డైలీ సీరియల్

శ్రీకృష్ణ రమ్య రామాయణం( రెండవ భాగం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉలుకూ, పలుకూ లేదు.
‘‘మిమ్మల్నందరినీ చూచి, భయపడి ఉంటాడు !’’
‘‘మరెట్టా ?’’
‘‘ఉండండి ! నేనున్నాను కదా ?’’ ... అని నలువైపులా చూచి
‘‘హనుమా ! ... నీ భక్తులంతా వచ్చారు. రా నాయనా !’’ అంటూ పిలిచాడు.
ఐనా సమాధానం లేదు.
కాసేపు యోచించాడు కృష్ణుడు.
‘‘మీరే పిలవండి ! ... వస్తాడేమో చూద్దాం !’’ అన్నాడు.
అందరూ కలిసి, ఒక్కసారిగా
‘‘అనుమా ! ... అనుమా ! ... ఆంజనేయా !’’ అంటూ అరిచారు. ఆ శబ్దం మిన్ను ముట్టింది. పక్షులన్నీ భయపడి ఎగిరిపోయాయి. లేళ్ళూ, కుందేళ్ళూ బెదిరి పారిపోయాయి.
‘‘పశు పక్షులన్నీ భయపడి ఎలా పారిపోతున్నాయో చూడండి ! .. అలా అరిస్తే ఎలా వస్తాడు ? ... మరింత బెదిరిపోతాడు, మీరు మనుష్యులో, రాక్షసులో తెలీక’’.
‘‘అగితే ఎట్టాగ ?’’
‘‘్భక్తితో పిలవాలి !’’
‘‘గదెట్టాగ ?’’
కాసేపు మళ్ళీ యోచించాడు కృష్ణుడు.
‘‘మీరంతా రామభజన చేయండి’’ అన్నాడు.
అంతే, వాళ్ళంతా ‘‘రామ ! రామ ! రామసీత !’’ ... అంటూ రామభజన చేశారు కొంతసేపు.
ఆనందం పట్టలేక, ఆ పిల్లకోతి వాళ్ళ మధ్యలోకి దూకింది.
అంతా భయపడి, దూరంగా తొలిగారు.
మధ్య పిల్లకోతి ! చుట్టూరా యాదవులు !
కొందరు పిల్లలు ‘‘కోతి ! కోతి !’’ అంటూ అరచి, రాళ్ళతో కొట్టారు దాన్ని.
అది పారిపోయి, మళ్ళీ చెట్టెక్కింది.
‘‘ఇలా చేస్తే ఎలా ?’’ గద్దించాడు కృష్ణుడు.
‘‘ఏటి సేయమంటారు సామే ! రాంభజన సేసినా రాలేదు గందా ?’’
‘‘వచ్చినవాణ్ణి రాళ్ళతో కొట్టి, రాలేదంటే ఎలా ?’’
‘‘అది పిల్లకోతి గందా ? ... అనుమంతుడు రాలేదు గందా ?’’ అన్నారు ఆవేదనగా.
‘‘అదే మీరు చేస్తున్న పొరపాటు. ప్రతి పిల్లకోతిలోనూ హనుమను చూడగలగాలి మీరు. ప్రతి మనిషిలోనూ దేవున్ని చూడగలగాలి. అప్పుడు హనుమ మీవెంటే ఉంటాడు. భగవానుడు మీలోనే, మీ హృదయంలోనే కాపురముంటాడు’’ అన్నాడు.
‘‘యింతకీ అనుమాండ్లు ?’’ ...

ఇంకా ఉంది

- గన్ను కృష్ణమూర్తి, 9247227087