డైలీ సీరియల్

బడబాగ్ని-12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదే పాదం కృత్రిమమైనదే.. మనం అనుకున్నది నూటికి నూరు పాళ్లు రైటే.. దానిని నిరూపించే ఆధారం మాత్రం ఒకటి రెండు రోజుల్లో వస్తుంది.. యింకొక విషయం... వాడికి మనం అనుమానిస్తున్నట్లు తెలిసిపోయింది.. నన్ను ఇంట్లో బంధించి ఉదయానే్న కొంప తాళమేసుకుని ఎటోపోయాడు.. యిదిగో నాకు రాసిన చీటీ’’.
‘‘గుడ్.. అయితే మన అనుమానం కరెక్టేనన్నమాట.. ఛ.. స్వంత అన్న అయ్యుండి ఎంత దారుణానికి వడిగట్టాడు.. రాస్కెల్.. సరే నువ్వు జాగ్రత్త.. సారీ.. మీరు జాగ్రత్త.. విషయం తెలిసిపోయిందని ఎంత దారుణానికైనా తెగిస్తాడు..’’
‘‘ఏమిటి సార్.. అసలు నేనే మీకు చెబుదామనుకుంటున్నా.. మీ కంటే చిన్నవాడిని.. మీ కొడుకు వయసు వాడిని నన్ను మీరు అనక్కరలేదు.. నువ్వు అంటే చాలు.. పైగా సారీ చెప్పడమేమిటి.. ఏడిసాడు వాడు ననే్నం చేస్తాడు.. ఎలాగైనా ఆ ఫుటేజ్ తెచ్చి రేపు గురువారం నాటికి కోర్టులో అందజేస్తా.. దెబ్బకి ఈ కేసూ.. వాడు.. రెండూ క్లోజ్..’’
‘‘ఒక హత్య అయినా.. ఇంకోటి చేసినా శిక్ష ఒకటే.. ఆ విషయం వాడికి బాగానే తెలుసు.. అందుకే తన విషయం తెలిసి.. సాక్షాలు సేకరించిన నిన్నూ.. ఆ సాక్షాలనీ అంత తేలికగా వదలడు.. అందుకే అంతగా చెబుతున్నా.. జాగ్రత్త.. మనం కోర్ట్‌లో వాడే దోషి.. అసలు హంతకుడు అని నిరూపించే దాకా నువ్వు జాగ్రత్తగా ఉండు..
సాధ్యమైనంతవరకూ బయటకు రాకు.. అలా అని మీ హాస్టల్ రూంలో కూడా ఉండకు.. ఇంకెక్కడైనా సేఫ్ ప్లేస్‌లో ఉండు.. అలాగే అరుణ్‌ని కూడా జాగ్రత్తగా ఉండమను.. నీకు తెలిస్తే అతనికీ తెలిసే ఉంటుందనో.. లేకపోతే అతనిని అడ్డం పెట్టుకుని నిన్ను పట్టుకోవాలనో ప్రయత్నిస్తాడు..’’ వివరంగా చెప్పాడు ఆయన.
‘‘సరే సార్.. మేం యిద్దరం ఎవరికీ తెలియకుండా ఎక్కడ రహస్యంగా ఉంటాం.. ఎంత యింక నాలుగు రోజులేగా.. సరే మరి ఈ కవర్ ఆ లేబ్‌లోనే ఇచ్చేసి వెళ్లనా.. రిపోర్టు మీకు పంపించమని చెబుతా...’’ లేచాడు.
‘‘వద్దు.. నాకిచ్చేసి వెళ్ళు.. లేబ్‌లో నే యిస్తాలే.. నువ్వు జాగ్రత్తగా అండర్‌గ్రౌండ్‌కి వెళ్లిపో... జాగ్రత్త సుమా’’ మరోసారి హెచ్చరించాడు.
‘‘సరే సార్.. యిదిగో.. నే వస్తా.. యిప్పుడు ఇంక అజిత్ దగ్గరకు కూడా వెళ్ళను.. మీరే ఏదో ఒకటి చెప్పేయ్యండి..’’ కవర్ ఆయన చేతికిస్తూ వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు.
‘‘యింక ఈ కేస్ క్లోజ్ అయిపోయినట్టే.. బి హేపీ.. బట్ ఈ నాలుగు రోజులు జాగ్రత్త.. వెళ్లిరా’’.
‘‘వస్తా సర్ నమస్తే..’’ అనే్వష్ వెళ్లిపోయాడు.
తన హాస్టల్ రూంకి వెడదామా... ఒక్క క్షణం ఆలోచించాడు.. పెద్దాయన చెప్పింది నిజం.. ఒకవేళ తను తప్పించుకు బయటపడ్డాడని తెలిసిన మరుక్షణం వాడు వెళ్ళేది అక్కడికే.. పైగా వాడు యింటికి వెళ్ళేదాకా అక్కరలేదు. తల్లి ఫోన్ చేసినా వాడికి తెలిసిపోతుంది తను సేఫ్‌గా అక్కడనుంచి తప్పించుకున్న విషయం.. సో ముందుగా వాడు వెళ్ళేది అక్కడికే.. కానీ తను అక్కడ లేడని తెలిసిన మరుక్షణం వాడు అరుణ్‌ని పట్టుకుంటాడు.. తన గురించి తెలుసుకోవడానికి.. కనుక తను ముందుగా చెయ్యల్సింది.. అరుణ్‌ని అక్కడనుంచి రప్పించడం.. కలిశాకా తీరికగా విషయాలు మాట్లాడుకోవచ్చు..
ఆలోచిస్తూనే దగ్గరలో ఉన్న పబ్లిక్ కాల్ బూత్ నుంచి అరుణ్‌కి ఫోన్ చేశడు.. బట్ అరుణ్ బదులు యింకో కోట్రైనీ మాట్లాడాడు.. అరుణ్‌కి ఫుడ్ ఫాయిజన్ జరిగిందని... కండిషన్ ట్రికల్‌గా ఉందనీ..
గవర్నమెంట్ హాస్పిటల్‌లో జాయిన్ చేశామని, ఆ విషయం చెబుదామంటే.. నీ సెల్ స్విచ్ ఆఫ్ వస్తూందని. నువ్వు అర్జెంటుగా హాస్పిటల్ రా’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు.. వింటున్న అనే్వష్‌కి మతి పోయింది..
ట్రైనింగ్ సెంటర్‌లో ఫుడ్ పాయిజన్ ఏమిటి.. అది అనుకోకుండా జరిగిందా.. లేక ఎవరైనా కావాలని చేసిందా.. ఆలోచిస్తూ రోడ్ క్రాస్ చేస్తున్న అనే్వష్.. తన మీదకు దూసుకువస్తున్న లారీ చూసుకోలేదు.. అయితే లాస్ట్ మినిట్‌లో తనని వేగంగా పక్కకి లాగేసారెవరో... అంత షాక్‌లోనూ... ఆ లారీ నెంబర్ మనసులో రిజిస్టర్ చేసుకున్నాడు అనే్వష్.
తనని రక్షించిన ఆ యువకుడికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు.
‘‘అరె.. మెయిన్ రోడ్ క్రాస్ చేస్తూ అంత పరధ్యానమైతే ఎట్లా.. కొంచెంలో ఎంత ప్రమాదం తప్పింది.. ఏమిటి గర్ల్‌ఫ్రెండ్ గురించి ఆలోచిస్తూ నడుస్తున్నారా’’ అని జోక్ చేశాడు.
‘‘నా ఫ్రెండ్ ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటల్‌లో క్రిటికల్ కండిషన్‌లో వున్నాడని తెలిసి.. కంగారులో చూసుకోలేదు.. మీరే కనక దేముడిలా రక్షించకపోతే ఈ పాటికి నేను.. ఒళ్లు జలదరించింది భయంతో అనే్వష్‌కి.
‘‘ఓ.. సారీ.. మీ పరిస్థితి తెలియక నేను జోక్ చేశాను.. బై ద బై.. నా పేరు కమల్.. నేనొక జర్నలిస్ట్.. పదండి నా బైక్‌మీద వెడదాం మీ ఫ్రెండ్ దగ్గరికి.. ఇంతకీ అతను ఏ హాస్పిటల్‌లో ఉన్నాడు..’’ అనే్వష్‌ని చేయి పట్టుకుని తన బైక్ పార్క్ చేసిన వైపు నడుస్తూ అన్నాడు.‘‘గవర్నమెంట్ హాస్పిటల్ అట.. మీకు చాలా థాంక్స్... మీరు చేసిన మేలుకు వట్టి ‘్థంక్స్’ అన్న పదం సరిపోదేమో.. నాకు పునర్జన్మ యిచ్చారు..’’ చాలా ఎమోషనల్ అయిపోయాడు అనే్వష్.
‘‘అరె మీరు మరీ సెన్సిటివ్‌లా ఉన్నారే.. అయినా ఈ లారీ వాళ్లకి కన్ను మిన్ను ఆనటంలేదు.. వాళ్ళు నడిపేది, బేసిక్‌గా రోడ్లమీదో.. మనుషులమీదో తెలియడంలేదు.. బై ద వే మీరు...’’
‘‘నా పేరు అనే్వష్.. ఐపిఎస్ ట్రైనీ...’’

ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్