డైలీ సీరియల్

స్థిరభక్తి... నిర్మలమానసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అన్నా ! నిన్ను మాయచేసి యింతదూరం తీసుకొని వచ్చిన ఆ వరాహం ఎక్కడికి పోయింది? మమ్ముల్ని చూస్తూ కూడ ప్రియంగా మాటాడవేమి? ఏల కన్నీరు కారుస్తూ మేమేమన్నా కూడ మారు మాటాడవేమి? వేటాడేందుకు వచ్చి ఇచట నీవు ఈ విధంగా ఉంటే నీ తల్లిదండ్రులు దుఃఖింపరా? నీ గాలినే పసికట్టిన కుక్కలు ఒళ్లు విరుచుకొంటూ మెడలోని త్రాళ్లను ఎంతలాగినా లొంగక ఇటకు వచ్చి నీ చుట్టు తిరుగుతున్నాయి. వానిని కూడ చూడవేమి?
వలల్ని - తెరల్ని పోగులుగా చుట్టలేదు. జంతువుల శరీరంలో గుచ్చుకొన్న బాణాల్ని లాగివేయలేదు. చచ్చిన జంతువుల్ని తీసుకొని రాలేదు. విడివేట (పక్షులవేట)లో చిక్కిన పక్షులకు మేతపెట్టలేదు. వెంట వేటాడవచ్చిన చెంచులు అలసట తీర్చుకోలేదు. చచ్చిన మృగాలు చెడిపోకుండ ఏమియు చేయలేదు. కుక్కలు-జింకలు-సివంగులు- మేత మేయలేదు. నైవేద్యమిచ్చి కాట్రేనిని కొలుచుకోలేదు. వేట విశేషాల్ని మీ తండ్రికి కబురు పంపలేదు.
అకటా! ఇచట కొయ్యబారిపోయి నీవేల కూర్చుంటివి? మా దీనదశను తొలగించవయ్యా! తండ్రీ! నిన్నీ అడవిలో ఒంటరిగ వీడి పోవటానికి మాకు మనసు రాకుంది. ‘‘వేటకు వెళ్లిన మీరందరు వచ్చారు. మా తిన్నడు రాలేదేమి? అని నీ తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు అడిగితే మా పైప్రాణాలు పైకే పోతాయి? వారిచేత మమల్ని తిట్టింపక మావెంటరావయ్యా! పల్లెలో మాకు చెడ్డపేరు తీసుకు రాకయ్యా. మేమెంత బాధపడుతున్నా కనీసం మమ్మల్ని చూడనైనా చూడవు. ఈ విషయాన్ని ప్రభువుల వారికి తెలిపేందుకు మేము వెళ్లతాము. ఏమి చెప్పి పంపెదవో చెప్పిపంపు’ అని వారు తిన్నని పాదాల్ని పట్టుకొన్నారు.
చివరకు శివలింగం మీద అత్యాసక్తి చేత అచంచలమైన మనస్సు కల ఆ శబరశ్రేష్ఠుడు దయతో చిరునవ్వు నవ్వి ఆ వనచరులతో ఇలా అన్నాడు. ‘దూలానికి ఓడను కట్టినట్లుగా నా ప్రాణాల్ని లింగానికి బంధించివేసాను. మీకేల కంగారు? మీరు పల్లెకు పొండి. నావెంట ఈ దైవం వస్తే ఇప్పుడు నేను మీ వెంట వస్తా. లేదా మహేశ్వరుడెక్కడుంటే అక్కడనే ఆయనకు తోడునీడగ ఉంటా. నాకు చుట్టమయినా తల్లిదండ్రులయినా స్నేహితులైనా ప్రభువయినా ఈ దైవం మాత్రమే. మీరిచ్చట దుఃఖపడ నవసరం లేదు. మీరు పొండి. బలాత్కారం చేసినా ఇచట నుండి కదిలిరాను. నాదైవం కోసం నేను నా ప్రాణాలర్పిస్తాను. నేను బొంకడం లేదు. నిజమే చెపుతున్నా’’ ఈ విధంగా పలికి తిన్నడు శివుని తమ మనసులో నిలుపు కొని మైమరచి పోయా డు. అతని ఆలోచనలో ఎట్టి మార్పు రాలేదు. తిన్నని స్థితిని చూచి శబరులు అచట నుండి వెడలిపోయారు.
తిన్నడు ప్రతిదినమూ శివుని కాహారమిచ్చుట
తదనంతరం తిన్నడు ఒంటరిగా ఈ అడవిలో ఎన్నాళ్ల నుండియో శివుడు పస్తున్నాడు. ఈతని ఆకలిబాధను నేను పోగొట్టవద్దా? కళ్లారా చూచిన ఈ సేవకుడి కింతకంటె సేవాఫలమేముంది? అని తలంచి మహేశ్వరుడికి భక్తితో తృప్తిగా సమర్పించేందుకై సమీపారణ్యాలలో తిరిగాడు. తన కొమ్ము కొనతో చెట్లను కూల్చివేయగల బలిష్ఠమైన వరాహాన్ని చంపాడు. కాల్చి ప్రేల్చిన దాన్ని మాంసాన్ని ఉంచిన ఆకుదొప్పల్ని రెండుచేతులతో పట్టుకొని విల్లునొక చంకలో పెట్టుకుని అమ్ముల పొదిని వీపున ధరించి సువర్ణముఖరీ జలాన్ని పుక్కిలి బట్టి తిన్నడు శివలింగం వద్దకు వచ్చాడు. వచ్చి పుక్కిట జలాన్ని లింగం మీద ఊసి స్నానం చేయించాడు. దొప్పలలోని మాంసఖండాల్ని తినుమని అద్రిరాజుల్లుడైన ఈశ్వరుడి ముందుంచాడు. కానీ మహేశ్వరుడు ఆరగింపక మిన్నకుండిపోయాడు. దానిని చూచి తిన్నడు ఆవేదన చెందుతూ ఇలా అన్నాడు.
‘ఓ పార్వతీశ్వరా ! ఈ మాంసం కాలలేదా? బలిసిలేదా? మాడిపోయిందా? రుచిగా లేదా? కమ్మగా లేదా? నీకు చాలదా? లేక తినడం అలవాటులేదా? నీవేల తినవు? చెప్పవయ్యా! ఆకలిగా లేదా? నిజమైన భక్తి లేనివాడనా? ఏలతినవు? ఇష్టంతో ఈ మాంసాన్ని తిని నన్నిప్పుడు దయతో చూడవయ్యా ! తినక నన్ను బాధింపకయ్యా! నాయందు తప్పేమైనా ఉందా? ఉపవాసంతో బాధపడే నీకు నేనేల యపరాధం చేస్తాను. దయతో ఈ కఱకుట్లను (ఊచకు కట్టి కాల్చిన మాంసపుముక్కలు) ఆరగింపవయ్యా! శివా! నీవు ఆరగించకుంటె ఇక నా జీవితమెందుకు? నీ పాదపద్మాల మీద పడినేను నా ప్రాణాల్ని విడిచి పెడతాను’ అని పలికి రోదించాడు.
అప్పుడు తిన్నని భక్తికి మెచ్చిన శివుడు ప్రసన్నుడై అతనిని ఓదార్చి అన్నా! కరకుట్లను ఇటుతే. తింటాను. లేలే అని పలికాడు. ఆ మాటల్ని విని సంతోషించి తిన్నడు కరకుట్లను అందీయగా శివుడు ప్రియంతో ఆరగించాడు. దానికి నింగిముట్టిన ఆనందంతో ప్రతి దినమూ అదే విధంగా శివుని సేవింపసాగాడు.
శివబ్రాహ్మణుడు ఆలయమందలి మాంసఖండాల్ని చూచి చింతించుట
తిన్నడిలా ఆ లింగాన్ని శివగోచరుడను పేరుగల శివబ్రాహ్మణుడొకడు వైదికాచార పద్ధతులతో పూజిస్తూ ఉండేవాడు. ఆతని ఆకారం చాల శ్రోత్రియమైనది. ఓం నమశ్శివాయ అని పంచాక్షరిని జపిస్తూ విభూతిని శరీరమంతట పూసుకొన్నాడు. స్నానం చేత శిఖ (పిలక) తడిసియుంది. క్రమంగా వేయబడిన ముడుల కల రుద్రాక్షమాలల్ని అలంకారాలుగా ధరించాడు. నోటితో శివ నామోచ్చారణ చేస్తూ ఉన్నాడు. చీలమండ వరకు వ్రేలాడే కావిరంగు ధోవతిని ధరించాడు. భుజాలపై యజ్ఞోపవీతా లున్నాయి. శివాభిషేకం కొఱకు క్షీరభాండాన్ని చేత ధరించాడు. మరొక చేత శివపూజకై పూలసజ్జ పట్టాడు. కుండవలె ఉన్న పెద్దబొజ్జ కలిగియున్నాడు. ఒకపాటి వామనరూపం కూడ. భుజాలపై ఉత్తరీయం ధరించాడు. అట్టి శుద్ధవైదిక శివయోగివేషంతో ఆ శివబ్రాహ్మణుడు ఆ గుడికి వచ్చాడు. వచ్చి శివలింగాన్ని చూచి అయ్యో! ఈ మహేశ్వరుని నిర్మలాంగం ఏల నీటి చారికలు కట్టి వుంది? ఇక్కడకు ఎంగిలి పుల్లి ఆకులు ఎలా వచ్చాయి? ఈ అశుచి వలన కలిగే దుఃఖాన్ని ఎలా భరించగలను? కులదైవమని ఈ గుడిని అలికి - ముగ్గులు పెట్టి అలంకరించగా ఈ విధంగా ఎంగిలి మంగలాలు- దొప్పలు ఎందుకు వచ్చాయి?

- ఇంకావుంది...

చరవాణి: 9490620512