డైలీ సీరియల్

యమహాపురి 18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘గురుడికి నామీద అనుమానం వచ్చినట్లుంది. వస్తే మాత్రం నాకేం నష్టమా?’’ అనుకుని- ‘‘సార్! నేను మీకు దొంగలా కనిపిస్తున్నానా?’’ అన్నాడు సుబ్బడు కోపం నటిస్తూ.
‘‘కనిపించావని నేనన్నానా? కానీ అవసరం ఒకోసారి మనిషిని ఎంతకైనా దిగజార్చుతుంది. ఈ రోజు దారిలో కనబడ్డ పర్సు నిజాయితీగా వెనక్కిచ్చిన నువ్వు- రేపు నీ అవసరం కోసం దొంగతనానికి పాల్పడవచ్చు. అలాంటప్పుడు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గిర దొంగతనం చెయ్యకూడదు. ముఖ్యంగా నాలాంటివాళ్ల దగ్గిర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉత్తుత్తి పర్సు తిరిగిచ్చినందుకు సంతోషించి ఈనాముగా వెయ్యి రూపాయలిచ్చినవాణ్ణి- కోపమొస్తే ఏం చేస్తానో ఊహించుకో! నువ్వు దొంగవి కాదనుకో- నేనేంటో నీకు తెలియాలనే నీకిప్పుడు వెయ్యి రూపాయలివ్వాలనుకున్నాను. ఉపకారికి ఉపకారం. అదీ సంగతి!’’ అన్నాడు పెద్దమనిషి.
‘‘నా గురించి మీరేమేమో ఊహించుకుంటున్నారు. నేను చాలా మామూలు మనిషిని! మీ కోపం గురించి నాకెందుకు సార్, తెలియడం?’’ అన్నాడు సుబ్బడు.
‘‘ఏమో, తెలుసుకోవడం మంచిదనిపించింది. తెలుసుకున్నావుగా- ఇంద!’’ అంటూ ఆయన వాడికి వెయ్యి రూపాయలనోటిచ్చి వెళ్లిపోయాడు.
ఆ తర్వాత సుబ్బడు ఆ నోటుని తనకి బాగా తెలిసిన గోపాలం దుకాణంలో మార్చబోయాడు.
గోపాలం ఆ నోటుని ఎగాదిగా చూసి వెంటనే వాడికి తిరిగిచ్చేశాడు. ‘ఇది దొంగ నోటురా, సుబ్బా! ఇది నీదగ్గిరకెలాగొచ్చింది? కొంపదీపి ఏదైనా దొంగనోట్ల రాకెట్లో చేరేవేమిటి?’’ అనడిగాడు.
‘‘అరి నీ’’ అని మనసులో అనుకుంటూ సుబ్బడు గోపాలానికి జరిగింది చెప్పాడు.
‘‘అమ్మో! ఆ పెద్దమనిషి నకిలీ నోట్ల మార్పిడిలో ఉద్దండుడై ఉంటాడు. నువ్వాయన్ని దగ్గిర్నుంచి చూశావుగా, మళ్లీ చూస్తే గుర్తుపట్టగలవా?’’ అన్నాడు దుకాణదారు.
‘‘ఎందుకు గుర్తుపట్టలేను? ఆయన నా కళ్లముందు కటౌట్లా కనిపిస్తున్నాడు’’ అన్నాడు సుబ్బడు.
‘‘ఐతే పోలీసుల దగ్గిరకెళ్లి విషయం చెప్పు. మంచి ఈనామిస్తారు’’ అన్నాడు గోపాలం.
అప్పుడు అర్థమైంది సుబ్బడికి, ఆ పెద్దమనిషి చివర్లో అన్నమాటల అర్థం.
‘‘ఉత్తుత్తి పర్సు తిరిగిచ్చినందుకు సంతోషించి ఈనాముగా వెయ్యి రూపాయలిచ్చిన
వాణ్ణి- కోపమొస్తే ఏం చేస్తానో ఊహించుకో. నువ్వు దొంగవి కాదనుకో- నేనేంటో నీకు తెలియాలనే నీకిప్పుడు వెయ్యి రూపాయలలు ఇవ్వాలనుకున్నాను’’ అన్నాడాయన. అంటే అది తనకి హెచ్చరిక అన్నమాట!
‘‘నాకు పోలీసుల ఈనామూ వద్దు, ఈ నోటూ వద్దు’’ అంటూ ఆ నోటుని గోపాలం దగ్గిరే వదిలేసి అక్కణ్ణించి వెళ్లిపోయాడు సుబ్బడు.
గోపాలం మాత్రం ఊరుకోలేదు. ఇటీవలే పరిచయమైన ఇన్స్‌పెక్టర్ శ్రీకర్- అతణ్ణి తనకి ఇన్‌ఫార్మర్‌గా చేసుకున్నాడు. అందుకని అతడా దొంగనోటు కథని శ్రీకర్‌కి చేరవేశాడు.
శ్రీకర్ ఆరా తీస్తున్న వాటిలో దొంగనోట్ల చెలామణీ కేసు కూడా ఉంది. అతడు వెంటనే సుబ్బడి కోసం
అనే్వషణ
మొదలెట్టాడు. అసలే జిడ్డు సుబ్బడు. అంత సులభంగా దొరుకుతాడా?
వాకబు చెయ్యగా ఇటీవల సుబ్బడు ఓ అమ్మాయి ప్రేమలో పడ్డట్లు తెలిసింది. కానీ ఆ పిల్లెవరో తెలియదు. ఆమెని ఎప్పుడు ఎక్కడ కలుసుకుంటాడో తెలుసుకోవడం కష్టంగా ఉంది.
తను ప్రేమించి పిల్ల కోసం పోలీసులు అనే్వషిస్తారన్న అనుమానం సుబ్బడికి లేదు. ఐనా ఎందుకో ఆ పిల్ల విషయం రహస్యంగానే ఉంచాడు. అందుకు వాడి కారణాలేవో వాడికుండొచ్చు!
ఆ పిల్లెవరో తెలిస్తే ఆమె ద్వారా వాణ్ణి బుట్టలో వేసుకోవచ్చునని శ్రీకర్ ఆశ!
ఈ రోజు సుబ్బడు ఆ పిల్లని శివగిరి కొండమెట్ల దగ్గిర కలుసుకోబోతున్నట్లు ఉప్పందించింది.
ఆ పిల్ల గురించి ఆరా తీసే పనిమీద కానిస్టేబుల్ సుందరాన్ని పంపాడు శ్రీకర్.
‘‘సుబ్బడు ఆవులిస్తే పేగులు లెక్కట్టే రకం. నువ్వు మఫ్టీలో వెళ్లినా ఇట్టే గుర్తుపట్టేస్తాడు. డ్యూటీమీద వెళ్లినట్లే యూనిఫాంలో అక్కడికెళ్లు. వాడికి అనుమానం రాకుండా ఆ పిల్ల గురించి తెలుసుకో. వాడిది దొంగ తెవివైతే, నీది పోలీసు తెలివి. నీ తెలివే గొప్పదని నాకు నమ్మకముంది’’ అన్నాడు శ్రీకర్.
సుందరం అరగంట నుంచి ఆ కొండమెట్లక్కి కాస్త దూరాన, ఓ చెట్టు కింద కాపు వేశాడు. అతడు ఎక్కడెక్కడో చూస్తున్నట్లు నటిస్తున్నా- దృష్టంతా కొండ మెట్లమీదే వుంది.
ఆ అరగంటలోనూ ఒక్క భక్తుడు కూడా మెట్లెక్కలేదు. మెట్లు దిగలేదు.
‘‘చెట్టు కింద కూడా చల్లగా అనిపించడం లేదు. ఎండలిలా మండిపోతుంటే భక్తులేమొస్తారు? దేవుడైనా సరే, ప్రాణాల తర్వాతే కదా!’’ అనుకున్నాడు సుందరం. తర్వాత మెట్లమీద బిచ్చగాళ్లని చూస్తూ, ‘‘ఒక్క రోజు డ్యూటీకే నాకిక్కడిలాగుంది. ఈ బిచ్చగాళ్లు జీవితమంతా ఇక్కడే ఉంటారు పాపం’’ అని జాలిపడ్డాడు.
ఇక జిడ్డు సుబ్బడు రాడేమో అనుకునే తరుణంలో- ఉన్నట్లుండి బిచ్చగాళ్ల బొచ్చె గంటల మ్రోత మొదలైంది. సుందరం దృష్టి సారిస్తే- ఓ వ్యక్తి కొండ మెట్లు దిగి వస్తున్నాడు.
‘‘జిడ్డుసుబ్బడు వాడేనా?’’ అని ఓ క్షణం అనుకున్నాడు సుందరం. కానీ సుబ్బడు అతడికి తెలుసు. వాడు మెట్లు దిగి వస్తున్న వ్యక్తి అంత పొడుగుండడు.

ఇంకాఉంది

వసుంధర