డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె గాద్గదిక కంఠస్వరంతో అన్నది: చూశారా! మగవారి ప్రణయం ఎంత తాత్కాలికమో! నేను మీతో అంటిపెట్టుకుని ఉండాలని విశ్వప్రయత్నం చేస్తుంటే, మీరు నన్ను వదిలించుకొని వెళ్లాలనీ, నాకు దూరంగా ఉండాలనీ వాంఛిస్తున్నారు కదూ! పోనీండి.. మీ ఇష్టం! ప్రపంచానే్న ఏలే మీకు ఎదురుచెప్పేందుకు నేనెవర్ని? మగవాళ్ళ మాటలు నీళ్ళలో మూటలు కదా!’’’
క్లియోపాత్రా మనస్సు నొప్పించాడు తాను. ఎలా చెబితే ఆమెకు అర్థవౌతుంనని సీజర్ ఆలోచించాడు.
‘‘రాణీ! ఒక్కటి ఆలోచించు- ప్రేమ ఒక్కటేనా జీవితానికి? నేను నీకు ఎలా దూరం కాగలుగుతాను చెప్పు! పూర్వం ఎప్పుడూ ఈజిప్టుకూ, రోమ్‌కూ ఇంత గాఢమైన సంబంధం ఏర్పడి ఉండలేదు కదా! నీవు వాగ్దానం చేసినట్లుగా, మరి కొద్దినెలల్లోనే నాకో పుత్రుడ్ని ఇవ్వబోతున్నావు. ఆ చిన్నారి కొరకు నేనేమైనా చెయ్యాలి. వాడు ఈజిప్టుకు మాత్రమే పాలకుడుగా ఉండేందుకు వీల్లేదు. వానికొరకై రోమన్ సామ్రాజ్యాధిపత్యాన్ని జాగ్రత్త చెయ్యాలి. ఇది నా కనీస బాధ్యత’’.
క్లియోపాత్రా కళ్ళు కాంతివంతమైనవి. నిజంగానే సీజర్ తనను విడనాడటం లేదు. తరువాతి తరంవాళ్ళ కొరకు కూడా ఆయన తగిన ఏర్పాట్లు చేస్తున్నాడు. తన సంతానానికి తండ్రి లేని కొరత ఉండదు. జగదేకవీరుడైన సీజర్‌కు కలిగే రుూ సంతానం చాలా సుఖపడగలదు!
ఇంకా కడుపులోనే ఉన్న బిడ్డమీద మమకారం అంతులేనిదైంది. సీజర్‌తో తనకు కలుగబోయే వియోగమే, తాను తల్లిగా తన బిడ్డకు చేయగల త్యాగం! క్లియోపాత్రా మనసు మారింది.
ఈ సంగతి గ్రహించిన సీజర్ ‘‘ప్రియా! నిన్ను నేనీ జన్మలో మరువలేను. నీకు పురుడొచ్చేవరకూ ఇక్కడే ఉంటాను. రోమ్ వెళ్ళాక, నీవు కూడా వద్దువుగాని, అంతవరకూ ఈ విరహాన్ని భరించు. అప్పుడే మన ప్రణయానికి విలువ హెచ్చుతుంది. మనుషులు దూరుమైనంత మాత్రాన, మనసులు దూరవౌతవా?’’’ అన్నాడు.ఆమె ఆనందపారవశ్యంతో సీజర్‌ను కౌగిలించుకుంది.
***
క్రీ.పూ. 47వ సంవత్సరంలో ఏడవ క్లియోపాత్రా పట్ట్భాషిక్తురాలైంది. ఆ రోజునే అర్సినోయ్ టాలమీ ఉరిశిక్షను అనుభవించాడు. దుష్టశిక్షణ జరిగిందని ప్రజలు సంతోషించారు. ఆనాడే క్లియోపాత్రాకూ, ఆమె తమ్ముడు బుల్లి టాలమీకీ నామకః వివాహం జరిగింది. పట్ట్భాషేక మహోత్సవంలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కిందటి రోజు సీజర్ చదివిన ఆజ్ఞాపత్రంతో క్లియోపాత్రా పట్ల ప్రజలకు గొప్ప సదభిప్రాయం కలిగింది. ఈ జగన్మోహిని రాణిగా పొందినందుకు ఈజిప్షియన్‌లు గర్వపడ్డారు.
ఆచార్యుడు- ఇరాస్ మాత్రం పట్ట్భాషేకాన్ని చూడలేకపోయాడు. కొన్నాళ్లుగా ఆయన పక్షవాతంతో మంచం పట్టి ఉన్నాడు. ఇక ఎక్కువ కాలం బతుకుతాడనే ఆశ లేదని రాజ వైద్యులన్నారు. క్లియోపాత్రాకు ఆయనయందుండే గౌరవంతో ఎలాగైనా ఆయన్ను బతికించుకుందామని ప్రయత్నించింది. కాని, ఆ ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలు లేవు. అప్పుడప్పుడు వెళ్లి ఆయన్ను చూసి వస్తోంది.
‘‘రాణీ! నేనెక్కువ కాలం బతకను. కాని, నేను అనుకున్నట్లే నీవు రాణివైనందుకు చాలా సంతోషం! నీ పరిపాలన ప్రజా రంజకమవుతుందని నాకు గట్టి నమ్మకం. నా గూర్చి విచారించకు.. ఐనా ఇప్పుడు పెద్దదానివయ్యావు. తల్లివి కాబోతున్నావని కూడా విన్నాను. నీకు యుక్తాయుక్తాలు తెలుసు. ఇపుడు సీజర్ లాటి లోకోత్తర పురుషునికే సలహాలివ్వగల దిట్టవయ్యావు. నీలాంటి శిష్యురాలిని చూసి గర్వపడుతున్నానంటే నమ్ము’’ అన్నాడాయన.
త్వరలోనే తనను విడిచి, పరలోకాలకు పోబోతున్న ఆచార్యుణ్ణి చూసి ఆమె కన్నులు తడిచేసుకుంది. వికలమైపోయిన మనస్సుతో ఆ రోజంతా గడిపింది. మనసు పాడవుతుందనే భయంతో ఇప్పుడసులు ఆచార్యుని చూసేందుకు వెళ్ళటం లేదామె. కావలసినదానికన్నా ఎక్కువగానే ధన సహాయం, వైద్య సహాయాన్ని ఏర్పాటు చేసిందామె.
ఇక ఆయా - ఆమె ముసలితనానే్న జయించిందా అనిపించేట్లు ఉన్నది. క్లియోపాత్రా జీవితమంతా ఇప్పటిదాకా ఆమె చేతులమీదనే నడిచింది.
‘‘నీకు చెప్పలేదా తల్లీ! నీవు దైవాంశ సంభూతురాలివి! నీకీ వెధవ ఈజిప్టేమిటి - ప్రపంచమే దాసోహమనాలి. నీవు మహారాణివే! ఆ మొహం చూస్తేనే అర్థవౌతుందీ విషయం! తల్లీ! నీ కష్టాలు గట్టెక్కినందుకు దేవతలందరికీ పూజలు చేశాను. ఇపుడు నీ కడుపు చల్లగా తల్లివౌతావు. టాలమీ వంశజుల మనుమల్ని కూడా ఎత్తుకొనే అదృష్టం నాకుందని ఎన్నడూ అనుకోలేదు!’’ అంటూంటుందామె.
తనను సీజర్ దగ్గరకు చేర్చిన బానిసను తగు విధంగా ఆమె గౌరవించింది. వాడిప్పుడు రాజభవనంలో బానిసలందరిమీదా పెత్తనదారు. క్లియోపాత్రాకు నమ్మిన బంటు.
క్లియోపాత్రా రాజ్యపాలన ఆరంభమైంది. దూరం నుంచే ఆమె పాలనను పరిశీలిస్తూ సీజర్ పట్టలేని ఆనందాన్ని పొందుతున్నాడు. ఆమె ఎవరి సలహాలనూ అడగదు. తనవలెనే ప్రతి విషయంలోనూ ఎక్కువ ఆలోచన లేకుండానే నిర్ణయాలకు వస్తుంది. ప్రజా సంక్షేమాన్ని ఆమె మనసులో ఉంచుకునే ప్రవర్తిస్తోందనే విషయం సీజర్ గ్రహించి, తాను క్లియోపాత్రాకు దారి తప్పి సహాయపడలేదనీ, నిజంగానే ఆమెకు రాజ్యార్హత ఉగ్గుతో పెట్టబడిందనీ నమ్మక తప్పలేదు. క్లియోపాత్రా తెలివితేటల్ని మెచ్చుకోనివారు లేరు. టాలమీ ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను ఆమె సునాయాసంగా సర్దుకోగలింది. అరాచకం నుంచి, బాధ్యతలున్న ప్రభుత్వాధికారం దేశంలో ఆరంభమైందనిపించింది.
రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె ఆరోగ్యం అంత బాగుండటంలేదు. రాజ వైద్యులు అహర్నిశలూ కనిపెట్టే ఉన్నారు. గర్భం పెరుగుతూనే వుంది. ఆమెలోని సౌకుమార్యం చాలావరకు తగ్గిపోయింది. మొహంలో కళాకాంతులు కూడా తగ్గినవి. ఇదివరకల్లే కామోద్రేకాలు లేవు. వేగంగా ప్రవహిస్తున్న నది సమతల ప్రదేశం మీదికి వచ్చి, అసలు నడుస్తుందా లేదా అనిపించే మాదిరి ఉన్నదామె.
ఐతే, ఈ స్థితిలోనే తాను తన ప్రియునికి దూరమయే అవకాశాలు ఏర్పడుతవేమోనని ఆమె భయపడింది. ఎందుకంటే, సీజర్ ఇప్పుడు సాధ్యమైనంత వరకూ ఆమెను తప్పించుకొని తిరుగుతున్నాడు. రోమ్‌నుంచి వచ్చిన ప్రభుత్వాధికార వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నాడు. రోజులో ఎప్పుడో ఒకప్పుడు మొహం చూపి తొందర పనులున్నవనే మిషమీద వెంటనే వెళ్లిపోతున్నాడు. ఇదివరకల్లే ఆయన్ను ప్రేమడోలికల్లో ఆనందింపజేసేందుకు క్లియోపాత్రా ప్రయత్నించింది. ఏ సంతానానికి తండ్రయి ఆయన గర్వించబోతున్నాడో, ఆ సంతానానికి మాతృత్వాన్ని వహించే తన ప్రస్తుత పరిస్థితి చూసి తనలో ఆకర్షణ సహజంగా తగ్గిపోయిన కారణంగా ఆయన ఏవగించుకుంటున్నాడు. ఇది పురుష ప్రకృతిలోని విచిత్రం!
క్లియోపాత్రా నిశితబుద్ధికి ఛేదించలేని సమస్యంటూ ఉండేందుకు వీల్లేదు. అందుకని ఆమె జలవిహారాన్ని ఏర్పాటుచేసింది. రాజకీయాలతోనూ, దైనందిన జీవితంలోనూ విసుగెత్తిపోయిన మనస్సుకు ఆహ్లాదకరంగా ఉండేట్లుగా సుందర ప్రకృతిలో కొన్నాళ్లపాటు తిరుగుతే తన ఆరోగ్యమూ బాగుంటుంది. సీజర్ మనస్సు ప్రకృతి కాంతను వరించటంతో ఆయన స్థితి కూడా బాగు పడుతుంది.
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు