డైలీ సీరియల్

దూతికా విజయం-93

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలరాతి బుగ్గలమీద పగుళ్ళు ఏర్పడ్డ విధంగా చారలు కూడాను.! ఇపుడు తెలిసిందా అక్కా!.. మదనుడు స్ర్తి హృదయాన్ని ఎంత అల్లకల్లోలం చేస్తాడో! ఇకముందు నన్ను దెప్పిపొడవకుండా నా మన్మథావస్థ ఎలాంటిదో స్వయంగా తెలుసుకోగల జ్ఞానం నీకు వచ్చినందుకు ఎంతో ఆనందిస్తున్నాను. అది సరే గాని.. ఎలా ఉన్నదా అనుభూతి! బావగారి రసికత్వాన్ని గూర్చి కాస్త చెప్పుదూ!’’
సరస్వతి మెదలకుండా ఊరుకున్నది.
‘‘సిగ్గెందుకే! ఇక్కడెవరున్నారూ? నాకు చెప్పకూడదా?’’
సరస్వతి వౌనం వహించింది.
‘‘అబ్బో! అంత రహస్యమా యేం?’’
‘‘రాణీ! ననె్నందుకు ఉడికిస్తావు?’’ అన్నది సరస్వతి.
‘‘అబ్బో! ఇప్పుడా ప్రశ్న నన్ను అడుగుతున్నావా సౌభాగ్యవతీ! సరస్వతీ!.. ఆనాడు నా శోభనం రోజున రాజు శనయగారంలోకి నన్ను తోసి, మర్నాటి ఉదయం నేను బైటికిరాగానే నన్ను వేసిన ప్రశ్నలన్నీ మరిచిపొయ్యావా? నన్ను నఖశిఖ పర్యంతమూ తీక్షణంగా పరీక్షించి, నా దుస్తులు కూడా పరిశీలించి, గుచ్చి గుచ్చి ఎన్ని ప్రశ్నలడిగావో జ్ఞాపకం లేదా?’’ అన్నది రాణి.
‘‘నేను ఎంత అడిగినా, బతిమాలినా ఆనాడు మీరు జవాబు చెప్పారా? దానికి నా రుూ వౌనమే చెల్లు!’’అన్నది సరస్వతి.
‘‘చెల్లు వేయటానికి ఈ ఎత్తు వేశావా?.. సరే కాని.. చెప్పవే సరూ! బావగారు మంచి రసికులనుకుంటాను!’’
‘‘త్వరలో మీరే చూస్తారుగా! తినబోతూ రుచులు అడగటం దేనికో?’’ అని సరస్వతి తప్పించుకోజూసింది.
‘‘తినేందుకు ఇంకా వ్యవధి ఉన్నదిగా! ఈ లోపల ఈ ఆత్రం ఆగక అడుగుతున్నానే! రుచి చూశావు కనుక, నీవు బా గా చెప్పగలవే!’’
సరస్వతి నోటికి తాళం వేసుకున్నది.
‘‘చెప్పవు కదూ! ఐనా నీ మీద ప్రయోగించిన ఈ చిలిపితనమంతా మెదలకుండా భరించావా అక్కా? కాదులే.. సివంగివై ఇంతకు రెట్టింపు బావగార్ని బాధించి ఉంటావులే! ఔనా?’’
‘‘సరస్వతి ‘ఔ’ననా లేదు, ‘కా’దనా లేదు.
‘‘ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే నేను మాత్రం ఒప్పను సుమా! నాకు తెలియక అడుగుతాను సరూ! మగ పురుగులంటే నీకు అంత మంట కదా! ఎలా అతుక్కుపోయావే! ఆ మంటలన్నీ చల్లారగా గూడు కట్టుకున్న ఆశాంతతంతా అరాధనమై ఎంత ప్రశాంతత నిన్ను ఆవరించిందో తెలుస్తూనే ఉందిలే!’’
‘‘నీ స్నానం కానీ రాణీ!’’ అన్నది సరస్వతి రాణి దృష్టిని మరల్చుదామని.
‘‘స్నానానికేం తొందర! అక్కడేం జరిగిందో వివరంగా చెప్పు.. చెప్పవూ?’’
రాణితనమీద ఎలాంటి కోపమూ, ఈర్ష్యా కలగనందుకు సరస్వతికి ఎంతో ఆనందమైంది. అక్కడి విషయాలు చెప్పవలసిన తన బాధ్యతను ఆమె విస్మరించలేకపోయింది.
‘‘అతనొక కొరకరాని కొయ్య రాణీ’’
‘‘ఐతేనేం! ఎంత కఠినమైన పురుషత్వాన్నయినా సరే స్ర్తిత్వం లొంగదీయగలదనేది నీవే రుజువు చేశావు కదా! తరువాత?’’
‘‘రాణీ పరిస్థితుల వొత్తిడి కారణంగా అతనికి లొంగ తప్పలేదు నాకు- క్షమించు’’ అన్నది సరస్వతి.
‘‘క్షమించటం అనే పదాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తావు సరూ! అసలు నేనే చెపుదామనుకున్నాను- అవసరమైతే అతన్ని లొంగదీసుకునేందుకు, నీ ప్రణయ పాశాల్ని ప్రయోగించేందుక్కూడా సందేహించవొద్దని. కానీ పురుషుడంటే నీకుండే ద్వేష కారణంగా- నేనా విధంగా చెపితే ఏమనుకుంటావోనని, అతనికి లొంగవలసిన దారుణ పరిస్థితి ఎదురౌతుందేమోనని భయపడిపోతావేమోనని ఊరుకున్నాను. నీవు చేసే పనులన్నిటికీ నా ఆమోదం ఉండనే ఉంటుంది సరూ! ఏ కార్యం ఎంత చక్కగా, చమత్కారంగా, తెలివిగా సాధించుకొని రావాలో తెలిసిన విజ్ఞురాలివి నీవు. సమయస్ఫూర్తితో అంతా సరిజేసుకొని రాగల సరసిజాక్షివి- నీకు వేరే చెప్పాలా?’’
‘‘ఇది ఎంతో ప్రమాదమని నేను మొదటనే మొత్తుకున్నా మీరు వినలేదు రాణీ! మొదటిసారి ఎదుర్కోవటంలోనే నా కన్యాత్వాన్ని బలిపెట్టవలసి వచ్చింది; ఎంత విలువ చెల్లించవలసి వచ్చిందో చూడు రాణీ.’’
తన మాటలు రాణిని బాధిస్తవని సరస్వతి అనుకోలేదు.
‘‘నీవే నన్ను క్షమించాలి సరూ! నా కోసం నీవు ప్రాణప్రదంగా చూసుకొనే కన్యాత్వానే్న వెచ్చించావు!’’ అన్నది రాణి.
‘‘‘రాణీ! నేను ఆ ఉద్దేశ్యంతో అనలేదు. నేను మిము మక్షమించే మాత్రపుదానినా? తమ కోసం ప్రాణాన్ని కూడా లెక్కచేయనిదాన్నని మీకు తెలుసు. మాట వరుసకు దీనిలో దాగిన ప్రమాదాలను గూర్చి వివరించబోయి మిమ్ము నొప్పించిన మూర్ఖురాల్ని. రాణీ! మన్నించు!’’
‘‘నిజంగనా నీ కన్యాత్వం భంగపడినందుకు నీవు విచారించటం లేదా సరూ! ప్రమాదంలో ప్రమోదాన్ని రుచిచూసిన తృప్తి నీలో ప్రతిఫలిస్తున్నది. హృదయపూర్వకమైన నిజాన్ని చెప్పు’’ అన్నది రాణి.
కన్యాత్వాన్ని కోల్పోబోయ్యే ముందు తన హృదయంలో కలుక్కుమన్న మాట నిజమే కదా, కోల్పోతున్న సమయంలో ఎలాంటి విచారమూ కలుగలేదు సరికదా, పరమానందమైన మాట నగ్నసత్యం. దాన్నిప్పుడు రాణి ఎదుట చెప్పేందుకు ఎలాంటి సంశయమూ ఉండనవసరం లేదు కదా!
అసలా దివ్యానుభూతిని తలచుకుంటేనే ఆమె పరవశ అవుతూన్నది. అలాటి మైకంలోనే తాను మాట్లాడుతున్నదేమిటో కూడా సరిగ్గా తెలుసుకోలేని స్థితిలో, ‘‘నిజం రాణీ! నా హృదయపు లోతుల్లోనుంచే ఈ మాటలు వెలువడుతూన్నవి! ఆ అనుభూతికి వంద కన్యాత్వల విలువ కూడా సాటిరాదు!’’ అన్నది సరస్వతి.
రాణి చిరునవ్వులు చిలకరిస్తూ ‘‘నిజాన్ని గ్రహించావు సరూ! కాముని నిశిత శరాల తాకిడిని నిరోధించేందుకు స్ర్తిని సంసిద్ధురాలని చేసే ఉద్దేశ్యంతోనే కన్యాత్వానికి ఆ విలువ అంటగట్టి, దాన్ని అనుసరించటమే జీవిత పరమావధిగా పెద్దలు నిర్ణయించారు. ఐతే ఏదో ఒకనాడు కనె్న చెర నంచి విడుదలవుతున్న సమయాసన్నమవక మానదు. అప్పు డు తెలుస్తుంది, అన్నాళ్ళు ఎలాంటి పొరపాటు పడ్డామో! శరీరంలోనే ఇమిడ్చి, దానికి తాళాలువేసి భద్రంగా దాచిన నిజాన్ని సౌఖ్యానికి, సరైన సమయంలో, తాళం చెవితో తెరువబడ్డాక, ప్రవాహ వేగంలో విడుదలయ్యే ఆ అమర సుఖం అప్పుడు కాని తెలియదు. స్వానుభవాన్ని పొందినదానివి నీకు నేను వేరే చెప్పాలా?’’ అన్నది.
రాణి సవాలు సరిగ్గా తన ఊహలనే పోలి ఉన్నట్లు వినిపించింది సరస్వతికి.
తాను కాస్త తొందరపడి మాట్లాడినట్లు గ్రహించేప్పటికి అంతా మించిపోయిందని సరస్వతి గ్రహించింది. శబ్దరూపం దాల్చినమాటలను, విల్లు విడిచిన బాణాన్ని ఉపసంహరించటం అసాధ్యం కనుక, ఆమె అన్నిటినీ అంగీకరించి ఊరుకోవలసి వచ్చింది.
‘‘ఇప్పుడు చెప్పు.. ఏం జరిగిందో, వివరంగా చెప్పవే ప్రాణ సఖీ! అనుభవించేటప్పుడు లేని సిగ్గు, చెప్పేటప్పుడు దేనికంట? మా అక్కవు చెప్పవూ?’’ అన్నది రాణి బతిమాలుతున్న ధోరణిలో. ఒక విధంగా చూస్తే చెప్పటమే మంచిదేమోననిపించింది సరస్వతికి. తనమీద నింద పడకుండా ఏ పరిస్థితులు తనను ఎలా దిగలాగినవో రాణి తెలుసుకుంటే, తనను ఏమనేందుకూ ఆమెకు ఎప్పటికీ ఎలాటి అవకాశమూ ఉండబోదు కదా!
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు