సబ్ ఫీచర్

భువికేతెంచిన దేవనది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ వర్షాలలో అగస్త్యముని నీరు-నేల-నింగి-మెరుపు-గాలి అన్ని తానే అయి అనగా పంచభూతస్వరూపుడై జంకక తపస్సు చేయసాగాడు. జలభూతం మేఘవర్షధారాపాతం చేత తక్కిన నాలుగుభూతాల ఔద్ధత్యాన్ని అణచి వేసిందేమోననే శంక ప్రజలకు కలుగనీయకుండ అగ్ని తన తేజస్సును తీవ్రమైన మెరుపుకాంతుల నెపంతో ప్రకాశింప చేసింది. భూమి కొండ శిఖరాల నెపంతో తన ఘనతను చూపింది. ఆకాశం గర్జనల రూపంగా గర్జించింది. వాయువు వర్షానికి చెలికాడై వెంటవచ్చాడు.
శీతకాలం - అగస్త్యుని తపస్సు
వర్షకాలానంతరం అతిచల్లని శీతకాలం వచ్చింది. ఆ కాలంలో స్ర్తిలు తన సహజమైన లజ్జా స్వభావాన్ని వీడి తన భర్తల్ని కౌగిళ్లలో బంధించి వారిని సంప్రీతుల్ని చేసారు. సూర్యుడే చంద్రబింబాకారాన్ని ధరించి వచ్చినాడో అని భీతిల్లి చకోరదంపతులు విడిపోసాగాయి. (చకోరపక్షులు సహజంగా నేలపై నుండే నీళ్లు త్రాగవు. చంద్రునిలోని అమృతానే్న త్రాగి దాహార్తిని తీర్చుకొంటాయి. అయితే శీతకాలంలో కురిసే అత్యంత హిమపాతం చేత ఏర్పడిన శైత్యానికి (చల్లదనానికి) తాళజాలక చంద్ర బింబాన్ని చూచి ఆ రూపంలో సూర్యుడే ప్రకాశిస్తూ ఉన్నాడని భ్రాంతిపడి జంటలుగా చంద్రామృతాన్ని తాగడానికి వచ్చిన చకోర జంటలు విడిపోయాయని కవి ఉత్ప్రేక్షించాడు). అటువంటి తీవ్రమయిన చలికాలంలో ఆ అగస్త్యుడు కంఠంవరకు ఉన్న నీటిలో నిలిచి తపస్సు చేయగా ఇంద్రాదిదేవతలు ఆ వృత్తాంతాన్ని బ్రహ్మకు చెప్పారు. బ్రహ్మ ఇంద్రాదుల్ని వెంటబెట్టుకుని సదాశివుని వద్దకు పోయి భక్తితో ఇట్లు స్తుతించాడు.
‘దేవా! వరాహాకారాన్ని దాల్చి విష్ణువు భూమిని ఛేదించుకొంటూ నీ పాదాల్ని సందర్శింప లేకపోయాడు. అట్టి నీపాదపద్మాల్ని నేడు చూడగలిగాను. నాతపస్సు ఫలించింది’ అంటూ ఆనంద భాష్పాలు కనురెప్పలలో నిండగా తిరిగి తిరిగి బ్రహ్మ ప్రార్థనలు చేస్తూ ఇలా అన్నాడు. ‘ఓ దేవోత్తమ! భక్తవత్సల! అగస్త్యుడు ఏ దేవాధిపత్యాన్ని కోరుకొంటున్నాడో ఏమో అతడు మహూగ్రతపస్సు చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఇంద్రాదులు నాకు చెప్పగా వారిని వెంటబెట్టుకొని నేను నీ వద్దకు వచ్చాను. నీవు ఆ మునికి కోరుకొనే కోరికల్ని తీర్చి మాకు చింతల్ని - దుఃఖాన్ని తొలగించవయ్యా!’.
బ్రహ్మమాటల్ని విని శంకరుడు సుందరదరహాసాన్ని చేస్తూ బ్రహ్మేంద్రాది దేవతల్ని చూచి ‘అగస్త్యుని తపస్సును గూర్చి మీరు భయపడనవసరం లేదు. దక్షిణకైలాస సమీపంలో ఒక పుణ్యనది లేకపోవడం చూచి విచారగ్రస్తుడై తపస్సు చేయ నారంభించాడు. ఈ విషయం నాకు తెలుసు. ముని మనస్సు లో ఉన్న భావమే నా మనస్సులో కూడ ఉంది. నీ వెంట ఆకాశగంగను పంపి స్తాను. దానిని ఆ అగస్త్య మహామునికి అందచేసి వెళ్లు. ఇంత చిన్న విషయానికి నేనే పోవడమెందుకు? నీవు పోయి నేను పంపగా వచ్చానని చెప్పు. ఆయన కోరుకొన్న ఈ ఆకాశగంగానదిని ఆయన కిమ్ము. దీనివలన చిరకాలమాతడు చేసిన తపస్సు వలన కల్గిన శరీరతాపం తొలగిపోతుంది’ అని కరుణాంతరంగుడైన ఆ మహాదేవుడు బ్రహ్మాదుల్ని పంపించాడు. అప్పుడు సంతోషంతో ఇంద్రుడు తన భార్యయగు శచీదేవిని పొందుట కిష్టపడ్డాడు. అగ్ని హూమద్రవ్యాల్ని స్వీకరించడానికి సుముఖుడయ్యాడు. యమధర్మరాజు ధర్మాధర్మమార్గావలంబియై జీవుల్ని విచారింప నారంభించాడు. నిరృతిదేవత నరభోజనాపేక్షకు సుముఖు డయ్యాడు. వరుణుడు వర్షించడానికి దేశకాలాల్ని పరిశీలించ సాగాడు. వాయువు స్వేచ్ఛగా సంచరించాడు. కుబేరుడు నిరంతర దానాలనీయనారంభించాడు. ఈశానుడు ఐశ్వర్యా నికి నేనే ప్రభువునని తలంచాడు. ఈ రీతిగా ఈశ్వరుని ఆజ్ఞతో దేవతలందరు మహదానందంతో విహరించారు. వారి ఉత్సాహాన్ని చూచి బ్రహ్మ మనస్సులో సంతోషించి అగస్త్యు నకు ప్రత్యక్షమయ్యాడు.
‘ఓ మునీంద్రా ! నేను బ్రహ్మను. పరమేశ్వరుడు నీకు వరాన్ని అనుగ్రహించుమని నన్నిచటకు పంపించాడు. నీకు కావలసిన వరాన్ని కోరుకో.’ అని పలికిన బ్రహ్మమాటల్ని విని అగస్త్యుడు దేవా! ఆకాశగంగానదిని తెచ్చి ఈ ప్రదేశంలో ప్రవహింపచేయి. దాని వలననే నా కోరిక ఈడేరుతుంది. అని పలుకగానే బ్రహ్మ నింగి వైపునకు చూచాడు. వెంటనే సువర్ణకాంతులతో - అనేక తరంగాల ధ్వనులతో ఆకాశ గంగానది అయిన దేవనది భువి కవతరించింది. సువర్ణ కాంతులతో ప్రకాశించే ఆ నదీస్వభావాన్ని బ్రహ్మ చూచి ‘సువర్ణముఖరి’ అనే పేరు పెట్టాడు. తదుపరి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. అగస్త్య మునీంద్రుడు మనస్సులో చాల సంతోషించాడు. అగస్త్యుడు తపస్సు చేసిన ఆ కొండ అగస్త్యగిరిగా ప్రసిద్ధమయ్యింది. సువర్ణముఖరీ అనే గంగానది నింగినేల మధ్య చల్లని నీటి తుంపర్లను చిమ్ముతూ దిక్కులు పిక్కటిల్లేటట్లుగా నింగిని కూడ ఒరుసుకొంటూ ప్రవహిం చింది.
సువర్ణముఖీనదీ గమనం
అప్పుడా నదీ వైభవాన్ని ఏమని వర్ణింపగలం? సింహం తన గోళ్లతో చీల్చగా బయటపడ్డ ఏనుగు కుంభస్థలాల్లోని ముత్యాలరాశులే ఆ నదియందు పుట్టే ముత్యాలరాశులు. కాలం చెల్లిపోయి మరణించిన చమరీమృగాల నల్లనితోకలే అందలి నాచుమొక్కలు. తెల్లని చమరీ మృగాల కేశజాలాలే తెల్లని నురుగుతో నిండిన తరంగాలు. ఆడ ఏనుగులతో జత కట్టడం మీద ఆతృతతో పరవశమై పోయిన మదపుటేనుగులు తమలో తాము చేసికొన్న యుద్ధాలలో తెగి నేలపడిన దంతాల ఖండాలే ఆ నదిలోని తామరతూడులు. ప్రవాహవేగం చేత ఒడ్డుల మీద నున్న పుష్పించిన మామిడి చెట్లు కూలిపోగా తేలియాడే ఆ చెట్లకొమ్మల సమూహం చేతను, ప్రకాశించే ‘కాదంబాల (్ధమ్రమైన రంగుతో ముక్కు - కాళ్లు - రెక్కలు గల హంస) సౌందర్యం చేతను ప్రకాశిస్తూ ఆ సువర్ణముఖరీ నది ముందుకు సాగింది.
- ఇంకావుంది...

చరవాణి: 9490620512