డైలీ సీరియల్

దూతికా విజయం-87

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘్భయం లేదు. ఈ వాన తగ్గుతుందిలే!’’
‘‘మీకెలా తెలుసూ?’’
‘‘మకరాంకుడే ఆధ్వర్యం వహించి ఈ తతంగమంతా నడిపించాడు కదా! వాన తగ్గేట్లు చేసి ప్రియురాల్ని కాపాడడా ఏం? నే చెప్పానుగా చూస్తూండు!’’
‘‘ఈ రవిక కాస్తా చింపారు కదా! బైటికి ఎలా వెళ్ళటం?’’
‘‘సూదీ దారం ఉన్నయ్‌లే.. ఇందాక అనులేపనం తీసావే ఆ గూట్లో వెదుకు ఇప్పుడు చేసే పనేమున్నది కనుక? తీరిగ్గా కుట్టుకో’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘ఎప్పుడో చిన్నప్పుడు కుట్టుపని నేర్చుకున్నాను. ఇప్పుడా అలవాటు తప్పింది’’ అన్నది సరస్వతి.
‘‘కానీ ఏం చేస్తాం? ప్రియురాలకి సేవ చేయక తప్పుతుందా? అయితే ఇంత బలహీనంగా వున్న కాంతిలో సూది బెజ్జంలోకి దారం ఎక్కించటం నావల్ల కాదు, దారం నీవు ఎక్కించు. కుట్టే వ్యవహారం నేను చూస్తాను!’’ అన్నాడు వీరభద్రుడు.
ఇక అంతకన్నా మరో మార్గం లేదు కనుక, ఆమె గూట్లో వెతికి దారపు ఉండను, దానికి గుచ్చిన సూదితోసహా తీసుకొచ్చి దివిటీ దగ్గర నిలబడి దారాన్ని నోటితో తడిచేసి ఒకటి రెండుసార్లు చీకి, అది కొంచెం గట్టిపడి మొనదేరాక మెల్లిగా వాటం చూసి సూది బెజ్జంలోకి ఎక్కించి, వీరభద్రుని చేతికి అందించింది.
‘‘రవికె విప్పి ఇటివ్వు’’ అన్నాడు వీరభద్రుడు తన సంసిద్ధతను సూచిస్తూ. రవికె విప్పిఇవ్వక తప్పదు మరి. ఐతే కొత్తగా కొండంత సిగ్గు ఆమెను ఆవరించింది.
‘‘మీరు కాస్త సావిట్లోకి వెళ్ళండి. రవికె విప్పాక మిమ్ము పిలుస్తాను’’ అన్నదామె.
‘‘సరూ- నాకు తెలియంది ఏముంది కనుకా? లేక ఇంకేమన్నా నాకు కానరాకుండా దాచావేమో- అల్లరి పిల్లవు! నేనే విప్పి చూస్తానుండు’’ అని వీరభద్రుడు సూదిని పెదవుల మధ్య కరిచి పట్టుకొని చేతుల్ని ఆమె రొమ్ములమీదికి పోనివ్వబోయాడు.
సరస్వతి ముడుచుకొనిపోయి అతన్ని వారిస్తూ, ‘‘మీరుండండి.. నా కసలే చక్కలిగిలి.. నేనే విప్పుతాను- మీరు కాస్త జరిగి కూర్చోండి’’ అన్నది అతని చేతులను తన చేతులతో వారిస్తూ.
వీరభద్రుడు కాస్త అవతలికి జరిగి కూర్చున్నాడు.
చిరిగిన రవికె రెండు తుంపులూ వీపుమీద ఉండగానే వీరభద్రుణ్ణి కుట్టమందామని అనుకున్నది సరస్వతి. కాని సూది పైకి కిందికీ, స్వేచ్ఛగా ఆడేందుకు తగినంత స్థలం ఉండదు. అదీగాక కుట్టేప్పుడు ఏ కాస్త అజాగ్రత్తగా వున్నా, లేక చేయి జారినా సూది కసుక్కున వీపులో గుచ్చుకునే ప్రమాదం వున్నది. ఇంతకుముందు గోళ్ళతో తను వీరభద్రుణ్ణి రక్కింది; ఆ కసి తీర్చుకునేందుకు అతను ప్రయత్నిస్తాడేమో? కొంటె వేషాలు వేయటంలో మొనగాడైన వీరభద్రుడు పొరపాటన్న విధంగా సూదిని చర్మంలోకి గుచ్చినా గుచ్చవచ్చు. అందుకని రవికె విప్పి అతని చేతికి ఇవ్వటమే ఉత్తమమనిపించిందామెకు.
సరస్వతి వీపు వీరభద్రుని వైపు ఉంచి, నిలబడి ముందుకు వంగి, పమిటను పెదవులమధ్య కరచుకొని మెల్లిగా రవికె విప్పింది. రవికెను ఒక చేతుల్లోకి తీసుకుని పమిటెను లాగి, రొమ్ములనిండా కప్పుకొనేందుకు ఆమె ప్రయత్నించేలోగానే, ఆమెకాశ్రమ తప్పిస్తూ, వీరభద్రుడుని రెండు చేతులూ బలంగా ఆమె గుండెల్ని కప్పినవి.
‘‘అబ్బ! వదలండి.. చెపుతూంటే మీక్కాదూ?’’ అని ఆమె బిగడదీసుకొనేందుకూ, వీరభద్రుని చేతుల పట్టు నుంచి విడివడేందుకూ వ్యర్థ ప్రయత్నాలు చేసింది.
‘‘నీ హృదయం ఇంకెవరికీ కనిపించకుండా దిట్టంగా కప్పానుగా, ఇంకా సిగ్గెందుకూ?’’ అంటూ వీరభద్రుడు ఆమెను తన ఊరువులమీద పడుకోబెట్టుకున్నాడు. ఒక చేతిని ఆమె వీపు కింది నుంచి దూర్చి, అవతలికి లాగాడు; మరో చేతిని రొమ్ముల మీదినుంచి జాచి ముందుకు జాపాడు. సరస్వతి ఆ రెండు చేతుల నడుమా ఇరుక్కొనిపోయింది. ఆచ్ఛాదన లేని రొమ్ముల్ని చూసుకొని ఆమె సిగ్గుపడింది. ఐతే కదిలేందుకు వీలు లేకుండా వీరభద్రుడు తొక్కిపట్టి ఉంచిన కారణాన ఆమె మెదలకుండా ఊరుకోవలసి వచ్చింది.
వీరభద్రుడు గుచ్చి గుచ్చి చూస్తుంటే సరస్వతి మరింత సిగ్గుపడింది. చివరి ప్రయత్నంగా గుంజుకుంటూ ‘చెపితే అర్థం కాదేం? ఇంత మొండిఘటం అనుకోలేదు, వదలండి!’’
‘‘కదలకు.. చేతిలో పదునైన సూది ఉన్నది. నేను కుడుతూంటాను.. చూడు సరిగ్గా వున్నదో లేదో.. కదిలావంటే రుూ సూది కసుక్కున గుచ్చుకుంటుంది జాగ్రత్త.. సిగ్గట.. సిగ్గు! ఎవరి దగ్గిరంట నీ సిగ్గు! ఈ శరీరమే నాది.. దాన్ని నా నుంచి ఎలా దాస్తావో చూస్తాను.. చిరిగింది యింతా ఏడుస్తే రవికె.. చీర చిరగనందుకు సంతోషించు.. కదలకు!.. ఆడది చేసే పనులు కూడా నా చేత చేయిస్తున్నందుకు నేను సిగ్గుపడాలి కాని- నీకు సిగ్గేమిటి.. ఈసారి కదిలావంటే రుూ సూది గుచ్చుతాను, జాగ్రత్త’’ అని వీరభద్రుడు కసిరినట్లు నటించాడు.
చిరిగిన రెండు కొసల్నీ చేర్చి వీరభద్రుడు మొదటి కుట్టు వేసి ‘‘ఏం సరిగ్గా ఉన్నదా?’’ అన్నాడు.
‘‘కుట్టాక చాలా బిగతవుతుందేమో? ఇంకా దగ్గరిగా నొక్కి కుట్టాలి! అన్నది సరస్వతి, తన అవస్థను గూర్చి చర్చించి ప్రయోజనం లేదు కనుక, విస్మరించిన విధంగా నటిస్తూ.
‘‘బిగుతు కాకుండా నొక్కి పెట్టి నేనే స్వయంగా రవికె తొడుగుతాలే! ఇంకా దగ్గరికి జేరుస్తూ కుట్టు ఎక్కడ వేయాలీ?’’
తనకు అనుకూలంగా వుండే విధంగా సరస్వతిని చేతుల మధ్య తిప్పుకుంటూ వీరభద్రుడు కుట్టుపనిలో నిమగ్నుడయ్యాడు. ఒకటి రెండుసార్లు సూది మొన వేలికి తగిలించుకొని ‘‘అబ్బ! కదలొద్దని చెపుతే నీక్కూదూ?’’ అని ఆమెను మందలించాడు, వీరభద్రుడు.
‘‘నన్ను విడుదల చేస్తే మీకీ అవస్థ ఉండదుగా?’’ అన్నది సరస్వతి.
‘‘నీవు ఇలా విశ్రమించకుంటే రుూ బోడి పని నేనసలు చేయను!’’
వీరభద్రుడు పడే అవస్థ సరస్వతికి నవ్వు తెప్పించి, ఆమెకు ఆనందపరిచింది.
వీరభద్రుడు ఎలాగో రవికె కుట్టటం పూర్తిచేశాక, సరస్వతికి బలమైన అతని చేతులనుంచి విముక్తి లభించింది. ఎప్పుడు బైటికి ఉరుకుదామా అని వేచి వున్న తాచు, బుట్ట మూత తెరవగానే బుస్సన పడగ ఎత్తి లేచే విధంగా సరస్వతి ఒక్కసారిగా లేచి నిలబడింది.
వీరభద్రుడు నవ్వుకొని రవికె ఆమెకు అందించబోయి, అంతలోనే ఆగి ‘‘నేనే తొడుగుతాను ఉండు!’’ అన్నాడు.
‘‘ఏం అక్కర్లేదు.. నేను తొడుక్కుంటాను. మీకో నమస్కారం- మీరు కాస్త అవతలకి వెళ్దురూ!’’ అన్నాడు.
‘‘అంతలోనే సిగ్గు.. నా ఇంట్లోంచి ననే్న వెళ్ళమంటున్నావ్- ఎంత జాణవై ఉండాలి!.. పోనీలే కళ్ళు మూసుకుంటాను. పని కానీ’’ అని వీరభద్రుడు రెండు అరచేతులనూ మొహానికి అడ్డంగా పెట్టుకున్నాడు.
బతిమాలి కూడా ప్రయోజనం లేదని సరస్వతికి తెలుసు. వీపు అతని వైపు తిప్పి, నడుం ముందుకు వంచి, పమిట జార్చివేసి, మెల్లిగా రవికె తొడుక్కుందామె. కాని బిగింపు ముడికి కొసలు చేతికి అందటంలేదు. ఎంత ప్రయత్నించినా కుదరలేదు.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు