుసన్నలలో మొగుడిలా బ్రతికేయడం లేదూ సామ్రాజ్ఞికీ, ఆమెకు సమాచారం చేరవేసే వాళ్లకూ తెలియకుండా జాగ్రత్తపడుతూ సాహిత్యతో స్నేహం కొనసాగించడం.
మొదటి ప్రత్యామ్నాయాన్ని నువ్వు ఎన్నుకుంటే నీ మెదడుకు పెద్దగా పనుండదు. రెండోదే నీకిష్టమనుకుంటే అనుక్షణం నీ మెదడు చురుగ్గా ఉండటం తప్పనిసరి.
నీ వెనె్నముకను తాకట్టుపెట్టి సంఘర్షణ లేకుండా బ్రతుకుతావో లేక వెనె్నముక వంగిపోకుండా నిటారుగా నిలబడి నీ మనసుకు నచ్చిన మార్గాన్ని ఎన్నుకుంటావో నిర్ణయం నీదే!’’ అన్నాడు.
‘‘నా సంగతలా ఉంచు. నీ విషయం తెలిస్తే సాహిత్య ఎలా స్పందిస్తుందో నా ఊహకు అందడంలేదు’’ అన్నాడు సామ్రాట్ సాలోచనగా.
‘‘తానెలా స్పందిస్తుందోననే అనుమానం నీకుందేమోకానీ ఆవిడ గురించి నువ్వు చెప్పినదాన్ని బట్టి ఆలోచిస్తే తను నీలా మాత్రం స్పందించదని నా నమ్మకం!’’ అన్నాడు మహర్షి.
‘‘అంటే.. ఈ విషయాన్ని తను తేలిగ్గా తీసుకుంటుందంటావా?’’ అన్నాడు సామ్రాట్ తేలికపడిన మనసుతో.
‘‘అనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక పని చేసేముందు దాని సాధ్యాసాధ్యాలను గురించి మగాళ్లకంటే ఆడవాళ్లే ఎక్కువగా ఆలోచిస్తారు.
ఆడవాళ్లకు ఊగిసలాట అనేది ఏ పనైనా చేసే ముందు ఉంటుంది సాధారణంగా. ఒకసారి తమ మనసులో గట్టి నిర్ణయం తీసుకున్నతర్వాతే వాళ్లు ఏ పనైనా మొదలుపెడతారు
మగవాళ్లలా ‘తర్వాత చూసుకుందాం..’ అనే మనస్తత్వంగల ఆడవాళ్లు అరుదు నాకు తెలిసి. మీ పరిచయం ఉత్తరోత్రా తన భర్తకూ, నీ భార్యకూ కూడా తెలిసే అవకాశం ఉంటుందని ఊహించిన తర్వాతే నీతో స్నేహానికి పచ్చజెండా ఊపి ఉంటుంది సాహిత్య కచ్చితంగా. కావాలంటే ఆమెనే అడిగి చూడు’’ అన్నాడు మహర్షి.
‘‘ఏమో ఇదంతా ఎక్కడికి దారితీస్తుందో నాకర్థం కావడంలేదు’’ అన్నాడు సామ్రాట్ ఏదో ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టి.
‘‘జరిగినదాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసి, ముందేం చేయాలో నిర్ణయించుకుని ప్రశాంతంగా ఉండు’’ అన్నాడు మహర్షి అనునయంగా.
సామ్రాట్ ఏదో అనబోతుండగా, ‘‘హలో మహర్షిగారూ.. ఏవండీ చక్రవర్తిగారూ.. గుర్తున్నానా?’’ అంటూ ఎదుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ పలకరించాడు గౌతమ్.
ఇద్దరూ పలకరింపుగా నవ్వారు.
‘‘మిత్రులిద్దరూ ఏదో విషయం మీద తీవ్రంగా చర్చించుకుంటున్నట్టుగా ఉన్నారు. నా గురించి కాదు కదా?!’’ అని నవ్వాడు గౌతమ్.
‘‘అరే.. ఎలా ఊహించారు? మళ్లీ మరోసారి మీ సామ్రాజ్యంలోకి విహార యాత్ర ఏర్పాటుచేద్దామా అనే చర్చించుకుంటున్నాం’’ అన్నాడు సామ్రాట్, హఠాత్తుగా అతణ్ణి అక్కడ ఆ సమయంలో చూపిన కలవరపాటును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తూ.
‘‘మా ఆడదీ, నేనూ మిమ్మల్ని ఆహ్వానించడానికి ఎప్పుడూ సిద్ధమే! కాకపోతే మీరు ఊళ్ళో ఉన్నా, అడవిలో వున్నా సిద్ధార్థుడిలానే ఉంటారుగా! నిజానికి మీ పేరు నాకూ, నా పేరు మీకూ సరిగ్గా సరిపోతాయేమో!’’ అన్నాడు గౌతమ్ నవ్వుతూ.
‘‘అయితే మనం ఈ క్షణం నుంచీ పేర్లు మార్చేసుకుందామా?’’ అన్నాడు సామ్రాట్ అప్రయత్నంగా.
‘ఇంకా చెప్పండి’ అన్నట్టుగా చూశాడు గౌతమ్.
‘‘పేర్లేకాదు.. మీకు సంబంధించివన్నీ నాకూ, నాకు సంబంధించినవన్నీ మీకూ బదిలీ చేసేసుకుందాం మీ కిష్టమైతే’’ అని నాలిక్కరుచుకున్నాడు సామ్రాట్.
‘‘మహర్షిగారూ.. చూడబోతే మన ఫ్రెండ్ సామ్రాట్‌గారికి నాకంటే ఎక్కువ బాధలు ఉన్నట్టున్నాయి’’ అన్నాడు గౌతమ్ కళ్లు పెద్దవి చేసి సామ్రాట్ వైపు, మహర్షివైపు మార్చి మార్చి చూస్తూ.
‘‘అదేంలేదులెండి. ఎక్కువమంది మగాళ్లలా ఈయనా భార్యాబాధితుడే! అందుకే సరదాగా అలా అని ఉంటాడు’’ అన్నాడు మహర్షి సామ్రాట్ మాటలకు భాష్యం చెపుతూ.
‘‘ఓస్.. అంతేనా! ఇంకా ఏదో అనుకున్నాను.. అయినా ఈలోకంలో భార్య వాత పడి గిలగిలా కొట్టుకోనివాడెవడున్నాడండీ...’’ అన్నాడు గౌతమ్, సామ్రాట్‌ను అనునయిస్తున్నట్టుగా.
‘‘అంటే ఎల్లకాలం భార్యల దౌష్ట్యాన్ని చేతకానివాళ్లలా భరిస్తూ ఈ జీవితాల్నిలా గడపాల్సిందేనా మనం’’ అన్నాడు సామ్రాట్ అప్రయత్నంగా.

-ఇంకాఉంది

సీతాసత్య