డైలీ సీరియల్

యమహాపురి - 9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఈపాటికి నీకు అర్థమయుండాలే! నేను రెసిడెన్షియల్ కాలనీలతోనూ, పారిశ్రామికవేత్తలతోనూ- దాదాల పద్ధతిలోనే ఒక డీల్ కుదుర్చుకున్నాను...’’ అన్నాడు.
‘‘వ్వాట్!’’ అన్నాడు శ్రీకర్ ఉలిక్కిపడి.
‘‘నువ్వు సరిగ్గానే విన్నావు. అర్థం కావడానికి- ముందుగా నీకు మన పోస్టల్ డిపార్ట్‌మెంట్ గురించి చెబుతాను’’ అన్నాడు ఈశ్వర్.
ఒకప్పుడు వార్తలు పంచుకుందుకు ఉత్తరాలు మాత్రమే ఆధారం. అప్పట్లో మన పోస్టల్ వ్యవస్థ అద్భుతంగా పనిచేసేది. అడపాతడపా ఆలస్యమైనా- సాధారణంగా ఉత్తరాలు చకచకా అందేవి.
రోజులు మారాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందింది. జనం పెరిగారు. జనం పెరిగినంతగా పోస్టల్ ఉద్యోగులు పెరగలేదు. ఒకప్పుడు వందమంది ఉండే కాలనీలో ఇప్పుడు పదివేలమంది ఉంటున్నారు. పోస్ట్‌మ్యాన్ మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఒక్కడే! ఎక్కువమందికి ఉద్యోగాలిచ్చే స్థితిలో డిపార్టుమెంటు లేదు. ఇచ్చినా చేరడానికి ఆకర్షణీయమైన సర్వీస్ కండిషన్లు లేవు. దాంతో ఉద్యోగుల సామర్థ్యం పడిపోయింది. రోజూ ఇవ్వడానికి బదులు పక్షానికో, నెలకో ఓసారి ఉత్తరాలు బట్వాడా చేస్తున్నాడు పోస్ట్‌మ్యాన్.
ఇప్పుడు జనం వార్తలు పంచుందుకు ఫోన్లు, ఈమెయిల్స్ వాడుతున్నారు. కాగితాల బట్వాడాకి కొరియర్ సర్వీసుంది. కొరియర్లతో పోటీగా పోస్ట్ఫాసుల్లో స్పీడ్ పోస్టు సేవలొచ్చాయి. అందుకు మామూలుకంటే ఎక్కువ మూల్యం చెల్లించాలి. అలా ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంతోపోటీ పడాల్సిన అగత్యం వచ్చిందిప్పుడు.
‘‘మూల్యం పెంచకుండా, సేవలు ఉత్తమంగా ఉంటే- జనం ప్రైవేట్ రంగం కంటే ప్రభుత్వ రంగపు వ్యవస్థలపైనే ఎక్కువ మొగ్గు చూపుతారు’’ అని ‘‘ఇప్పుడు పోలీసుల విషయానికొస్తాను...’’ అన్నాడు ఈశ్వర్.
మన దేశంలో పోలీసు స్టేషన్ల పరిస్థితి అధ్వాన్నంగా వుంది. వాటిని మెరుగుపర్చాలి.
మన దేశంలో పోలీసుల పరిస్థితి కూడా అధ్వాన్నంగా వుంది. ఆ పరిస్థితి మార్చాలి.
అందుకని ఈశ్వర్ జనంలోంచి ఒక నేర పర్యవేక్షక సమితిని ఏర్పాటుచేశాడు. దానికి వివిధ రంగాలనుంచి పదిమంది కార్యనిర్వాహక సభ్యుల్ని ఎన్నుకున్నాడు. సమితికి అవసరమైన నిధుల్ని సమకూర్చడం ఆ సభ్యుల బాధ్యత. కార్యాచరణకు కార్యదర్శిగా తను బాధ్యతలు స్వీకరించాడు.
‘‘అలా ఇప్పుడు ప్రజాధనంతో నువ్విప్పుడు చూస్తున్న స్టేషన్ రూపొందింది’’ అన్నాడు ఈశ్వర్.
అంతవరకూ కుతూహలంగా వింటున్న శ్రీకర్ మొహంలో ఉన్నట్లుండి నిరసన భావం కనిపించింది. ‘‘అంటే ఇవన్నీ పోలీస్ జులుంతో సాధించారన్నమాట! ఇక మనకీ, దాదాలకీ తేడా ఏముంది?’’ అన్నాడు.
‘‘తేడా చాలా ఉంది. మన డ్యూటీ మనం చేస్తే ఈ సమాజానికి మనం కాపలా కుక్కలం. మన డ్యూటీ మనం చెయ్యడం లేదన్న బాధతో, తమ పద్ధతిలో ఆ బాధ్యతను స్వీకరించిన గాడిదలు దాదాలు. మనమేం చేసినా మొరిగినట్లుంటుంది. వాళ్లేం చేసిన ఓండ్ర పెట్టినట్లుంటుంది. అదీ తేడా!’’
‘‘ఐనా సరే! జులుం చూపడం ప్రభుత్వోద్యోగ ధర్మం కాదు’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఓహో, నువ్వు జులుం అన్నావు కదూ! ఇందాకనే ఆ పదాన్ని ఖండించాల్సింది. ముందే చెప్పాను- నేను డీల్ కుదుర్చుకున్నానని! ఆ డీల్ ఫలితమే తప్ప జులం కాదిది’’ అన్నాడు ఈశ్వర్.
‘‘ఏమిటా డీల్?’’ అన్నాడు శ్రీకర్.
‘‘చెబుతాను విను’’ అన్నాడు ఈశ్వర్.
నేర నిరోధక నిధికి చందాలిచ్చి, నేర పర్యవేక్షణ సమితిలో చేరినవారికి- నేరాల నుంచి పూర్తి రక్షణ కల్పించే బాధ్యత ఈశ్వర్‌ది. మధురాపురి పోలీస్ స్టేషన్ ఏరియాలో నేరాలు జరుగకుండా చూసే బాధ్యత - సమితి కార్యదర్శి ఈశ్వర్‌ది. ఒకవేళ నేరం జరిగితే- వారం రోజుల్లోపల నేరస్థుణ్ణి పట్టుకునే బాధ్యత కూడా అతడిదే!
సమితిలో చేరినవారికి అనూహ్యమైన సదుపాయాలున్నాయి. నేరంవల్ల గాయపడినవారికి ఉచిత వైద్యం చేయించాలి. నగలు, సొమ్ములు, ఖరీదైన వస్తువులు వగైరాలు పోగొట్టుకున్నవారికి- దొంగ దొరక్కపోయినా, నిధినుంచైనా డబ్బు తీసి పోగొట్టుకున్నవన్నీ తిరిగి అందజెయ్యాలి.
ఈ విషయమై పోలీసులకూ నెల నెలా కొన్ని ప్రోత్సాహాకాలు ప్రకటించారు. ఏ నెలలో ఆ ఏరియాలో ఒక్క నేరం కూడా జరగదో- ఆ నెలలో పోలీసులకు నెలకింతని నో క్రైమ్ బోనస్ ఇస్తారు. ఒక్క నేరం జరిగినా ఆ బోనస్ ఉండదు. అలాగే నేరస్థుల్ని పట్టుకున్నందుకు కూడా పోలీసులకు ఎఫిషియన్సీ బోనస్ వుంటుంది. ఎంత తొందరగా పట్టుకుంటే అంత ఎక్కువ ఎఫిషియన్సీ బోనస్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎఫిషియన్సీ బోనస్ నో క్రైమ్ బోనస్ కంటే ఎక్కువుండదు. ఏ బోనసైనా ఒక్కరికి కాదు- క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొమ్ము పంచుకున్నట్లు- పైనుంచి క్రిందదాకా మొత్తం స్ట్ఫా పంచుకోవాలి. అందువల్ల స్ట్ఫాలో అందరూ ప్రతి ఒక్కరికీ విజయాన్నీ కాంక్షిస్తారు. ప్రతి ఒక్కరికీ సహకరిస్తారు, కృషి చేస్తారు, సంతోషిస్తారు.
‘‘ఇలాంటి స్కీమొకటి సాధ్యమని ముందెవరూ అనుకోలేదు. కానీ- రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్లు- పోలీసు తలచుకుంటే నేరాల్ని ఆపడం సాధ్యమేనని లోకజ్ఞానం చెబుతుంది. అందుకే ఈ బాధ్యతలు తీసుకున్నా. నెల్లాళ్ళలో నన్ను నేను నిరూపించుకున్నా. ఆర్నెల్లలో ఈ ఏరియాలో దొంగతనాల్ని పూర్తిగా అరికట్టా. తర్వాత నుంచి జనం తమంత తామే వచ్చి పోటీ పడి సమితిలో చేరుతున్నారు’’ అన్నాడు ఈశ్వర్.
వారి వారి అవసరాలు, స్థాయిని బట్టి నెలసరి చందా పది నుంచి వంద రూపాయలదాకా నిర్ణయించారు. నేరాలు జరక్కుండా హామీ ఇచ్చేది పోలీసులు. చందా కేవలం పది రూపాయలు. దీంతో మధ్య తరగతి వర్గమే కాదు, శ్రామిక వర్గమూ సమితిలో చేరడానికి ఆసక్తి చూపారు. సమితి ఏర్పడ్డ మొదటి నెలే లక్షమంది సమితిలో చేరారు.

ఇంకా ఉంది

వసుంధర