డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--66

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏంటనీ గాడు తనకు శత్రువని అతనెప్పుడో తేల్చుకున్నాడు.
అందునా తూర్పుదిశకు దేదీప్యమానంగా సర్వ సౌఖ్యాలతో విరాజిల్లే ఈజిప్టుకు పాలనాధికారిగా కొత్త బిరుదు పొందిన ఏంటనీ ఈజిప్షియన్ రాణికి భర్తగా ఆమె ద్వారా సంతానాన్ని పొందినవాడు తనకు బలవత్తరమైన శత్రువుగానే రూపొందాడు.
అదీగాక ఏంటనీకి సర్వాధికార వర్గంలో అనేకమంది మిత్రులున్నారు. సజీర్ లాంటి మహనీయుణ్ణి హత్య చేసిన వారి మీద యుద్ధాలు చేసి, వారిని నాశనం చేసి సీజర్ ఆత్మకు శాంతి చేకూర్చిన ఏంటనీ మీద తిరుగుబాటు చేయించడమంటే అంత తేలిక కాదనే సత్యాన్ని అక్టోవియన్ గ్రహించాడు. ఐతే. అతని మీద ద్వేషాన్ని రేకెత్తించేందుకు ఒక ప్రక్క ప్రయత్నాలు చేస్తూన్నప్పటికీ తీరా యుద్ధమే చేయటం అంటూ వస్తే తన సైనిక బలం చాలదు. తను సర్వనాశనమయ్యే కయ్యానికి కాలు దువ్వటం, కేవలం వ్ఢ్యౌం. కనుక ఏంటనీ దుష్కార్యాలు త్వరలోనే పరిపక్వవౌతవనీ ఆ సమయానికి తాను అతన్ని హతమార్చేందుకు సిద్ధంగా ఉండాలనీ తేల్చుకున్నాడు. అందుకని సైన్యాన్ని పెంపొందించసాగాడు.
ఇందుక్కూడా కారణాలనేవి ఉండాలి. ప్రస్తుతం ఈజిప్టు ఎంత పెంపొందుతుందో అందరూ గమనించారు. రేపు తూర్పున ఉన్న రోమన్ సామ్రాజ్యాన్నంతటినీ ఈజిప్టు పొట్టన పెట్టుకోవచ్చు. అపుడు తమరాజ్యాన్ని తాము రక్షించుకునేందుకన్నా తగినంత సైనిక బలం అత్యవసరం. ఇదంతాకళ్లకు కనిపిస్తూనే ఉంది. కనుక రోమ్ సైన్యాలను పెంచటం కేవలం సర్వరక్షణార్థమేనని అక్టోవియన్ నమ్మించగలిగాడు. అతనిప్పుడు ఏంటనీని ఎదుర్కోవటం లేదు. ఈజిప్టే అతని ఆగ్రహానికి గురవుతోంది. ఇందువల్ల ఇంటికి నిప్పంటిస్తే ఇంట్లో ఉన్న వ్యక్తుల బైటికి రాక తప్పదనే న్యాయాన్ని అతను అన్వయింపచేస్తున్నాడు.
ఈ విషయాలు ఎప్పటికప్పుడు ఈజిప్టుకు చేరుతూనే ఉన్నవి. క్లియోపాత్రా మండిపడుతోంది. కానీ, ఏంటనీ విని, తనకేమీ పట్టనట్లు మధుపానంతో నిమగ్నుడై పెద్దగా నవ్వి ఊరుకుంటున్నాడు.
పరిస్థితుల్ని వాటి ఇష్టానుసారంగా సాగనిచ్చినట్లయితే వచ్చిపడే ప్రమాదాలేమిటో క్లియోపాత్రా తేలిగ్గా గ్రహించగలుగుతోంది. ఇన్నాళ్లూ అక్టోవియన్ హృదయంలో రహస్యంగా భగభగమంటున్న మంటలు. ఈజిప్టు పట్ల అతనికున్న ద్వేషం, ఇప్పుడు బహిరంగం అవుతోంది. ఇన్నాళ్లూ ఈజిప్టుతో రోమ్‌కు స్నేహభావం ఉండేది. దాన్నిప్పుడు బద్ధవిరోధంగా రూపొందించేందుకు అక్టోవియన్ ప్రయత్నిస్తున్నాడు. న్యాయాన్యాయాలనేవి కేవలం అభిప్రాయ భేదాలుగానే కనిపించేటట్లు చేయవొచ్చు.
ఇక ఈజిప్టు కబళిద్దామనే దురూహ అక్టోవియన్ మనస్సులో మెరుస్తున్న సంగతి క్లియోపాత్రకు ఏనాడో తెలుసు. కానీ, ఏంటనీ తనవాడు కావటంతో అక్టోవియన్ తనతో విరోధానికి సాహించలేకపోయాడు. ఐతే ఎన్నాళ్లిట్ల? ఈ సమస్య ఎప్పటికైనా పరిష్కారం కావలసిందే కదా. అందుకని అక్టోవియన్ కొత్త కొత్త సైన్యాలను సమకూర్చుకుంటున్నాడు. ఈజిప్టు భయం రోమ్‌కు ఉండకుండా అనే కారణంతో తానంటే అక్టోవియన్‌కు భయమనేది స్పష్టమైంది. కానీ అక్టోవియన్ అంతరాంతరాల్లో రోమ్ రక్షణోద్దేశం లేదు. ఈజిప్టు భక్షకోద్దేశమే.
ఇక ఈజిప్టు మీద దండయాత్రే చేయవలసి వస్తే, కారణాలు కోకొల్లలుగా ఉండగలవు. యుద్ధమంటే భయపడి చచ్చే అక్టోవియన్ అంత తొందర్లో కదన రంగానికి దూకకపోయినా, త్వరలోనే యుద్ధమనేది తప్పని పరిస్థితులు రాగలవని క్లియోపాత్రా అర్థం చేసుకొన్నది. కనుక తాను కూడా సర్వ సన్నాహాలు చేసుకోవటం అవసరం. సమయం చూసి ఏంటనీని రెచ్చగొట్టటమూ చేయాలి. అన్నిటికన్నాముఖ్యంగా తన సంతానానికి పట్టం కట్టాలి.
ఒకనాటి రాత్రి ‘స్వామీ మీరు పర్షియన్ దండయాత్రకు వెళ్లే ముందు సీజర్ ఈజిప్టు సింహాసనానికి అప్పగించాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చాను. మిగతా పిల్లల్ని కూడా తలావొక దేశానికి పాలకులుగా చేసేయ్యాలని ఉన్నది’ అన్నది క్లియోపాత్రా ఏంటనీతో.
‘ఔను .. గుర్తొస్తోంది, దానికేమున్నది. చేసేద్దాం’ అన్నాడు అతను
‘అయితే ఇదంతా మీచేతి మీదగానే జరగాలి. ఒక రోమన్ అధికారం మరో పక్క ఈజిప్టు పాలనాధికారం మీ పరంగా ఉన్నవి. కనుక మీరు పూనుకున్నప్పుడు ఈ పట్ట్భాషేక మహోత్సవం జయప్రదంగా సాగుతుంది’ అన్నదామె.
ఏంటనీ ఎంతో గర్వపడ్డాడు. తాను రాజుల్ని నిర్ణయించగల సర్వ సమర్థుడైనందుకు అతనికి ఒళ్లు తెలియలేదు. పకపకా నవ్వేశాడు.
‘తప్పకుండా నేనే అంతా నడుపుతాను రాణీ... నా సంతానాన్ని నేను కాకుంటే మరెవరు చూసుకుంటారు. దానికింత చర్చదేనికి? సన్నాహాలు చేయించు’అన్నాడు.
క్లియో పాత్రా తన పాచిక పారినందుకు ఎంతో ఆనందించింది. ఈ విషయాన్ని గూర్చి మళ్లీ ఏంటనీ ఆలోచించే అవకాశం లేకుండా కేవలం సుఖం మీదనే అతని దృష్టి నిలిచేటట్లుగా చేయగలిగింది.
ఆలస్యం అమృతంవిషం అన్న సామెత గుర్తొచ్చి పట్ట్భాషేక మహోత్సాహానికి గాను ఏర్పాట్లన్నీ క్షణాల మీద జరిగేట్లు చేసిందామె. అలెగ్జాండ్రియాలో ఇంత గొప్పగా మరేది జరగలేదు. జరగబోదనేటంత అట్టహాసంగా జరిగింది. ఈ ఉత్సవం రాజప్రాసాదంలో మంత్రి సామంతుల సమక్షంలో రహస్యంగా జరిపించలేదామె. పెద్ద మైదానం మీ ఈజిప్షియన్ పౌరుల ఎదుటనే అంతా జరిగే ఏర్పాట్లు చేయించింది.
ఈ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చూసి ఈజిష్షియన్లు అదిరిపోయారు. టాలమీ వంశీకులు ప్రజల ఎదుటికి బహిరంగంగా వచ్చేందుకు భయపడేవారు. అలాంటిది ఈజిప్టు చరిత్రలో కని వినీ ఎరుగని రీతిలో ఈ బహిరంగ పట్ట్భాషేకాన్ని చూసేందుకు ఈజిప్టు నలుమూలల నుంచి ఇసుక వేస్తే నేలరానంతమంది వచ్చి పడ్డారు.
రాజభవనం నుంచి ఊరేగింపు బయలుదేరింది. ఆశ్వికదళాధిపతిగా ఈజిప్టు పాలనాధికారిగా ఉన్న ఏంటనీయే దీన్ని ముందుండి నడిపాడు. అతని వెనుక రోమన్ సైన్యాలు ఆ వెనుక రాణి, ఆమె సంతానము, ఆ వెనుక ఈజిప్షియన్ రాజోద్యోగులు, ఆ తరువాత సైన్యాలూ కట్టలు తెంచుకున్న మహా ప్రవాహం వచ్చి సముద్రంలో పడుతున్న విధంగా ఎంతో హుందాగా, గర్వంగా రాజఠీవితో ఈ ఊరేగింపు మైదానాన్ని సమీపించింది. రోమన్‌లు సైతం ఈజిప్షియన్ రాణికి దాసానుదాసులవటాన్ని ప్రజలందరూ కళ్లారా చూశారు. తూర్పు దేశాల మీద సర్వాధికారి ఏంటనీయే స్వయంగా ఊరేగింపును నడిపించారంటే అందరూ ఆశ్చర్యపోయారు. తమ రాణి ఎంత గొప్పదో తెలుసుకున్నారు.
పెద్ద మైదానం మీద ఎత్తుగా కట్టిన రంగస్థలం మీద బంగారు సింహాసనాలు అమర్చబడినవి. సూర్యుని లేత కిరణాలు ఆ సింహాసనాల మీద పడి కళ్లు మిరిమిట్లు గొలిపే కాంతుల్ని వెదజల్లుతూ ఉన్నవి. మధ్య ఉన్న ఆసనం మీద క్లియోపాత్రా కూర్చొని ఉన్నది. ఆమె తల మీద టాలమీ వంశజుల కిరీటం, అతి విలువైన రత్న మాణిక్యాలు పొదగబడి ఉన్నవి. కిరీటం మీద ఉన్న పడగ ఎత్తిన పాముబొమ్మ క్రూరంగానూ ఠీవిగాను కన్పట్టింది.
ఈజిప్టు ఐశ్వర్యాన్ని గూర్చి ఆ దేశీయులు కూడా ఎన్నో కథలు విని ఉన్నారే కానీ ఈనాడు క్లియోపాత్రా శరీరం మీది ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు చూసిన తరువాత వారు విన్న కథల్లో అతిశయోక్తులు లేవని తెలుసుకొన్నారు.
ఆమెకు కుడివైపున సీజర్ టాలమీ 14 ఏళ్లవాడు, సీజర్ వలెనే ఠీవిగా కూర్చున్నాడు. ఎడమవైపు ఏంటనీ సంతతి.. అలెగ్జాండర్, క్లియోపాత్రా ఇంకా పేరుపెట్టని చిన్న టాలమీ ఆశీనులై ఉన్నారు. ఈ వైభవానికి ప్రజలందరూ మూర్ఛపడి నట్లయింది. అది వరకు రాజ కుటుంబీకుల మీద గౌరవం లేనివారు సైతం సాష్టాంగ పడసాగారు.
ఏంటనీ లేచి నిలబడి అధికార పత్రాన్ని అందరికీ వినిపించాడు.
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు