డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సీజర్! మీరు పొరబడుతున్నారు. రోమన్ నియంత సీజర్‌గా ఆమె మిమ్ము ఆరాధిస్తుంది.. కాని, ఆ అధికారమే లేకుంటే!’’
‘‘ఆమె చూపే ప్రేమలో నాకెలాటి సందేహమూ లేదు!’’
‘‘సీజర్! కామోద్రేకంలో ప్రపంచమే వేరువిధంగా కనిపిస్తుంది. ఆమె స్వార్థచింతతో, తనకు లేని హక్కుల కొరకు తన పక్షాన మీరు పోరాడుతారని రుూ ప్రేమను నటిస్తుంది. ఆమె మీ అధికారాన్ని ప్రేమిస్తోంది కాని, మిమ్ముకాదు. చివరకు రుూ స్ర్తి రోమన్ సామ్రాజ్య పతనానికి కారకురాలు కాగలదు!’’
సీజర్‌కు ఇవన్నీ అబద్ధాలుగా తోచినవి. క్లియోపాత్రాను గూర్చి ఎవరేమన్నా ఆయన సహించలేని స్థితిలో పడ్డాడు.
‘‘ఆరు నూరయ్యేది- క్లియోపాత్రాను నేను వొదులుకోను. రోమన్ సామ్రాజ్యం పతనమైనప్పటికీ నేను లెక్కచేయను. ఇక ఈ విషయమై చర్చించవలసిన పనిలేదు. ఒక పక్క యుద్ధ సన్నాహాలు చేయండి. మరొకపక్క మనకు సహాయం కోవసమై కబుర్లు పెట్టండి. మీరంతా చివరివరకూ నాకు విశ్వాసపాత్రంగానే ఉంటారని నమ్ముతున్నాను!’’ అన్నాడు సీజర్.
అందరూ నిరాశతో నిట్టూర్చారు సీజర్- జగదేకవీరుడు- ఆయనకు ఎదురాడే సాహసం ఎవ్వరికీ లేదు. ఇక విశ్వాసాన్ని గూర్చి ఆయనొకమాట అన్నాడు. కనుక తమ తమ విశ్వాసాల్ని ప్రకటించవలసిన బాధ్యతలు సేనానులకు ఉన్నవి. ఒక్కరొక్కరే ఆయన ముందు మోకరిల్లి విశ్వాస సూచికంగా ఆయన చేయి ముద్దుపెట్టుకున్నారు.
ఒకప్రక్క అశాంతితో, మరోప్రక్క ప్రణయంతో దగ్ధమైపోతున్న హృదయంతో, సీజర్ బరువుగా అడుగులు వేసుకుంటూ అంతఃపురంలోకి వెళ్లిపోయాడు.
సీజర్‌కు మతిపోయినట్లుంది. చాలాసేపటివరకూ తన గదిలో పడుకొని, అతి దీర్ఘంగా ఆలోచించసాగాడు.
క్లియోపాత్రా తనకొక క్రొత్త జీవితాన్ని, నూతన ప్రపంచాన్నిచ్చింది. ఇప్పుడు తను తిరిగి వయసుగాడయ్యాడు. ఇంతకుపూర్వం తన జీవితంలో అనుభవవించవలసిందంటూ ఉన్నదని నమ్మలేకపోయాడు. కాని క్లియోపాత్రా స్నేహంతో, మధుర జీవితమనేది నిజంగా ఇప్పుడే ఆరంభమైనదని నమ్మక తప్పటంలేదు.
ఆమె తన అధికారానే్న ప్రేమించి ఉండొచ్చుగాక! ఏదైనప్పటికి, తనకు సంబంధించినవాటికే ఆమె తన ప్రణయాన్ని అర్పించింది. క్షణంలో తనను క్రొత్త వ్యక్తిని చేసింది. ఆమెకోసం తాను ఎలాటి త్యాగాన్నయినా సరే చేయగలడు!
లోకం నవ్వుతుంది! ముసలివాడు పడుచుదానివలలో చిక్కుకున్నాడని హేళన చేస్తుంది! తన జీవితమే ఒక కథయితే, రుూ సంఘటనను తాను కూడా నమ్మి ఉండేవాడు కాదు! ఐతే రుూ దివ్యానుభవానికి తాను చెల్లించే వెల ఏమిటి? అది రోమన్ సామ్రాజ్యమే కావచ్చు! తన సమాధే కావచ్చు! ఐనప్పటికీ, అదొక వెలగా తనకు తోచటంలేదు. రానున్న ప్రమాదాలేవీ క్లియోపాత్రా స్నేహం ముందు తనకు కనిపించని పరిస్థితులు ఏర్పడినవి.
స్వార్థ చింతతోనే క్లియోపాత్రా తనను ప్రేమించి ఉండొచ్చు. అది నిజమైన ప్రేమగాక, లోకులు అనుకుంటున్నట్లు కపట ప్రణయమే కావచ్చు. కాని అసత్యాన్ని సత్యంగా స్ఫురింపజేసి నమ్మించే ఆమె కౌశలానికి జోహార్లు సమర్పించక తప్పదు.
ఈ ప్రపంచాన్నంతా ఒక త్రాసులోనూ, క్లియోపాత్రా ఒక్కతెనూ మరొకదానిలోనూ ఉంచినట్లయితే, తన దృష్టికి ఆమె ఎక్కువ తూగుతుంది. జీవితపు అంత్య దశలో తనకు చిక్కిన రుూ రత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేదు. ఆమెకున్నలాంటి స్వార్థచింత తనకు లేదా? ఈనాడు రోమన్ సామ్రాజ్య పతనానిక్కూడా లెక్కచేయక, ఆమె పొందునే ఆశించే దారుణమైన స్వార్థం తనలో లేదా? యుద్ధమేసంభవిస్తే ఏవౌతుందో తనకు తెలియకపోలేదు. ఐనప్పటికీ, గాంభీర్యం చెడకుండా తాను నిలవదొక్కుకుంటున్నాడు. ఏ క్షణంలో తానుక్లియోపాత్రా ప్రణయాన్ని స్వీకరించాడో, ఆ క్షణం నుంచీ రుూ ప్రపంచంలో ఆశించదగిన మరొక వస్తువంటూ ఉన్నదనే జ్ఞానం నశించింది.
..జగదేకవీరుడుగా చరిత్ర ప్రసిద్ధికెక్కబోతున్న రుూ సమయంలో క్లియోపాత్రా తారసిల్లింది. చరిత్రకారులు తనను బుద్ధిహీనుడుగా చిత్రిస్తారు. కాని, తనదృష్టిలో వెధవ రోమన్ సామ్రాజ్యాన్ని గెలుచుకున్నందుకు తాను మరీ గర్వపడలేడు. క్లియోపాత్రాను గెలుచుకున్నాడు. ఆమె ముందు మిగతావన్నీ అత్యల్పాలు!
అయినదేమో అయినది. ఈ క్లియోపాత్రాను విడనాడుతే తనకంతా ఐశ్వర్యమే! శేష జీవితమంతా వైభోగమే! కాని, ఈమెను వదులుకునే శక్తి లేదు. ఈమెకొరకై మిగతావన్నీ వదులుకునేందుకే మనసు ఉవ్విళ్లూరుతోంది.
ఆలోచనాభారంతో తలదిమ్మెక్కుతోంది. సమస్యలన్నీ తీరే సమయం వచ్చింది కదాననుకుంటే, క్లియోపాత్రాయే జీవన్మరణ సమస్యగా ఎదురైంది. ఈ జీవితం క్షణభంగురమనుకుంటే, క్లియోపాత్రా ప్రణయమే తన జీవితంలో నిజంగా సువర్ణాక్షరాలతో లిఖించవలసిన సంఘటన కాగలదు.
ఆకలి దప్పులు కూడా సీజర్‌ను విడనాడినవి. సూర్యాస్తమయం వరకూ ఆయన ఆలోచిస్తూనే ఉన్నాడు. బుర్ర తిరిగిపోయింది. మధ్యలో ఒక రాజోద్యోగి వచ్చి, అలెగ్జాండ్రియాలోని ఒక ముఖ్యమైన వీధిలో ఇద్దరు రోమన్ సైనికులను, ఈజిప్షియనులు సంహరించారని చెప్పాడు.
సీజర్ చిరాకుపడ్డాడు. ఉద్రేకపడలేదు. చచ్చిన సైనికులపట్ల సానుభూతి చూపలేదు; చివరకు ఈ సంఘటన తన అధికారానికి తలవంపనీ అనుకోలేదు. రెండు అల్పజీవులు రుూ ప్రపంచాన్నుంచి తప్పుకున్నవనుకున్నాడు. ఈ కారణంగా అల్లరులు జరుగకుండా చూసుకోమని మాత్రం అన్నాడు.
తానిక్కడ ఆలోచిస్తూ కూర్చున్నాడే కాని, పాపం క్లియోపాత్రా తన రాకకోసం ఎదురుతెన్నులు చూస్తూంటుందనీ, ఆమె కన్నులు కాయలు కాచి, అందాలు చిందే ఆమె ముఖంలో విషాద మేఘాలు అలుముకొని ఉంటవనీ తానెందుకు మరిచిపోయాడు? ఇప్పుడే ఒక్క అరగంటలో తిరిగి వస్తానని ఆలోచనా మందిరానికి వెళ్లిన తను, సూర్యాస్తమయమైనా తన ఆరోప్రాణమనుకునే క్లియోపాత్రా దగ్గిరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? తన దేశానికీ, అధికారానికీ, తన ప్రజలకూ కీడు చేస్తున్నానని అంతరాత్మ ఘోషిస్తున్నందువల్లనా?
అంతరాత్మ! దానికి బుద్ధింటే, ఈ ప్రజలందరికన్నా, ఆ క్లియోపాత్రాయే ఎన్నుకోదగిందనే జ్ఞానం ఉండి ఉండేది. పరమ శత్రువును సంహరించినవిధంగా తాను ఆలోచనా మందిరంలోనే ఆ అంతరాత్మను నరికి పోగులు పెట్టాడు. ఇప్పుడది నీరసంగా చావు మూలుగులు మూలుగుతోంది. తనలాంటి మహాయోధుడికి ఇదొక లెక్కా!
క్లియోపాత్రా ఎలా ఉంటుందో, ఆమె ఎంత దుఃఖపడుతూండి ఉంటుందో తలుచుకొని సీజర్ కంపించాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఆయన క్లియోపాత్రా మందిరం వైపు చకచకా నడవసాగాడు. ఆమెతో ఉంటే కనీసం తాత్కాలికంగానైనా తానీ ప్రపంచంనుంచి దూరంగా ఉండి, మనశ్శాంతిని పొందవచ్చు.
తన హదృయంలోనే గాక, రాజభవనంలోని మూల మూలలా దుఃఖ మేఘాలు వేళ్ళాడుతున్నవని గ్రహించేందుకు ఆయనకు ఎక్కువ సేపు పట్టలేదు. పరిచారికలందరూ ముఖాలు వేళ్లాడేసుకుని, నిశ్శబ్దాన్ని ఆరాధిస్తున్నారు. నడవవలసి వస్తే మునివేళ్ళ మీద తప్ప నడవటంలేదు. హాలులో భోజనార్థం టేబిల్ వేసి ఉన్నది. భోజన పదార్థాలు సిద్ధంగా ఉంచబడినవి.
సూర్యాస్తమయ సమయంలో భోజనానికి ఏర్పాటేమిటని ఆయన ఆశ్చర్యపడ్డాడు.
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు