డైలీ సీరియల్

బడబాగ్ని-11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయినా తన పిచ్చిగాని వాడు రాత్రికి రాక ఎక్కడికి పోతాడు.. వాడు యింటికి వచ్చి తన కాలు డ్రెస్సింగ్ చేసుకోకుండా ఎట్టి పరిస్థితిలో కుదరదు.. కనక వాడు రాత్రికైనా సరే ఇక్కడికి వచ్చి తీరతాడు.. తన గాలానికి చిక్కితీరతాడు.. తను అనవసరంగా హైరానా పడకుండా.. ఆరామ్‌గా తిని రెస్ట్ తీసుకోవడం బెటర్..
లేచి ఫ్రెష్ అయి కిచెన్‌లోకి వెళ్ళాడు.. అక్కడ ఫ్రిజ్‌లో వున్న బ్రెడ్ జామ్ తిని పాలు కాచుకు తాగాడు.. ఏం చెయ్యాలిప్పుడు? ఈ రాహుల్‌గాడు.. వాడి వాటితో బాటు తన మొబైల్.. లాప్‌టాప్ కూడా పట్టుకుపోయాడు. ఇప్పుడు టైం పాస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి.. పోనీ ఆ చెత్త బుక్స్ చదువుదామా కాసేపు? ఆలోచిస్తూ వంటగది కిటికీలోంచి బయటకు చూసిన అనే్వష్ ఆనందంతో తలక్రిందులయ్యాడు. ఆహా అదృష్టం ఉన్నవాడిని సప్త సముద్రాల అవతల పారేసినా ఏదో ఒక మార్గం దొరుకుతుంది కార్యసాధనకు.. అన్నది ఎంత నిజం.. అజిత్ తల్లి, తండ్రి నడుచుకుంటూ రావడం కనబడింది.. ఒక్క క్షణం తన అదృష్టానికి తనే మురిసిపోయాడు.
‘‘వీళ్లేమిటి ఈ టైంలో.. పోనీలే నా అదృష్టం బాగుంది.. ఇప్పుడు వీళ్ల కంటబడకుండా దాక్కుని నెమ్మదిగా బయటపడితే.. తరువాత సంగతి తర్వాత చూసుకోవచ్చు..’’ అనుకుంటూ గబగబా చాప తన చుట్టూ చుట్టేసుకుని గుమ్మానికి వీలైనంత దగ్గరగా ఉన్నాడు.. అవకాశం చిక్కగానే బయటికి జంప్ చేసే ఉద్దేశ్యంతో.
తాళం తీసుకుని లోనికి వచ్చిన అజిత్ తండ్రి.. ‘‘యిదేమిటి.. చెప్పాపెట్టకుండా ఎక్కడికి పోయాడు నీ ముద్దులకొడుకు’’.
‘‘వాడేమీ చెప్పా పెట్టకుండా వెళ్ళ్లలేదు. ఈ రోజు అక్కడ కాలేజ్‌లో ఏదో సెమినార్ వుంది, తప్పక హాజరుకావాలి అని చెప్పాడు.. మనల్ని కోర్టుకి వెళ్లి అజిత్ విషయంలో ఏమైనా డెవలప్‌మెంట్స్ ఉన్నయేమో చూసి రమ్మన్నాడు... మీరెంత వాడిని ఈసడించుకున్నా.. దూరం పెట్టినా వాడికి తమ్ముడంటే ప్రాణం..’’ చేతిలో బాగ్ ఓ పక్కకి పెడుతూ అంది.
‘‘మరే ప్రాణం తీసేటంత ప్రాణం’’ ఉసూరుమన్నాడు అనే్వష్.
‘‘అది సరే వాడు లేనప్పుడు.. వాడు ఇంట్లో లేడని తెలిసి ఇప్పుడు ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చినట్లో..’’ అనే్వష్ మనసులో మాట తెలిసినట్లు అడిగాడు ఆయన.
‘‘మరే, మనం అజిత్ కేసు గొడవలో పడి.. రాహుల్‌ని అస్సలు పట్టించుకోవడమే కుదరటంలేదు.. వాడు ఉంటే ఎటూ ఒప్పుకోడు.. కోర్ట్ మళ్లీ నాలుగు రోజుల దాకా లేదు ఎటూ.. అందుకే కాస్త వీడి రూం సర్ది కాస్త కావలసిన వస్తువులు అమర్చివెడదాం.. ఏమిటో చేస్తున్న మంచి ఉద్యోగం మానేసి.. ఇక్కడ ఈ అరకొర కాలేజ్‌లో తక్కువ జీతానికి ఈ ఉద్యోగం ఎందుకో.. తమ్ముడు ప్రమాదంలో ఉన్నాడేమో అనిపిస్తోంది.. ఎందుకో గాభరగా అనిపిస్తోంది.. అందుకే వాడికి దగ్గరగా ఉండటం కోసమే.. యిలా చేసాను’’ అంటాడు.. మనసులో అంత అభిమానం పెట్టుకుని.. బద్ధశత్రువుల్లా ఎందుకుంటారా.. యిద్దరూ.. అయినా ఆ పాపం అంతా మీదే.. పెళ్లికి ముందు ఆ బిడ్డా నా బిడ్డే... వాడిని .. నిన్ను ప్రాణంలా చూసుకుంటాను అన్న మీరే.. పెళ్లి జరిగిన నాటినుంచే వాడిని మీ బద్ధ శత్రువులా చూసేరు..
‘‘ఏదైనా గానీ పెద్ద వాడికి అజిత్ మీద ఎంత ప్రేమో చూడండి.. పైకి చెప్పకపోయినా.. అందుకే మంచి ఉద్యోగం వదులుకుని వీడి కేసు సంగతి చూడడానికే ఇక్కడ ఉంటున్నాడు.’’ అంది నీరజ... అజిత్, రాహుల్ తల్లి.
‘‘ఊ.. ’’ ఏమనాలో తెలియక అయిష్టంగా మూలిగేడు తండ్రి విష్ణువర్థన్.
‘‘ప్రేమా.. గాడిద గుడ్డా.. వాడిని కేసులో యిరికించి ఉరికంబం ఎక్కించాలని చూస్తున్నదే వాడు..’’ మనసులోనే పళ్లు పటపటలాడించాడు అనే్వష్ చాప చుట్టలోంచే.
‘‘యిదిగో నీరూ.. తల పగిలిపోతోంది కాస్త కాఫీ యిస్తావా’’ తల చేత్తో రుద్దుకుంటూ అడిగాడు.
‘‘యిదిగో క్షణంలో తెస్తా.. కాస్త ఆ వీధి తలుపు దగ్గరకి వేసి.. అలా రిలాక్స్ అవండి..’’ సంచిలోంచి పాల పేకెట్ తీసుకుని వంట గది వైపు వెడుతూ అంది.
‘‘అలాగే’’ అంటూనే ఆయన వీధి తలుపు గడియ వేసి.. బాత్రూంలోకి వెళ్లాడు.. అదే అదనుగా చటుక్కున చాపలోంచి యివతలికి వచ్చి చప్పుడు కాకుండా వీధి తలుపు తీసి బయటకు జారుకున్నాడు అనే్వష్, తలుపు మెల్లిగా జారవేసి.
‘‘అమ్మయ్యా.. అదృష్టం బాగుండి మొత్తానికి ఎలాగో వీడి చెరలోంచి తప్పించుకున్నా.. ముందు ఈ విషయాలన్నీ లాయర్‌గారికి చెప్పాలి.. ఆ తరువాత వాడు ఎప్పుడు ఇంటికి వస్తాడో.. ఫోన్‌లో ఆంటీనడిగి తెలుసుకుని... వాడి కాలు సంగతి.. అది ఋజువు చేసే క్లిప్పింగ్స్ కోర్ట్‌లో అందజేస్తే సరి, అయ్యగారి పని సరి.. అప్పుడు అజిత్ నిర్దోషిలా బయటపడతాడు..’’ ఆలోచిస్తూనే లాయర్ భగవాన్ గారి ఇల్లు చేరాడు ఆటోలో.
****
‘‘నమస్తే లాయర్‌గారు..’’ ఏదో ఫైల్ సీరియస్‌గా చూస్తున్న ఆయన తలెత్తి అనే్వష్‌ని చూసి ఆ ఫైల్ మూసి పక్కన పెట్టారు.
‘‘రండి.. రండి.. అదే అనుకుంటున్నా.. రెండు రోజులైపోయింది. పత్తా లేరు.. ఇంతకూ ఏమైంది వెళ్లిన పని.. ఏదైనా క్లూ దొరికిందా?’’ కూర్చోమని కుర్చీ చూపిస్తూ అడిగారు. ‘‘చిన్న క్లూ కాదు సర్.. అసలు హంతకుడు అతడే అనేందుకు అన్ని ఆధారాలు దొరికాయి. అయితే ఇప్పటికి యివే వున్నాయి నా దగ్గర..’’ అంటూ జేములోంచి కవర్ తీశాడు.. మొన్న అడవిలో దొరికినవి, ఇవీ ఒకటే అవునో కాదో అన్నది మొన్న ఇచ్చిన లేబ్‌లో యిస్తే.. వేలి ముద్రలూ.. తరువాత డ్రగ్ వివరాలు అన్నీ తెలుస్తాయి.. ఖచ్చితంగా వాడే.. కాని కోర్ట్‌కి సాక్ష్యం కావాలిగా, అందుకే యివి.. మళ్లీ.. వాడిది కాలు..

- ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్