డైలీ సీరియల్

తిన్నని అమాయకం అచలుని కఠినం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడైనా కాసేపు విశ్రమిద్దామనుకొన్నాడు. అపుడు అతడికి ఒక బాగా పుష్పించిన వకుళవృక్షం కనిపించింది. దాని క్రింద తిన్నడు ఒంటరిగా నిద్రపోయాడు.
తిన్నని స్వప్నంలో ఈశ్వరుడు ప్రత్యక్షమగుట
ఆ నిద్రలో తిన్నడు కలగన్నాడు. ఆ కలలో తిన్ననికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన శివుడు తన శరీరం నిండుగ విభూతిని పూసుకొని యున్నాడు. పులితోలును ఒడ్డాణంగా ధరించాడు. ముఖంపైన రాగిరంగు కల జడలు వ్రేలాడు తున్నాయి. కేవలమాత్మనే ధ్యానించడం చేత నిశ్చలమైన విబన్నులు కలిగియున్నాడు. అచ్చమైన గోచిని పెట్టుకొన్నాడు. భుజాలపై పుఱ్ఱెల హారాన్ని వేసుకొన్నాడు. మెడలో లింగాన్ని కట్టుకొన్నాడు. ఆ రీతిగా ప్రత్యక్షమైన శివుడు కరుణామూర్తియై ‘బాలక! ఇచటకు సమీపంలో సెలయేరుంది. దాని గట్టున ఒక మఱ్ఱిచెట్టు ఉంది.
దానికి దగ్గరగా ఒక కొండ ఉంది. దానికి సమీపంలో సువర్ణ ముఖరీనది ప్రవహిస్తూంది. ఆ నదీతీరంలో భక్తులపాలిట పెన్నిధియైన ఈశ్వరుడున్నాడు. నీవు ఆయనను భక్తితో సేవించు.’ అని చెప్పి అంతర్ధానమయ్యాడు. వెంటనే తిన్నడు అదిరిపడి లేచి ఈశ్వరునికై నలుదిక్కుల వెదకుచు మనసులో ఆశ్చర్యచకితుడయ్యాడు. మృగసమూహాల్ని తరుమడం కోసం ఈలలు వేస్తూ పీకెలు (తాటాకు లేదా కొబ్బరాకులతో చేసిన బూరాలు) ఊదుతూ బోయవాళ్లు వెంబడించగా అవి పరుగు పెట్టి వారు పన్నిన వల్ఱలో పడకుండ చెల్లాచెదురయి తప్పించుకొనిపోయాయి. అప్పుడా బోయలు తమలో తాము తిట్టుకొని శార్దూలాన్ని అడవి పందుల్ని వలలు పన్నిన వైపు నకు తరుమసాగారు. ఆ సమయంలో వారి ఆ వేటకోలాహల ధ్వని తిన్నని చెవులకు సోకింది. వెంటనే కల ప్రభావం నుండి తిన్నడు బయటపడ్డాడు.
అప్పుడొక వరాహం (పంది) వలలకు చిక్కకుండ బంధించే త్రాళ్లను తెరలను తెంపి వేస్తూ వేటాడు ప్రదేశాన్ని దాటి పోతూ వేటకాండ్ర ప్రయత్నాన్ని వమ్ము చేస్తూ ఘుర్ఘర ధ్వనులు చేస్తూ పరుగెత్తసాగింది. దానిని చూచి తిన్నడు విల్లంబులు చేతబట్టి దానిని వెంబడించాడు. వేగంగా పరుగు పెట్టి ఆ వరాహాన్ని తరమడం చేత తిన్నడు అలిసిపోయాడు. ఒకచోట నిలిచి దానిని బాణంచేత కొట్టాలని ప్రయత్నించేలోగా అది పరుగుపెట్టి దూరంగా పారిపోయి తిన్నని నలుదిక్కుల త్రిప్పిత్రిప్పి బాధించింది. ఆ రీతిగా అది సంసార పాశబంధ విముక్తుడైన యోగివలె స్వేచ్ఛాసంచారం చేస్తూ కలలో తిన్నడు చూచిన శివుడ కనబడే స్థలం వరకు వచ్చి అది మాయమైపోయింది. అప్పుడా తిన్నడు తనకు కలలో కనబడిన జగత్ప్రభువైన శివుడే, ఊరిస్తూ ఊరిస్తూ ఇంత దూరం తీసుకొని వచ్చిన ఈ వరాహం ఇదంతా ఆ ఈశ్వరుని మాయావిలాసమే. అని మదిలో తలంచి ఎదురు గా ఉన్న ఒక మహాశివలిం గాన్ని చూచాడు. ఆ లింగం సర్వవ్యాపకమూ, అనంతమూ, వేదాంతంలో నిరూపితమైన నిత్య చైతన్య స్వరూపమైనది. అజ్ఞానాంధకారపటలం చేత కూడుకొన్న మనస్సులు కల జీవులకు సుఖమయమైన మార్గాన్ని అనుగ్రహించే అఖండమైన కాంతి గల సూర్యుని వంటి కడకంటి చూపు అయినది. ఏకాంత ప్రదేశంలో మాత్రం ధ్యానింపదగినది మరియు కారణరహితమైనది. అట్టి దివ్య లింగాన్ని చూచి శరీరమంతా పులకించిన వాడై తిన్నడు ఆనందబాష్పాలు రాలుస్తూ దానికి సాష్టాంగ నమస్కారాలు చేసి చేతులు జోడిస్తూ దానిని సమీపించి ఇలా అన్నాడు.
తిన్నడు శివలింగానికి సేవ చేయుట
ఓ సామీ ! ఇటువంటి కొండల సమీపంలో పులులు- సింహాలు బాధించే ఈ చిట్టడవిలో జువ్వి చెట్టు నీడలో ఈ నదీతీరంలో (సువర్ణముఖి) ఏ ఆశతో నీవు ఇల్లు కట్టుకొన్నావయ్యా! నీకాకలి అయినచో కూడు ఏ చుట్టాలు తెచ్చిపెడతారు? ఈ నిర్జన ప్రదేశంలో ఓ లింగమా! ఒంటరిగా నీవుండనేల? కొండలు- అడవులు తిరిగి బలిసిన పందుల్ని - లేళ్లను - దుప్పుల్ని చంపి తెస్తాను. వానిని మా చిన్నక్క పెద్దక్క కమ్మగా భక్ష్యాల్ని చేసి పెడతారు. నీవిచట ఒంటరిగా ఉండనేల? మారు మాటాడక ఉడుమూరుకు రావయ్యా. ఓ ఈశ్వరా! విను. నీకు పాయసానికి అవసరమైన ఒడిపిళ్లు- గునుకు బియ్యం - వెదురుబియ్యం - చమరీమృగాల పాలు మావద్ద ఉన్నాయి. ఇవియే గాక మావద్ద పుట్టతేనె - పెరతేనె - పుట్టజున్ను - తొఱ్ఱతేనె (చెట్టు తొర్రలలో ఉండే నల్లని చిన్న చిన్న తేనెటీగల నుండి వచ్చే తేనె) కాలి జలజల రాలిపోయే మంచి కందదుంపలు కూడ ఉన్నాయి. వానితో బాటు నీవి తినేందుకు - నేరేడు - నెలయూటి - కొండమామిడి - దొండ - పాల - నెమ్మి - బరివంక- చిటిముటి - కలివె - తొడివెంద - తమ్మికి - జాన - గంగరేగి - వెలగ - మోవి మొదలయిన అనేకమైన పండ్లున్నాయి. వానిని మా చెంచెతలు తెచ్చి నీకు పెడతారు. ఓ లింగమా! నీకు ఇల్లా? వాకిలా? ప్రియమైన స్నేహితులా? సరియైన చుట్టాలా? భార్యా! కొడుకా ? ఇచట నీకెవరున్నారు? ఏ సౌకర్యాలు లేకుండ ఒంటరిగా ఈ యడవిలో ఉండటం సాధ్యమా? మా పల్లెలో నీవు కోరుకొనేవి ఎన్నో ఉన్నాయి. వానినన్నింటిని నీకు ఇస్తాను. ఇచట ఒంటరిగా ఉండక మా ఉడుమూరికి రావయ్యా. ముక్కంటి కంటిమంటలలో పడి బూడిద అయిన దుండగీడగు మన్మథుని మిసమిసలాడుతూ మిడిసి పడే తమవిలాసపు చూపులచేత తిరిగి పుట్టింప గల గుండ్రని, ఎడమీయని, బిగిచన్నులు గల బోయ- పడతుల్ని సేవచేయడం కోసం నీకు సమర్పిస్తాను. నన్ను మన్నిస్తే నీవిప్పుడె నావెంట రా. నీవు రాకుంటే నేను ఒంటరిగా తిరిగివెళ్లను. ఇక్కడ నీవే లోకంగా బతుకుతాను. నీ దయను పొందుతాను. నీకిష్టమైతే ఈ వౌనాన్ని వీడవచ్చు. ఇప్పుడు నన్ను బాధింపనేల?’’ అని తిన్నడు ఆ మహాదేవుని (శివుడు) తన ఉడుమూరికి రమ్మని ప్రార్థించినా ఆయన ఏమియు మాటలాడలేదు. అప్పుడు ఈశ్వరుని యందు భక్తి పారవశ్యంతో సంపెంగ పూల వాసనలో మునిగిపోయిన తుమ్మెదలా తిన్నడు ఉండి పోయాడు. ఆ సమయంలో పందిని వెంబడించి వెళ్లిన తిన్నడు ఎచటకు వెళ్లాడో అని వెంటవచ్చిన బోయలు అడుగు జాడల ననుసరించి తిన్నని వద్దకు వచ్చి ఇలా అన్నారు.
- ఇంకావుంది...

చరవాణి: 9490620512