డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 40

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
అసలు వినే నాధుడు లేడు. అర్థం చేసుకునే సహృదయత ఎవరిలోనూ లేదు. ప్రతీ సీనియర్ ఆఫీసరు పేపర్ వెయిట్‌లాగా నా భావాల కాగితాన్ని ఒక పరిధిలో ఉంచేస్తాడు.
మేజర్ రాథోర్ సందీప్ దుఃఖాన్ని చూసి ఎంతో బాధపడ్డాడు.. ఆర్మీలో చేరకముందున్న సందీప్‌లా ఇప్పటి సందీప్ లేడు. మేఘాలతో ఆవృతమైన ఆకాశంలా ఉంది మనస్సు. మనస్సు బరువెక్కింది. మేఘాలు ఎప్పుడు కురుస్తాయా అన్నట్లుగా ఉన్నాయి. సిపాయిలు, ఆఫీసర్లు ఆర్మీలో ఎంతోమంది ఉన్నారు. ఆర్మీలో ఎంతో పవిత్రంగానూ, మంచి సంకల్పంతోనూ ప్రవేశించారు. నిజానికి ప్రాణాలు పోయేదాకా వీరోచితంగా పోరాడారు. చివరి రక్తపు బిందువును సైతం ధారపోశారు. కాని ఇవాళ దేశంలో ఎవరైనా వాళ్ళ పేర్లనైనా తలుచుకున్నారా? 1962 సం. నవంబరు 18. ఆ రోజు వాతావరణం జీరో మైనస్ 15 డిగ్రీల మధ్యదాకా వుంది. మేజర్ శైతాన్ సింహ్ అతని పదమూడో కుమువూ పలటన్ త్రిఘాల్ కొండలలో పదిహేడు వేల ఎనిమిది వందల అడుగులుపైన రజ్‌టంగాల్‌లో ఉన్నారు. చల్లటి గాలులు కొరడాలా శరీరంపైన తగులుతున్నాయి. ప్రొద్దున్న నాలుగు గంటల ముప్ఫై అయిదు నిమిషాలకు చైనా ఆక్రమణ జరిగింది. అప్పుడు మా జాకెట్లు కోల్డ్ ప్రూఫ్‌వి కావు. కొంతవరకు చలిని ఆపేవి. కాని చేతులు కొంకర్లు పోయేటంతటి చలి. గజ గజ చలికి ఒణుకుతూ కూడా మన సైనికులు చివరి ఊపిరి వరకు యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఎవరూ వెనక్కి తిరిగి రాలేదు. వీరగతి పొందిన ఒక సిపాయి చేతిలో చేతిబాంబు చిక్కుకుని ఉంది. కొంతమంది చేతులు ట్రిగర్‌మీద ఉన్నాయి. అంటే అందరు యుద్ధం చేస్తూ చేస్తూ వీరగతిని పొందారు. కాని ఆ కొండలో శత్రువుకు సూదిమోపినంత స్థలం కూడా ఇవ్వలేదు.
మన సైనికులు నూట పధ్నాలుగుమంది వీరగతిని పొందారు. కాని ఒక వేయి మంది శత్రువుల శవాలు దొరికాయి. కాని ఏ పాఠ్యపుస్తకాలలో ఈ వీరుల కథలు ఉన్నాయి. వీళ్ళ ఊరు పేరు ఎక్కడా లేవు. త్రిఘాల్‌లో చివరివరకూ జెండా దించనీయకుండా తన ప్రాణాలు అర్పించిన శైతాన్‌సింహ్‌కి కనీసం ప్రజలు శ్రద్ధాంజలి కూడా సమర్పించలేదు. ఒక సమయంలో నేను నీలాగా భావుకుడై ఆలోచించేవాడిని. కాని ఇప్పుడు నేను ఆలోచించను. ఎందుకు ఆలోచించాలి? ఆ కాలంలో దేశం కోసం యుద్ధం చేయడం, వీరగతి పొందడం అంటే ఎంతో గౌరవనీయంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే సైనికుడు దేశ రక్షణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టినా జీతం పెరగడానికి ఉద్యమం చేయాల్సి వస్తోంది. వేతన్ ఆయోగ్ ఎన్నోసార్లు అందరికి జీతాలు పెంచుతూ ఉంటారు. కాని సైనికుల విషయంలో ఏ మాత్రం పట్టించుకోరు. అందుకే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సీట్లు ఖాళీగా పడి ఉంటున్నాయి. ఆ టైమ్‌లో ఎన్.డి.ఎ. ఛాన్స్ దొరకడమే గగనం అయ్యేది’’.
మేజర్ రాథోర్ భావుకుడై చెబుతున్నాడు. సందీప్‌ని కూడా ఈ ప్రవాహంలో లాక్కుపోతున్నాడు. సందీప్ మేజర్ శైతాన్‌సింహ్ ఎవరు? అతనికి ఏమవుతాడు, తండ్రా? సోదరుడా అని అడగాలనుకున్నాడు. మేజర్ రాథోర్ కుటుంబంలో తరతరాల నుండి ఒక పుత్రుడినైనా ఆర్మీలో పంపే ఆచారం వుందని సందీప్‌కి తెలుసు. కాని అతడి ప్రవాహానికి అడ్డుపడకూడదని వౌనంగా ఉండిపోయాడు.
మరునాటి ఉదయం
సిద్ధార్థ ఫ్లైట్‌లో ఢిల్లీ వెళ్లాలనుకున్నాడు. ఉదయం పది గంటలకు సందీప్ ప్రైవేట్ కారుని తెప్పించాడు. కాని చివరి క్షణంలో సిద్ధార్థతో తను వెళ్లాలనుకున్నాడు. ఏమో! మళ్లీ కలుసుకుంటారో, కలుసుకోరో! మనస్సులో భావతరంగాలు లేస్తూనే ఉన్నాయి. గత మూడు రోజుల్లో తమ్ముడిని ఎన్నిసార్లు తలుచుకున్నాడో.
ఒక్కసారిగా సందీప్ ఈ లోకంలోకి వచ్చాడు. తమ్ముడు శాంతంగా నిలిచి ఉన్న నీళ్లలో మోహం మమతల రాళ్లను విసిరాడు. మనస్సు కల్లోలం అయింది. అతడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
కారులో కూర్చోగానే కారు డ్రైవర్ అడిగాడు- ‘‘ఇతనెవరు? మేజర్ అజహర్ సాహెబ్. సందీప్ వెంటనే తడుముకోకుండా జవాబు చెప్పాడు. ‘‘ఈయన మా ఇంటి ఓనర్. అజమేర్ షరీఫ్‌లో మేం ఇతడి తండ్రి ఇంట్లో అద్దెకుండేవాళ్ళం’’.
సిద్ధార్థ ఆశ్చర్యపోయాడు. అనవసరంగా ఇటువంటి వాతవరణంలో రిస్క్ తీసుకున్నాడు అన్నయ్య. సెక్యూరిటీ గార్డు లేకుండా ప్రైవేట్ కారులో రావడం రిస్కే. అతడు చెప్పాలనుకున్నది కూడా చెప్పలేకపోయాడు. మేజర్ సందీప్ హిందువు అని సందేహం రాకూడదు. దారిలో సందీప్ మాట్లాడుతూ ఉన్నాడు. సిద్ధార్థ కిటికీలోనుండి చీడ్, దేవదారు వృక్షాలను చూస్తూ కూర్చున్నాడు. తమ్ముడు అడిగే ప్రశ్నలకు ముక్తసరిగా అవును, కాదు అని సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు సందీప్. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో మామూలుగా తక్కిన ఎయిర్‌పోర్టులలో కన్నా డబుల్ చెకింగ్ జరుగుతుంది. ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టాక ముందే ఫస్ట్ చెకింగ్ జరుగుతుంది. ఈ చెకింగ్ కాగానే వర్షం పడటం మొదలుపెట్టింది. అందువలన సిద్ధార్థ సెకెండ్ చెకింగ్ కాకముందే అన్నయ్యని బలవంతంగా వెనక్కి పంపించాడు. రోడ్లనిండా ఎన్నో మలుపులు. సెన్సిటివ్ ప్లేస్. జనసంచారం లేని రోడ్లు. లోపల ఏదో అనుమానంగా ఉంది సందీప్‌కి. అయినా పైకి కనబరచకుండా దేవదారు వృక్షాలకింద కుప్పలు కుప్పలుగా పడి ఉన్న పసుపు రంగు ఆకులను చూస్తూ కూర్చున్నాడు. వర్షాన్ని చూస్తుంటే కొంత ఆనందం కలిగింది. కాని లోపల ఏదో తెలియని ఆందోళన. అయినా ఉదయం సమయం కదా భయం లేదు అని తనకి తనే చెప్పుకున్నాడు.

ఇంకా ఉంది

టి.సి.వసంత