డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 54

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
ఇంట్లో అంతా మృత్యువు కంపు కొడుతోంది.
కాని మేజర్ అతడి టీమ్ మాత్రం పక్షుల్లా కలారావం చేస్తున్నారు
దాదాపు ఒక్క సంవత్సరం తరువాత మేజర్ శ్రమకు ఫలితం దొరికింది.
మేజర్ అతడి టీమ్‌ల సంతోషానికి హద్దులు లేవు.
ఒక సక్సెస్ ఆపరేషన్. ఆపరేషన్ క్రెడిట్ మేజర్‌కి దక్కింది.
రాత్రి చిమ్మచీకటి. మేజర్ ఆ ఇంటి చుట్టూ కాపలాదారులని పెట్టాడు. జమీల్ రాత్రిపూటే దొంగతనంగా వస్తాడని వాళ్ల నమ్మకం. రెండు వందల కిలోమీటర్ల దూరంలో హెచ్‌హెచ్‌టిఐ, పిఎన్‌ఎన్‌జీ (రాత్రిపూట ఎంత దూరం అయినా కనపడే కళ్లజోడు) హాండ్ గ్రెనైడ్, రాకెట్ లాంచర్, ఎకె47 మొదలైన వస్తువులను తీసుకుని టీమ్ మొత్తం చీకటిలో దాక్కుని ఉన్నారు. జమీల్ ఇంటివైపు కనే్నసి ఉంచారు.
జమీల్ సరిగ్గా మధ్యరాత్రి భయం, భయంగా ఇంట్లో అడుగుపెట్టాడు.
ఆర్మీవాళ్ళు జమీల్‌ని ఇంట్లోకి వెళ్లనిచ్చారు.
రాత్రంతా ఇంటి చట్టూ కాపలా ఉన్నారు. హెచ్‌హెచ్‌టిఐతో ఆ ఇంటివైపు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు కొలెటరల్ డామేజ్ వీలున్నంతవరకు చేయకూడదనుకున్నారు. ఆర్మీ వాళ్ల రైఫిల్ గుండ్లు కేవలం జమీల్‌కే తగాలాలి. ఒక్క సివిలియన్ అయినా గాయపడకూడదు. ఇంటిని కూల్చకూడదు. ఇది వాళ్ల ధ్యేయం. ఒకసారి ఆపరేషన్ సమయంలో వాళ్లు కొంచెం తొందరపడటం వలన చుట్టుప్రక్కల ఇళ్లు ఖాళీ చేయించినా, మిలిటెంట్ ఉన్న ఇంటిపై రాకెట్ లాంచర్ విసిరారు. ఆ ఇల్లు అంతా కూలిపోయింది. తరువాత హ్యూమన్ రైట్స్ డిపార్టుమెంట్ వాళ్లు ఆర్మీ వాళ్ళపై కేసు పెట్టారు. ఆ ఇంటిని పడగొట్టకుండా ఉండే అవకాశం ఉంటే ఎందుకు పడగొట్టారు అని అడిగారు.
ఈసారి తొందర పడకూడదు అని వాళ్లు నిర్ణయించుకున్నారు.
ధైర్యంగా నెమ్మదిగా ఆలోచన చేసి యాక్షన్ తీసుకోవాలనుకున్నారు.
మరుసటి రోజు కూడా కాపలా ఉన్నారు.
ఆర్మీ కళ్లన్నీ ఆ ఇంటిమీదే.
రెండో రాత్రి గడిచిపోయింది.
మూడో రోజు మధ్యాహ్నం ఆర్మీ అనుకున్నట్లుగానే జమీల్ బయటికి వచ్చాడు. బయట చూసి ఎవరు లేకపోతే వెళ్లిపోదామనుకున్నాడు జమీల్. ఆర్మీ ఫైరింగ్ మొదలుపెట్టింది. వెంటనే అతడు లోపలికి వెళ్లి దాక్కున్నాడు.
ఇక మొదలయింది. ‘డుయెల్ కాంటెక్ట్’ అంటే ఆర్మీ జమీల్ ఎదురెదురుగా ఉన్నారు. తనని అందరు చుట్టుముట్టారని జమీల్‌కి అర్థం అయింది.
ఇక ఇప్పుడు జమీల్‌ని చంపడం శాంతియుతంగా ప్లాన్డ్‌గా జరిగింది. లౌడ్ స్పీకర్‌లో చెప్పడం మొదలుపెట్టారు. చుట్టుప్రక్కల ఇళ్లు అన్నిటిని ఖాళీ చేయించారు. ఊరి వాళ్ళందరిలో ఒక్కొక్కరిని విచారణ జరపడం మొదలుపెట్టారు. జమీల్ ఫొటో మేజర్ దగ్గర ఉంది. నల్లటి నకాబ్‌ని ముఖంమీద తగిలించుకున్నారు.
ఇప్పుడు చుట్టుప్రక్కల అంతా ఖాళీగా ఉంది.
మూడు కోణాలు కల గుడిసె లాంటి ఇంట్లో జమీల్ ఒక్కడే ఉన్నాడు. అతడికి దాపు 200 గజాల దూరంలో మేజర్ సందీప్ ఉన్నాడు. అతడి టీము ఉంది.
జమీల్ లోపల నక్కి నక్కి కూర్చున్నాడు.
ఆర్మీ బయట కాపలా కాస్తోంది.
అతడు ఒంటరివాడు.
మొత్తం యూనిట్ వుంది.
మరో రాత్రి గడిచింది.
పధ్నాలు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి జమీల్ మరొకసారి బయటికి తొంగిచూసాడు.
ఇంతలో బయట నక్కి కూర్చున్న సిపాయిలు ఫైరింగ్ చేశారు.
గుండు జమీల్ నుదుటిన తగిలింది. జమీల్ కిందపడిపోయాడు.
దీపం ఆరిపోయింది.
ప్రమాదాలతో కూడిన ఒక దుర్భర దుస్సాహ జీవితం ఆ సమయంలో అంతం అయింది.
మేజర్ యూనిట్ సంతోషానికి హద్దులేదు. కొలేటరల్ డామేజ్ జరగకుండా వాళ్ళు మిషన్‌లో విజయం పొందారు.
ఆర్మీ వాళ్లు జమీల్ శవాన్ని తొమ్మిది ఫీట్ల పొడగాటి ఇనుప హుక్‌గల కర్రతో లాగారు. మిలిటెంట్ల మృతదేహంలో కూడా గ్రెనైడ్‌లు ఉంటాయి. మృతదేహాన్ని వెతికే సైనికుడికి తగిలి చచ్చిపోతాడు. మిలటరీకి మిలిటెంట్లమధ్య ద్వేషం మాత్రం అట్లాగే ఉంటుంది.
జమీల్ ముఖం పాలిపోయింది. దేహం అంతా రక్తసిక్తం అయింది. శవపరీక్ష జరిగాక ఆర్మీ ఎంతో మర్యాదగా పోలీసులకు అప్పజెప్పింది. పోలీసులు శవాన్ని వాళ్ల ఇంటివాళ్లకి ఇచ్చేశారు.
ఇజలాహ్ మజీద్ అన్న మాటలు సందీప్‌కి గుర్తుకురాసాగాయి. ఇది జరగదు అని అనుకుంటావు. కాని ఆకాశం భూమి తల్లకిందులు కావచ్చు. కళ్ళు చూడవచ్చు, కాని చూడవు. ఆత్మీయుడు కాకపోవచ్చు. అయినా చనిపోయిన వాడి గుర్తులు మాసిపోవు. అతడు ఇక్కడే ఎక్కడోక్కడ ఉంటాడు.
ఎముకలు కొరికే చలి. కాని కప్పుకుందామంటే కంబళి లేదు. తన ఉదాశీనత్వానే్న కప్పుకున్నాడు. ఈ ఉదాశీనత ఇచ్చే వేడి చాలు దేహాన్ని చలి నుండి రక్షించడానికి.
ఉదాసీనత బరువైపోయింది. భరించలేకపోయాడు. గాయం నుండి టప్.. టప్.. అంటూ పడే రక్తంలా అంతరంగపు పొరలనుండి టప్ టప్ అంటూ శబ్దాలు పొరలి వచ్చాయి. భారతదేశంలోని ఈ ముక్కను సృష్టికర్త ఏ కాళరాత్రి సృష్టించాడో తెలియదు.

- ఇంకా ఉంది