డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
అయ్యో! నాన్నగారి భవిష్యవాణి నిజం కాదు కదా!
తరువాత అతడికి తెలిసింది, ఇదంతా రాగింగ్ అని. ఆఫీసర్స్ ట్రైనింగ్‌లో అడుగుపెడుతూనే అతడిని కఠోరంగా.. మగవాడిగా.. తయారుచేసే క్రియ మొదలైంది.
నిన్నటి దిగుడుమెట్లు...
కొండలు, కోనలు, లోయలు, వాసంత సమీరాలతో నిండిన డెహరాడూన్. ఒక నవలోకం అది. మెల్లి మెల్లిగా పొరలు విప్పుకుంటున్నాయి. తన రహస్యాలతో, భావోద్వేగాలతో.. ఆర్మీలో మనిషిని రాళ్ళను సైతం పిండికొట్టే మనిషిగా తయారుచేయడానికి ఎంత గట్టిగా ఫ్రేమ్‌లో బిగిస్తారు. అతడికి నమ్మకం ఎక్కువ కాసాగింది. ఇప్పుడు అతడికి తెలిసింది ఇంత కఠోరమైన ఇంటర్వ్యూ ఎందరు తీసుకుంటారో.. ఆర్మీ ఆఫీసర్ల కేటగిరీకి.. ఒకవేళ తడి మట్టిలో శక్తి ఉంటే ఆర్మీ దానికి రూపం ఇస్తుంది. ఆర్మీ అతడిని ఒక నైపుణ్యం కల కుమ్మరివాడిలా పూర్తిగా ఆర్మీలో ఫిట్ అయ్యేటట్లు తయారుచేస్తుంది. అతడు అతడుగా ఉండడు. అసలు అంతకుముందున్న మనిషి ముందులా ఉండనే ఉండడు. అతడిలో పదహారణాలు మార్పు తీసుకువస్తుంది ఆర్మీ. అంతటా మార్పు వస్తుంది. శరీరం మనస్సు... ఆత్మ.
అతడు శివాజి బటాలియన్ మాక్డీలా కంపెనీలో ఉన్నాడు. ప్రతీ కంపెనీలో 80 మంది దాకా ఆఫీసర్లు ఉంటారు. అతడి స్నేహితుడు గిరిరాజ్ రంజిత్ బటాలియన్ కోహిమా కంపెనీలో ఉన్నాడు. ప్రతీ కంపెనీలో రెండు ప్లేటూన్‌లు ఉంటాయి. ప్రతి ప్లేటూన్‌లో 30, 40, కైడెట్ ఉంటాయి. వీళ్ళపైన ఒక గ్రూపు ఆఫీసర్ ఉంటాడు. అక్కడే ట్రైనింగ్ ఉంటుంది. అక్కడి కెప్టెన్ పేరు- ఎ.కె.సింగ్.
అక్కడే మరో సత్యాన్ని తెలుసుకున్నాడు. ఏ నీళ్ళైనా సరే, చిన్న, పెద్ద నదులు, కాలువలు.. సరస్సులు.. అన్నీ గంగలో కలిసిపోయి గంగగా మారిపోతాయి.
అదేవిధంగా భారతదేశపు విభిన్న రాజ్యాలు- ప్రాంతాలు.. మైదానాలు.. పర్వతాలు.. రాజమార్గాలు.. కాలిబాటలు.. ఎక్కడినుండి వచ్చినా సరే ఆర్మీ గంగలో కలిసిపోయి సైనికుడు అవుతాడు. సిపాయిగానే అతడు గుర్తింపబడతాడు. ఈ ఆర్మీ అతడిని ముందుగా జెంటిల్‌మాన్‌గా తయారుచేస్తుంది. ముందు నువ్వు సైనికుడివి. ఆ తరువాతే మిగతాదేనా.. ఈ ప్రక్రియ కిందే ప్రతీ సైనికుడికి జెంటిల్‌మాన్ కాడర్ నంబరు ఇస్తారు. సందీప్ జెంటిల్‌మాన్ కాడరు నంబరు 108.
ఇది అతడి కొత్త గుర్తింపు. ఇప్పుడు అతడు పేరున కాకుండా జి.సి. నంబరుతో గుర్తింపబడతడు. ఇదే ఆర్మీ మూల మంత్రం. ‘స్వ’ని విసర్జించి ‘సమూహం’లో తనని తను మలుచుకోవడం. ఇక్కడ ‘నా’ ‘నాది’ అన్న ప్రశే్న లేదు. ‘మన అందరం’, ‘మనది’ అన్న భావమే వాళ్ళల్లో రావాలి. ఇక్కడ జీవితపు విలువలు సామూహికమైన జీవిత విలువలు మాత్రమే. వ్యక్తి నుండి టీము, టీము నుండి కంపెనీ, కంపెనీ నుండి బెటాలియన్, బెటాలియన్ నుండి రెజిమెంట్, రజిమెంట్ నుండి దేశం కోసం ఆలోచించడం. కాని అన్నింటికన్నా మాటిమాటికి డ్రెస్ మార్చుకోవాలంటే అతడికి విసుగ్గా అనిపిస్తుంది. తన వ్యక్తిత్వం అంతా కుంచించుకుపోయి డ్రెస్‌లో రెడ్యూస్ అయిందా అని అనిపిస్తుంది. అతడు మనిషి కాదు కేవలం డ్రెస్ మాత్రమేనా అని అనిపిస్తుంది. తన ఇంట్లో వారానికి కూడా ఇక్కడ ఒక్క రోజులో మార్చేటన్ని డ్రెస్‌లు మార్చడు. పి.టి. కోసం తెల్లటి టీ షర్ట్, డ్రిల్ కోసం వేరే డ్రెస్ అయితే ఫరవాలేదు, అర్థం చేసుకోగలడు. కాని ఇన్‌డోర్ క్లాస్‌లో వేరే డ్రెస్, అవుట్ డోర్ క్లాస్‌కి వేరే పులిచారల డ్రెస్- లైట్ గ్రీన్, ఎల్లో లీవ్స్ కలర్ డ్రెస్. అసలు ఒక్కొక్కసారి డ్రెస్ మార్చుకోవడానికి ఐదు నిమిషాలు కూడా సమయం ఇవ్వరు.
ఈ విధంగా డ్రెస్‌లను మార్చివేస్తూ వాళ్ళలో చురుకుతనాన్ని కలిగించి ఉత్సాహాన్ని పెంచుతారా?
మరుభూమిగా ఉన్న అతని మనస్సులో ఈ ప్రశ్న ఒక చిన్న మొక్క అయి మొలిచింది. మళ్లీ ఎన్నోసార్లు ఒక ప్రశ్న తలయెత్తుతునే వుంది. మొక్క మొలవడమా! అసలు తను ఇక్కడికి వచ్చి ఎటువంటి తప్పు చేయలేదు కదా!
ముఖ్యంగా ఈ కఠోర దినచర్య, నియమాలతో బంధింపబడి, ఫోర్స్‌గా చేసే రాగింగ్‌కి భయపడి అతడి ఆత్మఘోష పెడుతోంది. కాదు కాదు.. ఈ జీవితం తనది కానే కాదు. ఈ జీవితం తాచుపాములా తనని మింగేస్తుంది. తన తీయటి అనుభూతులను, ఉవ్వెత్తున ఆకాశాన ఎగిరే తన కలలను.. స్వప్నాలను సుగంధాలను ఈ మిలటరీ జీవితం మట్టుపెడుతుంది. ఇటువంటి సమయంలో తన ఇల్లు ఎంతో గుర్తుకు వస్తుంది. అమ్మ చేతి వంట ఎంత రుచిగా ఉంటుంది.
ఇక్కడ తను ఐదు గంటలకి లేస్తాడు. ఎముకలు కొరికే చలిలో స్నానం చేయాలి. పి.టికి వెళ్లాలి. కనీసం ఒక గంట పి.టి నడుస్తుంది. ఎంతగా శారీరక వ్యాయామం చేస్తాడంటే అంత చలిలో కూడా అతడికి చెమటలు కారుతూ వుంటాయి. చెమటలతో తను మరోసారి స్నానం చేస్తాడు. లోపల అండర్‌వేర్ కూడా తడిసిపోతుంది. లోపల గాయాలవుతాయి. ఓ 20 నిమిషాల బ్రేక్ లభిస్తుంది. ఆ లోపల డ్రెస్ మార్చుకుంటే మళ్లీ నలభై అయిదు నిమిషాలు డ్రిల్.
మొదటినుండి సుఖానికి అలవాటుపడ్డ దేహం ఈ కఠోర దిన చర్య వ్యాయామాలకు ఒక్కసారిగా బాధతో అరుస్తోందా అని అనిపిస్తుంది. ఇక ఇదంతా చేసాక బ్రేక్‌ఫాస్ట్ దొరుకుతుంది. పెరుగు, కాఫీ, టీ, పాలు, గుడ్లు, వెన్న, బ్రెడ్.. ఎంత తినగలిగితే అంత.
ఒక్కొక్కసారి కడుపు నిండా అన్నం కూడా దొరకదు. తినడానికి కూర్చోగానే సీనియర్ వచ్చి బెదిరిస్తాడు. ఐదు నిమిషాల్లో తిను అంటూ. తను అసలు అన్నం తినడు, మింగేస్తాడు.

- ఇంకా ఉంది

టి.సి.వసంత