డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏవో పాడు కలల కోసం మనస్సు చెడగొట్టుకుంటున్నావు కాని, నిజంగా నీవు రుూ ప్రపంచానే్న పాలిస్తావు. ఇక లేచి రామ్మా! భోంచేద్దువుగాని!’’
క్లియోపాత్రా ఆకాశపుటంచుల్లో విహరిస్తూ, తనకు తెలియకుండానే ఆయా వెంట నడిచింది.
ఆ రోజంతా ఆమె వినోదాలలో గడుపుతూ, ఊహల్లో ప్రపంచానే్న పాలించింది.
3
రోమ్ నుంచి రహస్యంగా వినవొస్తున్న వార్తలు క్లియోపాత్రాకు చాలా ఆశాజనకంగా వున్నవి. ఆ వార్తల్ని బట్టి, తన తండ్రి త్వరలోనే ఈజిప్టుకు తిరిగి వస్తున్నాడని ఆమె అర్థం చేసుకుంది. ఆయన రాకపోతే తనకు బతుకుమీద ఆశలే ఉండవు.
దుర్దినాలవలెనే, సుదినాలు కూడా హఠాత్తుగా వొస్తూంటవి. ఒకనాటి ఉదయం తన తండ్రి ఔలటీస్ టాలమీ, కొంతమంది రోమన్ సైనికులతోనూ, ఒక రోమన్ సైన్యాధిపతితోనూ అలెగ్జాండ్రియా రేవులో దిగాడు. ఆయన వస్తున్నాడని ఆ క్రితం రోజు సాయంత్రమే వేగులవాళ్ళద్వారా ఆమె విన్నది. ఆ రాత్రంతా మేలుకొని, తన గది కిటికీలో నుంచి రేవు వైపే ఎంతో ఆశతో చూస్తూన్నది. రాత్రి పొద్దుపోయిందనీ నిద్రపొమ్మనీ ఆయా ఎంత ప్రాధేయపడినా, కోప్పడినా క్లియోపాత్రా వినిపించుకోలేదు. చివరకు ఉదయమే ఓడలు రేవు జేరటం, రోమన్ సైనికులు కిందికి దిగటం, గద్ద పతాకాలు ఉత్సాహంగా ఎగరటం ఆమె ఎంతో ఆనందంతో చూసింది.
ఎలాగైతేనేం తాను బతికి బైటపడినట్లేననిపించిందామెకు. అయితే తన తండ్రి బందీగా వొస్తున్నాడో, రాజుగా వస్తున్నాడో ఆమెకింకి స్పష్టంగా తెలియలేదు. కాని గురువుగారనట్లు; తండ్రిని బందీగా ఈజిప్టు దాకా తీసుకొచ్చే శ్రమకు రోమన్‌లు ఓర్వరు. బందీగా ఉంచినందువల్ల వారికి ఏ విధంగానూ లాభదాయకం కదు సరికదా పెట్టిపోషించవలసిన బాధ్యతొకటి నెత్తిన పడుతుంది. కనుక ఆయన రాజుగా బతికన్నా రావాలి, లేదా శవంనైనా ఈజిప్టుకు దిగుమతి కావాలి!
ఈనాడు క్లియోపాత్రాకు ఎంత సుదినమనిపిస్తోందో, ఆమె అక్కగారూ రాణీ ఐన బెరినైస్‌కు అంత దుర్దినం! ఓడ రేవునుంచి తన తండ్రి ముందు వెనుకల్లో రోమన్ సైనికులు నడుస్తూండగా చాలా ఠీవిగా కోటలో ప్రవేశించాడు. నిన్నటిదాకా రుూ రాజు చాలా నీచుడని ప్రజలు అనుకుంటున్నారు. ఇలాంటి వెధవను తిరిగి రాజుగా గ్రహించేందుకు ఎవ్వరూ సుముఖులు కారు. వీలుంటే అసలు అలెగ్జాండ్రియా రేవులోనే ఆయన దిగకుండా చేసేవాళ్ళు, లేదా ఈజిప్టు గడ్డమీదనే ఆయన రక్తాన్ని ఇంకేట్లుచేసేవారు.
అయితే ప్రజాభిప్రాయమనేది ఔలటీస్ టాలమీ పట్ల ఇలా ఉన్నప్పటికీ, ఆయన రాజుగా, రాచ మర్యాదల్తో, రాచనగరు ప్రవేశించటాన్ని ఎవ్వరూ కాదనలేరు. పైపెచ్చు తమ విశ్వసాన్ని చూపేందుకుగాను దారిపొడుగునా ప్రజలు తండోతండాలుగా బారులు తీరి ఆయనకు మోకరించి, తన భక్తిని వెల్లడి చేశారు. ఒక్కరూ పల్లెత్తు మాట అనేందుకు సాహించలేదు.
ఆయనతోపాటే దిగిన సైన్యాధిపతికి ఈజిప్టులో రాజరికాన్ని నిలబెట్టే మిషమీద నిలవ ఉంచబడిన రోమన్ సైనికులు జోహార్లు అర్పించారు. ఈ విధంగా ఇటు ఈజిప్షియన్లూ, అటు రోమన్లూ కూడా ఔలటీస్ టాలమీ పట్ల విశ్వాసాన్ని ప్రకటించారు. ఇందులోని రహస్యాన్ని క్లియోపాత్రా లాంటి చురుకైన యువతి వెంటనే గ్రహించింది. ఈ మర్యాదలన్నీ తన తండ్రికి కాదు, ఆయన వెంట వున్న రోమన్ ప్రతినిధులకు! వాళ్ళు లేకుండా ఐతే, తన తండ్రి శవం మాత్రమే ఈజిప్టు భూభాగంమీద కాలమోపి ఉండేది! అందుకనే స్వదేశాన్ని చేరేందుక్కూడా ఆయన విదేశీయుల సహకార సానుభూతుల్ని సంపాయించుకోవలసిన దుర్గతి పట్టింది. ఈ రోమన్ బానిసత్వాన్ని క్లియోపాత్ర ఎంతగా ఏవగించుకుంటున్నప్పటికీ, రుూ సమయంలో అది తనకు ప్రాణదానమే జేసింది!
క్లియోపాత్రా ఊహించినట్లుగా చిన్న కల్లోలం, తిరుగుబాటు కూడా జరగలేదు. సరాసరి ఔలటీస్ టాలమీ సింహాసనం మీదికి జేరాడు. ఇన్నాళ్ళూ తన అక్క అడుగులకు మడుగులొత్తుతున్న ప్రభుత్వోద్యోగులూ, మంత్రి సామంతులూ అందరూ రాజుగారి ముందు మోకరిల్లారు.
ఆయన సింహాసనమెక్కుతూనే తన పెద్ద కూతురు బెరినైస్‌కు మరణదండన విధించాడు. వెనువెంటనే ఆమె శిరస్సు ఖండించబడింది. టాలమీ వంశ చరిత్రలోని మరొక పుట రక్తవర్ణమైంది. ఆమె రెండో భర్త పర్షియన్ రాకుమారుడు ఎలా అదృశ్యమయ్యాడో ఎవ్వరికీ తెలియదు.
అక్కగారి మరణంతోనూ, ముసలి తండ్రి సింహాసన నాశీనుడవడంతోనూ క్లియోపాత్రా భావి జీవితానికి గట్టి పునాది పడింది. మృత్యుభయం దూరమైంది. దాంతోపాటు తండ్రి తదనంతరం తానే రాణి అయే అవకాశాలకు లోతైన వేళ్ళు పాతుకున్నవి. ఆనందాశ్రవులతో ఆమెను తండ్రిని కౌగిలించుకుంది.
రెండేళ్ళకుపైగా తండ్రి రోమన్ ప్రభువుల దగ్గర కుక్కల్లే పడి ఉండి, నామమాత్రమైన స్వాతంత్య్రాన్ని కొనుక్కొచ్చాడు. ఈయన్ను తండ్రిగా ఒప్పుకునేందుకు క్లియోపాత్రా మనస్సు తిరుగుబాటు చేసింది. కాని అలా ఒప్పుకోనట్లయితే ఆమె ఈజిప్టులోనూ, బహుశా ప్రపంచంలోనూ కేవలం ‘జగదేకసుందరి’గా మాత్రమే ఉండిపొయ్యేది. అంతకుమించి చరిత్ర ఆమె గూర్చి మరేమీ చెప్పి ఉండేది కాదు.
తాను కూడా మహారాణి కావాలనీ, వీలైతే ప్రపంచానే్న తన మ్రోల మోకరిల్లజెయ్యాలనే ఆమె ఊహలకు ఇప్పుడొక స్పష్టమైన రూపం ఏర్పడింది. కనుకనే ఆమె తన తండ్రి వాత్సల్యాన్ని సంపాయించేందుకు తాను కుటిలానురాగాన్ని ప్రదర్శించసాగింది.
ఆనాడు ఔలటీస్ పెద్ద విందు చేశాడు. పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి సంపాదించినందుకు ఆయన ఆనందం హద్దుమీరింది. ఈసరికి మృత్యువాత పడవలసిన తను, త్వరలోనే మహారాణి అయేందుకు అవకాశమేర్పడినందుకు క్లియోపాత్రాకు వొళ్ళు తెలియటంలేదు.
ఈ విందులో అత్యున్నత ప్రభుత్వోద్యోగులూ, రోమన్ సేనానులూ పాల్గొన్నారు. రోమ్ నుంచి ప్రత్యేకంగా పంపబడిన సేనాపతికి ప్రత్యేకంగా గౌరవ మర్యాదలు జరిగినవి. ఈ విందునాడు క్లియోపాత్రా కళ్ళు రోమన్ సేనాపతి మార్క్ ఏంటనీ మీదనే ఉన్నవి!
ఈ రోమన్‌లు నిజంగా ఎంత సుందరులు! నఖశిఖ పర్యంతమూ పురుషత్వమూ, వీరత్వమూ కలబోసినట్లే కనిపిస్తారు. స్ర్తిలు కోరదగిన పురుష లక్షణాలన్నీవున్న నవనాగరికులీ రోమన్‌లు!
క్లియోపాత్రా వయస్సు 15 సంవత్సరాలకు దాపులో వున్నా ఆమె నవయవ్వనవతి! అందానికి తోడు యవ్వనం కూడా జతకడితే ఇక ఆ స్ర్తిని కామించని పురుషుడి జీవితం వృధా అనిపించడంలో ఆశ్చర్యం ఉండబోదు.

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు