డైలీ సీరియల్

శివమాయ దాటరానిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుఱ్ఱాలు
ఏనుగులవలె ఆ కాళహస్తి పట్టణంలోని గుఱ్ఱాలు కూడ చాల విలక్షణమైనవి. వేగంగా పరుగిడటంలో అవి బహు శక్తివంతమైనవి. వాని వేగంతో తాము పోటీ పడజాలమని సిగ్గుపడి కాబోలు అచట గల మానవుల మనస్సు సహజమైన తమ చపలస్వభావాన్ని విడిచి నిశ్చలస్వభావాన్ని అలవరచుకొని ప్రశాంతతను వహించాయి.
శ్రీకాళహస్తిపురాధీశ వర్ణన
అటువంటి దివ్యశ్రీకాళహస్తి పురాధీశుడైన విశే్వశ్వరుని యాజ్ఞను స్థావర (కదలని) జంగమ (కదిలే) రూపమైన సమస్త జీవసమూహమంతా జవదాటేందుకు భయపడుతుంది. ఆయన తేజస్సు ముందు దశకోటి-సహస్రకోటి దశసహస్రకోటి సూర్యచంద్రుల కాంతులు సహితం కళావిహీనమై పోతాయి. ఇచ్ఛాశక్తి - జ్ఞానశక్తి - క్రియాశక్తి అనే త్రివిధ గుణాత్మకుడైన శివుని వలె ప్రభు-మంత్ర- ఉత్సాహరూపమైన త్రివిధశక్తులతో వెలిగిపోయే ఆ రాజశేఖరుని శక్తిసామర్థ్యాలచేత సమస తప్రపంచానికి అభివృద్ధి విబలుగుతూ ఉంది. తనయందే జనించిన మహా ప్రకృతి మాతృప్రకాశం చేత శివుడు బ్రహ్మ జ్ఞానులైన వారికి సహితం ఆశ్చర్యాన్ని కల్గించే రీతిగా ఆ రాజన్య పరుడు తన ప్రకృతి (స్వభావం) ప్రభావం చేత రాజ్యంలోని విజ్ఞులకు కూడ అమితాశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. అంతేకాదు సమస్త భూభువన భారాన్ని నిత్యమూ వహించే ఆదికూర్మం- ఆదివరాహం- ఆదిశేషువు - అష్ట దిగ్గజాలు - కులపర్వతాలు- మహావిష్ణువు మొదలైన వారి ప్రాణాలకు ప్రాణచైతన్యాన్ని కల్పించే విశే్వశ్వరుని వలె ఆ కాళహస్తి పురాధీశుడు రాజశేఖరుడై (చంద్రుడు జటాజూటంలో ధరించిన శివుడు) రాజ్యపరిపాలన చేస్తూ ఉన్నాడు.
ఆవిధంగా విశే్వశ్వరస్వరూపుడైన యూదవరాజు రాజ్యపాలన చేస్తూ ఉండగా ఒకనాడు శ్రీకాళహస్తీశ్వరుడు ఆకస్మికంగా యాదవ వంశీయుడైన ఆ రాజేంద్రుని శివభక్తిని పరీక్షింపదలంచి వెనువెంటనే మాయాజంగమ దేవరరూపాన్ని ధరించాడు.
శివుని మాయాజంగమ వేషం
ఆ రూపం చాల సహజమనోహరమైనది. పాదాలకు బంగారు పావుకోళ్లు ధరించాడు. చేతులకు శివముద్ర గల పంచలోహకడియాల్ని తొడిగాడు. మొలకు బంగారు సరిగంచు కౌపీనాన్ని (గోచి) కట్టుకొన్నాడు. మెడలో రుద్రాక్షమాలల్ని వేసికొన్నాడు. విభూతి కల తోలు సంచిని - బెత్తాన్ని దండ చేతియందు (అనగా భుజానికి మోచేతికి మధ్యభాగంలో) కట్టుకొన్నాడు. మాణిక్యకాంతుల్ని వెదజల్లే ఒడ్డాణాన్ని నడుమునకు చుట్టుకొన్నాడు. విభూతి తీర్చిన నుదిటిపై గుండ్రని కస్తూరి బొట్టును ధరించాడు. నిత్యం తాంబూలాన్ని నమలడం చేత ఎఱ్ఱని కాంతితో మెరిసిపోతూ పద్మరాగమణుల్ని కూడ గడ్డి పోచవలె తృణీకారభావంలో చూచే సుందరమైన దంతపంక్తి కలిగి మెరిసిపోయాడు.
అ విధంగా మాయా జంగమవిటుడైన శివుడు యాదవ భూపాలుని రాజధానీ నగరమైన నారాయణవనానికి పోయి సంచరింపసాగాడు. అప్పుడు ఆయన సౌందర్యాన్ని చూచి నగరంలోని వివిధజనులు ప్రీతిపూర్వకంగా చూచారు. చూచిన వారిలో మోహ పరవశులు కాని వనితామణులు, మనసుచెదరని సుందరీమణులు, ఆయన కౌగిలి కోరుకోని భామారత్నాలు, తోడి ఆడువారితో ఆయన సౌందర్యాన్ని వర్ణించిచెప్పని లలనామణులు అప్పుడా నగరంలో మందునకు కూడ కనబడరు.
ఆ సమయంలో ఒక మోహనాంగి అదే వీధిలో నడచివస్తూ ఉంది. ఆమె సౌందర్య మద్భుతం. ప్రేమ పూర్వకంగా ఆమె తనను చూచే రసికశేఖరుల కళ్లనుండి ఆనందబాష్పరూపమైన కుంభవృష్టిని కురిపిస్తూ మెరిసిపోయే మెఱుపు తీగే కాదు నివారింపశక్యం కాని మన్మథాగ్నిని వారి హృదయాలలో రాజుకొని చేసే (రగులు కొలిపే) సమిధగా కూడ ప్రకాశించింది. శివలింగాన్ని భద్రపరచిన బంగారు భరిణను మొలనూలుతో కట్టుకొని ఆ రాజమార్గంలో ఒయ్యారంగా నడిచివస్తూ విలాసాల నొలికిస్తూ మాయాజంగమ కుమార రూపంగా వస్తున్న ఈశ్వరుని చూచి భక్తిపూర్వకంగా నమస్కరించింది. ఆమె ఆయన పాదపద్మాలను ఒంటి చేతితో స్పృశించి శరణాగతురాలయింది. అప్పుడా మాయా జంగమ దేవర తన సుకుమార హస్తాలతో ఆమెకు విభూతిని ప్రసాదించాడు. ఆమె దానిని భక్తిపూర్వకంగా తన నుదిటిపై ధరించి ప్రీతిపూర్వకంగా ఇలా అంది.
‘‘ఓ దేవరా ! కరుణతో నా యింటికి దయ చేయండి. మీ కృపాదృష్టితో పవిత్రమైన నా యిల్లు మీకు విడిది. నడయాడే ఓ లింగమా ! నేడు నాకు మీ పాదార్చన చేయు మహాభాగ్య మబ్బింది. వచ్చి క్షణకాలం నా యింట విశ్రమించండి. ఓ ప్రభూ ! ఓ మహానాయకా ! నా యింట స్నానమాడి శివార్చన చేయండి. ఓ జంగమ స్వామీ ! నా యింటికి వచ్చి విభూతిని తాంబూలాన్ని స్వీకరించండి. మంచి భోజనాన్ని మేలైన భక్ష్యాలను మీ కొఱకై సిద్ధం చేస్తాను. ఓ మదనాంతక ! ప్రతి దినమూ జంగమార్చన చేయక నేను తృప్తిపడజాలను.’’
ఆమె మాటల్ని విని మాయాశివుడు మనస్సులో సంతోషించి ‘ఈమె మహాత్మురాలు, శైవాచారాల్ని నిత్యం ఆచరించే సాధుశీలి. శివస్వరూపులైన జంగమదేవర్లను పూజించి వారిని తృప్తిపరచే సమర్థురాలు. మన్మథుని ఇల్లాలైన రతీదేవి సౌందర్యాన్ని కూడ పరిహాసం చేసే అతిలోక సౌందర్యవతి ఈమె. ఈ కాంతామణి భక్తికి నా మనస్సు ఆనందపరవశవౌతూ ఉంది.’ అని తలపోసి ‘‘ఓ లతాంగీ! నీ యింటికి తప్పక వస్తాను.

- ఇంకావుంది...

చరవాణి: 9490620512