డైలీ సీరియల్

దక్షిణామూర్తి.. శివాంశే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఓ మహేశా! నీవు విశ్వానికి ప్రభుడివి. సర్వసృష్టి కర్తవు. విశ్వమంతట ఆత్మస్వరూపుడవై వ్యాపించి ఉన్నావు. ప్రపంచగమనాన్ని సాక్షీమాత్రంగా చూస్తూ ఉన్నావు. ఈ సమస్త పదునాల్గు భువనాల విశ్వాన్ని నీయందే నిలుపుకొని పోషిస్తూ ఉంటున్న వాడివి. విశ్వాన్ని నిర్వహిస్తూ ఉన్నది నీవొక్కడివే అని నీ ఘనతను గూర్చి నేను వినియున్నాను. పంచభూతాలు, పంచకర్మేంద్రియాలు (వాక్కు-పాణి- పాద-పాయు-ఉపస్థలు) పంచతన్మాత్రలు (రూప, రస, గంధ, స్పర్శ, శబ్దాలు) పంచజ్ఞానేంద్రియాలు (కన్ను, ముక్కు, చెవి, నోరు, నాలుక) మనస్సు - బుద్ధి - అహంకార - విక్షేపశక్తి అను ఇరువదినాల్గు తత్త్వాలు (జ్ఞానేంద్రియాలు- కర్మేంద్రియాలు -పంచభూతాలు -పంచతన్మాత్రలు- మనస్సు-బుద్ధి- మహత్తు- అవ్యక్తము) నీయందే పుట్టి నీయందే అణగిపోతున్నాయి. జగత్తులో అణువణువున నీవే నిండియున్నవాడవు (ఈశావాస్య మిదం సర్వం, యత్కించ జగత్యాం జగత్. ఈశావాస్యం-1) మనో బుద్ధులకు వాక్కులకు అందని అదృశ్యమూర్తివి (యత్రవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ) అని వేదోపనిషత్తులు ఘోషించినదానిని తత్త్వవేత్తలు చెప్పగా విని యున్నాను. ఓ శివా ! కేవలం ఆత్మానుభవం చేత మాత్రమే తెలియబడేవాడవు. జీవ-బ్రహ్మాత్మైక్య రూపమైన నీ అఖండ అద్వైత జ్ఞానమయాకృతి ఆ బహుభాషా నిపుణత చేత వర్ణింపగా తెలిసేది కాదు. త్రిపురభంజనా ! ఇట్టి నిన్ను తెలుసుకొన్న జ్ఞానికి సంసారసముద్రం పశువుల గిట్టల వలన ఏర్పడిన గుంటవంటిది మాత్రమే అవుతుంది. అట్టి వానికి మోక్షలక్ష్మియే భార్యామణి కాగలదు. ఇది నా మనోభిప్రాయం. భక్తవత్సల! అనంతమైన కాల ప్రవాహంలో ఒకప్పుడు సమకూడి, మరికొంత కాలవ్యవధిలో నశించే బ్రహ్మాది దేవతా పదవులు నాకు వద్దు. కాలాన్ని కూడ వెంటనంటి మ్రింగివేసే సర్వకాలాతీతమైన నీ చిదానందాకృతిని నాకు దయతో చూపు. ఈశ్వరా! సంసారతాపమనే ఆకలిబాధచే బాధపడు నేను తపస్సు అనే మధ్యాహ్న సమయంలో ఆదిగృహస్థుడవైన నిన్ను చూడగలిగాను. నా హృదయమనే పాత్రయందు బ్రహ్మవిద్య అనే భిక్షాన్నాన్ని పెట్టి ఆదరించు. దాని వల్ల ఏ ఇతర దేవతల్ని యాచించే దీనస్థితి లోనుగాక సుఖిస్తాను. ఆదరముతో నాకిచ్చట ప్రసన్నుడైన రీతిగా ఘోరసంసారమనే రోగం పోకడం చేత బాధపడే జనులందరికి మహామహిమాన్వితమైన ఔషధం వలె ఇచటనే స్థిరంగా ఉండి యుగ యుగాలలో భక్తుల పూజల్ని స్వీకరించు. నేను కోరువరాలు ఈ రెండే. కరుణా కటాక్ష వీక్షణాలతో వీనిని దయచేయుమయ్యా.’ వసిష్ఠుని ప్రార్థన విని భక్తజనుల పాలిటి కల్పవృక్షరాజమైన ఆ పరమశివుడు వసిష్ఠుడు చూచుచుండగా ఆ మహాలింగాకార మధ్యం నుండి నవవన వైభవంతో ఆ వహాదేవుడు దక్షిణామూర్తి రూపంగా అవతరించాడు. ఆ సమయాన తన చుట్టు ఆశ్రయించియున్న మహావట వృక్షచ్ఛాయ తన శరీర కాంతి తో కూడిన మహా మేఘమా అనునట్లు నింగి అంతట వ్యాపించింది. బ్రహ్మ పంచమ శిరస్సును ఖండించి నట్టి మహా దేవుడనే కల్పవృక్షపు చిగురు టాకుల జొంపాలేమో అనే రీతిగా ఆయనకు చిన్న చిన్న ఎర్రని జడలు ప్రకాశించాయ. సదా శివో-హమ్మనే శివాద్వైత సుజ్ఞానాన్ని తెలిపే రీతిగా చేతిపై జ్ఞానముద్ర అమరింది. మనస్సు బ్రహ్మానంద రసంలో మునిగి పోయిన యోగి మాటాడని విధంగా వౌనముద్ర వహించాడు. ఆ విధంగా అవతరించిన దక్షిణా మూర్తిని చూచి వసిష్ఠుడు అత్యంత భక్తితో తిరిగి తిరిగి నమస్కారాలనర్పిస్తూ శివుని సన్నిధిలో నిలిచాడు. ఆయనను చూచి దక్షిణామూర్తి వెనువెంటనే ఆ ముని సంసారబాధ అణచేందుకు అపార కరుణావీక్షణాల్ని ప్రసరింపచేస్తూ జీవుల ఆలోచనలు సమీపింపజాలని సరిహద్దు అయినది, వ్యక్తమైన జగత్తులోని మనోవ్యాపారస్వభావం చేత పరిపూర్ణమైనది, భ్రాంతిచేత జీవతత్త్వాన్ని వహించేది, బ్రహ్మనుండి చీమ వరకు వ్యాపించి యుండేది, మనస్సునకందని ఆనందస్వరూపం కలది, ఆది - అంతం లేనిది, అయిన ఆధ్యాత్మిక దివ్య రహస్యోపదేశాన్ని ఉపదేశించి ముని జన్మ సంసార సంబంధాల్ని త్రెంచి తక్షణమే మాయమయ్యాడు.
పార్వతి జ్ఞాన ప్రసూనాంబగా కొలువగుట
అప్పుడు వసిష్ఠుడు తాను స్థాపించిన దివ్యలింగ సమీపంలో అపరిమితానంద పరవశుడై సంచరించాడు. ఆవిధంగా కైలాసాన్ని వీడి పరమేశ్వరుడు వసిష్ఠ స్థాపితలింగంలో స్థిరనివాస మేర్పరచుకోగా కైలాసంలో పరమేశ్వరి భర్తృ వియోగాన్ని సహింపలేక భువి కవతరించింది. ఆ మహాదేవిని చూచి ప్రమదగణాలు బంగారుబెత్తాలు చేత ధరించి నలువంకల గొలుచుకొన్నారు. ఆ ప్రమదగణాల సతీమణులు చేరువనే నిలిచి ఆమెను సేవించుకొన్నారు. బ్రహ్మ-విష్ణువులు తమ దేవతాగణాలతో ముందు వెనుకలలో నిలిచి సేవించుకోవడానికి సందడి చేస్తూ రాసాగారు. ఆ విధంగా వస్తూ ఉన్న జగదంబను స్మరాంతకుడైన మహాదేవుడు అనుమతింపగా జగత్పితయయిన పరమేశ్వరుని సన్నిధిలో కొలువై నిలిచింది. ఆ జగన్మాత తనను సేవింపవచ్చే భక్తులు అనే తుమ్మెదలకు బ్రహ్మానందమనే మకరందాన్ని పరిపూర్ణంగా త్రాగించి ప్రశాంతుల్ని చేస్తూ ఉండటం కారణంగా జ్ఞాన ప్రసూనగా ఘనకీర్తి వహించి శాశ్వత భూలోకవాసినియై శ్రీకాళహస్తిలో వెలసింది.
ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరులు వసిషా ఠశ్రమాన్ని ఆదరంతో తమ లీలా విహారభూమిగా చేసికొని నివసిస్తూ ఉన్నారు. వారికి నిజనివాసమైన కైలాసం తల్లిదండ్రుల్ని విడిచిన కుమారునివలె విచారించి జగన్మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరుల్ని వదలి ఒంటరిగా ఉండడం తగునా అని వారిని సేవించేందుకు వసిషా ఠశ్రమమున్న దక్షిణకైలాసానికి వచ్చింది.

- ఇంకావుంది...

చరవాణి: 9490620512