డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-37

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన రుూ వియోగం, త్వరలోనే బలవత్తరమైన సంయోగాన్ని కూర్చగలదు!’’
‘‘ఆ ఆశలతోనూ, పూర్వానుభవాల తాలూకు మధురమైన తలపులతోనూ జీవితాన్ని గడుపుతూంటాను. స్వామీ! మీ సాంగత్వంలోనే నేనొక కొత్త జీవితాన్ని వేరొక అవతారాన్ని దాల్చగలిగాను. మాతృదేవినై, నా జన్మ తరించినట్లే భావించాను.. ఐనప్పటికీ మీ స్నేహానే్న నా మనసు ఇంకా ఆపేక్షిస్తున్నది. ఆ మొదటి రోజు మీ సాంగత్వ భాగ్యానికి ఎంత తహతహలాడానో, రుూనాడొ అలానే ఎదురుచూస్తున్నాను.’’
ఇలాంటి సంభాషణలతోనే ఆ రాత్రంతా గడిచింది. ఈ ఏణ్ణర్థలోనూ జరిగిన అనేక సంఘటనల్ని జ్ఞాపకం తెచ్చుకుని, వారెంతో ఆనందించారు. విచారించారు.
పరిపాలనలో క్లియోపాత్రాకు చెప్పవలసిందేమీ లేదని సీజర్ తేల్చుకున్నాడు. ఆమె పాలన చాలా ప్రశాంతంగా ఉండగలదు. ఇప్పుడు కొత్తగా రోమ్‌తో ఏర్పడిన రక్తసంబంధంతో, రోమ్‌కూ ఈజిప్టుకూ అత్యంత సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ స్నేహం చిరకాలం ఉండగలదు.
మర్నాడు సీజర్‌ను సాగనంపేందుకు క్లియోపాత్రా కూడా ఓడరేవుకు వెళ్లింది. సముద్రపుటలలవలెనే, అనేక భావాలు ఆమె హృదయంలో కొట్టుకులాడినివి. వీడలేక వీడలేకనే సీజర్ బయలుదేరాడు. బయలుదేరే ముందు తన ప్రేయసి క్లియోపాత్రానూ, కుమారుడు సీజర్ టాలమీని దీవించాడు. వారి క్షేమం కొరకు రోమ్‌లోని దేవతలందరికీ పూజలు చేసేందుకు ఆజ్ఞలు పంపాడు
సీజర్ ప్రయాణం చేసే ఓడ కనుపూపు దాటిపోయినా, క్లియోపాత్రా అలాగే శిలాప్రతిమాలాగా ఓడరేవులో నిలబడిపోయింది. సీజర్ తనతోపాటే ఆమె సగం ఉత్సాహాన్ని తీసుకొని వెళ్ళాడు. కంటినుంచి ఏకధారగా నీరు కారుతున్నది. చుట్టూ జేరిన రాజోద్యోగుల హృదయాలు కూడా ద్రవించినవి. చివరకు ఆయా ఊరడింపులతో బరువైన హృదయంతోనే ఆమె తిరిగి రాజప్రసాదానికివెళ్లింది.
కాని ఈ రాజ్యమూ, ఈ వైభోగమూ అంతా మిథ్యగానూ, చాలా అల్పమైనవిగానూ ఆమెకు తోచింది. గదుల మూలల్లో పిశాచాలాలే నాట్యమాడుతున్నవేమో ననిపించిందామెకు! జీవితం ఇంతింత మార్పుల్ని ఎలా భరించగలదో ఆమెకింకా అర్థం కాలేదు. ఆ రాత్రంతా ఆమె తన గదిలో దుఃఖ సాగరంలో మునిగితేలుతూనే ఉండిపోయింది.
జూలియస్ సీజర్ రోమ్‌లో కాలుపెట్టే సమయానికి రాజకీయాలు అల్లకల్లోలంగా ఉన్నవి. పేరుకు ప్రభుత్వమంటూ ఉన్నప్పటికీ, దాదాపు అరాజకం తాండవిస్తూ ఉంది. దీనికంతకూ తాను ఇక్కడ లేకుండటమూ, తన పేరుమీదుగా నిరంకుశ పాలన జరగటమూ కారణాలని సీజర్‌కు తెలుసు. అయితే ఇందువల్ల వచ్చిన చెడు పేరును మాత్రం తానే భరించాలి.
ఈ పరిస్థితులకు ముఖ్య కారకుడు మార్క్ ఏంటనీ. అతని అనేక పొరపాట్లు చేశాడు. యువక రక్తం ఉద్రేకాన్ని తప్ప, అనుభవాన్ని ఎరుగదు. ప్రజలకు న్యాయాన్యాయాలు తెలుసు. ప్రభుత్వం చేసిన అన్యాయాలను బహిరంగంగా ఖండించేందుకు భయపడినప్పటికీ, ఎప్పుడో ఒకనాడు తిరుగుబాటు జరుగుతుంది. అప్పుడంతా సర్వనాశనవౌతుంది. నిన్నమొన్నటి గాథ- పాంపే పతనం కన్న వేరు తార్కాణం అక్కర్లేదు.
మార్క్ ఏంటనీ సీజర్‌కు నమ్మినబంటుగా, అధికారమంతా సీజర్ పరంగానే ప్రభుత్వాన్ని నడిపినా, అనేక పొరపాట్లు జరిగినవి. పాంపే తాలూకు ఆస్తిపాస్తుల్ని ప్రభుత్వం లాగేసుకుంది. నిన్న మొన్నటిదాకా అధికారంలో వుండి, ఎంతో పలుకుబడి గల పాంపేయులకు దురన్యాయం జరిగిందనే ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి ప్రమాదకరం. ఇలాంటి పనుల వల్ల ప్రజల్లో అసంతృప్తి జనించింది.
అందుకనే ముందుగా సీజర్, ఏంటనీని తీవ్రంగా ఖండించాడు. తనకు గురుతుల్యుడైన సీజర్‌కు అతను ఎదురుచెప్పలేకపోయాడు! తనను సీజర్ అవమానించాడు. ఐనప్పటికీ, ఇప్పుడు సీజరే రోమ్‌లో ఉన్నాడు కనుక తనేమీ చేయలేకపొయ్యాడు. తలవంచుకొని ప్రభుత్వానికి దూరంగా వుంటున్నాడు.
కాని, సీజర్‌మీద ఏంటనీకి మండిపోతోంది. ఒకపక్క ఇది నిరంకుశ ప్రభుత్వమనీ, ప్రజలను పీడించుకొని తినే సూచనలు ఉన్నవనే ప్రచారం చేస్తూ, ఏంటనీ కొంతవరకు తృప్తిపడుతున్నాడు. ఈ సంగతి తెలిసినా, ఏంటనీ మీద వుండే ఆపేక్షతో సీజర్, చూసీ చూడనట్లు ఊరుకుంటున్నాడు.
జగదేకవీరుడుగా సీజర్‌ను రోమ్ గౌరవించింది. అప్పటికే సీజర్ జీవిత గాథల్ని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇక పాంపేయులు, సీజర్ దాడికి తట్టుకోలేక, స్పెయిన్‌లో తలదాచుకుంటున్నారు. మొత్తంమీద రోమ్‌లో సీజర్‌కు ఎదురులేదు.
సర్వాధికార వర్గంవారు సీజర్‌ను పదేళ్ళవరకూ నియంతగా ఉండమని కోరారు. కాని, ఆయన ఒక్క సంవత్సరమే ఉండగలనని మాటవరసకన్నాడు. అధికార కూటమి వొత్తిడి చేసింది. సీజర్ లొంగినట్లే కనిపించాడు.
శతృశేషం ఉండటం ఎప్పటికైనా ప్రమాదమేనని సీజర్‌కు తెలుసు. అందుకని ముందు స్పెయిన్ వెళ్లి, పాంపేయుల్ని చెల్లాచెదురుచేసి రోమ్‌కు తిరిగి వచ్చాడు.
ఈ పనులవన్నీ పూర్తయి, సుస్థిర ప్రభుత్వాన్ని రోమ్‌లో సుస్థాపితం చేసేందుకు సంవత్సరం పట్టింది.
ఇక్కడ ఈజిప్టులో క్లియోపాత్రా, సీజర్ పిలుపుకోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉన్నది. రోమ్‌లో ఏం జరుగుతుందో తనకు ఎప్పటికప్పుడు తెలియపరిచేందుకు ప్రత్యేకంగా కొంతమంది గూఢచారుల్ని నియమించింది. ఈజిప్షియన్‌లు పూర్వంవలె రోమన్‌లను ఏవగించుకోవటంలేదు. ఎందుకంటే, వారు శాంతిభద్రతలుగల పాలనలో ఉండటమేగాక, రోమ్‌తో చాలా లాభసాటి వ్యాపారాల్ని కొనసాగిస్తున్నారు. మొత్తంమీద క్లియోపాత్రా పాలనలో ఒడిదుడుకులు లేవు.
ఐతే క్లియోపాత్రా వ్యక్తిగత జీవితంలో తీరని లోటు ఏర్పడింది. సీజర్ వైభవాన్నీ, రోమ్ పట్టణ సౌందర్యాన్నీ చూడాలని ఆమె తహతహలాడుతోంది. ముఖ్యంగా తన కన్యాత్వాన్ని సమర్పించిన ప్రియుడు సీజర్‌తో మరికొంతకాలం సుఖించాలని ఆమె వాంఛిస్తోంది. సీజర్ తనను మరిచిపోయి ఉంటాడా అనే సందేహం అప్పుడప్పుడు ఆమెను పీడిస్తూండేది. కాని, తన కుమారుణ్ణి చూసుకొని సీజర్ తన ప్రయాణాన్ని రుూ బిడ్డ రూపాన తన దగ్గర కుదువబెట్టాడు గనుక, మరిచిపోలేదనే నమ్మకంతో మనసు కుదుటబరచుకుంటోంది.
చివరకు ఆమె ఆశించినట్లే సీజర్ ఆహ్వానించచాడు. ఈజిప్టు ఐశ్వర్యవంతమైన దేశం; తాను విలాసాలకు ప్రసిద్ధి చెందిన రాణి. ఈ విషయాలు తేటతెల్లమయ్యే విధంగా ఆమె ప్రయాణ సన్నాహాలు చేసింది. తనతోపాటు కుమారుణ్ణి, భర్తగా వున్న 12 ఏళ్ళ తమ్ముడు చిన్న టాలమీని వెంట తీసుకొని ఉత్సాహంగా బయలుదేరింది.
ఐరాస్ చనిపోయి మూడు నెలలైంది. ఆయా మంచానపడింది. ఆమె అంత్యదశలో వున్నదని క్లియోపాత్రాకు తెలుసు. రోమ్ వెళ్ళేముందు ఆయా అన్నది- ‘‘తల్లీ! నీవు మళ్లీ తిరిగి వచ్చేదాకా నేను బతకను. ఇదే కడసారి నిన్ను చూడటం. నీ సేవలో నా జన్మ సార్థకమైనదని అనుకుంటున్నాను రాణీ! బిడ్డ జాగ్రత్త. ఈవడిలో టాలమీ వంశంలో కల్లా గొప్పవాడు అయే లక్షణాలున్నాయి. వీడు చక్రవర్తి అవుతాడమ్మా’’ అని దీవించింది.
ఒకపక్క క్లియోపాత్రా మనసు భారమైంది. ఐతే తన ప్రాణంలో ప్రాణంగా వున్న సీజర్ దూరమైనందుకు ఆమె పడిన విరహవేదనతో పోల్చి చూస్తే, ఇటు ఇరాస్, అటు ఆయాలతో తనకు కలిగే శాశ్వత వియోగం ఒక లెక్కలోది కాదు.
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు