డైలీ సీరియల్

శతభాషాకృతుల ఆకృతి శారద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాక్కులందు సుధారసాన్ని చిప్పిల చేస్తూ సుధారస (అమృతరసం) నిలయమైన అమృతాబ్ధిలా రమణీయంగా ఉంది. ఉదరం మీద కెరటాల వలె ప్రకాశించే సుడులు కలిగి సుడులు సుడులుగా వచ్చే తరంగాలు గల సుధాసముద్రం వలె మనోజ్ఞంగా ఉంది. తెల్లని నురుగు వలె ధవళవర్ణమై మిరుమిట్లు గొలుపుతూ తెల్లని నురుగే దేహకాంతిగా ప్రకాశించే సుధాబ్ధిలా మనోహరంగా ఉంది.
అట్టి శృంగారిణియైన సరస్వతీ మాతను చెలికత్తెలు భుజాల్ని పట్టి తీసుకొని రాసాగారు. దేవతా స్ర్తిలెందరో ఇరువైపుల నిలిచి సేవించసాగారు. వజ్రాలతో తయారుచేసిన ఆమె కాలి అందెలలు ఝళంఝళనాదాల్ని వీనులవిందుగా ధ్వనింపచేస్తూ ఉన్నాయి. ఎఱ్ఱని పగడాల కాంతులతో సరి సమానంగా తులతూగే పాదుకల్ని ధరించి కొలువుకూటంలో అడుగు పెట్టింది.
అప్పుడు ఆ సరస్వతీ దేవి బ్రహ్మకు పట్టపురాణి అయినా రాజసమైన చేష్టల యెడ అభిరుచి చూపలేదు. జగదేక సౌందర్యవతి యయినా కొంచెం కూడ గర్వభావాన్ని ప్రకటింపలేదు. పరిపూర్ణమైన వన సంపద కలిగినా కూడ మఖంలో మదనవికారభావాల్ని పొడమనీయలేదు. వాగ్దేవిగా ఆమె వాగ్రూపమైన సింహాసనాన్ని అధిష్ఠించినా అధిక ప్రసంగిని కాలేదు. మగని ముందర తన మహామహిమల్ని
వేనినీ కూడ కనబడనీయక వినయభావంతో తలవంచుకొని లోనికి వచ్చింది. అప్పుడామె సౌందర్యం చపలమైన గండు చేపలకు సహితం నిశే్చష్ట్భావాన్ని కల్గించింది.
ఆ రీతిగా కొలువు కూటంలో ప్రవేశించే ఆ వాగ్దేవి తన పాదుకల్ని బహిర్ద్వారమందే విడిచి కచ్ఛపీ వీణను- శుకరాజాన్ని-అక్షమాలా రత్నాన్ని - పుస్తకాన్ని చేత ధరించింది. తన వెంటవచ్చిన పరిజనుల్ని వెనుకకు పంపింది. తాను భర్తయైన బ్రహ్మవద్దకు పోయి ఆయన ఆజ్ఞానుసారంగా వివిధ మణుల బహువిధకాంతులు మించిన ధగధగలతో ప్రకాశించే సరిసమానమైన సింహాసనం మీద కూర్చుంది.
కూర్చున్న ఆ చదువుల రాణి సింగారం బ్రహ్మ మానసాన్ని దోచుకొంది. చందమామను పోలిన ఆ సరస్వతి ముఖం పండు వెనె్నలలు కాయగా హృదయమనే పద్మం కలవర పడిందా? వాలు చూపనే ఇంద్రుని వజ్రాయుధ శక్తి చేత కొండవలె స్థిరంగా ఉండే మనసు దిటవు శిథిలమై పోయిందా? కొప్పు అను కటిక చీకట్లు మీద కప్పికొంటే ఆలోచన అనే బాటసారి త్రోవతప్పినాడా? రాజహంసల నడకల్ని పోలిన నడకల రామణీయకత చేత మనస్సున కలిగిన రాపిడిచేత హృదయ శాంతి శిథిలమై పోయిందా? అనే రీతిగా తనను, కొలువ వచ్చిన వాగ్దేవి సౌందర్యాన్ని చూచిన బ్రహ్మ మన్మథుని వాడిబాణాల తాకిడికి కొంత సేపు గురి అయ్యాడు. ఆ దృశ్యా న్ని చూచిన అచట గల మును లు ఒకరి నొకరు తమతమ ముఖాల్ని చూచుకొన్నారు.
దానిని చూచి సభ్యులు చాల సంతోషపడ్డారు. బ్రహ్మ సభామర్యాద తలంచి తన మనస్సును ప్రయత్నపూర్వకంగా అదుపు చేసుకొని తనలోని మనోవికారభావాల్ని కనబడనీయక అప్పటికి తగినట్లు వారితో కొంతసేవు ముచ్చటించాడు. బ్రహ్మ కొంతసేపటికి ‘‘మన సరస సంభాషణలతో చాల ప్రొద్దు పోయింది’’ అని వేల్పుల్ని - మునుల్ని ప్రియపూర్వకంగా పంపివేసాడు. తదుపరి బ్రహ్మయు వాణియు ఒక సౌధాగ్రభాగానికి వెళ్లారు. అచట బ్రహ్మ వాణితో ఇలా పలికాడు ‘‘ఓ కోమలి! నీ సౌందర్యం మాటలకందనిది. ఊహింపరానిది, సాటియైన మరొక సౌందర్యమే లేనిది, అసామాన్యమైనది. అమితాశ్చర్య కరమైనది. లోకాతీతమైనది సాటియైనది - సరియైనది లేనిది. అందుచేత నాకు నీయెడల చపలమైన కామవాంఛ తీరడం లేదు. నా కోరికను తీర్చేందుకు నీవు సంతోషంతో శతభాషాకృతుల వలె అనేక రూపాల్ని ధరించాలి.’’ బ్రహ్మపత్ని పతిమాటల్ని విని తన పాతివ్రత్యానికి తగినట్లుగా పతి ఆజ్ఞను శిరసావహించి శతవాగ్దేవీ రూపాల్ని ధరించింది.
ఆ రూపాల్ని చూచి బ్రహ్మ పరమానందభరితుడై తుమ్మెద పుష్పించిన లతాపుష్పాలలోని మకరందాన్ని గ్రహించిన రీతిగా ఆ శతవాగ్దేవీముఖారవిందాలలోని అధరామృతాన్ని గ్రోలినాడు. ఫలితంగా నాటినుండి బ్రహ్మ శతానందుడని పురాణప్రసిద్ధుడయినాడు. ఆ విధంగా బ్రహ్మ కామాంధ కారంతో కన్నుకాడని వాడై ఉద్యానవనాలలో, క్రీడాపర్వతాలపై; ఆకాశగంగాతీరపు పొదరిండ్లలో దేశం-కాలం - ఆచారం అనే విషయాల్ని పాటించకుండ వాగ్దేవీ శతరూపాలతో కామకేళిలో గడిపాడు. అప్పుడా వాగ్దేవీ శతరూపాలలోని ఒక వనిత మోమునెఱ్ఱగా చేసుకొంది. ఒక వనిత ప్రేమ పూర్వకంగా నిందించింది. ఒక తరుణి తన తలను పట్టుకొంది. మరొక మహిళ హుమ్మని హుంకరించింది. ఒక నారీలలామ తనను పట్టకుమని ఒట్టు పెట్టింది. మరొక వనిత రోదించింది. వేరొక ముద్దుగొమ్మ ముసుగు పెట్టి పవళించింది. మరొక చెలువ నీకు సిగ్గులేదని ఆక్షేపించింది. ఈ రీతిగా కోపించి వివిధ రీతులలో ఉన్న వారిజాక్షుల్ని తగిన విధంగా బ్రహ్మ గౌరవించి లాలించి చాలాకాలం రతి సౌఖ్యాలలో తేలియాడాడు.ఆ సమయంలో శతవాణీ బింబాధరాల అమృతాన్ని ఆ బ్రహ్మ తన నాలుగు ముఖాల్ని వరుసగా పెట్టి ఆస్వాదించాడు. ఆ విధంగా అధరామృతాన్ని ఆస్వాదించే సమయంలో బ్రహ్మ తనను తాను మైమరచిపోయాడు. దంతక్షతాలపై మనసు ఉంచాడు. కౌగిలిలో పారవశ్యాన్ని పొందాడు. గోళ్లతో గిచ్చినంతనే తెలివి పొందుతాడు. బహువిధ రతిబంధాలతో క్రీడసల్పి పరవశుడై మణిత మంత్రాలచే (రతి సమయంలో స్ర్తిలు చేసే ధ్వని) హెచ్చరిక పొందుతాడు. సురతక్రీడా సుఖంబు చేత సోలిపోతాడు. కాని తాంబూల సేవనంతో కొంచెం సేదతీరుతాడు. జలకమాడి- దివ్యవస్త్రాల్ని ధరించి దివ్యసుగంధాల్ని మైపూసుకొని దివ్యపుష్పాలు ధరించి అమృతసేవనం చేసి బాలికాసంగమ సౌఖ్యాలలో బ్రహ్మ ఓలలాడాడు.

- ఇంకావుంది...

చరవాణి: 9490620512