డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త సీరియల్ ప్రారంభం
*
ఆ అమ్మాయికి హఠాత్తుగా మెలుకువ వచ్చింది. గాబరాగా హంసతూలికా తల్పం మీదనుంచి లేచి నిలబడింది. చుట్టూ కలయజూచింది. అది తన గదే! కంటికి ఇంపుగా ఉండే దీపాలు వెలుగుతూనే వున్నవి. సువాసనలతో గది నిండి వుంది. ఎంతో ప్రశాంతంగా వున్న రుూ వాతావరణంలో సుఖంగా నిద్రపొయ్యేందుకు మారుగా, ఆమె భయంతో లేచింది.

వాతావరణంలో మార్పులేదు. ప్రస్తుతానికి తనకొచ్చిన ప్రమాదమేమీ లేదని నిశ్చయంగా తెలుసుకుంది. కాని తనను వెన్నాడే రుూ భయం ఏమిటి?
గత సాయంత్రంనుంచే తననీ ప్రాణభయం తరుముకొస్తూ వుంది. ఇరాస్ - తన ఆచార్యుడు, వేదాంతి, తనపట్ల పుత్రికా వాత్సల్యాన్ని వర్షిస్తూ తన అభిమాన అనురాగాల్ని పొందగలిగే పురుషోత్తముడు, కొన్నాళ్ళుగా తనకో కథ చెపుతూ వచ్చాడు. ఆ కథ ఎంతో అద్భుతంగానూ, రసమయంగానూ వున్నది.
కథంతా రాజ కుటుంబానికి చెందిం ది. రాజ్యం కోసం, అధికారం కోసం రాజవంశీయులు ఒకర్నొకరు హత్య చేసుకోవటం జరుగుతుంది. తల్లిని కొడుకు నమ్మలేడు; చెల్లెల్ని అన్న నమ్మడు. ఒకరికొకరు విరోధులు. ఏ క్షణాన ఏం జరుగుతుందో ఊహించేందుకైనా వీలులేని వాతావరణంలో వారు బతుకుతారు. రక్తస్పర్శ వున్న బంధువుల్ని త్వరలోనే హతమార్చి, రాజ్యాధికారాన్ని సంపాయించనట్లయితే, తామే మృత్యువాత పడవలసి వుంటుందనే సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు. తరతరాలుగా రుూ హత్యాకాండ కొనసాగుతూనే వున్నది. శాంతియుతమైన జీవితమనేది ఆ రాజవంశానికి వుంటుందని ఎవరనుకోగలరు?
ఈ కథ వింటున్నప్పుడే తనకు అనేక సందేహాలు కలిగినవి. ఎందుకంటే, తాను రాజపుత్రిక. తన వంశంలోనూ చాలామంది రక్తస్పర్శ వున్న బంధువులున్నారు. ఆచార్యులు చెప్పే కథ తన వంశానికే సంబంధించి ఉంటుందేమోననే అనుమానం కలిగింది. కాని, ఆయన కథ చెబుతూంటే ఆ పాత్రలన్నీ ఎక్కడో దూరాన నివసిస్తున్నట్లే తోచి సరిపెట్టుకుంది. ఐతే రాజ్యాధికారం కోసం మానవ ప్రకృతి చేసే దుష్కార్యాలనేవి కథలోని సంఘటనల వలెనే తన జీవితంలోనూ, తన వంశంలోనూ మాత్రం ఎందుకు జరగకూడదు? ఈ ఊహ రాగానే తను కంపించిపోయింది.
‘‘ఆచార్యా!’’ అన్నది తను. ‘‘మా వంశంలో కూడా ఇలాంటి మరణాలు జరిగే అవకాశం లేదంటారా?’’
ఆయన ఒక్క క్షణం నివ్వెరబోయాడు. తాను చెప్పే కథను కేవలం కథగానే ఆమె స్వీకరిస్తూందని, తాను చెప్పే విధానంలో విజయాన్ని సాధిస్తున్నానని ఆయన అనుకున్నాడు. కాని ఆమె అడిగిన ప్రశ్నలో- ఆమె కథలోంచి విడిపోయి, విశిష్ట వ్యక్తిత్వాన్ని పొంది, తీవ్రంగా ఆలోచిస్తున్నదని తేల్చుకోక తప్పలేదు.
ఆ ఆశ్చర్యంలోనే ఆయన తొందరపడి ‘‘ఇంతవరకూ చెప్పింది మీ వంశ చరిత్రేనమ్మా!’’ అన్నాడు. తీరా రుూ మాటలు అన్న తరువాత చాలా పశ్చాత్తాపపడ్డాడు.
ఆ క్షణం నుంచే తనను మృత్యుదేవత ప్రచ్ఛన్నంగా అనుసరిస్తూన్నదనే చావు భయం తనలో కలిగింది.
సత్యాన్ని తెలుసుకున్నాక, ఆచార్యుడు చెప్పిన కథాభాగాన్ని తన వంశానికి అన్వయింపజేసి తీవ్రంగా ఆలోచించిందామె:
ఇప్పటికి సరిగ్గా మూడు శతాబ్దాల క్రితం అలెగ్జాండర్ మధ్యధరా సమద్ర తీరంలో ఒక గొప్ప పట్టణన్నా నిర్మించాడు. ఈజిప్టుకు ముఖ్యపట్టణం. ఈజిప్టును పరిపాలించే ‘టాలమీ’ వంశీకురాలు తాను.
తన తండ్రి ఔలటీస్ టాలమీ రెండేళ్ళుగా రోమ్‌లో ఉన్నాడు. స్వదేశాన్ని, రాజ్యాన్ని వొదిలి ఆయన రోమ్‌లో ఉండటం దేనికి? సరిగ్గా 27 సంవత్సరాల క్రితం టాలమీ వంశీకులు ఈజిప్టును రోమ్‌కు అమ్మటమో, ధారపోయటమో జరిగింది. ఆనాటినుంచీ ఈజిప్టు తన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోల్పోయింది. రోమన్ అధికారానికి లొంగిపోయింది. ఇప్పటికీ అనేకమంది రోమన్ యోధులూ, సైన్యమూ అలెగ్జాండ్రియాలో ఉన్నవి. ఈ విదేశీయుల్ని చూచినపుడల్లా వీళ్లంతా ఇక్కడెందుకున్నారని తను బాధపడుతూ, వారిన అసహ్యించుకుంటూ ఉండేది.
రెండేళ్ళ క్రితం రోమ్ వెళ్ళిన తన తండ్రి తిరిగిరాలేదు. తాను తెలుసుకున్న విషయాలను బట్టి, బహుశా రోమన్‌లు ఆయన్ను హత్య చేసి ఉంటారని తాను నమ్మవలసి వస్తుంది. అలాటి పుకార్లు కూడా తాను విన్నది.
గత సంవత్సరం తన బాబాయి అంటే తండ్రికి సాక్షాత్తూ తమ్ముడు- సైప్రస్ ప్రభువు ఆత్మహత్య చేసుకున్నాడని వదంతి పడింది. కొన్ని వర్గాలవారు తన పినతండ్రిని రోమన్‌లే హత్య చేశారని అన్నారు. ఏది ఏమైనా సైప్రస్ పూర్వం ఇటలీకి సామంతరాజ్యంగా ఉండేది. ఇప్పుడు రోమన్ సామ్రాజ్యంలో కలిసిపోయింది.

- ఇంకాఉంది