డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

డార్క్ రెడ్, డార్క్ గ్రీన్ రంగులతో ముఖ్యద్వారం అందంగా ఉంది. పైన ఇట్లా రాసి ఉంది- ‘కర్మ హీ ధర్మ్’ (కర్మమే ధర్మం) దర్వాజాకి ముందు గుడ్‌గాంవ్‌లో లాగానే పెద్ద మొద్దు కర్ర ఉంది. స్టాండ్‌మీద అడ్డంగా పెట్టారు. ‘ప్లీజ్ షో యువర్ ఐటెంటిటీ కార్డ్’ అని అడిగాక కార్డ్ చూపాక ఆ కర్రని లేవనెత్తారు. ఎడమ వైపు ముఖ్యద్వారం బయట చిన్న ఆఫీసు ఉంది. అక్కడ ఎ.కెలు చేతిలో పట్టుకుని ఉన్న ఒక గార్డ్ ఉన్నాడు. చిన్న రోడ్డు ఉంది. అక్కడ ఒక చిన్న హోర్డింగ్ ఉంది. దానిపైన ఇద్దరు కమెండోల చిత్రాలు ఉన్నాయి. కింద ది స్టోమ్రీ ట్రూప్స్ అని రాసి ఉంది.
కొంచెం దూరంలో ఒక బోర్డు వుంది. కదమ్ సే కదమ్ మిలావో కాశ్మీర్‌కో జన్నత్ బనావో (అడుగులో అడుగు కలపండి. కాశ్మీర్‌ని స్వర్గం చెయ్యండి) ప్రతీ చోట ఎ.కె.47 రైఫిళ్లని పట్టుకున్న సిపాయిలు. లోపలినుండి ఆజ్ఞ రాకపోతే పక్షి కూడా రెక్కలు విప్పలేవు.
ముఖ్యద్వారానికి పైన రాష్ట్రీయ రైఫిల్స్ ఎంబ్లమ్ - రెండు ఎ.కె.47 రైఫిళ్ళు క్రాస్‌గా ఉన్నాయి. పైన అశోక చక్రం ఉంది. మధ్యలో 14 రాష్ట్రీయ రైఫిల్స్ మీకు స్వాగతం పలుకుతోంది’ అని రాసి ఉంది. దానిపైన వీరత్ జార్ ధృఢతా అని రాసి ఉంది. దానిపైన ‘కర్మ హీ ధర్మ్ హై’ అని రాసి ఉంది.
భూషణ్ కాంప్‌లోపలికి వెళ్తున్నప్పుడు మనస్సుకు హాయిగా అనిపించింది. కుడి వైపు అంతటా పూల కుండీలు, మంచి సుగంధాలు. గులాబీ సౌరభం అంతటా వ్యాపించింది. కుండీలు ఎంతో అందంగా ఉన్నాయి. తివాసీలా పరచబడ్డ గడ్డి. అక్కడ అక్కడ కథారంగులో ఉన్న స్తంభాలు, గుండ్రంగా ఉన్న దారులు. మధ్య మధ్యలో ముత్యాల్లో అనిపించే చక్కటి అందమైన రాళ్ళు సిద్ధార్థ దృష్టి అక్కడ ఉన్న బోర్డుపై పడ్డది. దాని మీద ఇట్లా రాసి ఉంది. ‘ఉంగలీ ట్రిగర్ పర్ సిర్ఫ్ కాంటాక్ట్ హోనే పర్’ (సమాచారం అందాకే ట్రిగర్‌పైన మీ వేలు) అంటే వీరత్వం, దృఢత్వంతోపాటు అవసరం లేకుండా రక్తపాతం కాకుండా హెచ్చరిక.
కొంతదూరం నడిచాడు. అక్కడ చిన్న చిన్న కాటేజ్‌లు ఉన్నాయి. నిజానికి అవి బొమ్మరిళ్ళలో ఉన్నాయి. ఇవి ఆర్మీ ఆఫీసర్ల కాటేజ్‌లు. ఒకటే వరుసలో చిన్న చిన్న ఆఫీసులు. రిక్రియేషన్ రూమ్, కంప్యూటర్ రూము.. పిఆర్‌ఐ ఆఫీసు, టిఎన్‌టి ఆఫీసు రిక్రియేషన్ రూమ్‌లో ఒక మిలిటెంట్ ఫొటో వుంది. ఫొటోపైన వాంటెడ్ అహమద్ రషీద్ అని రాసి ఉంది. అందమైన ముఖం గడ్డం బాగా పెరిగి ఉంది. ఇతడు వాలీలో ఎన్నోసార్లు బాంబులు పేల్చాడు.
సందీప్ కాటేజ్‌లోకి వెళ్ళగానే సిద్ధార్థ ఆనందానికి అంతులేదు- ఆపిల్, ఆక్రోట్, పళ్ళ చెట్లపైన అందమైన రంగు రంగుల పిట్టలు. రకరకాల పిట్టలు చాలా ఉన్నాయి. వాటి కలారావం, కువకువలు అక్కడి వాతావరణానికి తాజాతనం ఇస్తున్నాయి. కుహూ.. కుహూ.. టీవీ టుట్.. టుట్ అంటూ పక్షులు కూస్తున్నాయి. అందమైన దృశ్యాలు. ఆ క్షణాలలో కాంప్‌లో శాంతి ఉంది. అంతా మంగళమయం. కాని ఇక్కడే శ్రీనగర్ లోయలో ప్రతిక్షణం, అశాంతి, రక్తపాతం- అసలు వీటిని గురించి ఊహించనైనా ఊహించలేం. ద్వేషం పెరగడానికి అనునిత్యం షడ యంత్రాలు.. కుతంత్రాలు.. సిద్ధార్థ యుద్ధాన్ని, అశాంతిని, ఎ.కె.47ని మరచిపోయాడు. పూల పరిమళాలు, హిమలయాల వాసంత సమీరాలు అతడి మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. ఎండలో తీవ్రమైన ఎండ లేనే లేదు. అడుగులు ముందుకు వేయసాగాడు. కాని ఆ ఆఫీసు దాకా వచ్చాక ఇక అడుగులు పడలేదు. ఎదురుగుండా పి.ఆర్.ఐ ఆఫీసు. ఆఫీసు బయట సిపాయిలకు కొన్ని సూచనలు ఇచ్చే బోర్డు వుంది. అతడు చదవడం మొదలుపెట్టాడు.
థల్ సైనికాధికారి ఇస్తున్న పది సూచనలు
- బలాత్కారం చేయకూడదు.
- ఎవరిని ఎగతాళి చేయకూడదు. ఎవరిపట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు.
- ఎవరిని శారీరకంగా బాధపెట్టకూడదు.
- శస్త్రాల దురుపయోగం కూడదు. దీనివలన సైన్యం పేరు పాడవుతుంది.
- ప్రజల పోట్లాటలలో తలదూర్చకూడదు.
- టెలిఫోను, రేడియో, దినపత్రికలు మొదలైన వాటిని ఆపరేషన్ కోసమే ఉపయోగించాలి.
- వ్యక్తిగత హక్కులకి గౌరవం ఇవ్వాలి.
- కేవలం పరమేశ్వరుడికే భయపడాలి. ధర్మమార్గంలో నడవడం, సంతోషంగా దేశ రక్షణ చేస్తూ ఆనందం పొందడం మన కర్తవ్యం.
వాహ్ చాలా బాగా రాశారు. సిద్ధార్థ మనస్సులో అనుకున్నాడు. సైన్యానికి, పోలీసులకి మధ్య ఇదే భేదం. ఏ వ్యక్తి అయినా సాధారణ ప్రజలతో ఏవిధంగా ప్రవర్తిస్తాడన్న పై ఆఫీసర్లు ఆ వ్యక్తిని తీర్చిదిద్దడంపై ఆధారపడి ఉంటుంది. ఈ సూచనలన్నీ మానవత్వంపై ఆధాపడి ఉన్నాయి. కాశ్మీర్‌లో జరిగే అల్లకల్లోలాని ఆర్మీ నియంత్రించింది. ఇది సత్యం. కమాండింగ్ ఆఫీసరు కర్నల్ కేదార్ ఆప్టే లాంటి ఆఫీసర్ల వలనే ఇది సాధ్యం అయింది. వీళ్ళు సైన్యంలో క్రమశిక్షణను, నైతికను పెంచే ప్రయత్నం చేశారు. దీనికోసం అహర్నిశలు పాటుపడ్డారు. మొట్టమొదటిసారిగా అతడిలో అన్నయ్య పట్ల గౌరవం పెరిగింది. అతడి జీవితం గొప్ప లక్ష్యాన్ని సాధించేందుకు అంకితం అయింది.
మరో కాటేజ్‌పైన అతడి దృష్టిపడేదాకా అతడిలో ఆలోచనా తరంగాలు లేస్తూనే ఉన్నాయి. డ్యూటీ రూమ్ అని బయట రాసి ఉంది. బయట గోడమీద ఒక పేపర్ కటింగ్ అతికించబడి ఉంది. బహుశ అధికారి సైనికుల మనోబలాన్ని పెంచడానికి ఈ కటింగ్ అతికించి ఉండ ఉండవచ్చు. కంగన్ అనే ఊరులో పోలీసులకి మిలిటెంట్లకి మధ్య జరిగిన సంఘర్షణలో చంపబడ్డ మిలిటెంట్‌ని పూడ్చడానికి ఊరివాళ్ళు స్థలం ఇవ్వడానికి నిరాకరించారు.

- ఇంకా ఉంది

టి.సి.వసంత