డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతడి స్నేహితుడు మళ్లీ చెంప ఛెళ్ళు మనిపిస్తూ అన్నాడు- ‘ఇప్పుడు నీవు భాగ్యవంతుడివి అయ్యావు. ఇక పో.. పరుగుతీయి..’
నేను భయపడుతూ పరుగు తీసాను. తరువాత నాకు తెలిసింది. డెట్టాల్, కత్తెర, పట్టీలు, అంతా నాటకం. నన్ను భయపెట్టడానికి ఇదంతా..
ఆలోచించరా! వాళ్ళల్లో ఎంత క్రూరత్వం ఉందో.. చంగిస్‌ఖాన్ ఎతె్తైన కొండల పైనుండి ఏనుగులను పడదోసేవాడు. అవి ఆర్తనాదం చేస్తుంటే వింటూ ఆనందించేవాడని నేను చదివాను. ప్రతీ యుగంలో సాడిస్ట్ ప్రవృత్తికల చంగీస్‌ఖాన్‌లు ఉంటూనే ఉంటారు. తమకి తిండి, గూడు, బట్ట ఇచన నేల తల్లికే ద్రోహం చేస్తారు వీళ్ళు.
ఎన్నోసార్లు నేను ఆలోచిస్తూ ఉంటాను. అసలు ఇంత క్రూరత్వం ఎక్కడినుండి వస్తుంది. క్రూరత్వం నుండి క్రూరత్వం పుడుతుందా? ఒకసారి నేను రాగింగ్‌కి గురి అయినపుడు ఏడిపించాను. ‘ఆరు నెలల క్రితం మీరు నాలాగా ఫ్రెషర్‌వే కదా! మర్చిపోయావా’ అని అడిగాను. నేను అడిగినదానికి అతడు ఏం సమాదానం చెప్పాడో తెలుసా? ‘పెద్ద చెప్పొచ్చావ్ లే. ఆరు నెలల తరువాత ఫ్రెషర్స్‌ని ఇట్లాగే రాగింగ్ చేస్తావు. ఇంతకన్నా క్రూరంగా’. అంటే ఈ క్రూరత్వం అనే ఆట ఇట్లానడుస్తూనే వుంటుందా? ఈ లోకం పోకడ కూడా ఇట్లాగే ఉంటుందా? ఒక్కొక్కసారి ‘అసలు ఈ బోర్ కొట్టే దైనందిన జీవితంలో కొంచెం థ్రిల్, కొంచెం మజా ఉండాలి. నేనా ఈ రాగింగ్‌ని బ్రిటీష్ వాళ్లు ప్రవేశపెట్టింది? అనుకుంటా ఉంటాను. కాని అభం శుభం ఎరుగని పద్ధెనిమిది సం.ల వయస్సు. తెలియని లోకం.. అందులోనూ ఈ రాగింగ్. ఈ ప్రపంచం బాగుంది అని అనుకుంటామో లేదో ఒక్క నిమిషంలో అంతా తల్లకిందులవుతుంది. ఛీ ఈ ప్రపంచం ఇంత క్రూరమైనదా? అని మనం అనక తప్పదు. అంతా ఒక్క క్షణంలో అకస్మాత్తుగా జరిగిపోతుంది. మా లయతాళాలు తప్పిపోతాయి. మనలో పాతుకుపోయిన నమ్మకం అనే వేళ్ళకి అపనమ్మకం అనే ఎరువు ఇక్కడే పడుతుంది. జన్మంతా ఇక నెగెటివ్ ఫీలింగ్స్ చోటుచేసుకుంటాయి.
సందీప్! నీకు ఈ జ్ఞానాన్ని ఇస్తూ ఒక సంఘటన గురించి రాయడం మరచిపోయాను. మా కాంపస్‌లో జరిగిన ఎప్పటికీ మరచిపోలేని రాగింగ్. నా రూమ్ మేట్! ద్వైపాయన్ అమ్మా నాన్నలు అతడిని దింపడానికి వచ్చారు. వాళ్ళ అమ్మగారు ఇక్కడ జరిగే క్రూరత్వమైన రాగింగ్ గురించి విన్నది. ఇక్కడ ఉన్నప్పుడే సీనియర్లు అందరు తన కొడుకుని చుట్టుముట్టడం ఆవిడ చూసింది. ‘‘బాబూ! చూడండి ద్వైపాయన్ మీ చిన్నతమ్ముడులాంటివాడు. కాస్త వాడిని కనిపెట్టి ఉండండి’ అని ఆవిడ అన్నది. ‘ఆంటీ! మీరేమీ వర్రీకాకండి. మేం అతడిని అన్ని విధాలా కనిపెట్టే ఉంటాము. మీరు నిశ్చితంగా ఉండండి’’-
సీనియర్లు ఇచ్చిన హామీ ఎంతో సంతోషాన్ని కలిగించింది. నిశ్చితంగా ఆవిడ ఇంటికి బయలుదేరింది. తల్లిదండ్రులు వెళ్లిపోగానే సీనియర్లు ద్వైపాయన్‌ని బలవంతంగా పక్కమీద పడుకోపెట్టారు. వాడికి చిన్నపిల్లలకి తొడిగినట్లు టోపీ, సాక్స్ వేసి దుప్పటి కప్పి పడుకోపెట్టారు. దాదాపు మూడు రోజులు పక్కపై నుండి లేవనీయలేదు. సీసాతో పాలు, నీళ్ళు, టీ పెట్టేవాళ్ళు- ‘‘మీ అమ్మ చెప్పి వెళ్లింది. నిన్ను కనిపెట్టి ఉండమని’’- వాళ్ళు హేళన చేస్తూ అన్నారు.
ఒరేయ్ హీరో! నీవు ఆర్మీలో ఉన్నావని, నువ్వే కఠోర జీవితం గడుపుతున్నానని, ముళ్ళకంచెల మధ్య జీవిస్తున్నావనీ అనుకోకు. నీవు మిలటరీలో ఉన్నావనీ నేను సివిలియన్‌ని నాకు ఏ కష్టాలు లేవు అని ఎంత మాత్రం అనుకోనురా! అసలు నాకేం అనిపిస్తుందంటే ప్రతిచోటా ఛాలెంజ్‌లు ఉన్నాయి. సంఘర్షణ చేయాలి. పూర్తిగా సుఖశాంతులు ఎక్కడా లేవు. జీవితం ఉన్నంతకాలం అలలు లేస్తూనే ఉంటాయి. అసలు జీవితం అంటేనే ఓ యుద్ధం. ప్రతీ అడుగు ఒక యుద్ధమే.
నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? మాకు రెండో సెమిస్టర్ తరువాతే సెలవులు దొరుకుతాయి. ప్రాణాలు తీసే రాగింగ్‌కి గురి అయిన తరువాత అసలు అందరితో నేను కలవాలా వద్దా, దూరంగా ఉండాలా అని ఆలోచించాల్సి వస్తోంది. నేను డేల్ కార్ నేగీ రాసిన నెపోలియన్ హత్య చదువుతున్నాను. జీవితాన్ని ఇంకా లోతుగా పరిశీలించాలన్న ఉద్దేశ్యంతో చదువుతున్నాను. నీకు ఈ పుస్తకం కావాలా?
-నీ అభిషేక్
అభిషేక్ ఉత్తరం సందీప్ గాయపడ్డ మనస్సుకు కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. ఒక మందులా పనిచేసింది. అతడిలో మళ్లీ ఉత్సాహం వచ్చింది. తను తన ఇష్టప్రకారం ఈ జీవితాన్ని వరించాడని తన లక్ష్యం చాలా బృహత్తరమైనది అని అతడు మరొకసారి తన మనస్సుకు చెప్పుకున్నాడు. జీవితంలో ఎత్తుపల్లాలు, ఆటుపోట్లు తప్పవు. కనుక తను ధైర్యంగా ముందంజ వేయాలని నిర్ణయించుకున్నాడు.
సందీప్ తన కొత్త డ్రెస్‌ని ధరించాడు. ఒక మహాత్ముడైన సైనికుడి ఆత్మ తనలో ప్రవేశించిందని అతడికి అనిపించింది. మిలటరీ కటింగ్ చేయించుకున్నాడు. ఐడెంటిటీ కార్డు తయారైంది. మొట్టమొదట డ్రెస్ వేసుకోగానే ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాడు. దేశభక్తి భావం లోపల ఉరకలు వేసింది. ఆ భావం ఉప్పొంగి అతడికి ఆహ్లాదాన్ని ఇచ్చింది. అతడు ఈ దేశానికి సైనికుడు. భారతీయ సైనికుడు. చిన్నప్పుడు విన్న పాట మనస్సులో ప్రతిధ్వనించింది. ‘నన్హా మున్నా రాహీ హుత్‌దేష్‌కా.. సిపాయి హమ్’ మనస్సు దేశభక్తితో నిండిపోయింది. నిజానికి ఈ ప్రతిధ్వని అతడిలో ఒక సంపూర్ణత్వాన్ని కలిగించింది కాని ఇంతలోనే మనస్సులో ఏదో తెలియని ఆవేదన. మళ్లీ ఆర్మీ కఠోర జీవితం అతడి కళ్ళ ఎదురుగా కదలాడసాగింది.
ఇక్కడి కఠోరత్వం అతడిలోని కోమల భావాలని, సుకుమారత్వాన్ని, సౌందర్యాన్ని అణగతొక్కేస్తోంది.

- ఇంకా ఉంది

టి.సి.వసంత