డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
సందీప్ నవ్వాడు. నీవు కాశ్మీరంలో ఉన్నావు. కశ్యప ముని పేరు మీద ఏర్పడ్డ ఈ కాశ్మీర్ అర్థం కర్మిషా అని నాకనిపిస్తుంది. అప్పుడేనా! నీవు చూడాల్సింది ఇంకా ఎంతో వుంది. నాకు కూడా మొట్టమొదటిసారి వచ్చినపుడు హిందుస్తానీగా, అవుట్ సైడర్‌గా వేరే వేరే ఎక్స్‌పీరియన్స్‌లు అయ్యాయి.
‘‘అవుట్‌సైడర్? అంటే అర్థం?’’ అపనమ్మకంగా సిద్ధార్థ సందీప్ వైపు చూశాడు.
‘‘ముందు మన క్వార్టర్‌లోకి వెళ్దాం పద. నీకు కూడా ఆకలి వేస్తూ ఉండవచ్చు. ఉల్లిపాయ పకోడీలు చేయిస్తా. టీ పెట్టిస్తా.. పద. సరేకాని ఇంట్లో అందరూ కులాసానేనా? అమ్మ ఆరోగ్యం ఎట్లా ఉంది?’’
అఖ్‌రోట్, ఏపిల్ చెట్ల కింద ఉంది ఆ క్వార్టర్. మొట్టమొదటి చూపులోనే సిద్ధార్థకి ఎంతో అందంగా కనిపించింది. బ్యాక్‌గ్రౌండ్‌లో అంతా హిమాలయాలే. ముగ్ధుడై అతడు చూస్తున్నాడు. కాశ్మీరు అందాలు, సరస్సులు, లోయలు, పూల పళ్ళ చెట్లు అన్నింటిని చూస్తూ ఎంతో పరవశించిపోతున్నాడు. కాని అతడి మనస్సులో సందీప్ అజగర్‌గా ఎట్లా మారాడు అన్న ప్రశ్న మాటిమాటికి లేస్తూనే ఉంది. అసలు ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనుకున్నాడు.
‘అన్నయ్య! ముందు ఈ విషయం చెప్పు. ఆ చెర్రీలు అమ్మేవాడు నిన్ను అజహర్ అని ఎందుకు పిలిచాడు. నేను ఏమీ మాట్లాడలేదు. లేకపోతే ఇతడు సందీప్, అజహర్ కాదు అని ఉండేవాడిని.
సందీప్ అతడికి జవాబు చెప్పడం ఇష్టం లేక మాట మార్చేసాడు. ‘‘మన పని మనం సులభంగా చేసుకోవడానికి అంతకన్నా ఏముంది? ఒరేయ్ సిద్ధార్థా! ఇది కాశ్మీర్‌రా! ఇక్కడ అడుగుపెట్టగానే జనాలలో అలజడి మొదలవుతుంది. ఒకరి మనస్సులో నెహ్రూ మేల్కొంటే మరొకరి మన్సులో షేక్ అబ్దుల్లా, మరొకరి మనస్సులో మహరాజా హరిసింగ్, ఇంకొకరి మనసులో శ్యామాప్రసాద్ ముఖర్జీ- పెద్దవాళ్ళు చేసిన తప్పులకి కాశ్మీర్ బలి అయిపోయింది. పెద్దవాళ్ళు చేసిన తప్పులకి చిన్నవాళ్ళ ఖర్మ కాలింది’.
‘నువ్వు అసలు విషయం చెప్పదలచుకోకపోతే చెప్పకు. నేను తక్కిన సైనికులను, తక్కిన స్నేహితులను అడిగి తెలుసుకుంటాను. తెలుసుకోకుండా ఇక్కడ నుండి చస్తే వెళ్ళను’.
‘సరే..’ సందీప్ సిద్ధార్థ ముఖంలోని భయం, అనుమానం, జిజ్ఞాస, కోపం మొదలైన భావాలని పసికట్టాడు. ఇక్కడ రక్షణని దృష్టిలో పెట్టుకొని కొన్ని పనులు చేయాలి, తప్పదు. తూచి తూచి మాట్లాడాలి. తప్పదు. పళ్ళవాళ్ళు, కూరలవాళ్ళు, కిరాణ దుకాణం వాళ్ళు, కుంకుమ పువ్వు, చెర్రీలను అమ్మేవాళ్ళు, తివాచీలు అమ్మేవాళ్ళు మొదలైన వారందరూ నన్ను ముస్లిం- మహమ్మద్ అజహర్ అనే అనుకుంటారు. నన్ను హిందూ అని అనుకోరు. మాకు ఊళ్ళల్లో ప్రతిదీ తెలిసి ఉండాలి. ఎవరు వచ్చారు? ఎవరు వెళ్ళారు? ఎవరు ఎవరితో కలుస్తున్నారు. ఏ ఇంట్లో ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారు? మిలిటెంట్లతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి. ఎవరి ఇంట్లో ఎంతమంది ఉన్నారు? వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, ఎవరి ఇంట్లోకి ధనం చేరుతోంది. కొత్తగా పిల్లలు కాని పెద్దవాళ్ళు కాని ఎవరెవరు వస్తున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే సముద్రంలో చేపలు కలిసిపోయినట్లుగా కలిసిపోవాలి. ఇక్కడ హిందువుల వ్యతిరేక వాతావరణం ఉన్నప్పుడు హిందువులుగా కనబడకపోవడమే మంచిది’.
సిద్ధార్థకి సందీప్‌లో చాలా మార్పు కనిపించింది. గడ్డం కూడా పెంచాడు. మాటా మంతీ చాలావరకు మారిపోయాయి. ఇదివరకు మాటిమాటికి ఇంగ్లీషు శబ్దాలు వాడే సందీప్ ఇప్పుడు ఎంతసేపు మాష అల్లా, ఇంషా అల్లా, శుభాన్ అల్లా అని అంటున్నాడు.
‘‘మరి నీవు కాశ్మీర్‌లో పరిస్థితులు బాగుపడ్డాయి అని అన్నావు కదా’’ దీర్ఘశ్వాస తీసుకుంటూ అన్నాడు సిద్ధార్థ.
సందీప్ ఆవులిస్తూ అన్నాడు- ‘నో డౌట్- ఇదివరకటికన్న పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి. 1992-93లో శ్రీనగర్ ఒక మృతనగరంలా ఉండేది. ఆ సమయంలో ఉగ్రవాదుల దాడులు అనేకం జరిగాయి. ఒక శ్మశానంగా మారింది కాశ్మీర్. ప్రతిరోజు దాడులు, రక్తపాతాలు.. గుళ్ళ వర్షలు.. ముఠాకక్షలు.. సాయంత్రం అయ్యేసరికి శ్రీనగర్ భూతల నగరంగా మారిపోయేది. ఎక్కడ చూసినా కల్లోల వాతావరణం. రెస్టారెంట్లు బంద్- సినిమా థియేటర్లు బంద్. భయంవలన ఎవరు ఇంటి బయట కాలుపెట్టేవారు కాదు. ఉగ్రవాదులు ఫత్‌వా జారీ చేసేవారు. బుర్ఖా లేకపోతే యాసిడ్. అప్పుడు ప్రతి మిలిటెంట్ ఒక హీరోనే.. భగత్‌సింగే! ఆ రోజుల్లో ప్రతి మస్‌జిద్ నుండి గుళ్ల వర్షం కురిసేది. బాహాటంగా నినాదాలు చేసేవారు. అల్లాహోఅక్బర్. హిందుస్తానీ కుక్కల్లారా వెనక్కి వెళ్లిపోండి.. కాశ్మీర్ నుండి రావల్‌పిండికి. శ్రీనగర్ అట్టుడికి పోయినట్లు ఉడికిపోయింది. ప్రతి నుక్కడ్ దగ్గర మిలిటెంట్లు. ప్రతి బుర్రలోను అసహ్యత కరుడు కట్టుకుపోయింది. ఆ రోజుల్లో ప్రతి కూడలిదగ్గర, ప్రతీ గల్లీలో ముజాహిదీన్ తిష్టవేసి కూర్చున్నారు. ఎప్పుడు ఆర్మీ వెళ్లిపోతుందా, ఎప్పుడు ఫైరింగ్ చేద్దామా అని ఎదురుచూస్తూ ఉండేవాళ్ళు. రోజులో నాలుగైదుసార్లు గుళ్ళ వర్షం కురిసేది. అప్పుడు బాహాటంగా అరిచేవాళ్ళు. కాశ్మీర్‌లో హిందుస్తానీ కరెన్సీతోపాటు పాకిస్తాన్ కరెన్సీ కూడా నడవాలి. ఇప్పుడు ఎవడిలోనైనా ఇట్లా అనే ధైర్యం ఉందా! ఆ రోజుల్లో అసలు టూరిస్టులే వచ్చేవాళ్ళు కాదు. ప్రతిచోటా పాకిస్తానీ జెండాలు ఎగరవేసేవారు. ప్రతి గోడమీద ‘లా ఇలాహ్ ఇల్ లల్లాహ్’ అని రాసి ఉండేది.
వాళ్ళలో దృష్టిలో స్వంత్రానికి అర్థం ‘లా ఇలాహ్ ఇల్ లల్లాహ్’. ఇప్పుడు చూడు శ్రీనగర్ ఎంత కళకళలాడుతోందో. టూరిస్టుల సంఖ్య బాగా పెరిగింది.

- ఇంకా ఉంది

టి.సి.వసంత