డైలీ సీరియల్

వైరాగ్యమే మహాఫలమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలెపురుగు, పాము, ఏనుగు కిరాతులచే ఆశ్రయింపబడిన మహేశ్వరుని వలె సాలెపురుగులు, పాము ల, ఏనుగుల, కిరుతాల సంచారం కలది, ఏవంక చూచినా శంకరాకార స్మరణకు కారణమైన ఎతె్తైన పర్వతశిఖరాలు తాకే ఆకాశమునూ, బ్రహ్మ, విష్ణు,ఇంద్రాది దేవతా నేత్రాలకు గోచరం కానిది, మునిజన మహాభాగ్యమునూ, నిత్య సుఖదాయక మునూ, వేదాలచే ప్రకటింపబడు మహిమాన్వితమునూ, గణింపశక్యంకాని ప్రభావం కలదియునూ అయిన మహాలింగ సముల్లాసాన్ని అనుకరించే దక్షిణ కైలాసం, ప్రత్యక్షంగా కాగా ఆ వేశ్యాంగనలు అత్యంత సంతోషంతో మహాదేవుని (శివుని) సన్నుతించారు. అంతట ప్రసన్నమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి సమీపానికి రాగానే ఆ జంగమాలతో కలిసి వచ్చిన ద్రవిడ జంగమదేవుడు మాయమయ్యాడు.
వేశ్యాకన్యల విచారం
అప్పుడు ఆ మధురానగర వేశ్యభామలు ఆశ్చర్యపడి శ్రీకాళహస్తి మహాదేవుడు జంగమాకృతితో తన సేవకులతో వచ్చి మా కష్టాల్ని తొలగించి తన నగరమైన శ్రీకాళహస్తి సమీపాన చేర్చి మాయమయ్యాడు. ఇక వారు ఆ శివుని తిరిగి ఏ విధంగా దర్శిస్తామో! అని పరిపరివిధాలుగా విచారించారు.
‘ఇంతవరకు కూడ వచ్చిన జంగమప్రభువును మృత్యుం జయుడనే నని అనుకోలేదు. పార్వతీశ్వరుడేనని తెలిసికోలేక పోయాం. దేవదేవుడేనని ఆశ్రయించలేకపోయాం. ఈశ్వరు డేనని పట్టుకోలేకపోయాం. గంగాధరుడేనని కానలేక పోయాం. భర్గుడే (శివుడే)నని భావింపలేకపోయాం. మన్మథాంతకుడని తలంచలేక పోయాం. జగదీశ్వరుడేనని గణింపలేక పోయాం. సాక్షాత్తు శివుడేనని తెలిసికోలేక పోయాం. భవుడేనని (శివుడేనని) మోకరిల్లి నమస్కరింపలేక పోయాం. హరుడేనని తృప్తిగా దర్శింపలేకపోయాం. ఇక ఎప్పుడా దేవదేవుని దర్శనం లభిస్తుంది!! కట్టుకొయ్యకు చేరుకొన్న కామధేనువే తప్పిపోయింది. కంటికి కాన వచ్చిన పెన్నిధే మాయమైపోయింది. చేతిలోనే ఉన్న చింతామణియే చేజారి పడిపోయింది. ఫలించిన తపస్సు నిష్ఫలమైపోయింది. ఎదురుగా వచ్చిన కల్పవృక్షమే వరదపాలయింది. స్వయంగా వచ్చిన అదృష్టదేవతయే తొలగిపోయింది. సిద్ధరసం లభించినా అది వ్యర్థమయ్యింది. పరుసవేది లభించికూడ వృథా అయింది. ఇప్పుడు చింతించి మేమేమి చేయగలం? సంసారారణ్యాన్ని దహింపచేసే దక్షుడు మోక్షలక్ష్మీప్రదుడు అయిన శ్రీకాళహస్తీశ్వరుడు ప్రత్యక్షమై కూడ మాకు తెలియకుండానే వెనువెంటనే మాయమయ్యాడు. పండును ముందుగా చూపి ఆశ పెట్టి శిశువుల్ని దగ్గరకు చేర పిలిచి చివరకు దానిని వారి కీయనట్లు గా, తపసిజనులకు తమ జన్మఫలమైన తన మాహా త్మ్యాన్ని తెలియ రానీయని రీతిగా చెంతచేరిన సర్వేశ్వరుడు వెడలిపోయాడు. అయితేనేమి! శ్రీకాళహస్తీశ్వరుడు తన నిజని వాసమైన దక్షిణకైలాసాన్ని దర్శింపచేసాడు కదా. దురా త్ములైన ఆ దొంగలు అడవి లోనికి పారిపోయారు. వాత్సల్యం మరియు కృపాస్వభావం గల ఆ మహాదేవుడు ఇంతవరకు చేపట్టి రక్షిస్తూ వచ్చి ఇప్పుడు చేపట్టకుండా ఉంటాడా? ఈ శ్రీకాళహస్తి పట్టణాన్ని నిజ నివాసంగా చేసికొన్న ఈశ్వరుని సేవించుకొనే మహాభాగ్యం నేడు మనకు చాలును. ఈ జంగమాకారం సాక్షాత్తు కాళహస్తీశ లింగాకృతియే. ఈ లీల కుమారస్వామితో వెలసిన శ్రీకాళ హస్తీశ్వర స్వామిదే. ఈ నేల సువర్ణముఖీనది స్వరూపం. ఇదియే నీలాచలేంద్ర మహిమ. ఈ దారి దుర్గాదేవి కొండ గాదయే. ఈ మార్గమంతా వేయిలింగాల తీర్థమహిమయే. ఈ ప్రదేశం ఇంద్రుడు తపస్సు చేసిన తపోభూమి. ఈ విధంగా మయూర తీర్థమూ ఘనమైనదియే.
శ్రీకాళహస్తి మహిమ
ఆలోచింపగా ఈ క్షేత్రం మిక్కిలి మోహనక్షేత్రం. ఈ క్షేత్రాన్ని గూర్చి చెప్పినా, విన్నా, కొలిచినా సంకల్పసిద్ధి కలుగుతుంది. సాక్షాత్తు అభవుడే (శివుడే) మన వెంటనంటి ఇక్కడకు వచ్చాడు. ఈ క్షేత్రంలోని శివుని అర్చిస్తే మోక్షం అసంభవమా?
ఈ క్షేత్రంలో ప్రమథులు శివభక్తాకృతిలో ఉన్నారు. శివుడే ఇచట శ్రీకాళహస్తీశ్వర రూపంలో ఉన్నాడు. ఈ విహారాద్రి జ్ఞానమనే పుష్పానికి చిహ్నంగా దక్షిణదిశలో వెలసిన వెండికొండను పోలియుంది. ఇక ఆలోచింపనేల? నేడు మనకు ముక్తిసౌఖ్యం లభిస్తుంది. ఈ కాళహస్తిలోని ప్రజలంతా రుద్రాక్షమాలలచే సుందరంగా అలంకరింపబడిన వారూ, ఓం నమశ్శివాయ అను పంచాక్షరీ మంత్రోచ్చారణతో మేల్కొన్న హృదయం కలవారు, మన్మథాంతకుడైన శివుని పూజా విధియందు మిక్కిలి ఆసక్తి చూపేవారు. వౌనధారులూ, వైరాగ్యమనే మహాభాగ్యాన్ని అనుభవిస్తున్న వారు’ అని తలంచి ఆ వేశ్యాంగనలు పురవీథుల్లో సంచరిస్తూ ఇలా అనుకొన్నారు. ‘సువర్ణముఖీనదిలో స్నానం చేస్తే బహుజన్మల పాపపంకిలమే (బురద) తొలగిపోతుంది. అది ఒక అల్పఫలమా ఏమి? జ్ఞానప్రసూనా దేవిని సేవిస్తే పరమశివ మహాజ్ఞాన సంపదలే లభిస్తాయి. లోకంలో అంతకంటె ఘనమైనవేవి? ఇచటగల దుర్గామాతను కొలిస్తే స్వల్పమను మాట ఏమి? అష్టపాశాలు, (మోహ, భయ, కుల, బల, వైర, సదాచార, దయ, సంశయ పాశాలు), కష్టాలు తొలగిపోతాయి. ఈ దక్షిణకైలాసగిరిని దర్శిస్తే నిరంతర బ్రహ్మానందసౌఖ్యం సులభమే.
- ఇంకావుంది...

చరవాణి: 9490620512