డైలీ సీరియల్

బడబాగ్ని 37

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజంగా ఆ పిక్చరైజేషన్.. వాహ్.. నిజంగా యుద్ధ సన్నివేశాన్ని తలపింపజేస్తోంది. కొంతమంది సైనికులు అవతలి దేశం వాళ్లకి బందీలుగా చిక్కారు. వాళ్ళని తాళ్ళతో కట్టి తాము ఎక్కిన గుర్రాలకి కట్టి ఆ రణభూమిలో రుూడ్చుకుపోతున్న దృశ్యం, నిజంగా వళ్ళు గగుర్పొడిచింది రాహుల్‌కి.. తనకు తెలియకుండానే ఆ సినిమాలో లీనం అయిపోయాడు.. ఆ బందీలను ఒక నేల మాళిగలో బంధించి తమ సైనికులని కాపలా పెట్టి వాళ్లకి తిండి పెట్టకుండా, నీళ్లివ్వకుండా తమ దేశపు రక్షణ రహస్యాలను చెప్పించే ప్రయత్నంలో చిత్రహింసలు పెడుతున్నారు. వారిలో ఒకడు ఊపిరి బిగపట్టి చచ్చినట్టు పడి వుంటే.. వాడిని తన్ని, కొట్టి కదలకపోవడం, శ్వాస ఆడకుండా పడి ఉండటం చూసి చచ్చిపోయాడనుకుని బయటికి ఈడ్చుకెళ్లి పడేస్తారు. ఆ రాత్రి వాడు అష్టకష్టాలు పడి ఎలాగో సరిహద్దు దాటి తన వారికి ఆ వివరం చెప్పి చనిపోతాడు. అప్పుడు హీరో కొంత అవసర సామగ్రి బ్యాగ్‌లో పెట్టి మోసుకుంటూ పగలు దాక్కుని విశ్రాంతి తీసుకుంటూ రాత్రి రహస్యంగా ప్రయాణిస్తూ బందీలున్న రహస్య స్థావరానికి చేరతాడు.
అర్ధరాత్రి దాటాక అక్కడికి సమీపించి తను తెచ్చిన బ్యాగ్‌లోంచి ఒక పెద్ద పైపు తీసి దానికి ఒక చిన్న మెషీన్ అమర్చి రెండో కొస జాగ్రత్తగా చిన్న కన్నంలోంచి లోపలికి పంపిస్తాడు. అప్పుడు ఆ మెషీన్ సాయంతో మత్తు మందు లోపలికి పంపిస్తాడు.. చూస్తున్న రాహుల్‌కి ఒక్కసారిగా మెరుపులా స్ట్రైక్ అయింది. విషయం.. మనిషి ఊపిరి బిగపట్టి దానిలో లీనం అయిపోయి ఎగ్జైట్ అయిపోయాడు.
హీరో కొంతసేపు అక్కడే విశ్రాంతి తీసుకుని కొంతసేపటి తరువాత, తన పిస్టల్‌తో ఆ నేలమాళిగకున్న తలుపు లాక్ షూట్ చేసి, తన ముఖానికి ఒక మాస్క్ వేసుకుని ఆ గాలి పీల్చకుండా జాగ్రత్తగా అందులోకి ప్రవేశించి అక్కడ వున్న కాపలాదారులని నిర్దాక్షిణ్యంగా చంపేసి, తన వాళ్లకు స్పృహ వచ్చాక అక్కడనుంచి సురక్షితంగా బయటకు తెస్తాడు.
అది చూసిన రాహుల్‌కి కమల్, మహేష్‌ల మరణం వెనుకనున్న మిస్టరీ విడిపోయింది.. ఎస్.. ఆ రోజు ఏసీ సర్విసింగ్ అని చెప్పి వచ్చిన ఆ ఆగంతకుడు చేసిన పని యిదే.. కమల్, మహేష్ గదిలో మాట్లాడుకుంటున్నప్పుడు మెల్లిగా, చాలా తక్కువ మోతాదులో చాలాసేపు ఏదో మత్తుమందు ఏసీ పైపు ద్వారా పంపేడు. దానివలన కలిగిన మత్తులో బయలుదేరి వెళ్లిన మహేష్ కారు నడుపుతూ కొంతదూరం వెళ్లగానే ఏక్సిడెంట్ జరిగి మరణించేడు. అయితే ఆ మత్తు ప్రభావం కొంతసేపే ఉంటుంది కనుకే తరువాత పోలీస్ దర్యాప్తులో ఏమీ దొరకలేదు.
అలాగే గదిలో కమల్ ఆ మత్తు ప్రభావంవలనే తన ఫోన్ కాల్‌కి బాల్కనీలోకి మాట్లాడాలని వెళ్లి ఆ మత్తులో అక్కడనుంచి జారిపడి మరణించేడు.. నిజంగా హాట్సాఫ్ ఆ మాస్టర్ మైండ్‌కి.. కాకపోతే అవి క్రిమినల్ ఏక్టివిటీస్‌కి కాక మంచి పనులకి వాడితే.. బాగుండేది. విషయం అర్థమైంది. దీనిని ఈ కేసు ఏక్సిడెంట్‌గా భావించి క్లోజ్ చేసిన పోలీసులకి అర్థం అయ్యేలా చెప్పి ఈ కోణంలో దర్యాప్తు కొనసాగించేలా చూడాలి.. కేసు మళ్లీ దర్యాప్తు చేసేలా వాళ్లని ఒప్పించాలి..
ఏది ఏమైనా ఈ హంతకుడి విషయం తను అనుకున్నంత ఈజీగా తేలేదిలా లేదు. బహుశా తను కూడా ఈపాటికి వాడి హిట్‌లిస్ట్‌లోకి చేరిపోయి ఉంటాడు. ఏది ఏమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాట అనుకోగానే అప్రయత్నంగా నవ్వు వచ్చింది అతనికి. కమల్ మాత్రం జాగ్రత్తగా లేడా? నిజానికి అనుక్షణం, నేరస్థులమధ్య, నేర ప్రపంచంలో తిరిగే కమల్‌కి ఈ విషయం తనకంటే చాలా బాగా తెలుసు. అయినా చాపకింద నీరులా తనని చుట్టుముట్టిన మృత్యువుని గ్రహించలేకపోయాడు. దానికి బలయిపోయాడు.. సో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు.. తను కనుగొన్న ఈ విషయాలు తనతోనే పోకూడదు.. వీటిని ఏదో రకంగా బతికించి, ఈ కేసు సాల్వ్ అయ్యేందుకు సహకరించాలి.. వీటిని నేను రికార్డు చెయ్యాలి.
ఎలా.. వ్రాత పూర్వకంగానా లేక ఆడియో రికార్డ్ చేద్దామా? పోనీ రెండు చేస్తే ఇంకా మంచిది. ఆ ఆలోచన రావడం తడవు బ్యాగ్‌లో వున్న రహస్య అర నుంచి చిన్న పాకెట్ టేప్ రికార్డర్ తీసి ఆన్ చేసి మెల్లిగా, స్పష్టంగా చెప్పడం మొదలుపెట్టేడు.
‘‘రాహుల్ అనే నేను ఏ రకంగానైనా, ఏ కారణంగానైనా, ఏ విధంగానైనా మరణిస్తే యిది నా మరణ వాగ్మూలంగా పేర్కొంటూ చెప్పడం జరుగుతోంది.. నేను వృత్తిరీత్యా ప్రొఫెసర్, కానీ ప్రవృత్తిరీత్యా నేర పరిశోధన నాకిష్టమైన సబ్జెక్ట్. ఆ కారణంగానే నా మరణం ఎప్పుడైనా, ఎవరివల్లనైనా జరగచ్చు.
అందుకే ముందు జాగ్రత్తగా నేను పరిశోధించిన విషయాలూ, ఆధారాలూ నాతోనే అంతమవకూడదని నా వాగ్మూలం నాకు నేనుగా, ఎవరి ప్రమేయం, ఎవరి బలవంతం, ఎవరికీ తెలియకుండా చేస్తున్నది.. నాకు ఏదైనా జరిగితే దీనిని నా గదిలో ఒక రహస్య ప్రదేశంలో ఉంచుతున్నాను.. పోలీసులకు నేను ఈ లేఖ పంపుతూ దీనిని నా మరణానంతరమే తెరవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
దీనితోబాటు ఒక సీల్డ్ కవర్ ఉంచుతున్నాను. అందులో నేను ఇప్పటివరకూ చేసిన పరిష్కృతం కాని సీరియల్ మిస్టీరియస్ మర్డర్స్ తాలూకు పరిశోధనలు (నేను చేసిన) ఉంచుతున్నాను.. వాటి ఆధారంగా ఆ కేస్ పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను.

-ఇంకాఉంది

- మీనాక్షి శ్రీనివాస్