డైలీ సీరియల్

దూతికా విజయం-85

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోటితో చెపుతే రత్నాలు రాలిపోతాయ్ కాబోలు!’’22
‘‘జీవితాంతం వరకూ కావాలి సరూ నీవు!’’22
‘‘పాపం!.. ఎంత ఆశ’’ అన్నదామె, లోలోపల ఎంతో సంతోషపడుతూ.
‘‘ఏం..?’’ అన్నాడు వీరభద్రుడు నిరుత్సాహాన్ని ప్రదర్శిస్తూ.
‘‘నేను చిన్నరాణి ఇష్టసఖినని తెలియదూ? ఆమె సేవ చేసుకుంటూ రాణివాసంలోనే జీవితమంతా గడపాలని బ్రహ్మ రాసిన రాత లేదూ?’’2 అన్నదామె.
ఇప్పుడిప్పుడే ఆమెను కూడా విచారం పట్టి పీడిస్తూన్నది. ఈ అమరారనుభూతి జీవితాంతం వరకూ కావాలని తనకూ ఉన్నది. కాని అదెలా సాధ్యమనే విషయం తాలూకు నిరుత్సాహం ఆమెను కుంగదీస్తూన్నది. ఈ వీరభద్రుని లాటి ఉత్తమ పురుషుడు తన చేతికి చిక్కినందుకు కలిగిన ఆనందం- ఈ అనుభూతివలెనే కొద్ది క్షణాలే తనకు ప్రాప్తమేమో ననిపించింది. ఇతన్ని మాత్రం తాను భద్రంగా దాచుకోగలగటమెలా? అందుకనే కదా, అసలితను తనకు దొరక్కుండా ఉన్నా బాగుండేదని ఇపుడు అనిపిస్తూన్నది!
‘‘సరూ! నేనే బ్రహ్మను.. నీ తలరాతను మారుస్తాను!’’ అన్నాడు వీరభద్రుడు, నిజంగానే తనకంత శక్తి ఉన్నదనే ధీమా ధ్వనించే విధంగా.
తనకు భర్తయినంత మాత్రాన, తాను బ్రహ్మ పదవికే ఎగబాకినట్లు వీరభద్రుడు నమ్ముతున్నాడని ఆమె తెలుసుకున్నది. ఐనా ఇతను తన రాతను ఎలా మారుస్తాడు? ఆ విషయం అతనికే తెలియాలి, అతనే చెప్పాలి. కాదు- అతని చేతనే చెప్పించాలి
‘‘నీ దర్శనం కాగానే నా మతిపోయింది. నా స్వాప్నవిక సుందరి ప్రమైనదనుకున్నాను. పేరు సరస్వతని చెప్పి, నా పరంగా బ్రహ్మ శబ్దాన్ని ముమ్మారు నీవు ప్రయోగించినప్పుడు బ్రహ్మ అంశే నాలో ప్రవేశించినట్లయింది. ఆ బ్రహ్మ వాక్కు మహత్మ్యాన్ని ప్రయోగిద్దామని నోటిదాకా వచ్చినా, ఎందుకులెమ్మని ఊరుకున్నానులే!’’22
వీరభద్రుడు మనసులోని మాటేదో దాచి ఉంచాడని సరస్వతి అర్థంచేసుకున్నది.
‘‘ఏమందామనుకున్నారూ?’’ అన్నదామె గోముగా.
‘‘ఎందుకులే!’’22
‘‘చెప్పరూ? చెప్పరూ?’’2
వీరభద్రునికి చెప్పక తప్పలేదు.
‘‘కల్యాణికి శోభమగుగాక!2 అందామనుకొని, మొదటి మాటకే తత్తరపడి పారిపోతావేమోనని భయపడి 3కల్యాణికి శుభమగుగాక2 అని లోలోపలే 3శోభనం2 అని మార్చుకున్నాను’’.
ఎంత కొంటెవాడీ వీరభద్రుడు! లోలోపల సంతోషంగా ఉన్నా పైకి మాత్రం మూతి ముడిచి 3‘‘4ఒంటరిగా ఎదురైన కన్య అంటే ఎంత అలుసో!’’ చెప్పిందామె.
‘‘చెప్పొచ్చిందేమంటే’’ అన్నాడు వీరభద్రుడు కృత్రిమమైన ఆమెఅలుకను లెక్కచేయనట్లు. 34నేను అనుకున్నట్లుగానే నీ శోభనం శుభప్రదంగా, సుఖకరంగా కొనసాగిందా? లేదా? అందుకని ఆ బ్రహ్మ రాసిన రాతను రుూ బ్రహ్మ మార్చగలడని ఇప్పటికైనా నమ్ము!’’222
లోలోపలే నవ్వుకుంది సరస్వతి.
‘‘ఎలా మారుస్తారు? రాణి ఆజ్ఞలను శిరసావహించవలసిన నేను రాణి అనుమతి లేనిదే మళ్లీ ఇక్కడికి రాలేను కదా!’’ అన్నదామె.
‘‘నీవసలు రాణివాసానికి వెళ్ళవలసిన పనేమిటి? మళ్లీ రావటం అనుమానమని ఇపుడే చెపుతూన్నావు కనుక, నిన్నసలు రుూ ఇంటి గడప దాటనీను తెలుసా?’’22
‘‘ఇక్కడే కట్టడి చేసి నన్ను ఉంచితే రాణి ఎంత కలవరపడుతుందో!22
‘‘రాణి గొడవ నాకు చెప్పకు!’’ అన్నాడు వీరభద్రుడు చిరాకుగా.
‘‘మీ స్వేచ్ఛా జీవనానికి నేను అడ్డు కదా!’’22
‘‘అంటే.. నీ ఉద్దేశం.. నేను.. ఇతర స్ర్తిలను కోరుతున్నాననా?’’ అన్నాడు వీరభద్రుడు మొహం చిట్లించి.
‘‘ఏమో! మగవారి మాటలు నీళ్లలో మూటలు! ఎలా నమ్మటం?’’ అన్నదామె.
‘అందుకే.. ఆ అనుమానాలు ఏమీ లేకుండా చేసుకునేందుకే నీవు ఇక్కడే ఉండిపో. మీ రాణి పురమాయించే పనుల్లో, ఇక్కడివలెనే మరెక్కడన్నా మానాన్ని అర్పించవలసిన అవసరం నీకు రావొచ్చు. అదీగాక స్ర్తిహృదయం ఆ బ్రహ్మకే తెలియదన్నారు!’’
‘‘ఉహు. ఇందాకణ్ణుంచీ ఆ బ్రహ్మ మీరే అయినట్లు నటిస్తున్నారుగా!’’
‘‘ఐతేనేం- బ్రహ్మను తిమ్మినీ, తిమ్మిని బ్రహ్మనూ చేయగల చతురాలివి. నిన్ను నమ్మటమెలా?’’ అని వీరభద్రుడు తిప్పి కొట్టాడు.
‘‘అంటే.. మీ ఉద్దేశం? నేను కనిపించిన మొగాడి వెంట పడతాననా?’’ అన్నదామె.
కోపాన్ని నటిస్తూ, బుంగమూతి పెట్టి, మంచం చివరకు జరిగి కూర్చుంది.
వీరభద్రుడు ఆమె ముఖాన్ని అన్ని కోణాలనుంచీ పరిశీలించాడు. ‘‘కోపమొచ్చినా ఎంత ముద్దొస్తావే సరూ!’’ అన్నాడు, మీద చేయివేస్తూ.
ఆమె అతని చేతిని విసిరికొట్టింది.
‘‘అబ్బో! ఈ ప్రణయం ఆరంభమైన మొదటి ఝాములోనే ఆకాశపుటంచులదాకా పెంపొందటం, అంతలోనే ప్రణయ కోప ప్రకరణంలో పడటం- దీని వేగాన్ని నేను ఊహించుకోలేకుండా ఉన్నాను సరూ!’’ అన్నాడు వీరభద్రుడు.
సరస్వతికూడా ఆ విషయానే్న ఆలోచిస్తోంది. రుూ ప్రణయం ఎంత బలవత్తరమైనది కాకుంటే ఇరవై ఏళ్ళుగా తాను ప్రాణప్రదంగా చూసుకుంటూ అనుసరిస్తూన్న కన్యాత్వమనే ఉత్తమ ఆదర్శాన్ని కొద్ది క్షణాల్లో వొదులుకోవటం మాత్రం కాదు; దాన్ని వదులుకున్నందుకు ఎలాంటి విచారమూ లేకపోతే, తాను ఎంతో ఆనందపడుతోంది. ఇంత స్వల్పకాలంలో తన అభిప్రాయాలన్నిటినీ మార్చుకున్నది. తన వలెనే పావు శతాబ్దంగా ఆరాధిస్తున్న బ్రహ్మచర్యమనే ఆదర్శాన్ని వీరభద్రుడు వొదులుకొని, వదులుకున్నందుకు ఆనందిస్తూన్నాడు. ఈ ప్రణయం అతి శక్తివంతమైనది కాదనేందుకు తామిద్దరూ సజీవ సాక్ష్యులుగా ఉండనే ఉన్నారుగా.
సరస్వతి వౌనం వహించింది.
‘‘ఎందుకు ప్రియా! నా మీదంత కోపం? ప్రణయం ఉన్నప్పుడే కదా రుూర్ష్య కూడా ఉండేది. ఒక్కసారి మొహమిటు తిప్పుదూ!’’ అని వీరభద్రుడు ఆమెను బతిమాలాడు.
‘‘ప్రణయంట.. ప్రణయం!’’ అన్నది సరస్వతి రుసరుసలాడుతూ. ‘‘కాస్తయితే, బైటపడుకున్న రాజభటుల క్కూడా అప్పగించేందుకూ, ఆడదాన్నీ, నిస్సహాయనూ అనే విచారణ లేకుండా, అతిథినీ, దూతికను అనే ఆలోచన కూడా లేకుండా వీధిలోకి గెంటినప్పుడు రుూ ప్రణయం ఏమైందో?’’
‘‘నిన్ను అంత బలవత్తరంగా ప్రేమించబట్టే, నీవు నిరాకరించి నన్ను రక్కి పీకినప్పుడు మనసు విరిగి, చిరాకుపడి నిన్ను బైటికి నెట్టిన మాట వాస్తవమే! ఐతే అదంతా తమాషాకు! ఆ విధంగా బెదిరించి, భయపెట్టయినా సరే నిన్ను లొంగదీసుకోవాలని! అంతే!’’’
‘‘తమాషాట. తమాషా! ఆ రాజభటులు నన్నుగుర్తించి పట్టుకుపోతే ఏం చేసేవారు?’’
‘‘్భర్యవని చెప్పలా? అలాగే నటించి తప్పించలేదా? అప్పటికీ వాళ్ళు వినకుంటే’’ వీరభద్రుడు- రెండు చేతులూ పైకి ఎత్తి బిగించి చూపుతూ అన్నాడు.
ఇంకావుంది...

-ధనికొండ హనుమంతరావు