డైలీ సీరియల్

శివలింగం.. కల్పవృక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనయందు పవ్వళించిన నీలవర్ణుడైన శ్రీమహావిష్ణువు నల్లని ప్రతిబింబం సముద్రజలమంతటా వ్యాపించిందేమో! సూర్యుడికి భయపడిన చీకటి ఎక్కడికి పారిపోలేక సముద్రంలోనే అడగిపోయిందేమో, తనలోనే ఉన్న బడబాగ్ని జ్వాలలు మండటం చేత సముద్రగర్భమంతా మాడిపోయిం దేమో! నేరేడు పండు రంగువంటి ఆకాశనీలిరంగు తన జలంలో ప్రతిబింబిస్తూ ఉందేమో! అన్నట్లుగా నీలిమేఘ ఛాయతో - ఇంద్రనీలమణి కాంతులతో కాటుక - నల్లని అవిసెనపూవు - విబస్తూరి - తుమ్మెదల వంటి నల్లని కాంతితో మహానీలవర్ణమయమై చిదంబరేశ్వరుడికి తూర్పున మనోహరంగా ప్రకాశిస్తూ ఉన్న మహాసముద్రాన్ని వేశ్యాంగనలు చూచారు. అట్టి సముద్రతీరంలో వేశ్యాస్ర్తిలు మరియు కపట జంగమ వేషధారులు చాల దూరం ప్రయాణించిన కారణంగా కలిగిన శారీరకశ్రమను నివారించు కొనేందుకు కొంతసేవు విశ్రాంతి తీసుకొన్నారు. పిమ్మట సకలవర్ణమయ అయిన శివకామ సుందరిని, తన ఫాలనేత్ర హూమాగ్నికి మన్మథుని సమిధగా చేసిన ఋత్విజుడునూ, ఆకాశవేదికపై తాండవనృత్యం చేసే నాట్య మూర్తియైన చిదంబరేశ్వరుణ్ని సేవించుకొన్నారు. తదుపరి వారు మూడవనాడు ఆ చిదంబరం నుండి ఉదయాననే శ్రీకాళహస్తికి ప్రయాణమయ్యారు. త్రోవలోని ఒక అడవిలో వారు ప్రయాణింప సాగారు. ఆ సమయంలో దొంగలు ‘ఇక్కడ నుండి అరస్తే ఇది ఎవరికి వినబడనంత చాల సుదూర ప్రాంతం. ఏమార్చి పారిపోయేందుకు ఇటువైపు నట్టడవి. దగ్గరలో ఊరుగాని పల్లెగాని లేదు. ఈ ప్రదేశంలో జనులెవ్వరూ తిరుగనే తిరుగరు. ఈ వేశ్యల్ని దోచుకోవడానికి మంచి అనుకూలమైన సమయమిదే.’’ అని తలంచి పలుమారులు పలుచోట్ల ప్రయత్నించారు.
ఆ సమయంలో ప్రతిసారి శ్రీకాళహస్తీశ్వరుడు వేశ్యామణిల్ని రక్షించేందుకు రాజు-సేన, శబరరాజు-శబరసైన్యం, వ్యాపారులు- వ్యాపాధికారి, కాపాలికప్రభువు-కాపాలికులు, గొల్లలరాజు-గొల్లవారు, ముని- మునిశిష్యులు, శివుడు- శివభక్తులు, పశురక్షకాధిపతి ఇలా పలుచోట్ల పలురూపాలుగా కనబడుతూ వారి ప్రయత్నానికి విఘ్నం కలిగించాడు.
అయినా దొంగలు తమ ప్రయత్నాన్ని మానలేదు. మార్గమధ్యంలో విడిది చేసిన ఇండ్లలోనే వేశ్యల్ని చంపేందుకు ప్రయత్నించారు. అప్పుడు కూడ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని రక్షించేందుకు జంగమ వేషధారియై ఆత్మవిద్యనుపదేశించే నెపంతో వచ్చి రాత్రికాలమంతా మేల్కొని ఉండేటట్లు చేసి దొంగల ప్రయత్నాన్ని వమ్ము చేసాడు.
అయినా దొంగలు తమ అకృత్యాలను విడువలేదు. మహా దేవుడు (శివుడు) వారి ప్రయ త్నాల్ని సఫలం కానీయలేదు. ఆ రీతిగా శివుడు ఆ వేశ్యాంగనల్ని మందరపర్వత విలాసం గల తిరుకాళశైలం వద్దకు చేర్చాడు. అచట ఆరణీనది ప్రవహిస్తూ ఉంది. ఆ నదిలో వారు స్నానం చేసారు. తదుపరి వాలిచేత పూజలందుకొనబడిన మోక్షలక్ష్మీపతియైన శివలింగాన్ని అర్చించారు. పిమ్మట సిద్ధులకు అష్టసిద్ధుల్ని (అణిమ- మహిమ- గరిమ- లఘిమ- ప్రాప్తి- ప్రాకామ్యము-ఈశత్వము-వశిత్వము) అనుగ్రహించే భైరవమూర్తిని ధ్యానించారు. ఆయన మహిమ యేమిటో తెలిసికోవాలని వారు తలంచి అడుగగా అచటనున్న పురాణాలు తెలిసిన పౌరులిలా చెప్పారు.
వాలి పూజించిన శివుని కథ
పూర్వమిక్కడ తిరుకాళ శైలసమీపంలో ఒక సరోవరముం ది. ఒకప్పుడు కపిరాజైన వాలి ఈ సరోవర తీరంలో పద్మాసనం వేసికొని తన వద్దనున్న సజ్జ లింగాన్ని పూజించి తదుపరి ఉద్వాసన (పూజాస్థానం నుండి తొలగించుట) చేయబోవగా భగవంతుడాస్థలంలోనే ఉండాలనే సంకల్పంచేత కాబోలు అది చేతికి సులభంగా రాలేదు. అప్పుడు వాలి ఒక చేత పట్టి తీయడానికి ప్రయత్నించినా రాకపోవడం చేత మోకాళ్లపై కూర్చుని రెండు చేతులతో పట్టి శివలింగాన్ని లాగగా అది ఎంతకు కదలలేదు. వాలి వెంటనే లేచి తన వాలంతో శివలింగాన్ని గట్టిగా చుట్టి పిక్క బలంతో నేలపై తన్నిపట్టి నిలిచాడు. శరీరాన్ని కొద్దిగా వంచి చేతులతో తొడలతో గట్టిగా నొక్కిపట్టాడు. ముఖం కందగడ్డవలె ఎఱ్ఱగా కాగా శివలింగాన్ని లాగేందుకు ప్రయత్నించాడు. కాని లింగం కదలలేదు సరికదా వాలి పాదాలు నేలలో దిగఖడ్డాయి. అంతేకాదు తోకబిగువు చేత సమస్త దిక్పాలకులచే నమస్కరింపఖడే మహేశ్వరుని శరీరం నొక్కులు పడింది. ఆ దృశ్యాన్ని చూచి వాలి భయపడి సాష్టాంగపడి అనేక నమస్కారాలు చేసి ఇలా అన్నాడు.
‘మహేశ్వరా! నీ యెడల నేనేమి అపరాధం చేసాను. నన్ను నీ మనస్సులో అసహ్యించు కొంటున్నావా? నా భుజబలమంతా ఉపయోగించి ఎంత కదలించిన కదలకున్నావు? భక్తజన కామధేనూ! ఒక పూట కూడ నిన్ను దర్శించక నిలువలేని నన్ను భక్తకృపానిధివయినా నీవు నిష్కారణంగా నన్ను విడిచిపెట్టావు. మహేశ్వరా! నా పాలిట మూలధనానివి. భాగ్యదేవతవు. ధననిధివి. దేవతా రత్నానివి. కల్పవృక్షానివి. ఇహపరసాధన మవు రక్షకుడవు. శుభకారణుడవు. పరమపుణ్యరాశివి. సంపద స్వరూపుడవు. దేవతాకల్పవృక్షానివి. సులభంగా అందుబాటు లో ఉండే తంగేటి జున్నువి. నన్నీవిధంగా నీవు విడనాడటానికి కారణమేమి? నేనేమి యపరాధం చేసాను?’’ వాలి మాటల్ని విని ఈశ్వరుడు దయతో చూస్తూ ‘ఏల దుఃఖిస్తావు? ఈ కొలను చెంత నివసించాలనే కోరికతో ఇచట సుస్థిరుడనై నిలిచాను. నీపై అయిష్టం చేత నిన్ను విడిచిన వాడను కాను. పూర్వం వలె నన్ను భక్తితో సేవించుకో నీ మదిలోనే నేనుంటాను’ అని సజ్జలింగం కృపామూర్తియై ఆనతీయగా వాలి విని పరమేశ్వరుడు అచటకు వెళ్లేందుకు మనసొప్పనివాడై ఇచట నివసించాలనే కోరిక ఈశ్వరునకు తీరని విధంగా ఇచట గల పర్వతాన్ని ఈ సరోవరంలో వేస్తే శివలింగం సులభంగా నాచేతికి వస్తుంది అని తలచి ఈ మహాపర్వతాన్ని తెచ్చి ఈ సరోవరంలో వేసాడు.
అప్పుడు స్వచ్ఛమైన ఆ సరోవరంలోని జలం ఉబ్బి ఈశ్వరుడికి దక్షిణదిశగా ప్రవాహమై పారసాగింది. ఆ విధంగా ఏర్పడిన ఈ తీర్థం (జలం) చాల ఉత్తమమైనది. ఈ జలంలో స్నానమాడిన మానవుడు సంసారదుఃఖమనే దావాగ్ని బాధల నుండి విముక్తుడవుతాడు. విష్ణువు- బ్రహ్మ మున్నగు దేవతా గణాలతో కూడి సదా సంచరిస్తూ ఉంటాడు. అణిమ- మహిమ- గరిమ మొదలగు అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. ఈ కొండ భైరవమూర్తికి నివాసభూమి. సర్వేశ్వరుడు ఈ కొండపై సదా విహరిస్తూ ఉంటాడు.

- ఇంకావుంది...

చరవాణి: 9490620512