డైలీ సీరియల్

దూతికా విజయం-105

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనకీ పరిస్థితి ఒక సదవకాశాన్ని చేకూర్చిందని తెలుసుకున్నదామె.
‘‘ఇదంతా మీ మూలానే జరిగింది. ఇప్పుడు నా జీవితం ఏం కావాలి? ఈ రహస్యం బైటికి పొక్కితే ఇంకేమన్నా ఉన్నదా?’’ అన్నది సరస్వతి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ.
‘‘విచారపడి ఏం లాభం సరూ! ఈ రహస్యం బైటపడితే నీ జీవితమే కాదు నా జీవితమూ పతనవౌతుంది. మొత్తం రాణివాసాన్నంతా భూకంపం మింగివేయటమే జరుగుతుంది. ఏ మగ పురుగో ఇక్కడికి ప్రవేశం దొరికిందని రాజు విచారణ లేకుండానే దోషులనూ, నిర్దోషులనూ కూడా కఠినంగా శిక్షిస్తాడు!’’
‘‘ఈ జీవితానికి నేను మిమ్మే నమ్ముకొని ఉన్నాను!’’ అన్నది సరస్వతి రాణి ఎదుట మోకరించి.
రాణి మనసు కరిగిపోయింది.
‘‘్ఛ! అధైర్యపడకు సరూ! లే!’’
‘‘నిండా మునిగిపోయాను రాణీ! మీ సలహా పాటించకుండా ఉన్నట్లయితే బతుకులో బూడిద చల్లుకొని ఉండేదాన్ని కాదు కదా!’’
రాణి సరస్వతిని లేవదీసి అనురాగం ఉట్టిపడేవిధంగా కావలించుకున్నది.
‘‘నీ రాజభక్తికి మెచ్చాను సరూ! నిన్ను అపార్థం చేసుకున్నందుకు అన్యధా భావించకు. ఆ దైవమే మనను మోసం చేశాడు. నీ జీవితం భంగపడకుండా కాపాడే భారం నాది!’’ అని రాణి సరస్వతికి ధైర్యం చెప్పింది.
‘‘నా కర్మకు మీరు మాత్రం ఏంచేస్తారు రాణీ!’’
‘‘అలాక్కాదులే సరూ! నీకంతకూ పరోక్షంలో నేనే బాధ్యురాలిని.. అదలా ఉంచు.. నీవిక ఒక్కక్షణం కూడా రుూ రాణివాసంలో ఉండరాదు. ఈ రహస్యం ఎవరికీ తెలియకముందే రుూ ప్రాంతాల లేకుండా పారిపోవాలి!’’
‘‘ఎక్కడికి వెళ్ళేది రాణీ! మిమ్ము వదిలి నేను ఉండగలనా?’’
‘‘కాస్త జాగ్రత్తగా ఆలోచించు సరూ! నేను మాత్రం నిన్ను వదలి ఉండగలనా? కాని దుర్విధి మన వియోగాన్ని రుూ విధంగా, తీవ్రంగా జరగాలని శాసిస్తే మనమేం చేయగలం? నీవిక్కడ ఉంటే మా అందరికీ ప్రాణభయం కూడాను. పిడుగును పక్కనే ఉంచుకోవటం లాంటిది నీ ఉనికి! నీవు మునుగుతూ, మా అందర్నీ కూడా ముంచే స్థితిలో ఉన్నావు. అందుని సరూ! నీవు రాజీనామా పెట్టు; వెంటనే మంజూరు చేస్తాను!’’
‘‘రాణీ! నేను ఎక్కడికి వెళ్ళగలను? రుూ జీవితాన్ని ఎలా వెళ్లబుచ్చేది?’’
‘‘సరూ! విచారించకు.. నీకు తగిన విధంగా ఐశ్వర్యమిస్తాను. ఆ వీరభద్రుణ్ణే వివాహమాడు..’’ అని రాణి సలహా ఇచ్చింది.
సరస్వతికి మనసులో బ్రహ్మాండమైనప్పటికీ, పైకి మాత్రం దైన్యత ప్రదర్శించింది.
‘‘అతను నన్ను పెళ్ళాడుతాడని నమ్మకమేమిటి?’’
‘‘నీకేం తక్కువ?’’
‘‘తక్కువ కులం దానినుంచి రతి సౌఖ్యాన్ని పొందేందుకు ఎలాంటి సందేహమూ లేని ఈ ఉత్తమ కులజుడు, ఆమెను పెళ్ళడి తనకులం నుంచి వెలయేందుకు సిద్ధపడడు కదా- రాణీ!’’
విధి కరుణించి తనకీ సాయంత్రమే స్వేచ్ఛా పత్రాన్ని ప్రసాదించటంలో రెక్కలు విప్పుకున్న ప్రేమ పక్షి విశాల విశ్వంలో వీరభద్రునితో కలిసి విహారం చేసే అవకాశం ఏర్పడుతుందనే తలపుల తాకిడితో ఆమె శరీరం ఆనందంతో పులకరించి పరవశించింది.
ఇది నాకో అగ్ని పరీక్షగా పరిణమిస్తుందను కోలేదు. రాణీ అంది సరస్వతి భేదపూరిత కంఠస్వరంతో
నీకు కాదు సరూ మా రాణివాసానికే ఇదొక విషయ పరీక్ష. మా అందరి క్షేమం మనసులో ఉంచుకొనైనా సరే నీవు వెనువెంటనే విరమించక తప్పదు. తరువాత ఏం జరుగుతుందో ఇపుడు ఆలోచించే వ్యవధి కూడా లేదు. చడీ చప్పుడు లేకుండా అంతా సవ్యంగా జరిగిపోయేటట్టు చూసే బాధ్యత నీది. అన్నది రాణి.
రాణీ మీ ఆజ్ఞ పాటిస్తాను
రాణి సరస్వతిని మరోసారి అనురాగ పూరిత ఆలింగనంలో బంధించింది.
‘‘పిచ్చిదానా! నేను నిన్ను ధనికురాల్ని చేస్తాను. ధనం కులాన్నీ, గోత్రాన్నీ కూడా కొనగలదు. కులంలో తక్కువైనా ఆర్థిక స్తోమతలో అధికురాలువే అవుతావు కనుక నిన్ను భార్యగా స్వీకరించటంలో వుండే వీలు గ్రహించలేనంత మూర్ఖుడవడులే! రూప లావణ్యాలూ, గుణమూ- ముఖ్యంగా గాఢమైన ప్రేమానురాగాలూ ఉండనే ఉన్నవి కదా! కనుక అతను నిన్ను భార్యగా నిరాకరిస్తాడనే భయం నీకు ఎంత మాత్రమూ ఉండవలసిన పనిలేదు! ధనం ప్రపంచంలో అన్ని భాషల్లోనూ ఆజ్ఞాపించగలది. వీరభద్రుణ్ణి వశం చేసుకుంటుంది!’’ అన్నది రాణి.
‘‘ఏమో!’’ అన్నది సరస్వతి తన సందేహాన్ని వెల్లడిస్తూ.
‘‘ఏమైనప్పటికీ, ముందు ఈ కోటనుంచి సకల మర్యాదలతోనూ నీవు కదిలిపోక తప్పదు..’’
‘‘రాణీ! మీ ఆజ్ఞ మీరగలనా?’’
ఒక్క క్షణం ఆగి సరస్వతి అన్నది:
‘‘ఒక్కటే విచారం రాణీ! నేను ఎంత హృదయపూర్వకంగా ప్రయత్నించినా తమకు అనుకూలించలేదు.’’
‘‘విచారించకు సరూ! మన పథకాలన్నింటినీ మించిన పథకాన్ని ఆ దుర్విధి ప్రయోగించాడు. ఇప్పుడు బతికి బైటపడితే చాలుననే దారుణ పరిస్థితి ఏర్పడింది కనుక, మిగతా కోర్కెలన్నీ అల్పాతి అల్పాలుగానే కనిపిస్తున్నవి. అదంతా ఒక పీడకలగా భావిస్తే సరిపోతుంది!’’ అన్నది రాణి.
తనకు ఆ రాత్రి వచ్చిన దుస్స్వప్నం సంగతి రాణికి తెలియదు. అది గడిచిపోయినందుకూ, దాని ఛాయలు కూడా శాశ్వతంగా దూరమైపోయినందుకూ సరస్వతి ఆనందించింది.
దీర్ఘంగా నిట్టూర్చి, అన్నది రాణి.
‘‘పోనీలే.. నా కోర్కె యెలా వున్నప్పటికీ, నీవైనా సుఖపడగలుగుతూన్నందుకు ఆనందిస్తున్నాను!’’
‘‘ఏం సుఖమో!’’’ అని చప్పరించింది సరస్వతి
‘‘సరూ! ఈసారి నన్ను చూడవచ్చేప్పుడు నీ ముద్దుల కొడుకుని నాకు చూపాలి సుమా!’’
‘‘పో రాణీ! నీకెప్పుడూ పరాచికాలే!’’
‘‘సరే ... సాయంత్రానికే కదిలి వెళ్లిపోయే ఏర్పాట్లుచేసుకో! నీ ఆరోగ్యం బాగాలేదని, ఈ సేవికా వృత్తినుంచి విరమించదలిచాననీ, కరుణించి విడుదల పత్రాన్ని ప్రసాదించమనీ, చెలులందరిముందు దీనంగా అడుగు. నేను కాసేపు బతిమాలి చూస్తాను.. ఆరోగ్యం బాగుపడితే తిరిగి వస్తానని చెప్పు.. స్వేచ్ఛాపత్రం ప్రసాదిస్తాను. రహస్యం పొక్కనీకు.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు