డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
హృదయాన్ని చీల్చుకు వస్తున్న ఏడుపు. రోదనంతో పాటు గుండ్లు పేలుతున్న శబ్దాలు.. ఢామ్.. ఢామ్.. రెండు అడుగులు మందుకు వేసాడో లేదో కడుపులో పేగులు కదలిపోయాయి. హృదయం బద్దలయింది. భయంకరమైన దృశ్యం.. ఇద్దరు ముగ్గురు సైనికులు ఎవరో స్థానీయ యువకుడిని బాహాటంగా కొడుతున్నారు. వాళ్ళ నోటినుండి బూతుల ప్రవాహం. సైనికులు తిట్టకుండా మాట్లాడరన్న సంగతి తనకు తెలుసు. కాని అమ్మనాబూతులు.. ఛ.. ఇంతకంటే అసహ్యంగా.. అసభ్యంగా.. బాస్టర్డ్.. మోసం చేస్తావుటరా...సాలా.. ఇంత భయంకరంగా తిట్టడం.. కొడ్డటం చూశాక సిద్ధార్థ హృదయం తల్లడిల్లింది. గాయపడ్డ ఆ యువకుడి అంగాంగాలనుండి రక్త రాసాగింది. ఉఫ్.. అతడు తల తిప్పుకున్నాడు. కొంచెం దూరంలో పళ్ళు అమ్ముకునేవాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయి. వాళ్ళందరు భయం భయంగా చూస్తున్నారు.
కొంచెం సేపయ్యాక ఒక సైనికుడు వచ్చాడు. సిద్ధార్థ ఎందుకు కొడుతున్నారని అడిగాడు.
సైనికుడు నవ్వాడు- సాహెబ్! ‘రాక్షసత్వాన్ని రాక్షసత్వంతోనే జయించాలి’.
అందుకేనేమో సైనికులకు మదిర మాంసాలు పెట్టి రాక్షసుల్లా తయారుచేస్తారు. వాళ్ళు రాక్షసులైతే కాని అవతలి వాళ్ళ రాక్షసత్వాన్ని జయించలేరు.
‘‘మీరు మేం వీడిని కొట్టిందే చూసారు. వీడు ఒక ఇన్‌ఫార్మర్. ఆపరేషన్లన్నీ ఇన్‌ఫార్మర్ ఇచ్చే ఇన్‌ఫర్‌మేషన్ మీదే ఆధారపడి ఉంటాయి. వీడు మమ్మల్ని మోసం చేశాడు. బ్రేవో కొండపైన ఇద్దరు మిలిటెంట్లు ఉన్నారని చెప్పాడు. కాని ఎనిమిదిమంది ఉన్నారు. మిలిటెంట్లకి మా సైనికుల గురించి చెప్పాడు. వాళ్ళు మా కోసం ఎదురుచూస్తున్నారు. వీడిట్లా మోసం చేసాడనే బాహాటంగా తన్నారు. తక్కిన ఇన్‌ఫార్మర్లు తప్పుడు వార్తలు అందిస్తే ఎంత నరకం అనుభవించాలో తెలుసుకోవాలనే ఇంత హింస పెట్టాము. మిలిటెంట్లు గురించి, సరియైన సమాచారం తెలిసేవాళ్ళకి ఒక లక్ష రూపాయల వరకు బహుమతి ఇస్తాం! సర్! ఉగ్రవాదులలాగానే ఆర్మీకూడా తనదైన పంథాలో భయం క్రూరత్వాలని చూపించకపోతే ఈ రోడ్లలో మీలాంటివారు, మేము నడవలేము’’.
‘మరైతే ఉగ్రవాదులందరు ఈ విధంగా వార్తాహరుల ద్వారానే పట్టుబడతారా?’ జిజ్ఞాసతో అడిగాడు సిద్ధార్థ.
సిద్ధార్థకి తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఎక్కువ అని సైనికుడు తెలుసుకున్నాడు. చెప్పాలా! వద్దా! సివిలియన్స్‌కి ఆర్మీకి సంబంధించిన విషయాలను చెప్పడానికి ఆర్మీ కోడ్ ఒప్పుకోదు.కాని ఇతడు మేజర్ సందీప్‌కి రక్తసంబంధీకుడు.. తమ్ముడు. తను రహస్యమైన విషయాలు ఏవీ చెప్పడం లేదు కదా! ఓపెన్ సీక్రెట్.. ఉగ్రవాదులందరికీ తెలిసిన రహస్యమే చెబుతున్నాను కదా!
రెండు మూడు క్షణాలయ్యాక అతడి నోటి నుండి జవాబు వచ్చింది-
‘సాహెబ్‌గారూ! మూడు పద్ధతుల్లో మేం ఉగ్రవాదులను మట్టుపెడతాం. మిలిటెంట్ల ద్వారా హింసింపబడిన ఏ యువకుడినైనా మేం బుట్టలో వేసుకుంటాం. వాడిని నకిలీ మిలిటెంటుగా మారడానికి ప్రోత్సాహం ఇస్తాం. అతడు సరేనంటే కొంత ట్రైనింగ్ ఇస్తాము. అతడు మిలిటెంట్లలోని ఏ గ్రూపులో చేరతాడో మాకు తెలిసే ఉంటుంది. అతడు వాళ్ళతో ఉండటం మొదలుపెడతాడు. పాకిస్తాన్ వెళ్తాడు. తిరిగి వస్తాడు. కొంత టైమ్ అయ్యాక అతడు స్వయంగా ఆపరేషన్ చేస్తాడు. ఆ సమయంలో మాకు అంతా తెలియజేస్తాడు. అవకాశం రాగానే అతడు ఉగ్రవాదులను చంపేస్తాడు. అతడికి పెద్ద బహుమతి ఇస్తాం. ఆర్మీలో జాయిన్ అవడానికి ఆఫర్ ఇస్తాము.
రెండో పద్ధతి- కాల్ ట్రాకింగ్.. మేం మిలిటెంట్ల కోసం డూప్లికేట్ సిమ్ కార్డును తయారుచేయిస్తాము. కాశ్మీర్‌లో కొత్తగా మొబైల్స్ వచ్చినపుడు ఎంతోమంది ఉగ్రవాదులను చంపేసాము. కాల్ ట్రాకింగ్ ద్వారా వాళ్ళ స్థావరాలను కనిపెట్టి వాళ్ళను చంపేసేవాళ్ళం. కాని ఇవన్నీ డబుల్ ఏజెంట్ వెపన్లు. అంటే రెండు వైపుల పదునున్న ఆయుధాలు. ఒకవేళ వార్త సరియైనది కాకపోతే ఏమైనా జరగవచ్చు. మేము మోసపోయి వాళ్ళ చేతుల్లో చావనూ చావవచ్చును.
పసుపు పచ్చటి ఆకులుగల చెట్లు చాలా ఉన్నాయి. మధ్య మధ్యలో చీధ్, దేవదారు, ఆపిల్, అఖరోట్ చెట్లు చాలా ఉన్నాయి. అక్కడక్కడా పైనుండి పడుతున్న సెలయేళ్ళు, ఏ ఋతువులోనైనా సరే శ్రీనగర్ ఎంతో అందంగా కనిపిస్తుంది. సిద్ధార్థ కాశ్మీర్ సౌందర్యాన్ని మనఃస్ఫూర్తిగా ఆనందించాలని అనుకున్నాడు. ఈ సౌందర్యం ఎప్పటికీ ఉండాలి అని ప్రార్థించాడు. చెర్రీ ప్యాకెట్టును విప్పి తిన్నాడు. సైనికుడికి కూడా ఇచ్చాడు. కొంచెం దూరం నడిచాక సైనికుడు మళ్లీ తన అనుభవాలను చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘సర్, అన్నింటికంటే ఇంటలిజెన్స్ బ్యూరోవలన తెలిసే వార్తలు ఎంతో ఇంపార్టెంట్. ఈ వార్తలు ఏ మాత్రం తప్పుగా ఉండవు. ఎందుకంటే ఇంటిలిజెన్స్ బ్యూరో శాటిలైట్‌నుండి చూస్తారు. నేను ఒక సంఘటన గురించి చెబుతాను. నేను ఆ ఆపరేషన్‌లో ఉన్నాను’’.
‘‘మీరు ఉన్నారా!’’ సిద్ధార్థకి నమ్మకం కుదరడంలేదు.
సైనికుడు మెల్లిగా నవ్వాడు. ‘‘సర్! ఇక్కడ ఆర్.ఆర్ పోస్టిగ్‌లో ప్రతీ ఆఫీసరు ఇంఫ్రెంటీ ఆఫీసరే! ప్రతి సైనికుడినీ ఆపరేషన్‌కి పంపించవచ్చు. దాదాపు ఒకటిన్నర సం. కిందటి సంఘటన. అప్పుడు మా కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ బత్రా ఉండేవారు. ఆయనకి దాదాపు పదమూడు మంది ఉగ్రవాదులు బార్డర్‌ని దాటివస్తున్నారు అన్న వార్త తెలిసింది. సాయంత్రం 5 గంటలకు నారాయణ్ నాగ్ దగ్గరికి వస్తున్నారు.

ఇంకా ఉంది

టి.సి.వసంత