డైలీ సీరియల్

వేటలో అలసట..వేల్పులకు దగ్గర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంకొందరు ఊరికే ఉందామని తలంచి కూడ ఉండలేకపోయారు. వేరొకకొందరు లేవడానికి ప్రయత్నించి లేవలేక పోయారు. ఇంకా కొందరు ఎదుట ఎవరును లేకున్నా తిట్టేవారు. మరికొందరు పాడటం చేతకాకున్నా పాటలు పాడారు. మరికొందరు కనబడిన వారికందరికి దండాలు పెట్టేవారు. కొందరు సిగ్గులేక ఆడేవారు. మరికొందరు చాల త్రాగి కూడ ఇంకా కావాలని చేసాచేవారు. ఇంకా కొందరు ఊరగాయ పాత్రల్ని తడిమేవారు. ఈ విధంగా ప్రవర్తిస్తూ శబర దంపతులందరు శృంగార చేష్టలకు పూనుకొన్నారు.
ఒకామె మనస్సును ఉపనాథుని మీద (్భర్తకాని వేరొక వ్యక్తి) ఉంచి మాటమాటికి భర్తకు అధికమైన మద్యాన్ని ఇచ్చి సేవింపచేసింది. మోహాతిశయంలో తన భర్తను కౌగిలించుకొని అతనిని ఉపభర్త పేరుతోనే పిలుస్తూ మద్యపానాసక్తమైన విలాసంతో భర్తను కూడింది. ఇప్పుడు తీసుకొని తాగిన మద్యం పుడిసెడు గాని లేదు ఇంత మాత్రానికే ఒళ్లు తెలియటం లేదు’ అని భర్తను ఒక వనిత నిందిస్తూ ‘ఎంత తాగినను ఇతడు జడియడు’ అని వేరొకని భర్తకు చూపించి సరసంగా భర్తకౌగిలి లోనికి ఒదిగిపోయింది.
ఈతడు మంచిభర్త. ఏమన్నా తిరిగి బదులు పలుకడు. కాని నేడేమో రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్లు మాటలాడుతున్నాడు. ఈ మద్యపు కుండల దగ్గర ఆడే మాటలు కొత్తవి కావు. బహుశా అత్త ఈతనికి నాపై ఏమి నూరిపోసిందో మరి. మాటిమాటికి మగడు నిందిస్తూ ఉన్నాడు. అని ఒక భిల్లాంగన వాపోయింది. మంకెన పూవులో ప్రవేశించి మత్తెక్కిన తుమ్మెదలా మన్మథుని ఎఱ్ఱని పద్మరాగాభరణంలోని నీలమణిలా మద్యపానం చేత ఎర్రబడిన కనుపాపల కాంతులు బింకం చాపగా భిల్ల దంపతులు విరివిగా మద్యపానం చేసారు.
తిన్నడు పరిజనులతో కూడి వేటకు వెడలుట
ఈ విధంగా బోయదంపతులు మధురమైన మద్యపాన మత్తవినోదాలలో ఓలలాడి తమ తమ ఇండ్లకు వెళ్లారు. అప్పుడా బోయరాజయిన నాదనాథుడు వేటలో కాటిరేనిపతి (శివుడు) అంతటి వాడవు అగుదువు గాక అని కొడుకును దీవించి తన బోయపల్లెకు వెళ్లిపోయాడు. ఆ మరునాడు ఉదయాననే కొడుకుకు ఈడయిన జతగాండ్రను కూర్చి వేటకు పొమ్మని కొడుకును అనుమతించాడు. అతడు వేటకవసరమైన తెరచీరకట్టలు - త్రాళ్లచుట్టలు - పెద్ద పెద్ద జంతువులు గుంపులు గుంపులుగా చిక్కిపడే దొడ్డివలలు - లేళ్లను పట్టే వలలు - కుందేళ్లను పట్టే వలలు - పందుల్ని పట్టే వలలు, సవదండవలలు, మకరివలలు, ఎలుకల వలలు మొదలైన వలలునూ, సివ్వంగులు - కుక్కలు - నల్లజింకలు - ముంగిసలు - ఎద్దులు మొదలయిన వేటకు శిక్షణ ఈయబడిన జంతువులనూ, ఓరణాలు - సెలకట్టెలు - సాళువాలు - గిద్దులు (అన్ని ఒక జాతి డేగలు) వేసడములు మొదలయిన విడివేటకు (పక్షులపై పక్షుల్ని విడిచి పట్టుకొనే వేట) ఉపయోగపడే డేగలనూ, పెంపుడు పిట్టల్ని ఒకచోట ఉంచి వాని ధ్వన్ఱుచే ఇతర పిట్టల్ని ఆకర్షించి చేసే పక్షుల సాదివేటకు ప్రత్యేకంగా శిక్షణ రుూయబడిన బూరేడు. (ఒకజాతి పక్షి) కారుకోడి (అడవికోడి) కేరజం (పొంచివేటాడు పక్షి) కౌజు (కపింజలమనే ఒక జాతి పక్షి) కక్కెర (ఒకజాతి పక్షి) చింద (చీపిరి పిట్ట) మొదలయిన పక్షులనూ, వేటాడడానికి సహాయపడే ఉరులు (జంతువుల మెడలకు బిగించే త్రాడు) ఉరికోలలు (ఉరులను కట్టే కర్రలు) బోనులు (జంతువు బంధించేందుకు ఉపయోగించేవి). చిక్కాలు (జంతువుల్ని బంధించేందుకు తాళ్లతో అల్లిన సంచులు) జిగురు కండెలు (పక్షుల్ని పట్టుకోవడానికి కర్రకుగాని - దారానికి గాని పూసిన జిగురు ముక్క) తీపుత్రాళ్లు- ఒడి తాళ్లు - తలముళ్లు (వేటకు ఉపయోగించే తాళ్లు) విల్లంబులు మొదలైన వన్నీ సాధనాలనూ వెంటతీసుకుని అడవికి వచ్చి వేంకటాచలం వేటాడే స్థలంగా చేసికొని తిన్నడు వేట నారంభించాడు.
ఒకనాడు తెరవేట (తెరలు వేసి చేసేవేట) ఆరంభించాడు. ఆ వేటలో క్రూరమృగాల కాళ్ళుపైకి లేచి అవి క్రిందపడగా వానిని తిన్నడు వధించాడు. మరియొక సారి వడిగల వేటకుక్కలతో అడవి పందుల్ని వేటడాడు. మరియొక సారి మచ్చుపక్షుల్ని (పక్షుల్ని ఆకర్షించేందుకు పెట్టే పక్షి) పెట్టి పక్షుల్ని ఆకర్షించి పట్టి తెచ్చాడు. మరొకసారి డేగవేట నారంభించి ఆకలితోనున్న డేగల్ని పక్షులపై ఎగద్రోసి వానిని చంపి తెచ్చాడు. ముంగిసవేట- ఏదువేట-సివంగివేట- ఇర్రివేట - గంటువేట (గంటలు కొట్టి జంతువుల్ని ఆకర్షించి చేసే వేట) ఇలా అనేకమైన వేట పద్దతుల్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వంతున అనుసరిస్తూ జంతువుల్ని తిన్నడు వేటాడాడు. ఆ విధంగా పులులు - లేళ్లు - గున్నఏనుగులు - ముళ్లపందులు - జత కట్టని జంతువులు - దుప్పులు - కణుతులు (జంతువిశేషం) ఎలుగుబంట్లు- చమరీమృగాలు - అడవి దున్నపోతులు - కస్తూరి పిల్లలు మొదలైన జంతువుల్ని పక్షుల్ని తిన్నడు వేటాడి తండ్రికి కానుకలుగా పంపాడు.
ముందుగా వేనీలో చిక్కిన జంతువుని తెచ్చి దాని మిడిగ్రుడ్లను పొడిచివేసి తలను నీటితో తడిపి తోకకోసి ధూపం వేసి మీసాలు కత్తిరించి కాట్రేనికి తిన్నడు నైవేద్యంగా సమర్పిం చాడు. పిమ్మట బలిసిన పందుల్ని కొన్నింటిని చంపి వాని వెంట్రు కలు కాల్చారు. కుండపెంకులతో గీకుతూ వానికి ఎర్రమన్ను పూసి శరీరం లోని నీరు పోయే విధంగా కాల్చారు. మరల వానిని పేల్చి చమురు చిమ్ముతుండగా కర కుట్లుగా కాల్చి జువ్విచెట్టు నీడలో ఒక శిలావేదికపై మిత్రులందరితో చేరి తిన్నడు కాల్చిన కరకుట్లను, కాల్చిన పిట్టలను కందమూలా లను, పట్టుతేనెలందు ముంచుకొని తృప్తికరంగా భుజించాడు.
ఆవిధంగా వేంకటాచల ప్రాంత వనాలలోని మృగాల్ని - పక్షుల్ని సంహరించి తూర్పుదిక్కున గల అడవులలో ఆటవికులతో కలిసి వేటాడే తలంపుతో వేటగుడారాన్ని ఎత్తివేసి వెంటనే తన పరివారంతో వెళ్లి సువర్ణముఖరీ తీరంలోని కొండలలోని అరణ్యాలలో వేటాడసాగారు. ఆ నదీతీరం లోని అంజినాడు అనే ప్రదేశంలోని కొండల్లో, శివుడు నివసించే ఉత్తరదిశలో గల యముడు నివసించే దక్షిణ దిశలోని కైలాస పర్వతాలలో గల వనాలలోని క్రూర జంతువులన్నింటిని వేటలాడిన తిన్నడు అలసిపోయాడు. కళ్లు అలసటకు మూసుకుపోతున్నాయ.
- ఇంకావుంది...

చరవాణి: 9490620512