డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతానికి ఇదే తన నివాసం. చుట్టూ కొండలు, అల్లంత దూరంలో సముద్రం. ఈ రెండూ తనకు ప్రకృతి ఏర్పరచిన రక్షలు. మిగతా జాగ్రత్తలమీద ఆమె మనస్సు లగ్నం చేసింది.
రోమ్‌కు ధనసహాయం, సైనిక సహాయం చేయకపోయినట్లయితే, రుూ ప్రస్తుత స్థితిలో ఆ రెండూ ఆమెకు ఎంతో ఉపయోగపడేవి. ఐతే ఆనాడు ఇందువల్ల తనకు రోమ్ సహాయం ఉంటుందనీ, తానే ఏకచ్ఛత్రాధిపత్యాన్ని వహించవచ్చుననీ ఆమె అపోహపడింది కాని, ఆ ప్రతిఫలం మాట ఎట్లా ఉన్నా, రుూనాడు ఆత్మరక్షణకు తగిన సిబ్బంది, ధనం కూడా తనకు లేని దుస్థితి ఏర్పడింది. చెయ్యిజారిపోయినదాన్ని గూర్చి ఇపుడు విచారించి కూడా లాభం లేదు.
ఒకపక్క ఈజిప్టులోని పరిస్థితుల్ని తెలుసుకోవటం ఎంత అవసరమో, రోమ్‌లోని పరిస్థితుల్ని గూర్చి తెలుసుకోవటం కూడా అంత అవసరం. ఎందుకంటే వీటిమీదనే తన భావి జీవితమంతా ఆధారపడి వుంటుంది. స్వశక్తిమీద కాక, పరశక్తులమీదా, ఇతరుల అదృష్టాదృష్టాలమీద జీవితం ఆధారపడి ఉండటం ఎంత దుర్భరమో ఆమెకు బాగా తెలిసివచ్చింది.
అదృష్టం కానీ, దురదృష్టం కానీ ఏ రూపంలో ఎప్పుడు ఎదురౌతుందో ఎవ్వరికీ తెలియదు. అదలా ఉంచి, తన స్వశక్తిమీద కూడా కొంతవరకన్నా ఆధారపడి ఉండటం, లేదా దురదృష్టపు తాకిడిని తట్టుకునేందుకు సిద్ధపడి ఉండటం అత్యవసరం. ఈ విషయాన్ని గ్రహించిన క్లియోపాత్రా తనకు తాను చేసుకోగలిగినవాటి విషయంలో ఎన్నడూ అజాగ్రత్త వహించలేదు.
తన దగ్గర ధనరాసులేవో ఉన్నవని సైనికుల అభిప్రాయం. ఐతే వారనుకునేటంత ధనం తన దగ్గర లేదు. కాని, మూసిన గుప్పెటకున్న విలువ ఏమిటో తెలుసుకున్న క్లియోపాత్రా, సైనికులు తమ అభిప్రాయాల్ని గాడంగా నమ్మే విధంగా ప్రవర్తించసాగింది.
సైనికులు కూడా తనకు ఏ క్షణాన్నయినా ద్రోహం చెయ్యవొచ్చు లేదా తన దగ్గర ఉన్నదనుకునే రుూ ధనరాల్ని కొల్లగొట్టేందుకు ఏ ఇతర సైన్యాధిపతి అయినా తన సైనికులకు ఇచ్చే కొద్దిపాటి లంచంతో తనను సర్వనాశనం చెయ్యవచ్చు. కనుక కొత్త సైనికుల్ని కూడా జేర్చుకొని, కొంత సైన్యాన్ని కేవలం స్వరరక్షణ కోసం కూడగట్టుకొని ఉండటం అత్యవసరమైంది.
ఆ చుట్టుపట్ల వున్నవారు అరబ్బులు. వీళ్ళను నమ్మేందుకు లేదు కాని, అంతకన్నా మరి గత్యంతరమూ లేదు కనుక అరబ్బుల్నే కొంతమందిని సైనికులుగా జేర్చుకొని, వారికి శిక్షణను ఇప్పించింది.
సైనికుల్లో చాలామంది వొంతుల ప్రకారం ఆ చుట్టుప్రక్కల వున్న అటవీ ప్రదేశాలకు వేటకు వెళ్లి, ఆహారాన్ని సంపాయించాలి, మరికొంతమంది సముద్ర తీరంలో చేపల్ని పట్టాలి; ధాన్యాదుల్ని పరిసర పట్టణాలనుంచి బంగారమిచ్చి కొనుక్కొని రావాలి. మొత్తంమీద దినదినగండంగానే జీవితం సాగుతోంది. తెచ్చిన సొమ్ము తరిగిపోతుంది. రాజ్యపాలనలో ఐతే, కొంత రాబడి అంటూ ఉంటుంది. ఇక్కడ ఖర్చు తప్ప రాబడి లేదు. తన దగ్గర సొమ్ము అయిపోతుందని తెలిసిన క్షణంలో రుూ సైనికులందరూ తనను కొల్లగొట్టుకుని హత్యచేసి, వారి దోవన వారు పోతారు.
సైన్యమంటూ ఉన్న తరువాత, దాన్ని యుద్ధ్భూమిలో ఉపయోగించాలే కానీ, పెట్టి పోషిస్తూ కూర్చున్నట్లయితే కుదరదు. ఎటూ కాని స్థితిలో క్లియోపాత్రా కొట్టుమిట్టాడుతోంది. చుట్టూ ప్రకృతి సౌందర్యమంటూ వున్నది కాని, దాన్ని ఆనందించే స్థితిలో ఆమె లేదు. తన రుూ సమస్య ఎప్పటికి ఏ విధంగా పరిష్కరించబడేది ఆమె ఊహించలేని స్థితిలోనే ఉండిపోయింది.
ఈజిప్టులో ఏం జరుగుతూన్నదో ఆమెకు వార్తలు అందుతూనే వున్నవి. తన భర్త టాలమీ జనరంజంకంగా పాలిస్తున్నాడనీ, రోజురోజుకూ అతని పలుకుబడి పెరుగుచున్నదనీ విన్నది. దాంతోపాటే తానంటే ఈజిప్షియన్‌లకు ఈర్ష్యకూడా పెరిగి ఉంటుందని ఆమె గ్రహించింది. తాను చేసిన పొరపాట్లకు ఇది తగిన శిక్షే మరి!
చిన్నతనంనుంచీ తనకు గురువుగా వున్న ఇరాస్ సలహాలను ఆమె అడుగుతూనే వుంది; కాని, వాటన్నిటినీ ఆమె అమలుజరపటంలేదు. స్వబుద్ధితో, స్వార్థంతో ఆలచోంచి, తొందరపడుతూనే వుంది.
టాలమీ పక్షంవారు పాంపేకు సహాయం చేయలేమని చెప్పినపుడు, తనను మెదలకుండా ఊరుకోమని గురువుగారు సలహా చేశారు గాని, తాను వినకుండా రోమన్ ప్రభుత్వం తనకేమో ఒరగబెడుతుందని కావాలని కల్పించుకుని సహాయపడింది. అదే తనను రుూ అజ్ఞాతవాసానికి పారద్రోలింది.
ప్రతి సాయంత్రమూ ఇరాస్‌తో ఆమె మంతనాలు చేస్తూనే వుంది. ఐతే ప్రస్తుత పరిస్తితుల్లో ఎటూ సలహాలిచ్చే స్థితిలో ఆయన లేడు. కేవలం వారి సంభాషణలు పరిశీలనలుగానే ఉండిపోయినవి. కాని, ఒక నిర్థారణకు దారి తీయటంలేదు.
దాదాపు ఒక సంవత్సరం గడిచింది. పరిస్థితులు రోజురోజుకూ విషమిస్తూన్నవే కాని, సుముఖంగా మారటంలేదు. ఏ దివ్యశక్తులో వచ్చి అడ్డుపడితే తప్ప రుూ బతుకుమీద ఆమె ఆశలు అడుగంటుతున్నవి.
ఒకనాటి అర్థరాత్రి ఇరాస్‌కు పిలుపువచ్చింది. ఆయన ఏం ప్రమాదం వాటిల్లిందోనని భయపడుతూ పరుగెత్తుకుంటూ క్లియోపాత్రా డేరాకు వచ్చాడు.
ఆమె ఆలోచనా సాగరంలో మునిగి ఉంది; కాలు కాలిన పిల్లవలె అటూ ఇటూ పచార్లు చేస్తోంది.
‘‘కూర్చోండి ఆచార్య! చాలా విషాదకరమైన వార్తలు వొస్తున్నవి’’ అందామె ఇరాస్‌ను చూడగానే.
‘‘మళ్ళీ ఏమైంది?’’ అన్నాడాయన ఆతృతతో.
‘‘రోమన్ ప్రభుత్వం టాలమీని ఈజిప్టుకు రాజుగా అంగీకరించింది!’’
‘‘బహుశా నీ మీద లేనిపోనివి రోమన్ ప్రభుత్వానికి చెప్పి ఉంటారు- రాణీ!’’
‘‘రాణి!’’ అని ఆమె వికటంగా నవ్వింది. ‘‘ఆచార్యా! రాజ్యం లేదు; కిరీటం లేదు; అధికారం లేదు.. నేను రాణినెలా అవుతాను? ఆ ఆశలు నాకు లేవు. నన్ను ‘రాణీ!’ అని పిలిస్తే అది పరిహాసమనే అనుకోవలసి వుంటుంది!’’ అన్నది.
ఇరాస్ అన్నాడు: ‘‘నీవు తప్పక రాణివౌతావు. ఈజిప్టు సింహాసనానికి నీకు హక్కున్నది. ఇవాళ కాకపోయినా, రేపైనా నీవు రాజ్యపాలన చేస్తావు. అంతేకాని, నిన్ను హేళన చేసేందుకు నేను రాణీ అని పిలవటంలేదు.
‘‘నామీద మీకున్న వాత్సల్యంవల్ల అలా అంటున్నారే కాని, అలాటి ఆశలు నాకు లేవు. ఏ విధంగానైనా తిరిగి అలెగ్జాండ్రియా జేరి, రాజప్రాసాదంలో స్థానాన్ని సంపాయించుకునే అవకాశం ఉన్నదా అని ఆలోచిస్తున్నాను’’ అన్నదామె.
ఇరాస్ ఏమీ మాట్లాడలేదు; ఎందుకంటే ఆమె ఏం ఆలోచించిందో చెప్పాక, తన అభిప్రాయాన్ని వెల్లడిద్దామని ఆయన అనుకున్నాడు.
‘‘రోమన్ ప్రభుత్వానికి నిజంగా విశ్వాసం లేదు. ఈనాటికీ పాంపేయే నియంత కదా! పాంపేకు నేను సహాయంచేస్తే, దానికి ప్రతిఫలం నాకు రాజ్య బహిష్కారమూ, టాలమీకి రాజ్యమూనా?’’ ఆమె కంఠస్వరంలో అగ్నికణాలు రేగినవి.
ఇరాస్ మెదలకుండా వింటున్నాడు.
‘‘మనకిక ఆశలేమున్నయ్?’’ అంతలోనే చల్లబడి నిట్టూర్చి అందామె.
‘‘నా సలహా తీసుకోవు కాని’’ అని ఇరాస్ వాక్యాన్ని పూర్తిచెయ్యకుండానే ఆగిపొయాడు.
‘‘చెప్పండి’’ అని ఆమె ప్రశాంతంగా కూర్చున్నది.
‘‘నీకు నిజంగా తక్షణం ఈజిప్టుకు రాణి కావాలాని ఉన్నట్లయితే’’ అని ఆయన ఆమె ముఖంలోకి సందేహంతో చూశాడు.
- ఇంకాఉంది -

-ధనికొండ హనుమంతరావు