డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 49

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
****
నేను సాలెగూడులో చిక్కుకుపోయాను. అసలు ఈ జన్మలో బయటపడలేను. ఇరవై సంవత్సరాలు ఆర్మీలో ఉద్యోగం చేయాల్సిందే. ఎగ్రిమెంటుపైన సంతకం చేశాను. ఇక నాకు ఇక్కడనుండి విముక్తి లేదు. ఇక ఇక్కడ ఉండే ఏమో ఎనె్నన్ని క్రూరకృత్యాలు చేయాల్సి వస్తుందో. నాలో మానవత్వాన్ని సంవేదనను పూడ్చిపెట్టాలి.
ఉత్తరం రాస్తూ- రాస్తూ సందీప్‌కి హృదయ సముద్రంలో భావోద్వేగాల అలలు లేవకుండా అణగిపోయాయా అని అనిపించింది. భావోద్వేగాలు శాంతించాయి. తన డార్క్‌రూము నుండి సందీప్ బయట పడ్డాడు. సగం రాసిన ఉత్తరాన్ని ఈమెయిల్ చేశాడు. మధ్యాహ్నం జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు.
యుద్ధం - బౌద్ధం
చాలా రోజుల నుండి సందీప్ బషీర్ అహ్మద్ అనే ఒక ఇరవై సం.ల వయసుగల యువకుడికోసం గాలిస్తున్నాడు. ప్రయత్నాలు ఫలించాయి. అతడి ఆచూకీ తెలిసింది. అతడు ఒక ఉగ్రవాది. బాబాయి కొడుక్కి స్నేహితుడు. సందీప్ అతడిని విచారించాలనుకున్నాడు. ఆర్మీ ద్వారా నడపబడే వర్క్‌షాప్‌లో ప్రవేశపెట్టాలనుకున్నాడు. దీని వలన ఆర్మీ గురించి అందరికీ మంచి అభిప్రాయం ఏర్పడవచ్చు. అసలు యువకులు ఉగ్రవాదులుగా తయారుకావడానికి కారణాలు ఏమిటో తెలుసుకోలనుకున్నాడు. మూఢ నమ్మకాల నుండి వాళ్లను బయటపడేయాలి. బీదరికాన్ని పోగొట్టాలి. వాళ్లకి విద్యను నేర్పించాలి. విద్యావంతులైతే వాళ్ల జీవితాలు మెరుగవుతాయి. బషీర్ అహమ్మద్‌ని మేజర్ సందీప్ కలవమని చెప్పి ఎన్నోసార్లు సందేశం పంపించాడు. కాని అతడు రాలేదు. చివరికి అతడు రాకపోతే సైనికుడిని పంపిస్తానని, వాడు లాక్కువస్తాడని బెదిరించాడు.
చివరికి బషీర్ వచ్చాడు. వాడు భయంతో బతుకుతున్నాడు. సందీప్ మెల్లిగా అడిగాడు. ‘‘ఏం ఎందుకు రాలేదు ఇన్నిసార్లు పిలిచినా?’’- బషీర్ చెప్పిన జవాబు వినగానే అతడికి కళ్ళు తిరిగినట్లుగా అనిపించింది. ప్రపంచం అంతటా దేశ ప్రజలే కాదు, కాశ్మీర్ సమస్య గురించి మళ్లీ ఆలోచించి తీరాలి అని అనిపించింది. ‘సాహెబ్‌జీ! నేను చాలా భయపడ్డాను. అక్కడికి వెళ్లకు, వెళితే హిందువులందరు నిన్ను కొట్టి కొట్టి చంపేస్తారు’ అని మా ఊరి వాళ్ళందరూ అన్నారు.
‘ఏమిటి?’ ఇదా నా గుర్తింపు. నేను భారతీయుడను కాను. మనిషినీ కాను, మేజర్‌ని కాను, నేను కేవలం ఒక్క హిందువుని మాత్రమే. అసలు ఇది అదే కాశ్మీరమా! ఒకప్పుడు ఇక్కడ సమతాభావం, మతసామరస్యం ఎంతగా ఉండేది. దీని చరిత్ర మహోజ్వలమైనది.
ఈ సంఘటన ఇంకా మనస్సులో మెదులుతూనే ఉంది. ఈ సంఘటన సందీప్ మనస్సును గాయపరిచింది. కాన్సర్ వచ్చిన రోగిలా అతడి జీవితం నడుస్తోంది. ఇంతలో వార్తలందించేవాడు గుడ్‌గాంవ్‌కి చెందిన కుటుంబంలోని యువకుడు జమీల్ ఆరు నెలల క్రితం ఉగ్రవాదిగా మారాడన్న వార్త పంపించాడు.
‘‘ఆశ్చర్యం! ఇంత కఠోరమైన సెక్యూరిటీ వున్నా ఉగ్రవాదులకు శిక్షపడుతున్నా, ఛస్తున్నా, నా ఏరియాలో ఉగ్రవాది ఎట్లా అయ్యాడు?’’ సందీప్ వార్తాహరుడిని అడిగాడు.
‘‘సాహెబ్‌జీ! ఇక్కడ ప్రతీ ఇంట్లో ఇస్లాం అనే కొరడా ఉంటునే ఉంటుంది. ఇక్కడి ప్రజలు జీవితంకన్నా అల్లా, ఖురాన్, నమాజ్, గడ్డం ఉంచుకోవడం, టోపీ ధరించడం అందరికీ ఇష్టం ఎక్కువ. ఎవరైనా జిహాదీ కాగానే వాళ్ల కుటుంబం అంటే భయపడతారు. ఎక్కువ గౌరవం ఇస్తారు. ఎందుకంటే జిహాదీ కాగానే వాళ్ళ కుటుంబాలు ధనవంతులయిపోతాయి. ఆర్థికబలం బోలెడంత లభిస్తుంది. జమీల్ కూడా బీదరికం నుండి విముక్తి పొందటానికి, ఈతి బాధలను జయించడానికి, ఆకలి మంటలు చల్లార్చుకోవడానికి రైఫిల్ పట్టాడు. ఇప్పుడు ఉగ్రవాదుల తాళలయలమీదే నృత్యం చేస్తున్నాడు.
సందీప్ ఇదంతా విన్నాక ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక ఈ ఉగ్రవాదాన్ని మట్టుపెట్టాలి అని నిర్ణయించుకున్నాడు.
రెండో క్షణంలో కళ్లజోడు తీసేసాడు. దీర్ఘంగా శ్వాస పీల్చాడు. ఇక్కడి అందం, చల్లటిగాలులు, సెలయేళ్ళు, అందమైన లోయలు, నీలిమేఘాలు, అందమైన చెట్లు చేమలు ఈ యువకులకు కొంత శాంతినిస్తే ఎంత బాగుంటుంది.
ఈ రక్తపాతం నుండి ఈ హింస క్రూరత్వాలనుండి యువతరాన్ని దూరంగా ఉంచితే ఎంతగా బాగుంటుంది.
మేజర్ సందీప్ ఆ ఇంటిమీద ఒక కనే్నసి ఉంచాడు. ఆ కుటుంబం గురించిన అన్ని వివరాలు రాసి ఉంచిన కాగితాలు సందీప్ టేబుల్‌పై ఉన్నాయి.
ఆ కుటుంబ చరిత్ర, ఆ ఇంటి సభ్యుల జాతకాలను సైతం అతడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. ఒక బీద బి.పి.ఎల్ (బీద వర్గంకన్నా ఇంకా తక్కువగా) కుటుంబం. జమీల్‌కి ఒక చిన్న తమ్ముడు హమీద్. ఒక వయసులో ఉన్న చెల్లెలు. ఆమె పేరు రూబీనా. తల్లి రుక్సానా.
వాళ్ల దగ్గర రెండు గుర్రాలు ఉన్నాయి. వాటిమీద గుల్‌మార్గ్ నుండి నారాయణనాగ్ దాకా సవారీలను తీసుకువెళ్తారు. సీజన్‌లో టూరిస్టులు పెద్ద సంఖ్యలో వస్తే కొంత ఆదాయం లభిస్తుంది. అది వాళ్ల బతుకుతెరువు. అంతో ఇంతో కడుపు నింపుకునే మార్గం ఇది ఒక్కటే. ఇంటి ఎదురుగుండా కొంచెం స్థలం ఉంది. అప్పుడప్పుడు ఆకుపచ్చటి కూరగాయలతో ఆ స్థలం అందంగా అనిపిస్తే అప్పుడప్పుడు కోళ్ళ కొక్కొరకోల ధ్వనులు మారుమోగుతూ ఉంటాయి. జమీల్ జిహాదీగా మారాక పరిస్థితులలో కొంత మార్పు వచ్చింది. పడిపోయిన ఇంటి కప్పును రిపేరు చేశారు.
ఇంకాఉంది

టి.సి.వసంత