డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

ఎన్నో హోటళ్ళు, భోజనాలయాలు తెరువబడ్డాయి. వైష్ణవ భోజనాలయ్‌ని కూడా తెరిచారు. బీర్ బార్‌లు కూడా తెరిచారు. ఇక ఆ అల్లర్లు, ఆ గోలలు ఇక చస్తే జరగవు’.
‘అసలు అట్లాంటి సమయం ఎందుకు వచ్చింది?’
‘నీకు కాశ్మీర్ చరిత్ర తెలియదా?’
‘అంతో ఇంతో తెలుసు కాని పూర్తిగా తెలియదు’.
సందీప్ ఆలోచనలో పడిపోయాడు. ఎక్కడినుండి మొదలుపెట్టాలి? పొరలు పొరలుగా ఉన్న ఈ కాశ్మీర్ సమస్యను తను మాత్రం పూర్తిగా తెలుసుకోగలిగాడా?’ నిజానికి సరియైన సమయంలో సరిగ్గా అన్నివిషయాలలో మెలకువగా ఉండి ఉంటే బహుశ అట్లా జరిగి ఉండేదే కాదు.
సందీప్ ముఖం ఉదాసీనంగా మారింది. నెమ్మది నెమ్మదిగా అతడు చెప్పడం మొదలుపెట్టాడు. నృత్యాలతో, పాటలతో, గజళ్ళతో మారుమ్రోగే ఈ కాశ్మీర్ 87, 88 వరకు అందమైన కాశ్మీర్‌లాగానే ఉండేది. ఝలమ్ నది ఝలమ్ నదిలాగానే అందంగా ఉండేది. మనుష్యుల రక్తంతో ఎర్రబడలేదు. అడుగడుగునా బుల్లెట్ ప్రూఫ్‌లు వేసుకున్న ఆర్మీ వాళ్ళు లేరు. ఆ రోజుల్లో ఎంతో స్వచ్ఛమైన గాలి వీచేది. ఆ రోజుల్లో జెకెఎల్‌ఎఫ్‌కి చెందిన ఉగ్రవాదులు గృహ మంత్రి మహమ్మద్ సయ్యద్ కూతురు డా.రుబైయాని అపహరణ చేశారు. రుబైయా కావాలంటే ఐదుగురు ఉగ్రవాదులను విడుదల చేయాలని కండిషన్ పెట్టారు. సెప్టెంబర్ 13, 1989న ఈ సంఘటన జరిగింది. ఇక అప్పటినుండే ఈ రక్తపాతం మొదలయింది. ఉగ్రవాదులు పెద్ద పెద్ద వాళ్ళని అపహరించడం మొదలుపెట్టారు. పీడితుల ఆర్తనాదాలు.. రుబైయా అపహరణని సూఫీ మనస్తత్వం వున్న ప్రజలందరు నిందించారు. ఒక యువతిని ఈ విధంగా అపహరించడం తగదన్నారు. ఈ ఉగ్రవాదుల ఉక్కు చేతుల్లోంచి ఆమెను రక్షించే ఉపాయం కూడా వాళ్లకి కనిపించలేదు. భారత ప్రభుత్వం ఏ మాత్రం ధైర్యం చూపించలేదు. సురక్షా సలహాదారులు, ఇండియన్ ఆర్మీ, స్థానికులైన పోలీసులు భారత ప్రభుత్వాన్ని ఎంత మాత్రం తలవంచవద్దని చెప్పారు. ఒకసారి తలవంచితే ఉగ్రవాదులకు భవిష్యత్తులో ఎంతోమంది గొంతులను కోసే అవకాశం మనం ఇచ్చినట్లవుతుంది. కాని తమ్ముడూ! అసలు అప్పుడు కాశ్మీర్ గురించి కాని సైనికుల గురించి కాని ఎవరైనా ఆలోచిస్తే కదా! గృహ మంత్రికి కేవలం తన కూతురు గురించిన చింతే తప్ప మరి దేని గురించి ఆయన ఆలోచించలేదు. రక్షణ దళం, ఆర్మీ, పోలీసులు చెప్పిందంతా ఎంతమాత్రం ఎవరు లెక్క చేయలేదు. ఉగ్రవాదులదే పైచేయి అయింది. నా కూతురిని వదిలేయండి, రక్తం పీల్చే రాక్షస ఉగ్రవాదులు మీ అయిదుగురినీ వదిలేస్తాం అన్నది మన ప్రభుత్వం.
ప్రభుత్వం తల వంచింది. అంతే కాశ్మీర్ స్థితిగతులు మారిపోయాయి. ఇక ఉగ్రవాదులకు ఇంకా పొగరెక్కింది. వాళ్ళ మనోబలం ఆకాశం అంత అయింది. వార్త అడవిలోని నిప్పులా వ్యాపించింది. సర్కస్ ఫీట్లు చేయడం, బెదిరింపులు.. ఐదుగురు ఉగ్రవాదుల విడుదల.. శాంతియుతమైన సముద్రంలో సుడిగుండాలు మొదలయ్యాయి. అక్కడి గోడల నిండా ‘స్వతంత్ర కాశ్మీర్’ అని రాశారు. గోడలమీద ఖురాన్‌లోని ఆయతేలు రాసారు. ‘జిహాద్’లో అందరు కలవండి అని బాహాటంగా అపీలు చేయడం మొదలుపెట్టారు ఉగ్రవాదులు. అడుగడుగునా ఆకుపచ్చ జెండాలు ఎగరేశారు. ప్రతిరోజు వందల వందల ముజాహిద్దీనులు పుట్టుకొచ్చారు. స్వతంత్రం అంటే భుజాలమీద పావురం అని చెయ్యి చాపితే చాలు అన్న ఊహలో వాళ్ళున్నారు. కాశ్మీరీ డోగ్‌రీలను, పండితులను, ఏరి ఏరి క్రూరత్వంగా చంపేయడం మొదలుపెట్టారు. వేల వేల మంది రోడ్ల మీద పడ్డారు. ఇక ఎక్కడ చూసినా.. రక్తపాతం.. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకు ద్వేషం. మతం మరో రంగు దాల్చింది. మత పిచ్చి పెరిగిపోయింది. వాలీ అంతా గుళ్ళ వర్షం. పేలుళ్లతో మారుమ్రోగిపోయింది. ఇక అక్కడ మరెటువంటి పనులు లేకుండా పోయాయి. ప్రతిరోజూ అమాయకులైన ప్రజల చావులు.. ఇక ఢిల్లీ ప్రభుత్వంపై ఎవరికి నమ్మకం లేకుండా పోయింది. దీనివలన ఉగ్రవాదుల గతి విధులకు, స్వతంత్ర కాశ్మీరు నినాదాలకు బలం చేకూరింది. ఆ రోజుల్లో ఇండియన్ ఆర్మీలో ఎంతోమంది చనిపోయారు. ఇక ఉగ్రవాదం ఉక్కుపాదం అయింది. రేపు నీకు ఈ అమరజీవుల స్మారకాలని చూపిస్తాను’’- చెబుతూ చెబుతూ భావుకుడైపోయాడు సందీప్. ‘ఇక్కడ శాంతి ఉంది అని అనుకుంటాం. కాని అదంతా పైకి మాత్రమే. అండర్ కరెంట్‌లో ఈనాటికి ఇంకా అన్ని కణాలు ఉన్నాయి. అణిగి వున్న ఈ అగ్నికణాలు ఎప్పుడో ఒకప్పుడు అగ్విజ్వాలలు అవుతాయి.
సిద్ధార్థపై ఈమధ్య పత్రికలో చదివిన వార్తల ప్రభావం చాలా ఉంది. ఒక వారం క్రితం సోపార్‌లో జరిగిన గొడవలలో ఆర్మీలోని ఒక కెప్టెన్‌కి వీరగతి ప్రాప్తించిందని చదివాడు. ‘‘నిజానికి ఇప్పుడు ప్రజలు అలసిపోయారు. మిలిటెంట్లుగా మారిన యువకులు తెలివి తెచ్చుకున్నారు. వాళ్ళని ఉపయోగించుకుంటున్నారన్న సత్యాన్ని తెలుసుకుంటున్నారు. మా సీనియర్ కర్నల్ ఆప్టేకి సంబంధించిన ఒక సంఘటన గురించి చెబుతాను. శ్రీనగర్ రోడ్లపైన ఇద్దరికన్నా ఎక్కువమంది ఉండేవాళ్ళు కాదని ఆయన చెప్పారు. శ్రీనగర్ స్టేడియం శ్మశానంలా అనిపించేది. సోన్‌మార్గ్, గుల్‌మార్గ్‌కి వారంకి ఒకసారి బస్సులు నడిచేవి. ఇప్పుడైతే 200 బస్సులు ప్రతిరోజు నడుస్తాయి. ఆ రోజు కర్నల్ ఆప్టే ఒక హోటల్ అతడిని అడిగాడు- ‘టూరిస్టులు లేరు కదా! మీకు రాబడి కూడా లేదు. మరి ఎట్లా జీవిస్తున్నారు? అతడి సమాధానం ఇది- ‘మేము స్వతంత్రాన్ని తింటాము స్వతంత్రాన్ని కట్టుకుంటాము. స్వతంత్రాన్ని కప్పుకుంటాము’- కాని ఈనాడు కాశ్మీరీ యువత అసలు సిసలు సత్యాన్ని తెలుసుకుంది.

ఇంకా ఉంది

టి.సి.వసంత