డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏవో నాలుగు పేర్లు చెబుదూ.. నువ్వు పేరు సరిగ్గా చెపితే నీకు నేను బహుమతేవీ ఇవ్వబోవడంలేదుగా!’’ అంది సాహిత్య.
‘‘నీపేరు సాహిత్య కాబట్టి.. ఆయన పేరు నిరక్షరరావా..?’’’
‘‘చాల్లే... తెలివితేటలు.. అటువంటి పేరు అసలెవరికైనా వుంటుందా?’’ అంది సాహిత్య.
‘‘నీ సమక్షంలో.. నా బుర్ర అసలు పనిచేయదు సాహిత్యా. అందుకే క్లూ ఇమ్మని అడిగాను’’ అన్నాడు సామ్రాట్ తన తప్పేం లేదన్నట్టుగా.
‘‘నువ్విహ చెప్పలేవు గానీ నేనే చెప్పేస్తున్నాను. ఆయన పేరు.. గౌతమ్’’ అంది సాహిత్య.
‘‘గౌతమ్.. గౌతమ్... నీ భర్తా?!’’ అన్నాడు సామ్రాట్ ఏదో నమ్మలేని విషయం విన్నట్టుగా.
‘‘ఆ.. ఆయన నీకు ముందే తెలుసా?’’ ఈసారి ఆశ్చర్యపోవడం సాహిత్యవంతైంది.
‘‘ఊ’’ అంటూ గౌతమ్ తనకెలా పరిచయమైందీ వివరించాడు సామ్రాట్.
‘‘మావార్ని చూస్తే నీకేవనిపించిందీ?’’
‘‘ఆలోచనల్లో నీకూ ఆయనకూ ఎటుంవంటి పోలికా లేదు. ఆయనకు కల్పనలూ, ఊహలూ ఇత్యాదులంటే ఎంతమాత్రమూ ఇష్టంలేదనిపించింది. పూర్తిగా వాస్తవ లోకంలో బ్రతికే మనిషి.
స్ర్తి పురుష సంబంధాలన్నీ భౌతిక అవసరాలేననీ, సమాజం నిర్వచించినట్టుగా పవిత్రమైన బాపతువేమీ కావనీ ఆయన ప్రగాఢ నమ్మకం.
ఒక్కమాటలో చెప్పాలంటే ఎదుటివారు నీ గురించి ఏమనుకుంటారో నీకనవసరం. నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా నువ్వే నడిపించుకో! దాన్నాడించే పగ్గాలు ఎవ్వరికీ ఇవ్వకు! అనేదే ఆయన నమ్మే సిద్ధాంతమనిపించింది నాకు’’ అన్నాడు సామ్రాట్.
‘‘సరిగ్గా చెప్పావు. ఒక విధంగా ఆలోచిస్తే సామ్రాజ్ఞీ, గౌతమ్‌లాంటివాళ్ళే ఎటువంటి ఊహలూ, ప్రత్యేకమైన ఆలోచనలూ లేకుండా సుఖంగా బ్రతికేస్తారేమో!’’ అంది సాహిత్య.
***
‘‘ఎక్కడికీ ప్రయాణం?’’ బ్యాగ్‌లో బట్టలు సర్దుకుంటోన్న సామ్రాట్ దగ్గరకొస్తూ అడిగింది సామ్రాజ్ఞి.
‘‘ఏం నువ్వూ వస్తావా?’’ అంటూ ఆమె వైపు చూడకుండా తన పని తాను చేసుకోసాగాడు సామ్రాట్.
‘‘అంత వెటకారం వద్దులెండి. ఎప్పుడు ఊరెళ్లినా జేబురుమాళ్లు ఉతికావా, బనియన్లు మతడపెట్టావా, చొక్కాలు ఇస్ర్తి చేయించావా? అంటూ హడావుడి చేస్తారు కదా.
ఈసారి ఒక్కమాటైన అనకుండా మీ అంతటా మీరే బ్యాగ్ సర్దుకుంటూంటే అడిగాను, ఏం తప్పా?’’ అంది సామ్రాజ్ఞి.
‘‘అవును గతంలో నిన్నడిగీ, అడిగీ.. అడిగినా అడక్కపోయినా నా జన్మకు నువ్వు నాక్కావాల్సినవేవీ సిద్ధంగా ఉంచవని జ్ఞానోదయమై నా పని నేను చేసుకుంటున్నాను. సరేనా?’’
‘‘ఏమైనా ఈమధ్య మీ ప్రవర్తనలో బాగా మార్పువచ్చింది. మిమ్మల్నా రోజు నిలదీశాననేనా అప్పటినుంచీ నాతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారూ?’’
‘‘ఏదో ఒకటిలే.. నా పనులు నీ నెత్తిన వేయకుండా నేను చేసుకుంటున్నందుకు సంతోషించడం మానేసి ఈ అనవసర ప్రసంగం దేనికి?’’
‘‘అవునవును.. మీకు నచ్చిన వాళ్లతో ఊకదంపుడు కబుర్లు చెప్పడానికైతే ఏ అభ్యంతరమూ ఉండదు మీకు. నా దగ్గరకు వచ్చేసరికి నేను మాట్లాడేది అధిక ప్రసంగంలా అనిపిస్తోంది.
అసలు ఆ రోజునుంచీ మీతో మాట్లాడ్డం మానేద్దామని అనుకున్నాను గానీ, నా శ్రేయస్సుకోరి అమ్మ చెప్పిన మాటలకనుగుణంగానే నాకిష్టం లేకపోయినా మిమ్మల్ని పలకరిస్తున్నాను. మీతో మాట్లాడకపోతే జీవితం గడవదని నాకేం భయంలేదు’’ అంది సామ్రాజ్ఞి.
‘‘మరింకేం అదేమాట మీ అమ్మకు చెప్పి ఒప్పించలేకపోయావా?’’
‘‘ఆ ప్రయత్నమూ అయింది. మీరు నన్ను పట్టించుకోకపోయినా నేను ఏదో విధంగా మిమ్మల్ని ఆకట్టుకుని మిమ్మల్ని నా పట్టులో బిగించి ఉంచాలని అమ్మ చెప్పిడంతో తప్పక మీతో మామూలుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను.
అసలు మీరు చేసిన పనికి మరొక ఆడదైతే జీవితాంతం మీకు బుద్ధొచ్చే విధంగా గుణపాఠం చెప్పి తీరుతుంది. నేను మంచిదాన్ని కాబట్టి ఆ ప్రస్తావన మళ్లీ మళ్లీ తీసుకురాకుండా మంచితనంతో మీ బుద్ధిని మార్చాలనుకుంటున్నాను’’ అంది సామ్రాజ్ఞి.
‘‘్ఫర్వాలేదే! మీ అమ్మ కూడా మంచి సలహాలే ఇస్తోంటుందన్నమాట అప్పుడప్పుడూ. మొగుణ్ణి ఆకట్టుకోవాలని చెప్పిన మీ అమ్మ ఎలా ఆకట్టుకోవాలో చెప్పలేదా నీకూ?’’
‘‘అవన్నీ మీకు చెప్పేస్తే ముందే జాగ్రత్తపడి నాకు దొరక్కుండా తప్పించుకుందామనుకుంటున్నారేమో! అటువంటి ఆశలేవీ పెట్టుకోకండి’’ అంది సామ్రాజ్ఞి.
‘‘పెళ్లికి ముందు నాకున్న ఆశలూ, కోరికలూ మన ఈ కాపురపు సెగలో ఆవిరైపోయాయిలే! నాలో కొత్తగా ఆశలు కల్పించి నన్ను మళ్లీ నిరాశపరిచే కష్టం నీకెందుకలే! నీకు నచ్చినట్టు నువ్వుండు. నాకు నచ్చినట్టు నేనుంటాను. సరేనా?’’ అన్నాడు సామ్రాట్ ఒక ఒప్పందానికి వస్తున్నట్టుగా.
‘‘అలా ఎలా కుదురుతుందీ? ఒక కప్పు క్రింద బతుకుతున్నపుడు ఒకరి ఇష్టాలేవిటో మరొకరు తెల్సుకోవాలి కదా!’’
‘‘చాలా బాగా చెప్పావు. నా ఇష్టాలేమిటో మన పెళ్లయిన తొలి రోజుల్లోనే చెప్పాను నేను. అప్పుడు నువ్వేమన్నావో ఎలా స్పందించావో ఒకసారి గుర్తుకుతెచ్చుకో.. అంతేకాదు ఒకసారి మనసు గాయపడిన తర్వాత అది ఏ మందులతోనూ నయం కాదని కూడా తెల్సుకో!’’
‘‘లేదు.. ఈ మాటలు మీరు మాట్లాడ్తున్నవి కావు. ఎవరో మీ మనసులో ప్రవేశించి మీతో ఇవన్నీ చెప్పిస్తున్నారు. ఎవరి దన్నో చూసుకునే మీరిలా మాట్లాడుతున్నారు.
నా నుంచి మిమ్మల్ని ఎవరో శాశ్వతంగా దూరం చేస్తున్నారు. నా అనుమానం.. కేవలం అనుమానం కాదు.. ఈ రోజు కాకపోతే రేపైనా మీ గుట్టు రట్టుచేసి తీరుతాను.

-ఇంకా ఉంది

సీతాసత్య