డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--63

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐతే ఈసారి విలాసవస్తువులూ, అందమైన అమ్మాయిలూ, ఖరీదైన మత్తు పదార్థాలూ లేవు. ధ్యానం, దుస్తులు ముఖ్యగా పంపబడిన వస్తువులు. వీటిని చూడగానే ఏంటనీ మొహం విప్పారింది. కాని, అతనికి ఇవి చాలవు. కొంత బంగారం కూడా రానిదే, విసుగెత్తిన సేనలకు వేతనాలను అతను చెల్లించలేదు.
బంగారం కొరకు కబురు పెడదామని అనుకుంటూండగానే బంగారాన్ని తీసుకొని కొన్ని ఓడలు సిరియా జేరినవి. ఏంటనీ ఆశ్చర్యపడ్డాడు. క్లియోపాత్రా ఎంత నిశితంగా ఆలోచించి, మానవ హృదయాన్ని అర్థం చేసుకుని తదనుగుణంగా ప్రవర్తించగలదో అతనికి బాగా అర్థమైంది.
ఈ టాలమీల కోశాగారాలు అక్షయాలు! ఇంకెంత బంగారం ఉన్నదో ఏంటనీ ఊహించలేకపోయాడు. ప్రస్తుతానికి తననీ దుస్థితినుంచి కాపాడిన క్లియోపాత్రాను హృదయపూర్వకంగా అభినందించాడు.
ఏంటనీ ఊహించినట్లుగా రోమ్ నుంచి కూడా చివాట్లేమీ దిగుమతి కాలేదు. ఏంటనీ ఓటమిని విని ఆక్టోవియన్ తృప్తిగా నవ్వుకున్నాడు. పర్షియాను జయించి ఏంటనీ తిరిగివస్తే, ప్రభుత్వంలో అతనిదే పైచెయి అయే అవకాశాలుండేవి, అలా జరగకుండటం ఆక్టోవియన్‌కు వీలైంది.
ఇప్పుడే ఏంటనీని బహిరంగంగా ఖండించేందుకు, అతని పలుకుబడిని తగ్గించేందుకు సదవకాశాలున్నవి. కాని వాటన్నిటినీ మరొక సమయం కోసం ఆక్టోవియన్ దాచి ఉంచాడు. ఎందుకంటే తూర్పు దేశాల పాలన ఏంటనీ పరంగా ఉన్నది. అక్కడ అతని ప్రతిభ తగ్గుతేనే కాని, చెప్పుకింది తేలుగా మారదు. ఆ శుభ సమయం కోసం ఆక్టోవియన్ వేచి ఉన్నాడు.
ప్రస్తుతానికి రోమన్ ప్రభుత్వం తనను ఒత్తిడి చేయనందుకు ఏంటనీ ఆనందించాడు. తెగ తాగి, ఈసారి పర్షియన్ దండయాత్రలో తాను సాధించబోయ్యే ఘనవిజయాన్ని గూర్చి వొళ్లు తెలియకుండా వాగుతున్నాడు. సేనానులు విని, లోలోపల నవ్వుకున్నారు.
పర్షియన్ దండయాత్రకు ఇక రోమ్ నుంచి తనకు వచ్చే సహయమంటూ లేదు. అసలు ఆ ప్రస్తావన ఎత్తుతే తనను వెంటనే రోమన్‌కు రమ్మనే తాఖీదు వస్తుందని, ఇక్కడి సుఖాలను వదులుకోవలసి వస్తుందనీ అతను భయపడ్డాడు.
పోతే తనకు మళ్లీ క్లియోపాత్రాయే శరణ్యం. ఆమె సహాయంతో ఇక్కడేమైనా సాధించకుండా రోమ్ వెళ్ళటం అసంభవం. ఎందుకంటే, రోమ్‌లో తనను - ఈ స్థితిలో చూసినవారు- నేలమీద ఉమ్మివేయక మానటమంటూ జరగదు.
అలెగ్జాండ్రిలో క్లియోపాత్రా పరిపాలనకు తిరుగులేదు ఇప్పటికీ. రోమ్‌లో ఏం జరుగుతుందో ఏ రోజుకారోజు వార్తలు వస్తూనే వున్నవి. సీజర్ పెంపుడు కొడుకు ఆక్టోవియన్ ఏమేమి పథకాలు వేస్తున్నాడో ఆమె తెలుసుకుంటూనే ఉన్నది.
సర్వాధికార వర్గ సభ్యుల్ని లంచాలతో అతను ముంచెత్తుతున్నాడట! సీజర్ ఆక్రమించిన ఆసనంలో కూర్చున్నంత మాత్రాన, తాను కూడా సీజరంత అయానని తృప్తిపడుతున్నాడట! ఎక్కడ ఏం తిరుగుబాటు జరుగుతుందోనని భయపడుతూ బతుకుతున్నాడట! కాస్త తెలివితేటలంటూ ఉంటే ఉండుగాక- కాని కొంత సాహసం, రాజ్యపాలనా కౌశలం ఎక్కడున్నవి? క్లియోపాత్రా దృష్టిలో అతనొక గొప్ప మూర్ఖుడుగా ఉన్నాడు. ఐతే, మూర్ఖునిక్కూడా బలగమంటూ ఉన్నది గనుక, అతనికి భయపడకా తప్పదు మరి!
ఈజిప్టు రాజ్యానికి సంబంధించిన కొత్త దేశ పటాల్లో, మధ్యధరా సముద్ర తీరాన వున్న అనేక చిన్న రాజ్యాలు- క్లియోపాత్రాకు ఏంటనీ పెళ్లి కానుకలుగా సమర్పించినవి జేర్చబడినవి. తమ రాణి ఎన్నడూ కత్తిదూసి ఎరగకపోయినా, రాజ్యాన్ని విస్తరింపజేయటంలో రక్తస్రావం జరగకుండా తెలివిగా, శక్తివంచన లేకుండా సాధించినందుకు ప్రజలు సంతోషించారు. యుద్ధ భయమన్నది వారికి లేదు. వ్యాపారం బాగా సాగుతున్నది. సుఖంగా ఉన్నారు. ఇక క్లియోపాత్రా అధికారానికి ఇంతకన్నా బలం ఏం కావాలి?
ఏంటనీ అటు రోమ్ వెళ్ళేందుకూ, ఇటు అలెగ్జాండ్రియా వెళ్ళేందుకూ మొహం చెల్లక, సిరియాలోనే త్రిశంకు స్వర్గంలో వేళ్ళాడుతున్నాడు. ఈ సమయంలో క్లియోపాత్రా అలెగ్జాండ్రియాకు రమ్మని కబురు పంపింది.
ఇదే సమయంలో ఆక్టోవియన్ ప్రోత్సాహంతో, ఆక్టోవియా నుంచి కూడా పిలుపు వచ్చింది. రోమ్ తిరిగి వచ్చినట్లయితే, తనకు అన్ని గౌరవాలూ లభించగలవనీ, పర్షియన్ ఓటమిని గూర్చి కూడా ఎవరూ ప్రస్తావించి అవమానించరనీ ఆక్టోవియా ప్రాధేయపడింది.
క్లియోపాత్రా తాను కన్న మగశిశువును చూసి పొమ్మనీ, తిరిగి పర్షియన్ దండయాత్ర సాగించేందుకు తాను హృదయపూర్వకంగా సహాయ, సహకార, సానుభూతుల్ని చూపుతాననీ వాగ్దానాలు పంపింది.
అటు రోమ్ వెళ్తే తనకు గౌరవం, కీర్తి, కొంత అధికారం లభిస్తవి. అది తన మాతృదేశం. మాతృభాషలో ఉపన్యాసాలు దంచవచ్చు. తనకక్కడ భార్యాబిడ్డలున్నారు. ఏనాటికైనా తన భావి జీవితమనేది రోమ్‌లో నిర్ణయించబడుతుందే కాని ఇక్కడ కాదు!
రోమ్ వెళ్ళకుండా ఇక్కడే ఉన్నట్లయితే, తనకు భూతల స్వర్గాన్ని చూపగల జాణ, తాను హృదయపూర్వకంగా ప్రేమంచిన పడతి, కామకళా నైపుణ్యమున్న క్లియోపాత్రా తనకు ఈజిప్టురాజ్యానే్న అప్పగించలదు. ఆమె అందచందాలూ, ధనరాశులూ తన మనసును ఆకర్షించి, కట్టివేసినవి. పర్షియన్ దండయాత్రలో తనకు నిజమైన సహాయం ఈజిప్టు నుంచే లభ్యవౌతుంది. అదీగాక కేవలం సంసార తాపత్రయమే తనకు అవసరమనుకుంటే, అలెగ్జాండ్రియాలో మాత్రం తనకు భార్యాబిడ్డలు లేరు కనుకనా?
పోతే తను రోమ్ వెళ్ళటమంటే, తిరిగి తూర్పుకు రాకుండా కట్టుదిట్టాలు జరగవొచ్చు. బతికినన్నాళ్ళూ బతికి, ఒక్క గొప్పపనన్నా చేయకుండా ఇంటి వెనకాల చచ్చినట్లు కాకుండా చూసుకోవాలి. రోమన్ చరిత్రలో తనక్కూడా అగ్రస్థానం అవసరం. అక్కడ స్వదేశస్థుడూ, తనకు బావమరిదీ అయిన ఆక్టోవియన్‌తో పోరాడటంకన్నా ఇక్కడ విదేశీయులైన పర్షియన్‌లతో పోరాడటమే ఎన్నుకోదగిందని ఏంటనీ తేల్చుకున్నాడు.
ఇద్దరు భార్యలూ తనను మనసారా ప్రేమించబట్టే తానిప్పుడు ఎటూ తేల్చుకోలేని అవస్థలో పడ్డాడు. క్లియోపాత్రాకు అబద్ధాలు చెప్పి నమ్మించటం కష్టం. ఆక్టోవియా ఉత్తమ ఇల్లాలు కనుక, భర్త చెప్పిన ప్రతి మాటలోనూ ఆమెకు సత్యం మినహా మరేమీ కనిపించదు.
ఇదంతా ఆలోచించి, పర్షియన్ దండయాత్రకు సహాయార్థం కొంత సైన్యాన్నీ, ధనాన్నీ పంపమని ఆక్టోవియాకు కబురు చేశాడు. తొందరపడి ఆక్టోవియా సిరియాకు పరుగెత్తుకొస్తుందేమోనని భయపడి ‘పర్షియా నైసర్గిక రూపమే భయానకంగా ఉన్నది. పురుషులమైన మేమే ప్రకృతి బాధలకు తట్టుకోలేకపోయాము. నీవు రుూ అవస్తలన్నీ పడలేవు కనుక, ఏథెన్స్‌లోనే మన పిల్లల్ని సాకుతూ ఆస్తిపాస్తులు చూసుకుంటూ ఉండు. అతి త్వరలో పర్షియాను జయించి నేను తిరిగొస్తాను’ అని లేఖ పంపాడు.
పాపం! పిచ్చి ఆక్టోవియా ఇదంతా నమ్మి, తన అధీనంలో వున్న సైన్యాలనూ, ధనాన్నీ పంపడమేగాక, ఆక్టోవియన్ మీద వత్తిడి చేసి, కొంత రోమన్ సైన్యాన్ని కూడా పంపగలిగింది.
ఇలాంటి వత్తిడేదో జరుగుతూన్నదని గ్రహించిన క్లియోపాత్రా కూడా ఏంటనీని ముందు అలెగ్జాండ్రియాకు వచ్చి మాట్లాడిపొమ్మని కబురుచేసింది. ఇక పోతే, క్లియోపాత్రాను మూడోసారి కూడా నానా అవస్థాపడి వశం చేసుకొనే బాధలు తప్పవని, ఏంటనీ అలెగ్జాండ్రియాకు ప్రయాణమయ్యాడు. ఈసారి అతను రాకున్నట్లయితే, తానే స్వయంగా సిరియాకు వెళ్ళాలనుకున్నది క్లియోపాత్రా. అతను వస్తున్నాడని తెలిశాక, తాను విజయాన్ని సాధించానని ఆమె గర్వపడింది.
క్లియోపాత్రా ఓడరేవులోనే ఏంటనీని ఆహ్వానించింది.

- ఇంకా ఉంది

ధనికొండ హనుమంతరావు