డైలీ సీరియల్

శ్రీకృష్ణ రమ్య రామాయణం ( రెండవ భాగం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేరవలసిన చోటు చేరుకొనెనేమో ?
అనగనొక చోటునను నిలిచిపోయేను
ఎండలో, మంటలో మాడిపోయేను
ఏముంది ? అచ్చోట ఏమియునులేదు
ఓ చెట్టుక్రింద నొక ముసలమ్మ తప్ప !
తల నెరసిపోయింది.
వయసు ఉడిగింది
గాలికే ఆకువలె వణకసాగింది
తనలోనె తానేదొ మాటాడుచుండె
ఎవరికోసమొ గాని ఎడ్చుచూనుండె
కళ్ళలో కన్నీరు !
ముఖము నిండా ఆర్తి !
దోసిళ్ళలో మట్టి ! ఒక శోకమూర్తి !
ఏ జోలపాటయో పాడుకొనసాగె
ఓ రాతిబొమ్మతో మాటాడసాగె
ఓ చిన్నికన్నయ్య ! నా చిట్టి తండ్రీ !
ఆ మన్ను తినుటేల ?
వెన్న తినవయ్యా !
అంటు రాతిని ఆమె వేడుకొనసాగె
రాతిలో కృష్ణున్ని చూచుకొనసాగె
‘‘ఏమిటో ఈ ప్రేమ ? ఎవ్వరీయమ్మ ?’’
అనుచు సఖియలు
సంభ్రమమున తేలేరు
‘‘ఈయమ్మ మాయమ్మ !
మా యశోదమ్మ !
నన్ను పెంచిన తల్లి !
మా యనుగు తల్లి !’’
అనుచు సఖియల
కతడు చేసె పరిచయము
తీర్చివేసె నటుల వారి సందియము
ఆమె పదముల నంటె ఆ రుక్మిణమ్మ
ఆపైన సత్యయును కాళ్ళపైబడెను
అంతటను
అందరును మ్రొక్కులిడినారు
ఆ మాతృమూర్తినీ ఆదరించారు
‘‘వద్దు ! వద్దు ! తల్లి వద్దుచాలింక !
నిండుగా నూరేళ్ళు బ్రతుకిడి కనింక !
అంచు వారల నెల్ల లేపె నా తల్లి
మనసార ఆశీస్సులందించె తల్లి
‘‘ఎవరురా వీరంత ?
ఎవరు కన్నయ్యా ?
ఎందుకని దణ్ణాలు నాకు నిడియేరు ?’’
అంచు అడిగెనంత ఆ యశోదమ్మ
వచనం :
‘‘ఈవిడ నీ పెద్ద కోడలు రుక్మిణమ్మ. ఈవిడ నీ రెండో కోడలు సత్యభామ. ఈమె జాంబవతి. ఈవిడ మిత్రవింద.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087