డైలీ సీరియల్

యమహాపురి-21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదైనా రోగంతో చచ్చిపోయాడా, లేక నువ్విచ్చిన ప్రసాదంలో విషముందా- అన్నది పోస్టుమార్టంలోనూ, ఫోరెన్సిక్ టెస్టుల్లోనూ తేలుతుంది. ప్రస్తుతానికి నిన్ను అరెస్టు చెయ్యక తప్పదు’’ అన్నాడు సుందరం.
అరెస్టు అన్నమాట విని యువకుడు కంగారు పడ్డాడు, ‘‘సార్! ఈ బిచ్చగాడికేదో జబ్బుండి ఉంటుంది. ఆకలికాగలేనని కాళ్లా వేళ్లా పడితే, నా కోసం తెచ్చుకున్న ప్రసాదం వీడికి పెట్టాను. వీడు తినకపోతే, నేను తినాల్సిన ప్రసాదం సార్ అది! నాకోసం నేను విషమెందుకు తెచ్చుకుంటాను సార్! పోనీ వీణ్ణిచంపడానికే తెచ్చాననుకుందా మనుకున్నా- హత్యకి మోటివ్ ఉండాలి కదా!’’ అన్నాడు.
‘‘ఒక్క రూపాయి కోసం హత్యలు జరిగిపోతున్న రోజులివి. మోటివ్ నేను చెబుతా విను. నువ్వు నిరుద్యోగివి. డబ్బవసరం బాగానే ఉంది. స్వయంగా అడుక్కోలేక, అడుక్కుతినేవాళ్లని విషం పెట్టి చంపి దోచుకోవడం మొదలెట్టావు. ఈ రోజు ఇక్కడికి అందుకే వచ్చావు’’ అన్నాడు సుందరం.
‘‘మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు’’ అన్నాడు యువకుడు.
సుందరం కొనసాగించాడు. ‘‘చదువుకున్నవాడివి. తెలివైనవాడివి. నీ చదువు, తెలివి- సంపాదనకు పనికిరాలేదు. దాంతో బుద్ధి పెడదారులు తొక్కింది. పకడ్బందీగా పథకం వేసి- ఇంటినుంచి విషాహారం తెచ్చుకొన్నావు. మెట్ల చివరున్నాడు కదా, వీణ్ణి చంపడం సులభమనుకున్నావ్! బిచ్చగాడే కదా, ఎవరూ పట్టించుకోరనుకున్నావ్. నీ పథకం ఫలించేదే కానీ సమయానికి నేనిక్కడుండడం నీ దురదృష్టం. నా సంగతి నీకు తెలియదు. నేను హోదాకి భయపడను. డబ్బుకి లొంగను. ఎంత క్లిష్టమైన కేసైనా నిగ్గు తేల్చేదాకా నిద్రపోను. ఎంత ప్రమాదకరమైన కేసైనా ప్రాణాలొడ్డి సాల్వ్ చేస్తాను’’ సమయం వచ్చిందని తన గురించి కూడా కాస్త డబ్బా కొట్టాడు సుందరం.
‘‘సార్! మీరు సామాన్యులు కారని చూడగానే తెలిసిపోయింది నాకు. మనిషిని చూసి ఎలాంటివాడో పట్టేసే సత్తా ఉంది మీకు. అందుకే వేడుకుంటున్నాను. ఒక్కసారి నన్ను చూడండి సార్ నేను చాలా మామూలు మనిషిని’’ అన్నాడు యువకుడు దీనంగా.
సుందరం యువకుడి భుజం తట్టి ‘‘టెక్నాలజీ చాలా ఇంప్రూవైపోయింది. మొహాలు చూసి అంచనా వేసే రోజులు కావివి. ఐతే మా పరిశోధన పక్కాగా వుంటుంది. ఇన్స్‌పెక్టర్ శ్రీకర్ గారున్నారే- ఆయన నేరస్థులకి సింహస్వప్నం. అమాయకులకి సుందర స్వప్నం. నువ్వే తప్పూ చెయ్యకపోతే నీకే అన్యాయం జరగదు. ఇప్పుడు మాత్రం నువ్వు నాతో స్టేషనుకి రావాలి’’ అన్నాడు.
‘‘నిరుద్యోగిని సార్! హత్య కేసులో ఇరుక్కుంటే నాకిక భవిష్యత్తుండదు’’ యువకుడి కళ్ళలో నీళ్ళు.
‘‘ఆ విషయం మా వాణ్ణి చంపేముందు ఆలోచించుకోవాలి’’ అన్నాడు అక్కడున్న ఓ బిచ్చగాడు.
యువకుడేదో అనబోయాడు కానీ నోట మాట రాలేదు. ఈలోగా సుందరం అంబులెన్స్ కోసం ఫోన్ చెయ్యడానికి మొబైల్ తీశాడు.
తనకి అరెస్టు తప్పదని యువకునికి అర్థమైపోయింది. అతడోసారి చుట్టూ చూసి, చటుక్కున పరుగు లంకించుకున్నాడు.
‘‘సార్- వాడు పారిపోతున్నాడు’’ అన్నాడో బిచ్చగాడు.
సుందరం ఉలిక్కిపడి మొబైల్ ఆఫ్ చేశాడు. ‘‘ఏమిట్రా చూస్తున్నారు. మీరూ పరుగెత్తండి, వాణ్ణి పట్టుకోండి’’ అంటూ అరిచి తనూ పరుగెత్తాడు.
యువకుడు ప్రాణాలకు తెగించి పరుగెడుతున్నాడు. సుందరం తన శక్తినంతా జోడించి అనుసరిస్తున్నాడు.
అలా ఓ ఐదు నిముషాలు. అంతే వెనుక నుంచి ఓ రాయి తగిలి సుందరం వీపు చురుక్కుమంది. ఎవరా అని వెనక్కి తిరిగితే- బిచ్చగాళ్ళు. నలుగురూ ఉన్నచోటనే ఉండి చేతికి దొరికిన రాళ్లు విసురుతున్నారు. అవి హంతకుడికి కాదు, తనకి తగులుతున్నాయి.
సుందరం ఇస్సురని నిట్టూర్చి ముందుకి తిరిగితే- యువకుడు మాయమయ్యాడు.
అంతలో జేబులో మొబైల్ మ్రోగింది. ‘‘్ఫన్‌కి ఇదా సమయం?’’ అనుకుంటూ చిరాగ్గా చూస్తే- ఆ నంబరు ఇన్స్‌పెక్టర్ శ్రీకర్‌ది. ‘‘చెప్పండి సార్!’’ అన్నాడు సుందరం నీరసంగా.
‘‘సుబ్బడు కనిపించాడా?’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఇంతవరకూ లేదు సార్!’’
‘‘మరి కాసేపు వెయిట్ చెయ్యి. ఉన్నచోటునుంచి కదలకు. జిడ్డు సుబ్బడి విషయం తెలుసుగా. ఇలా ప్రత్యక్షమై అలా మాయమైపోగలడు’’ అన్నాడు శ్రీకర్.
‘‘కదలకూడదనే అనుకున్నాను. కానీ కదలక తప్పలేదు సార్!’’ అన్నాడు సుందరం.
‘‘ఏమయింది?’’
సుందరం అతడికి జరిగింది చెప్పాడు.
‘‘గుడ్ వర్క్! బిచ్చగాడి హత్యే కదా అని తేలికగా తీసుకోనందుకు- నిన్ను అభినందిస్తున్నాను. పారిపోయినవాడి గురించి బెంగెట్టుకోకు! వాణ్ణి నువ్వు చూశావు. అక్కడున్న బిచ్చగాళ్ళు చూశారు. మనిషి దొరికితే గుర్తుపట్టడం కష్టమేం కాదు. అంబులెన్స్‌కి నేను ఫోన్ చేస్తాను. నువ్వక్కడే వుండు’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఓకే సర్!’’ అని నీరసంగా వెనక్కి వెళ్లాడు సుందరం.
‘‘వాడు దొరకలేదా బాబూ!’’ అన్నాడు అక్కడున్న ఓ బిచ్చగాడు.
ఆ మాట వినగానే సుందరానికి మండిపోయింది, ‘‘మావాడు మావాడని ఇందాకా తెగ ప్రేమ ఒలకబోశారు. మీవాణ్ణి చంపినవాడు పారిపోతుంటే పట్టుకుందుకు ఒక్కడు ముందుకు రాలేదు’’ అన్నాడు.

ఇంకా ఉంది

వసుంధర