డైలీ సీరియల్

దూతికా విజయం-92

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలిలో తేలిపోతూన్నట్లనిపిస్తోంది.
యవ్వన లావణ్యాలున్న ఆడపిల్ల చిలిపితనం మాయమై, ఆ స్థానే పరిపక్వ దశకు మారిన స్ర్తిత్వం వొచ్చిపడింది. అల్లరితనానికి మారుగా హుందాతనం వచ్చింది. అమాయకత్వాన్ని, విజ్ఞానం ఆక్రమించింది. లత పుష్పించి శోభాయమానంగా తయారైన విధంగా తోచింది. కదలిక లేక కరుడుకట్టిన ఊహలు పటాపంచలై, అయోమయమంతా అంతర్థామవగా, స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ప్రవాహ వేగంతో పయనించే ఆనంద స్రవంతి తానేననిపిస్తూన్నది. ఏమిటో తెలియని బాధలనుంచి, అన్నీ తెలిసిన పొంగి, పొరలి, తెరిలే ఆనందానుభూతిలో మునకలు వేస్తూన్నట్లున్నది.
ఈ ప్రాపంచిక సమస్యలే లేకుంటే ఆ దివ్యానుభూతిని నెమరువేసుకుంటూ దీర్ఘకాలం హాయిగా గడపవచ్చును కదా అని సరస్వతి తలపోసింది.
ఆలోచనలు తెగకుండానే సరస్వతి రాచనగరులో ప్రవేశించింది. మరికొద్ది క్షణాల్లో తాను రాణి సమక్షంలో ఉండగలదు. ఏదో వొకటి తేల్చుకోవాలని ఆమెను మనసు ఎంతో తొందరపెట్టింది. కొంత వ్యవధి ఉంటేనే తప్ప ఇది తేలదు. అందుకని అసలు వీరభద్రుణ్ణి కలుసుకునే అవకాశమే దొరకలేదని బొంకి ప్రస్తుతానికి ఈ విషమ సమస్య కోరలకు చిక్కకుండా తప్పించుకొని, ఇవాళ రాత్రి వీరభద్రునితో కూడా సంప్రదించి, రేపటికి ఎటో అటు తేల్చుకోవటం ఉచితమని సరస్వతి నిశ్చయించుకున్నది.
ఈ రవికె ఒకటి మహా ఇబ్బందిగా ఉన్నదామెకు. స్వేచ్ఛగా ఎటుపడితే అటు కదిలేందుకు వీల్లేదు. ఏ మాత్రం వొత్తిడి తగిలిన టపటప చప్పుడు తప్పదు. వీపున వాతలు పెట్టినట్లు అవి భగభగ మండుతూన్నట్లూ ఉన్నది. వీరభద్రుడు వేసిన పీటముడి మరీ బాధగా ఉన్నది. రాణివాసం జేరగానే ముందు రవిక మార్చి ఆ తరువాత రాణిని దర్శించటం మంచిదని అనుకున్నదామె.
రాణివాసంలోకి ప్రవేశించగానే ఒక చెలికత్తె ఎదురొచ్చి, ‘రాణిగారు నీ కోసమే ఎదురుచూస్తున్నారు. ఆమె స్నానానికి వెళ్ళబోతూ నిన్ను వెంటపెట్టుకొని వెంటనే రమ్మన్నారు’’ అని వాయువేగం ధ్వనించే వార్తను అందించింది.
సరస్వతి వెంటనే రాణి ఎదుటికి వెళ్ళక తప్పలేదు.
‘‘రా.. నీ కోసమే చూస్తున్నాను. స్నానం చేయించవా?’’ అన్నది రాణి.
రాణి కళ్ళు జ్యోతులల్లే మెరిసిపోతూన్నవి. తనను చూసీ చూడగానే ‘కాయా? పండా?’ అని కూడా అడగకుండానే, బహుశా రెండోదే అయి ఉంటుందని ఊహించి ఈ ఉత్సాహాన్ని రాణి ప్రదర్శిస్తోందేమోనని సరస్వతి అనుకున్నది. ఈ స్నానాల గది తాము స్వేచ్ఛగా మాట్లాడుకునేందుకు అత్యంతానుకూలమైన ప్రదేశమని సరస్వతికి తెలుసు.
‘‘దానికేం రాణీ! నా రాక మీ స్నానానికి ఆలస్యవౌతుందేమోనని భయపడ్డాను’’ అన్నది సరస్వతి.
‘‘్భయమెందుకే.. రా..’’ అని రాణి బయలుదేరితే, సరస్వతి ఆమెను అనుసరించింది.
స్నానాల గది తాలూకు బరువైన తలుపులు మూసి సరస్వతి వెనుదిరిగిందో లేదో, రాణి ఆమెను గాఢంగా కౌగిలించుకుని ఆమె పెదాలమీద గట్టిగా ముద్దులు కురిపించింది.
సరస్వతి నివ్వెరబోయి ‘‘రాణీ! నేనింకా మొహమన్నా కడగలేదు!’’ అన్నది.
‘‘పిచ్చిదానా! ప్రియుని పెదాలు తగిలిన ప్రియురాలి పెదవులు సూర్యకిరణాలు సోకిన పద్మదళాలే! ఆ ఘుమఘుమలు వెదజల్లే సువాసనలకు నకలు ఈ భూమిమీద మరోటి ఉండబోదు!’’ అన్నది రాణి.
రాణి అంతా క్షణంలో గ్రహించేసిందని సరస్వతికి తెలిసిపోయింది. తాను బొంకాలనుకున్నది వృథా! ఇంకా నయం ఏమైనదని రాణి ముందుగా తనను అడిగి, తాను అబద్ధాల అల్లికతో చెప్పిన కథనాన్ని విని, తన బోంకుల్ని రుజూచేసినట్లయితే, రాణి ఎలా దండించేదో సరస్వతి ఊహించలేకపోయింది. ఈ ప్రమాదం విరుచుకొని మీద పడకుండా కాపాడినందుకు తన కులదేవతలందరికీ సరస్వతి మనసులోనే ప్రణామాలు అర్పించుకున్నది.
‘‘ప్రియుని పెదవులతో సంఘర్షించిన అధరాలు మధురమైనవే!’’అని రాణి తన ప్రియసఖి పెదవులను మరోసారి ముద్దాడింది.
సరస్వతి వాటి రుచిని తాను కూడా చూడాలని పెదవుల్ని చప్పరించి చూసుకున్నది కాని, అవి చప్పగానే ఉన్నవామెకు.
‘‘వాటి రుచి నీకెలా తెలుస్తుంది సరూ! ఎవరి పెదాల రుచి వారికి తెలిస్తే ఈ ప్రపంచం ఏనాడో నిర్మానుష్యమై ఉండేదే! చెకుముకిరాయి వ్యవహారమనుకో. రెండు చెకుముకి రాళ్ళల్లోనూ నిప్పు ఉన్నది. ఐతే ఏ ఒక్కటీ దాన్ని సృష్టించలేదు. రెండూ రాపిడి పడ్డప్పుడే ఆ నిప్పు కణాలు రాలుతవే! ఇక స్ర్తి పురుషుల సంఘర్షణలో విద్యుత్ప్రవాహాలే పొంగి పొర్లుతవి.. గత రాత్రి ఈ విషయం నీకు సుబోధకమై ఉండాలి!’’ అని రాణి చిలిపిగా సరస్వతి కళ్ళల్లోకి చూసింది.
సరస్వతి నిరుత్తరురాలయింది.
‘‘నీ వొక్కసారి అద్దంలో చసుకో, ఎంత కళ వచ్చిందో! పసిడి పంజరంలో బంధించబడిన పక్షి విడుదలై, భానుని బంగారు కిరణాలతో సింగారించుకొని తిరుగులాడుతూ, స్వేచ్ఛావాయువుతో ఊపిరితిత్తులు నింపుకున్నపుడు అది పొందే వికాసమంతా ఇపుడు నీ మొహంలో స్పష్టవౌతున్నది!’’ అన్నది రాణి.
నిజమే అయి ఉండాలని సరస్వతి భావించి ఊరుకున్నది.
‘‘ఏం శోభనపు పెళ్ళికూతురా! రాత్రి సుఖంగా గడిచిందా?’’ అని రాణి అడిగింది.
సరస్వతి సిగ్గుపడి బొటనవేలుతో నేలమీద రాస్తూ, నేల చూపులు చూడసాగింది.
‘‘నేను ఊహించనే లేదు సుమా! లేకుంటే నీకు మధుపర్కాలు కట్టబెట్టి, కొంగున సువర్ణ రాజముద్రిక కూడా కట్టేదాన్ని!’’
వీరభద్రుడు కొంగున కట్టిన సువర్ణ ముద్రికనుమెల్లిగా బొడ్డున తడిమిచూసుకుంది సరస్వతి.
‘‘ఇంతకూ మా బావగారు రసికులేనా?’’
‘పో రాణీ! నాకు తెలియదు!’’ అని అలిగినట్లు నటించింది సరస్వతి.
‘‘ఏమిటి? నీకే తెలియలేదా? రసగ్రావి కదా ఆ మాత్రం కూడా తెలుసుకోని మైకంలో పడ్డావా?’’ అని రాణి కవ్వించిందామెను.
ఎలుకకు ప్రాణసంకటం, పిల్లికి చెలగాటంలా తయారైంది ఇదంతా అనుకున్నది సరస్వతి. అక్కడ వీరభద్రుడు ఏడిపించాడు: ఆ కబంధ హస్తాలనంచి విడుదలై వస్తే, ఇక్కడ రాణి తనను ఉడికిస్తోంది!
‘ప్రణయపు మరకలన్నీ రాంకి ఎరుకలే!’ అనుకున్నది సరస్వతి.
సరస్వతి జవాబు చెప్పలేదు; చిరు చెమట్లు కమ్మేటంతగా ఆమె సిగ్గుపడిపోయింది.
‘‘చెప్పవే అక్కా! బతిమాలుతున్నాగా!’’ అని రాణి ఈసారి లాలించింది.
‘‘నేనంత రసికురాల్నికాదు రాణీ!’’ అన్నది సరస్వతి.
‘‘అలాగా? మరి పెదాలమీద ఈ మణిమాలా దంతక్షతాలను ధరించావే!.. నెత్తిమీదేమిటి? ప్రియుడు తలమీద తీవ్ర ప్రహరణల్ని ప్రసాదించలేదు కదా! నీ నెత్తురు కళ్ళజూశాడా యేం?’’ అన్నది రాణి.
సరస్వతి వేలుతో పాపిటలో రాచుకుంటూ ‘కుంకుమ!’ అన్నది.
‘‘దేవీ పూజకు ఉపయోగపడిన ద్రవ్యమా? సరే.. శోభనపు పెళ్ళికూతురికి ఎంత కళ వచ్చిందే! అద్దంలో చూసుకో నీకే తెలుస్తుంది. ’
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు