డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 60

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
సిద్ధార్థ సందీప్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. నిరాసక్తతో బతుకునీడుస్తున్న గాయపడ్డ సందీప్‌కి ఒక నీడ కావాలి. ఒకరి చేయూత కావాలి. ఒక స్ర్తి స్నేహితురాలైనా భార్య అయినా కావాలి. ఆ గాయాన్ని మాన్పడానికి, మళ్లీ నిలదొక్కుకోడానికి, ప్రేమతో పలకరించే మళ్లీ సందీప్‌లో బతుకుపై ఆశ చిగురించేలా చేయడానికి ఒక ప్రేమమయి, దయామయి కావాలి. కాని ఎట్లా? సందీప్ రుబీనా వైపు ఆకర్షితుడవుతున్నాడు.
‘‘బావగారూ! ఏ లోకంలోకి వెళ్లిపోయారు?’’ మరదళ్లు సిద్ధార్థని ఈ లోకంలోకి తీసుకువచ్చారు.
ఎదురుగుండా ఒక అద్భుతమైన దృశ్యం. వధువు సందీప్ కాళ్ళని గట్టిగా పట్టుకుని వదలడం లేదు. తక్కిన వధువులలా బావగారిని వెండి, బంగారాలు ఇవ్వమని అడగలేదు. మణులు మాణిక్యాలు అడగలేదు. విదేశీయాత్ర కోసం టికెట్ అడగలేదు. త్వరలో తోడికోడలిని తెస్తానని హామీ ఇచ్చేదాకా చరణాలను వదలనంది.
సందీప్ ముఖంలో కోపం, హాస్యం కలబోసిన ఒక భావోద్వేగం కనబడుతోంది. కొందరి జీవితాల్లో కథలు పూర్తికాకుండా ఉండటం కోసమే మొదలవుతాయి అని అందామనుకున్నాడు. కాని అసలు నువ్వు కాళ్ళు వదిలితే కదా నీకు తోడికోడలను తీసుకువచ్చేది అని అన్నాడు.
సిద్ధార్థ జీవితంలో ఆ రాత్రి అతి ముఖ్యమైన రాత్రి. ఈ రోజు తన అన్నయ్య సందీప్ హృదయంలో జొరబడి అసలు విషయం తెలుసుకోవాలి. ఇక తను అసలు విషయం తెలుసుకోకుండా ఏ మాత్రం సందీప్‌ని వదలకూడదు. తనకు ఒక అస్త్రాన్ని ఉపయోగించే అవకాశం దొరికింది. ఈ బాణం అతడికి తగిలి తీరుతుంది అని అనుకున్నాడు సిద్ధార్థ.
సాయంత్రం అవుతుండగా సందీప్ దగ్గరికి సిద్ధార్థ వచ్చాడు. అన్నయ్యా నువ్వు ఎప్పటిదాకా అయితే అన్ని విషయాలు చెప్పవో, అసలు నువ్వు ఎందుకు పెళ్లిచేసుకోవడం లేదో చెబితే కాని నేను నా మొదటి రాత్రిని జరగనివ్వను. అమ్మ నాన్నల కోసం నీ బలవంతం వలన నేను పెళ్లి చేసుకున్నాను కాని..’’ అతడి కంఠం ఒణికింది.
ఇదేమిటి ఇట్లా అంటున్నాడు! సందీప్‌కి తల తిరిగినట్లుగా అనిపించింది. వాడికి నా పెళ్లి విషయమే దొరికిందా! సిద్ధార్థ ముఖాన్ని చూసాడు. కొత్తగా పెళ్లి అయింది. కోరికలు ఉత్తేజనలమీద ఉదాశీనత అనే పల్చటి ముసుగు.
ఆర్మీలో పనిచేస్తూ కొంత భావోద్వేగాలను అదుపులో పెట్టుకునే అలవాటు చేసుకున్నాడు. అయినా కోపం ఆపుకోలేక అడిగాడు. ‘నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా?’
‘‘నేనేమీ బ్లాక్‌మెయిల్ చేయడంలేదు. జీవితంలో వచ్చే సమస్యలని ధైర్యంగా ఎదుర్కోవాలి కాని ఇట్లా ఎస్కేప్ కావడానికి చూడకూడదు అన్నయ్యా. నీ జీవితం నీ ఒక్కడిదే కాదు అందరి జీవితాలతోనూ ముడిపడి వుంది. నాకు తెలుసు, నువ్వు ఎవరికోసమో ఎదురుచూస్తున్నావు. మేజర్ సుఖవంత్ నాకు అన్ని విషయాలు చెప్పారు. కాని నాకు అసలు సత్యాన్ని నీవు చెబితేనే వినాలని వుంది.’’
సందీప్ ముఖం వాడిపోయింది. రుమాలుతో ముఖాన్ని తుడుచుకున్నాడు. మాట్లాడడం మొదలుపెట్టాడు- సిద్ధార్థా! నేను ఇక్కడినుండి వెళ్లిపోయే ముందు నీకు సత్యాలు, రహస్యాలు అన్నింటిని గురించి చెబుతాను. కాని ఈ రాత్రిని నీవు చేజార్చుకోవద్దు. ఈ రాత్రి మీ ఇద్దరి జీవితాల్లో ఓ కొత్త వసంతాన్ని తెస్తుంది. కలలు పండే రాత్రి ఇది. సీమ నీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆమె కలలు పండించడం నీ కర్తవ్యం.. వెళ్ళు.. అతడి కంఠం వణికింది. ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సిద్ధార్థ నుదుటిని చేత్తో నిమిరాడు. ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. ఎట్లాగొట్లా తన మాటని పూర్తిచేయాలని ప్రయత్నించాడు. ‘‘సిద్ధార్థా నన్ను నమ్ము, ఒక రాత్రిలో ఏమీ మించిపోదు. రేపు మధ్యాహ్నంకల్లా అతిథులు వెళ్లిపోతారు. సాయంత్రంకల్లా నీకు అన్ని విషయాలు చెబుతాను. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. ఒక సైనికుడిగా.. ఒక అన్నయ్యగా..’’.

రాత్రి గడిచిపోయింది.. తెల్లవారింది.
సందీప్ సిద్ధార్థకి ఇంటి నౌకరు రామలఖన్ ద్వారా ఒక పెద్ద కవరు పంపించాడు. సిద్ధార్థ కవరును చింపాక ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అందులో సందీప్ రాసిన పెద్ద ఉత్తరం ఉంది.
సిద్ధార్థా!
నేను ఈ ఉత్తరంలో ఏదీ దాచకుండా నిజాయితీగా నీకు అన్ని విషయాలు తెలియపరుస్తున్నాను. ఇప్పటివరకు నేను జీవించిన జీవితం గురించి ఆలోచిస్తే కొన్ని సత్యాలను తెలుసుకోగలిగాను. అసలు కొందరి జీవితాలే అంత. వాళ్లెప్పుడూ జీవితాన్ని జీవించరు. జీవితం గురించి తెలుసుకోవడంలోనే సమయం గడిచిపోతుంది. నా బతుకు కథ కూడా ఇంతే. జీవితాన్ని ఎంతగా అర్థం చేసుకోవాలని ప్రయత్నించానో అంతగా అందులో నేను అందులో చిక్కుకుపోయాను. నేను ఎంత దగ్గరిగా వద్దామనుకున్నానో అంతగా అది నన్ను దూరం తోసేసింది.
అసలు నా కథకు బీజాలు పడ్డది బాల్యంలోనే. సీతాకోక చిలుకలను చిట్టి చేతులతో పట్టుకునే బాల్యంలోనే ఏదీ ఆలోచించకుండా ఒక కలని కన్నాను. కాని నిజానికి తెలుసుకుని అర్థం చేసుకుని కల కంటే అది కల ఎట్లా అవుతుంది. నేను ఆర్మీలో చేరాలనుకున్నాను. సైనికుడినై దేశ సేవ చేయాలనుకున్నాను.

- ఇంకా ఉంది

టి.సి.వసంత