డైలీ సీరియల్

బడబాగ్ని-28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరివీ పూర్తిపేర్లు తెలిస్తే బహుశా హంతకుడు దొరికిపోవచ్చు.. ఏది ఏమైనా అసలు మిస్టరీ అక్కడే, ఆ ట్రైనింగ్ సెంటర్‌లోనే ఉందనే నా నమ్మకం.. సో నెక్స్ట్.. విక్టిం బహుశా ఈ మహేష్ కావచ్చు.. లేదా ఆ రోజు.. ఆ గ్రూప్‌లో వున్న వేరెవరైనా కావచ్చు.. ఎవరికి మూడి విహారయాత్రకి ఏ హిల్ స్టేషన్‌కో వెడితే... వాళ్ళు.. అలా ఆగితే మరో హత్య జరిగే వరకూ తెలియదు.. జరిగినా నిరూపించడం కష్టం.. సో నిరూపించాలి అంటే.. మనమే అతనికి ఆ అవకాశం కలిగించాలి.. ఎస్.. అప్పుడే ఈ మిస్టీరియస్ హత్యలు తెరపడేది.. హంతకుడు దొరికేది..
‘‘ఏమిటి ఆలోచిస్తున్నారు.. నే చెప్పిన దాంట్లో నిజమెంతా అనా..’’ సందేహంగా అన్నాడు మహేష్.
‘‘యిప్పుడు మనం ఆలోచించాల్సినది దాని గురించి కాదు... తరువాత వంతు ఎవరా అన్నది.. వాళ్ళని ఎలా రక్షించాలి అన్నది.. అన్నట్లు.. మీరు చెప్పిన రవీంద్ర.. రవీంద్ర.ఎస్ పూర్తిపేరు... ఎస్ అంటే..?’’
‘‘ఏమో.. సార్.. రవీంద్ర.ఎస్ అనే గుర్తు.. అసలు అందరం రవీ అని పిలిచేవాళ్లం.. చాలామంది ఫ్రెండ్స్ ఇంటిపేర్లతో పిలుచుకునేవాళ్లం.. వాడిని మాత్రం అంతా రవీ అనే పిలిచేవాళ్లం...
అవునూ.. నాదొక సందేహం సార్.. ఎప్పుడో మా నుండి వేరయి ఎక్కడికో వెళ్లిపోయిన రవీంద్రకి... మేం కూడా యిప్పుడు అంతా తల చోటా ఉన్నాం.. చాలా ఏళ్ళు కలిసి ఉన్న మాకే యిప్పుడు ఎవరం ఎక్కడ ఉన్నదీ సరిగా తెలియదే.. అలాంటిది మేం ఎక్కడ ఉన్నదీ.. ఎప్పుడు ఏ విహారయాత్రకి వెళ్ళేది.. అతనికి ఎలా తెలుస్తోంది.. అంటే అతను మమ్మల్ని ఫాలో అవుతున్నాడా.. ’’ భయం.. సందేహం మహేష్ గొంతులో.
నవ్వేడు కమల్...
‘‘మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..?’’
‘‘ఉంది’’ అన్న మహేష్‌కి వెంటనే విషయం అర్థం అయింది.. సో వాడు ఫేస్‌బుక్ ఉపయోగించి తమ వేర్ అబౌట్స్ ట్రేస్ చేస్తున్నాడన్నమాట...
‘‘ఏమిటి ఫేస్‌బుక్ అకౌంట్ క్లోజ్ చేసేద్దామనా..?’’ నవ్వుతూ అన్నాడు కమల్..
‘‘నాదో చిన్న అనుమానం.. మా మీద అంత కోపం, పగ ఉన్నవాడు వెంటనే చంపెయ్యక యిన్ని సంవత్సరాలు ఎందుకాగినట్టు..?’’
‘‘ఆలోచించవలసిన విషయమే... అతనికి అవకాశం చిక్కలేదు అనుకోవడానికి పద్దెనిమిది ఏళ్లంటే తక్కువ కాలం కాదు.. ఇప్పుడు చిక్కించుకున్న అవకాశాలు అప్పుడు చిక్కాకా కాదు, బహుశా అతని లెక్కలేవో అతనికి ఉండి ఉంటాయ్.. అయినా తెలిసే అవకాశం లేని విషయాల గురించి ఆలోచించి మెదడు వేడెక్కించుకోవడమెందుకు? మన ప్రస్తుత సమస్య అతనిని ఎలా ట్రాప్ చెయ్యడం.. ఎలా హంతకుడిగా నిరూపించడం.. అది ఆలోచించాలి.. మహేష్ ఒక పని చేద్దాం, మీరు ఏదైనా బిజినెస్ టూర్ పెట్టుకుని ఆ విషయం ఫేస్‌బుక్‌లో పెట్టండి.. ఖచ్చితంగా అతను మిమ్మల్ని టార్గెట్ చేస్తాడు మన వలలో చిక్కుతాడు..’
‘‘మీరు చెప్పేది మరీ బాగుంది... పులిని వేటాడడానికి ఆ పులి నోటిలో తల పెట్టమన్నట్లు ఉంది. మనం దానిని వేటాడేలోపు అది నన్ను గుటుక్కున మింగేస్తే...’’ భయంతో మహేష్ గుండె దడదడలాడింది.
‘‘అరే ఎందుకంత భయం.. మీ వెనుకే నేను, పోలీసు యంత్రాంగం ఉంటాం కదా.. వాడు మిమ్మల్ని ఎటాక్ చెయ్యకుండానే చుట్టుముడతాం కదా.. మీరు ధైర్యం చెయ్యకపోతే ప్రతిదినం భయంతో చస్తూ బతకాలి.. ప్లీజ్ యింకేం ఆలోచించకండి.. ఒప్పుకోండి...’’
‘‘మరేం ఫర్వాలేదంటారా..’’ అయిష్టంగానే అంగీకరించాడు.
‘‘ఏమీ ఫర్వాలేదు.. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు.. సరే.. మీరు జనరల్‌గా బిజినెస్ పనిమీద ఏ ఏ ఊళ్ళు వెడుతూ ఉంటారు...’’
‘‘ఎక్కువగా కల్కటా వెడుతుంటాను’’.
‘‘గుడ్.. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్లండి.. మీరు ఏ రోజు వెళ్ళేది, ఎక్కడ బస చేసేది ఫేస్‌బుక్‌లో పెట్టండి.. మీతో బాటు నేను కూడా వస్తాను.. అహ వద్దులెండి.. అలా వద్దు, పోనీ ఒక పని చేస్తే..’’
‘‘ఏం చేద్దాం..’’
‘‘మీరు సరదాగా డెహ్రాడూన్ చూడటానికి వెళ్లినట్టు వెళ్లి అక్కడ ఎవరో తెలుసున్న వాళ్లను కలియడానికి వెళ్లినట్లు నే చెప్పిన చోటుకి వెళ్లండి.. అక్కడ మీ రవీంద్ర ఉంటాడు.. అప్పుడు అతను మిమ్మల్ని గుర్తుపడతాడా.. అతని ఫీలింగ్స్ అన్నీ మనకి తెలుస్తాయ్.’’
‘‘మీరు సీరియల్స్ రచయితలా ప్లాన్స్ బాగానే చెబుతున్నారు.. అవి బెడిసికొడితే నాకే మూడేది..’’ ముఖం గంటుపెట్టుకుని అన్నాడు.
‘‘చూడండి.. నేను అంత దూరం నుంచి పనికట్టుకుని ఇక్కడకు వచ్చింది, ఎలా అయినా ఆ హంతకుడిని, యికముందు అలాంటి అనర్థాలు జరగకుండా చూడాలనే కదా.. యిందులో నా ఇంటరెస్ట్ ఏమిటి, సరేలెండి నా దారిన నే పోతాను..’’ విసురుగా లేచాడు కమల్.
‘‘అయ్యయ్యో.. అలా కోప్పడి వెళ్లిపోకండి.. ప్రశాంతంగా ఉన్న సరస్సులో ఓ రాయి పడేసి మీ దారిన మీరు పోతే ఎలా.. తెలియకుండా ఏదోనాడు, ఏదో రూపంలో మృత్యువు రావడం వేరు, యిప్పుడు చావు నన్ను వెతుక్కుంటూ ఖచ్చితంగా వస్తుంది అని తెలిసి ఎలా ప్రశాంతంగా బ్రతికి చచ్చేది.. కానీండి తాడో పేడో తేలడమే మంచిది.. మీరు అనుకున్నదే నిజమైతే అతనిని పట్టుకుంటే హాయిగా, ప్రశాంతంగా బ్రతకచ్చు, కానిపక్షంలో యింకా మంచిది..

-ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్