డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 61

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
అసలు సైనికుడి జీవితంలో ఎన్ని తుఫానులు లేస్తాయో, ఎంత కఠోరమైన జీవితమో, ఎన్ని ప్రమాదాల మధ్య బతుకు బండిని ఈడవాలో అప్పుడు నాకేం తెలుసు? తీయటి కలలు కనే వయస్సు.
పిల్లల జీవితాలపై తండ్రుల జీవితాల ప్రభావం ఎంతగా వుంటుందో ఇప్పుడు తెలుసుకున్నాను. సంసారం, పిల్లలు, జంజాటం- ఇవేగా నాన్నగారి జీవితం. ఆయన జీవితంలో ఏముంది శూన్యం తప్పిస్తే. ఈ శూన్యాన్ని దాచడానికి ఎనె్నన్ని ప్రయత్నాలు. నేను సత్యం - శివం - సుందరం కోసమే జీవించాలని అనుకున్నాను. ఆర్మీ వీటికి ప్రతీక అని అనుకున్నాను. నా ఎదురుగుండా ఒకే లక్ష్యం సైన్యం. ఒకవేళ నాన్నగారి జీవితం ఒక వ్యాపారి జీవితం కాకుండా ఉంటే నా జీవితం ఎన్నటికి ఇట్లా ఉండేది కాదు. బహుశ ప్రతి కొత్తతరం పాతతరంలా కాకుండా మరో కొత్త జీవితాన్ని కోరుతుంది. ఎందుకంటే తమ ముందు తరం వారి కష్టాలు కన్నీళ్లు వాళ్లు చూస్తూనే ఉంటారు కనుక.
అందుకే ఆర్మీ అంటే ఎంతో ఇష్టపడే కర్నల్ వాజ్‌పేయి ఆర్మీలో పైపోస్టులు ఖాళీగా ఉన్నాయని బాధపడుతూ ఉంటారు. కాని కర్నల్‌కి రెజిగ్నేషన్ పేపర్లు ఇచ్చినపుడు అసలు నేను వ్యక్తిగతంగా ఏ కారణాలవలన రిజైన్ చేస్తున్నానో అన్న ఆలోచన కూడా ఆయనకి రాలేదు. ఇవాళ నేను నా కోసం జీవించాలనుకుంటున్నానా లేక ఆర్మీ కోసమా! నా కోసమే.. అవును.. రుబీనా నా జీవితంలో ఒక రంగుల కల. ఆమె ఎంతో పవిత్రమైనది. ఆమె ఆకలి మంటలను చూసింది. క్షణ క్షణం చస్తూ బతికింది. ఎన్నో కష్టాలను ఎదుర్కొంది.
కర్నల్ వాజ్‌పేయి నా నిస్సహాయ స్థితిని అర్థం చేసుకోలేకపోయాడు. నేను ఎక్కువ జీతం కోసం, హైగ్రోత్ కోసం ఆర్మీని వదిలేస్తున్నానని ఆయన అనుకున్నారు. ఆయన నాతో అన్నారు- ‘‘నాకు తెలుసు నువ్వు ఎందుకు ఆర్మీనుండి వెళ్లిపోవాలనుకుంటున్నావో.. ఈ రోజు ఆర్మీ యువతులను ఆకర్షించలేకపోతోంది. వాళ్ల కలలను పండించలేకపోతోంది. ఈ తరంలోని వారికి ఆర్మీలో ఏ మాత్రం ఇష్టం లేదు. అందువలనే 40వేల ఆఫీసర్ల పోస్టులలో దాదాపు పదకొండువేల ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసలు నేను ఎన్నోసార్లు ఆలోచించి ఆశ్చర్యపోతాను. నేను ఆర్మీలో ఇరవై సంవత్సరాల తరువాత ఏ రాంకుకు వచ్చానో, నా ఐఎఎస్ స్నేహితుంలదరూ ఆరు సంవత్సరాలలో ఈ రాంక్‌కి వచ్చేస్తారు. నాకన్నా 20 శాతం జీతం ఎక్కువ వాళ్లకి. ఆ క్షణాలు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి. టీ తాగుతూ వాళ్లు ఎంతో బాధగా అన్నారు. ‘‘్భరుూ! ఇంకో ఇరవై సంవత్సరాల తరువాత కోతుల చేతుల్లో ప్లానింగ్, డిఫెన్స్ స్ట్రేటజీ ఉంటుంది. పాకిస్తాన్ తన జిడిపిలో మూడున్నర శాతం ఆర్మీకి ఖర్చుపెడుతుంది. కాని మనం 1.99 శాతం మాత్రమే ఖర్చుపెడతాం. ఇక ఆర్మీ వాళ్లు వాళ్ల సైన్యాన్ని ఏ విధంగా మట్టుపెట్టగలుగుతారు.
తమ్ముడూ! అసలు సత్యాలను వినడానికి ఎవరు తయారుగా లేరు. నేను ఎంత అనుకున్నా ఉన్నది ఏదో, ఏది సత్యమో ఈ రెండింటిమధ్య ఉన్న గోడను పగులగొట్టలేకపోయాను. ఒకప్పుడు నేను ఒంటరితనానికి భయపడేవాడిని, బాధపడేవాడిని. ఇప్పుడు లోకానికి భయపడుతున్నాను. అసలు నేను కళ్లు మూసుకున్నప్పుడు మూసి ఉన్న నా కనురెప్పల మధ్య యువతరం స్వప్నాలు కాకుండా అసలు సత్యాలు కనిపిస్తూ ఉంటాయి. నేను ఏ సత్యాలనైతే గొంతు చించుకుని నాపై ఆఫీసర్లకి చెప్పాలనుకున్నానో, ఆ సత్యాలే కదలాడుతాయి. కాని ఏం లాభం వాళ్లు చెవులని గట్టిగా మూసుకున్నారు. అసలు ఏదీ వినడం వాళ్లకి ఎంతమాత్రం ఇష్టం లేదు.
మేము ఆపరేషన్ ఫ్రైడేను పాటిస్తున్నపుడు మా మీద పొలిటికల్ ప్రెషర్ ఎంతో ఉంటుంది. ఉగ్రవాదులను పట్టుకుని తీరాలి అని వాళ్లు ఫోర్సు చేస్తారు. మేం ఒకసారి ఆ ఊళ్లో ఉండే ఒక అనుమానాస్పదుడిని పట్టుకున్నాము. అతడి స్నేహితుడి సోదరుడు ఉగ్రవాది. అతడు అప్పుడప్పుడు స్నేహితుడింటికి వెళ్తూ ఉండేవాడు. నిజానికి ఇందులో అతడి అపరాధం ఏమీ లేకపోయఉండవచ్చు. లేకుంటే ఉండవచ్చు.మా దగ్గర సరియైన సమాచారం లేదు. మా కమాండర్ల దృష్టి ఆ ఇంటిమీద ఉంది. అతని మీద మాకు అనుమానం కలిగేట్టుగా అతని చర్యలుసాగాయ. ఒకానొక సారి అనుకోకుండానే కాల్పుల్లో అతడు చనిపోయాడు. కాని అతని దగ్గర మాకు ఏమీ దొరకలేదు కాని ఒకప్పుడు మాకు రైఫిల్స్ ఉగ్రవాదుల దగ్గరే దొరుకుతాయ. ఎక్కడైనా ఉగ్రవాదులను చంపినపుడు వాళ్ల దగ్గర దొరికిన రైఫిల్స్‌నన్నింటిని రిజిస్టర్‌లో ఎంట్రీ చేయడానికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతుంది. అట్లాంటివి మా దగ్గరే ఉంటాయి. ఒక్కొక్కసారి నిర్దోషులు ఉగ్రవాదులనుకొనే ప్రమాదాలు జరుగుతుంటాయ. అందుకే మాకు ఎపుడు అప్రమత్తత అవసరమని మా కమాండర్స్ అంటుంటారు. పైగా అందరినీ అనుమానదృక్కులతో చూస్తుంటాము. కాని వారిలో నిజాయతీ పరులు ఉన్నారేమో అని కూడా మాకు కన్నులు కనిపెడుతూనే ఉంటాయ. కాని మామూలు పౌరులు కూడా ఇలా కాల్పుల్లో చనిపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. కాని, ఇదంతా సామాన్యులకు అర్థంకాని విషయం. ఆశ్చర్యం! ఈ భారత భూమి మీదే మన పూర్వజులు సత్యం, శివం, సుందరంల తత్వాన్ని బోధించారు. అంతటా ఇవే ఉండాలని ఆశించారు.

- ఇంకా ఉంది

టి.సి.వసంత