డైలీ సీరియల్

ముక్తికాంత నిలయం శ్రీకాళహస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదియును గాక కాముని ప్రతాపమనే దావాగ్ని (అడవులను కాల్చు అగ్ని) శిఖల నుండి వెలువడు దట్టమైన పొగయేమో!! అన్నట్లుగా ఆ దాసికి జంగమవిభుని మహిమచే వెనువెంటనే నల్లని కేశపాశమమరింది. దానిని చూచుకొని దాసి ఆనందసాగరంలో తేలిపోయి మాయా జంగమ మహేశ్వరుని పాదపద్మాలకు నమస్కరించింది. ఆయన ఆదేశానుసారం వస్త్ర-మాల్య-లేపన-్భషణాల రూపమైన నాలుగు విధాలుగా అలంకరించుకొంది. ఈశ్వరుడికి తిరిగి యథాప్రకారంగా అర్చనలు చేసింది. తదుపరి మన్మథుని విడిచి వచ్చిన రతీ దేవియేమో అన్నట్లుగా యాదవరాజు వద్దకు వచ్చి మర్యాదపూర్వకంగా నమస్కరించింది. రాజు ఆమెను చూచి ఆశ్చర్యపడి తల గొరిగింపుడని ఇచ్చిన ఆజ్ఞ గడిచి స్వల్పకాలం కూడా కాలేదు. మరి ఈమె కీవిధంగా మనోహరమైన ఈ కేశపాశమే విధంగా ఏర్పడింది? ఇందలి మాయామర్మం మంగలి వానిదే కావచ్చు. వెంటనే ఆతడిని ఇటకు తీసికొని రండి. అని ఆజ్ఞాపించాడు.
రాజాజ్ఞను విన్న దాసి నమస్కరిస్తూ విన్నపమాలకింపుమని ఇలా అంది. ఓ పృథివీవర ! ఈ నా విషయంలో మంగలి మాయామర్మాలేమీ లేవు. మీ ఆజ్ఞ నెవరు మీరగలరు? సర్వమంగళను (పార్వతిని) అర్ధ్భాగంగా ధరించిన ఆ శివుడికి ప్రత్యక్షరూపమైన ఒక జంగమదేవర నిన్నటి నుండి నా గృహంలో నివసిస్తూ ఉన్నాడు. దయావిహీనమైన మీ ఆజ్ఞచే నేనారీతిగా ముండిత (గొరగబడిన) శిరస్కనై ఇంటికి పోయి ఆయన దివ్యపాదార విందాలపై పడి నేను చేసిన తపస్సు - మహేశ్వరా ర్చన ఈ రీతిగా ఫలించిందని విలపించాను. అందులకా కరుణామయుడు తన శ్రీకరాల్ని నా తలపై ఉంచాడు. చిత్రమేమో గాని ఈ రీతిగా ఈ సుందరకేశపాశం నాకు వెనువెంటనే అమరింది.
యాదవరాజు మాయాజంగమదేవరను దర్శించుట
అని శివదాసి పలికినంతనే ఆ యాదవరాజేంద్రుడు కనుకొనలయందు కొనలు సాగుతూ ఉన్న కోపాగ్నికి మూలాధారమైన హృదయాన్ని దయావంతంగా ప్రయత్న పూర్వకంగా సరిదిద్దికొని కొందరు మంత్రిపురోహితుల్ని వెంటబెట్టుకుని ఆ నీలవేణి యింటికి వెళ్లి జంగమప్రభువును దర్శించి ఆయనను తన కరకమలాలతో సేవించుకొని ముఖాంభోజాన్ని వంచి నమస్కరించి వినయంగా ఇట్లు పలికాడు. అయ్యా ! విలాసార్థంగా ఎక్కడ నుండి ఇక్కడకు వచ్చారు? ఈ కోమలాంగిపై మీకింత దయ ఎందుకు కలిగింది? నేడు మీకు నేను చేయగల సేవ ఏమి?’ ప్రశంసాపూర్వకమైన రాజు మాటల్ని విని ఆ త్రిపురారి ప్రసన్నుడై ఈరీతిగా అన్నాడు.
‘జంగమదేవర (నడిచే శివుడు) అనే పేరుకు తగినట్లుగా నిత్యదేశసంచారినై తిరుగుతూ ఉండగా కొందరు పండితులు శ్రీకాళహస్తిలోని వింతల్ని- విశేషాల్ని గురించి అద్భుతంగా చెప్పారు. వానిని చూడడానికి నేను స్వయంగా రాగా వానికి తగిన మహాదేవాలయం (శివాలయం) ఇక్కడేమీ కనబడలేదు. శివ శివ! ఈ దుస్థితికి నివారణగా నేనేమి చేయగలనని విచారిస్తున్నాను. రాజా ! నీకు సాటియైన శివ భక్తుని చూడలేదు. కాబట్టి నేనే ఈ విషయాన్ని చెప్పడానికి వచ్చాను. ఇక్కడ గల ఈ శుభాంగి శివ భక్తికి మెచ్చు కొన్నాను. శివభక్తులైన మీ యిరువురిని విడువలేక ఈ రీతిగా మిమ్మల్ని యుక్తిగా కరుణించాను. కైలాసవాసుడికి వెండికొండ శిఖరాల్ని పోలిన ఒక మహాదేవాలయాన్ని నిర్మించు.’
అపర శివావతారుడైన జంగమప్రభువు మాటల్ని విని యాదవేంద్రుడు ఓ కృపాసాగరా ! తమ ఆజ్ఞానుసారంగా శ్రీకాళహస్తీశ్వరుడికి విశ్వమోహనంగా దివ్యాలయాన్ని నిర్మిస్తాను. దానికి ముందుగా ఆ మహాదేవుని ప్రసిద్ధ పురాణకథావిశేషాల్ని వినాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. వానిని సవిస్తరంగా తెలిపి నన్ను అనుగ్రహించండి.’ అని అభ్యర్థించాడు.
శివుడు యాదవేంద్రుడికి శ్రీకాళహస్తి మాహాత్మ్యాన్ని చెప్పుట
ఆ అభ్యర్థన విని విశ్వవిభుడైన ఆ చంద్రశేఖరుడు దయాళువై భూనాథుడితో ఇట్లు పలికాడు. ఓ రాజా ! విను శ్రీ కాళహస్తీశ్వరుని చరిత్ర మహా మహిమాన్వితమైనది. అంతే కాదు. క్షీరసముద్రాన్ని మథించినపుడు మహాలక్ష్మి పుట్టినట్లుగా మహాపురాణాలనే మహాసముద్రాల్ని మథించగా పుట్టిన మోక్షలక్ష్మికి ఆ శ్రీకాళహస్తి నిత్యవిహారస్థానం.
అంతేకాదు, అది సాక్షాత్తు దక్షిణకైలాసమే. సువర్ణమఖీనదియే దాని ప్రాకారానికి అగడ్తగా ఉన్న మహాసముద్రం. మోక్షసామ్రాజ్య వైభవమే ఆ శ్రీకాళహస్తి సామ్రాజ్యవైభోగం. అచట గల మహారాజు సాక్షాత్తు పరమేశ్వరుడే. నగర సంరక్షకుడు ఆ విఘ్నవినాయకుడే. ఆ విధంగా శోభించే శ్రీకాళహస్తి మహానగర వైభవాన్ని శ్రీహరి-బ్రహ్మ-ఆదిశేషులు సహితం కొనియాడగలరా?
దక్షిణకైలాసమే శరీరంగా, సాక్షాత్ శివుడే శిరస్సుగా, దుర్గాద్రి-నీలాద్రులు స్తనాలుగా సువర్ణ ముఖీనదియే ఆమె సుందర కేశపాశంగా, ఇంద్రుడు-మయూరుడు అనేవారు స్థాపించిన తీర్థాలు బాహువులుగా, సహస్రలింగ, భారద్వాజతీర్థాలు పాదాలుగా అమరి ముక్తికాంతకు నిలయమైన ఆ శ్రీకాళహస్తి నగర లక్ష్మీమాహాత్మ్యాన్ని వర్ణించడం సామాన్యవిషయమా?
ఆ నగరసమీపంలో పూర్వమొక మహారణ్యముంది. అది సింహాలు శరభాలు మొదలైన క్రూరమృగాల సంచారం చేత భయంకరమైనది. శబరగృహాల నుండి నిరంతరం వినవచ్చే శ్రవణ పేయమైన (చెవికింపయిన) మధురగానాలచే మనోహరంగా ఉంటుంది. అంతేకాదు, జంటలు జంటలుగా ఆ శబరగ్రామాలలోని దంపతులు రతిబంధాలతో అలసిపోతూ చేసే ప్రణయవిహారాలు అనే సాముగరిడీలకు కేంద్రస్థానంగా ఉంటుంది.

- ఇంకావుంది...

చరవాణి: 9490620512