డైలీ సీరియల్

శ్రీకృష్ణ రమ్య రామాయణం( రెండవ భాగం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అమ్మా ! ... నువ్వలా నమస్కరించొద్దు ! నేను నీ కొడుకుని ! చిన్నవాణ్ణి ! ... తప్పు !’’ అంటూ , ఆమె జోడ్చిన చేతుల్ని పట్టుకున్నాడు పరంధాముడు.
ఆ తల్లీ కొడుకుల పరస్పరానురాగంతో తలమునకలైపోయారు వాళ్ళు.
‘‘ఇంకోమారు ఏమయిందో తెలుసా ?’’
‘‘ఏమయింది ?’’
‘‘మా ఊరు చివర ఓ మడుగుంది. దానినిండా పాములున్నాయి. దాన్ని ‘కాళింది’ మడుగంటారు. ఆ నీళ్ళు విషం ! వాటిని త్రాగిన వాళ్ళు చచ్చేవాళ్ళు. ఆ కుంటలోకి ఈ గుంటడు దూకాడు ఓసారి ! ... ఎంతకూ బయడపడడు ’
‘‘అవునా ?’’
‘‘అవును. అప్పుడు నేనూ, మా ఆయన నందులవారూ, ఆబాల గోపాలం ఆ మడుగు దగ్గరికి పరుగెత్తాం ! ... చుట్టూచేరి, కృష్ణా ! ... కృష్ణా! ... కన్నయ్యా ! అంటూ అరిచాం ! ...పెడబొబ్బలు పెట్టాం !’’
‘‘అప్పుడేం జరిగింది ?’’
‘‘నేనా మడుగులోకి దూకి, చావబోయాను. అందరూ కలిసి, ఆపారు నన్ను. ఆపై ఏమయిందనుకొన్నారు ? ... పేద్ద పాముని పట్టుకొని, పైకి లేచాడు వీడు ! ... దానికి బోల్డు తలలున్నాయి ! ... ఒకచేత్తో మురళి, ఒకచేత్తో దాని తోకా పట్టుకున్నాడు ! దాని తలపై కెక్కి చిందులు వేస్తున్నాడు లయబద్ధంగా, ఏ మాతరం భయం లేకుండా ! ...’’
‘‘అప్పుడేమైంది ?’’
‘‘ఏమవుతుంది ...’’ కొన్ని ఆడపాములూ, పిల్లపాములూ బయట పడ్డాయి. ఆ పెద్ద పాముకి భార్యలూ, పిల్లలూ నంట అవి ! మనకేం తెలుసు ? ... ఒక్కటే ఏడుపు ! ... ఒక్కటే ప్రార్థన! మా భర్తని క్షమించేసి, మమ్మల్ని విడిచిపెట్టండని !’’
‘‘చివరికేమయింది ?’’
‘‘ఇంకేమవుతుంది ? వాటినన్నిటినీ ఆ మడుగు విడిచి, వెళ్ళి పొమ్మనాడు మన కిట్టయ్య. సముద్రంలో ఉండమన్నాడు. అవి అప్పుడా మడుగు విడిచి, బిరబిరా ! సరసరా ! ... వెళ్ళిపోయాయి ! సముద్రంలో దూకాయి మా కళ్ళముందే !’’
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087