డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
రాష్ట్రీయ రైఫిల్స్ హోమ్ మినిస్టర్ కింద వస్తుంది. ఇది ముఖ్యంగా జమ్మూ కాశ్మీరులకోసం తయారుచేయబడ్డది. 1990లో కాశ్మీరు ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి దీన్ని తయారుచేశారు. ఇక్కడి పోలీసు డిపార్ట్‌మెంట్‌పై ప్రజలకు నమ్మకం లేదు. ఈ డిపార్ట్‌మెంట్ బదులుగా దీని స్థాపించారు. దీని ఎంబ్లమ్ ఇండియన్ ఆర్మీ ఎంబ్లమ్‌లా ఉండదు. మా ఎంబ్లమ్ 2/47 మామోటో- వీరత్వం- దృఢత్వం. నేను ఇండియన్ ఆర్మీలో ఉన్నప్పుడు మా మామోటో- వీరత్వం- వివేకం. ఆర్.ఆర్ (రాష్ట్రీ రైఫిల్స్) ఒకే ఒక రెజిమెంటు. ఇందులో సైన్యం ఈఎమ్‌ఈకి చెందినా సిగ్నల్‌కి చెందిన ఆర్.ఆర్ బానర్ కింద ఉగ్రవాదులతో పోరాడి తీరాలి.
‘‘కాని ఇది ఎట్లా కుదురుతుంది? నినే్న తీసుకో, నువ్వు సిగ్నల్‌లో ఉన్నప్పుడు ఎ.కె.47 తీసుకుని ఉగ్రవాదులతో ఎట్లా తలపడతావు?’’
చలి పెరిగింది. సందీప్ గది తలుపులు మూసేశాడు. తమ్ముడి కాళ్ళపై రజాయి కప్పాడు. తను పడుకుని మాట్లాడసాగాడు. మాకు వెపెన్ ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ పోస్టింగ్ అయిన వెంటనే ఒక నెల కఠోరమైన రిగరస్ ఫ్రీ ఇండక్షన్ కోర్స్ కోపర్స్ బాటిల్ స్కూల్లో ఇస్తారు. ఇక చాలులే ఈ రైఫిల్స్ ఈ మాటలు.. ఇక నీ గురించి చెప్పు’’-
సిద్ధార్థ ఐఐఎమ్ కొలకత్తా నుండి ఎమ్‌బిఏ చేశాడు. దేశంలో పెద్ద కంపెనీ అయిన ఇండియా యూనీలీవర్ అతడికి ఉద్యోగం మంచి పేకేజ్ మీద ఇచ్చింది. ఒక సంవత్సరం కూడా కాలేదు. ఎ.ఎస్.ఎమ్ అంటే ఏరియా మానేజర్ పోస్టు ఇచ్చారు.
సిద్ధార్థకి ఎఫ్.ఎమ్.సి.జీ (్ఫస్ట్ మూవింగ్ కంజ్యూమర్‌గూడ్స్)లో అన్ని కంపెనీలకన్నా పెద్దదైన కంపనీకి తను ఎ.ఎస్.ఎమ్ అయ్యాడు. ఇది అతడికి ఎంతో గర్వకారణం. గర్వంగా అన్నాడు- ‘‘మా కంపెనీ గురించి ఏం అడుగుతావు. దేశంలో ప్రతి దుకాణంలోనూ మా ప్రోడక్ట్ ఉండి తీరుతుంది. నేను ఒక్కడిని 38 కోట్ల సేల్స్‌ని హాండిల్ చేస్తున్నాను’’.
‘‘బాప్‌రే.. 38 కోట్లా.. ఇంత సేల్స్ టార్గెట్ ఎట్లా ఎచీవ్ చేస్తావు?’’ సందీప్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘‘నేను ఈ సేల్స్ టార్గెట్‌ని ముక్కలు ముక్కలుగా నా సేల్స్ ఆఫీసరుకి పంచుతాను’’.
‘‘ఏ ఆధారంపైన?’’
‘‘వాళ్ళ పాత చరిత్రను ఆధారం చేసుకుని’’.
‘‘ఇంత పెద్ద టార్గెట్ పూర్తిచేయాలంటే ఏ సమస్యా రాదా?’’
‘‘సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈమధ్య సమస్యలు ఎక్కువగా కూడా అయ్యాయి. మా కాంపిటీటర్ చిన్నచిన్న వ్యాపారస్తులు. వాళ్ళ పెట్టుబడి మాతో పోలిస్తే అతి స్వల్పం. వాళ్ళు ఎడ్వర్‌టైజ్‌మెంట్‌కి ఎక్కువగా ఖర్చుపెట్టరు. రీసెర్చి కోస్ట్ ఉండదు. ఇనె్వంటరీ కోస్ట్ ఉండదు. వాళ్ళందరు లోకల్‌వాళ్ళే ఉంటారు. అక్కడే నూనె, సబ్బులు తయారుచేస్తారు. అక్కడే అమ్మేస్తారు. మా ఫైన్ అండ్ లవ్‌లీ ప్రొడక్టు హరిద్వార్, గౌహతిలలో తయారవుతుంది. మేం కాశ్మీర్‌లో, ఆంధ్రప్రదేశ్‌లో చిన్న చిన్న ఊళ్ళకి ప్రొడక్ట్‌ని పంపిస్తాం. మా డిస్ట్రిబ్యూషన్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అందువలన కోకోకోలా లాగా మా లక్ష్యం కూడా మారుమూల కుగ్రామాల వరకు పంపిణీ జరగాలనేదే. అందువలన చిన్న చిన్న ప్రొడక్ట్‌లను తయారుచేసేవాళ్ళను, పంపిణీదారుల నోట మట్టికొట్టాల్సిందే, తప్పదు. దేశం మొత్తంలో దాదాపు ఒక కోటి దుకాణాల దాకా మా ప్రొడక్ట్‌లను పంపిస్తాము. 26 వేల దుకాణాలను నేను హాండిల్ చేస్తాను. మా టార్గెట్ ఈ ఫిగర్‌ని ఇంకా పెంచాలి. అందుకే ప్రతీచోటా మా బ్రెయిట్ లైఫ్‌మాన్, ఫైన్ అండ్ లవ్‌లీ పోచులు వేళ్ళాడుతూ కనిపించాలి’’. మళ్లీ సిద్ధార్థ గర్వంగా అన్నాడు- ‘‘దీని కోసం మేము అప్పుడప్పుడు కొన్ని ప్రణాళికలను తయారుచేస్తాం. ప్రతి మూడు నెలలకు మా అడ్వర్‌టైజ్‌మెంట్ మారుతూ వుంటుంది. అడ్వర్‌టైజ్‌మెంట్‌పై మేము చాలా ఖర్చు చేస్తాం. ఎందుకో తెలుసా, ఏది కనిపిస్తుందో అదే అమ్ముడు పోతుంది. అందుకే ప్రతీ దుకాణంలో ముందు వరుసలో మా ప్రొడక్టులు కనిపిస్తాయి. కాని అన్నింటికన్నా సఫలీకృతమైన ప్రణాళిక మహాశక్తి- అమ్మ ప్రణాళిక. దీనిలో భాగంగా మేము ఊళ్ళల్లో ఉండే ఎవరైనా చదువు సంధ్యలు వచ్చిన మహిళను పరిచయం చేసుకుంటాం. ఆమెని నెల జీతంమీద కమిషన్‌పైనా అపాయింట్ చేస్తాం. ఆమె ప్రతి ఇంటికివెళ్లి అతి తక్కువ ధరకైనా లేక ఉచితంగానైనా చిన్న చిన్న పోచ్‌లను పంచి పెట్టాలి. ఇది ఆమె పని. ఒకసారి మా కస్టమర్ మా సబ్బు చమత్కారాల మెరుపులకి అలవాటుపడితే స్థానియంగా తయారయే సబ్బులకు విలువ తగ్గిపోతుంది’’-
‘‘వాహ్ గురూ! పాపం కష్టపడి స్వాభిమానంగా, స్వావలంబంగా నిలబడే స్థానీయ వ్యాపారులను అణగదొక్కి మీ కంపెనీ అధిక లాభాలు గడిస్తోందా? వాహ్.. నీవు నీ జీవితాన్ని మంచి మిషన్‌కే సమర్పణం చేసావు’.
బాత్‌రూమ్‌వైపు వెళ్తున్న సిద్ధార్థకి సందీప్ మాటలు వినిపించలేదు. అందుకే అడిగాడు- ‘ఏమైనా అన్నావా?’
‘ఉహు.. ఏమీ లేదు.. నీ అలసట అంతా సేల్స్ టార్గెట్ పూర్తిచేయడంలో తగ్గిపోతుంది’.
‘అవును.. ఉగ్రవాదులను మట్టుపెట్టడంలో మీ అలసట ఎట్లా దూరం అవుతుందో అట్లాగే అవుతుంది’.
సందీప్ నవ్వాడు.
సిద్ధార్థ నవ్వాడు.
మళ్లీ ఇద్దరు కలిసి నవ్వారు. మాట మారింది.
ఇద్దరు తమ ఇంటి విషయాలు మాట్లాడుకున్నారు. మాట్లాడుతూ మాట్లాడుతూ సందీప్ నిద్రలోకి జారుకున్నాడు. సిద్ధార్థ కూడా నిద్రపోవడానికి ప్రయత్నించాడు కాని ఒక దోమ గదిలోకి ఎట్లా వచ్చిందో తెలియదు. చెవి దగ్గర రొద పెట్టడం మొదలుపెట్టింది. ఆలౌట్ ఎక్కడ ఉందో అడుగుదామని సిద్ధార్థ తన అన్నయ్యని కదిపాడు.

- ఇంకా ఉంది

టి.సి.వసంత